April 28, 2024

నవదుర్గా దేవి

రచన: ములుగు లక్ష్మీ మైథిలి

నవరాత్రి ఉత్సవాలలో
భక్తాభీష్ట ప్రదాయినిగా
శ్రీచక్ర నివాసినిగా విలసిల్లిన
శ్రీమన్ మహాలక్ష్మి నమోస్తుతే

నవవిధ పూజలతో
సర్వ సౌభాగ్యదాయినిగా
అలరారే శోభతో వెలిగే కల్పవల్లి
బాలా త్రిపురసుందరి నమోస్తుతే

నవకాంతుల తేజముతో
భక్తుల పాలిట కొంగుబంగారమై
ఆదరించే అమృతమూర్తివై
అన్నపూర్ణా దేవి నమోస్తుతే

నవవిధ విద్యలతో
జ్ఞానమొసగే వీణాపాణి
సకల కళల ప్రదాతవై
సరస్వతీ దేవి నమోస్తుతే

నవనవోన్మేషమైన
వేదశాస్త్రములకు మూలమంత్రమై
పరబ్రహ్మ స్వరూపిణివై
గాయత్రీ దేవి నమోస్తుతే

నవావరణ అర్చనలతో
జగన్మాతవని కీర్తిస్తూ
శ్రీమాతా హైమవతి
రాజరాజేశ్వరీ దేవి నమోస్తుతే

నవదుర్గా అవతారాలలో
అంబ పరమేశ్వరిగా
కరుణామయి శాంకరీ
మహా దుర్గా దేవి నమోస్తుతే

నవశోభల అలంకరణతో
భక్తి ముక్తి ఫల ప్రదాయిని
సర్వమంగళ గౌరి
లలితా త్రిపురసుందరీ దేవి నమోస్తుతే

నవశకానికి నాంది పలుకుతూ
దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడే
అవని జనులకు అభయమిచ్చి కాపాడే
మహిషాసుర మర్ధిని దేవి నమోస్తుతే!!

****

1 thought on “నవదుర్గా దేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *