June 25, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2023 సంచికకు స్వాగతం

      కృష్ణం వందే జగద్గురుం… షరతులు లేకుండా ప్రేమించడం, ఉద్దేశం లేకుండా మాట్లాడటం, కారణం లేకుండా ఇవ్వడం, నిరీక్షణ లేకుండా శ్రద్ధ వహించడం, అదే నిజమైన ప్రేమ యొక్క ఆత్మ. కృష్ణుడు అనగానే జీవిత సారాంశాన్ని ఉద్భోదించిన భగవద్గీత స్ఫురణకు వస్తుంది. ప్రతి మనిషి సైకాలజీ కృష్ణునిలో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అసలు సిసలైన ఫిలాసఫర్. కృష్ణుడు అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. ఈ కృష్ణతత్వాన్నిమననం […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2

రచన: డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. ఏమ్ సీ ఎచ్ అనువాదం: స్వాతీ శ్రీపాద 2. మెడికల్ స్కూల్‌లో ప్రవేశం నా స్కూల్ జీవితం పుస్తకాల్లో, అసైన్మెంట్లలో పీకల్లోతు మునిగి ఉండేదనుకుంటే మెడికల్ స్కూల్ ప్రవేశానికి నా తయారీ మరింత కఠినతరం అయింది. నాన్న నిజామీ హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న జహీరాబాద్ బ్ర్రిడ్జ్ ప్రాజెక్ట్ కు పనిచేస్తూ ఉండడంవల్ల కుటుంబాన్ని హైదరాబాద్ కు మార్చారు. మళ్ళీ మాధ్యమం ఇంగ్లీష్ కావడం వల్ల క్లాసులో ఫస్ట్ రాడానికి […]

అనగనగా ఓ జాబిలమ్మ

రచన: కోసూరి ఉమాభారతి అనగనగా ఓ జాబిలమ్మ….. “చంద్రకళా, ఎక్కడమ్మా నువ్వు?” అమ్మ పిలుపుకి, “ఇదో ఒక్క నిముషం,” అని చందూ జవాబు చెప్పింది. రాత్రి పడుకునే ముందు రోజూవారీగా జరిగే వారి ‘కథా-సమయం’ ఆసక్తికరంగా సాగుతుంది. అందుకోసం అమ్మ ఇలా దాన్ని పిలవడం, చందూ అలా జవాబివ్వడం రోజూ వినేదే. మామూలుగా అయితే, ఆ సమయానికి, అమ్మ గది సర్దుతూ వాళ్ళ మాటలు వింటుంటాను. రెండు రోజులుగా చందూ పుట్టినరోజు పనులతో, అమ్మ గది వైపు […]

లోపలి ఖాళీ – తపస్సు

రచన: రామాచంద్రమౌళి మళ్ళీ అదే దృశ్యం. రాత్రి ఎనిమిది ముప్పై నిముషాలు.. డైనింగ్ టేబుల్.. నాన్న అబ్రహం.. అమ్మ అరుంధతి.. అక్క ఎలిజబెత్.. అన్న రామ్మోహన్.. సుశీల అనబడే నేను.. అందరమూ నిశ్శబ్దంగానే భోజనం చేస్తున్న ‘ డిన్నర్ ’ సందర్భం. హైదరాబాద్ లోని డి ఆర్ డి ఎల్ ల్యాబ్ లో సైంటిస్ట్గా పని చేస్తున్న నాన్న ఆ రోజే భారతదేశపు ఆర్మీలో యుద్ధసమయంలో అత్యంత కీలకమైన రాత్రి వేళల్లో రాడార్ సిస్టంలో పనికొచ్చే ఒక […]

సినీబేతాళ కథలు – 1. ఓవర్ నటేశన్

రచన: డా. వివేకానందమూర్తి ‘కాస్త చూసి నడువు విక్రా!’ అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. ‘అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్.టి.సి బస్సు, దానికి ఎన్టీ రామారావైనా ఒకటే. ఎకస్ట్రా నటుడైనా ఒకటే.’ విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్తపడ్డాడు. “విక్రా! నీకు […]

ప్రాయశ్చిత్తం – 4

రచన: గిరిజారాణి కలవల ఆలోచనల నుండి బయటకి వచ్చి చుట్టూ చూసాడు. పార్క్ లో జనం పల్చబడ్డారు. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి.తను కూడా లేచి ఇంటి దారి పట్టాడు. పార్క్ లో ఇందాక విన్న మాటలే చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి. అన్యమనస్కంగా కారు నడుపుతున్న సురేంద్ర ఆలోచనలకి , ఫోన్ రింగ్ బ్రేక్ వేసింది. తనతో పాటు పని చేసే రమణ వద్ద నుంచి ఫోన్. లిఫ్ట్ చేసి, “ హలో! రమణా! చెప్పరా?” అన్నాడు. “హలో! […]

ఇంటర్వెల్ బెల్

రచన: ధరిత్రిదేవి ఎమ్ ఇంటర్వెల్ బెల్ మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటకు చొచ్చుకుని వచ్చారు. రెండు నిమిషాల్లో ఆ సందడి సద్దుమణిగింది. అంతే ! అలా వెళ్ళిన పిల్లలు మళ్లీ అరగంట దాకా తిరిగి రారు. కొందరు అసలే రారు. ఇంటర్వెల్ టైం పది నిమిషాలే! ఉదయం గదుల నిండుగా ఉన్న పిల్లలు ఇంటర్వెల్ తర్వాత సగానికే ఉంటారు. మధ్యాహ్నం పూటా అంతే! సుగుణ పదిరోజుల క్రితం ఆ స్కూల్ హెచ్.ఎం గా జాయిన్ అయింది. వారంరోజులుగా […]

శంఖు చక్రాలు

రచన: భవాని కుమారి బి “బుజ్జిముండ స్కూల్ నుంచి వచ్చేసిందా?” గుమ్మంలో అడుగుపెడుతూనే అడిగాడు సదాశివ౦. “బుజ్జిముండేమిటి మామయ్యా! దానికి పేరు లేదా?” డూప్లెక్స్ హౌస్ లో ఆఖరి మెట్టు మీద నిలబడి అన్నది సుధ, “అయినా ఆ లుంగీ ఏమిటి అంత పైకి కట్టారు? ఎన్నసార్లు చెప్పాలి? అట్లా సగం, సగం గుడ్డలతో కమ్యూనిటీలో తిరగొద్దని ? సదాశివం “నా ఇష్ట౦,, పల్లెటూరి ముండావాణ్ణి, నా గురించి నీకూ, నీ ఫ్రెండ్స్ కి దేనికి?’ రౌద్రంగా […]

సమన్వయం

రచన: శ్యామదాసి తెల్లవారు ఝామున మూడు నాలుగయ్యుంటుంది. ఫోను రింగవుతుంటే నిద్ర కళ్ళతో తీసుకుని చూస్తే మా పిన్నమ్మ కూతురు లక్ష్మి. ఈ టైంలో ఏంటబ్బా అనుకుంటూ, కొంత ఆదుర్ధాతో, “హలో లక్ష్మి!” అని పలకరించగానే, “సారీ అక్కా! టైం చూసుకోలేదు, కిట్టి పార్టీ నుండి వస్తున్నాను. నిద్ర పట్టలేదు, చాలా రోజులయింది నిన్ను పలకరిద్దామని చేశాను.” నాకు కాసేపు అర్ధంకాలేదు, ఏం మాట్లాడాలో కూడ తెలియలేదు. మావారికి కూడ మెలుకువ వచ్చి “ఎవరి ఫోను?” అని […]

ధైర్యం శరణం గచ్ఛామి

రచన: యశస్వి జవ్వాది “గుడ్ మార్నింగ్ మేడం” వినయంగా అంటున్న సబార్డినేట్ను కారు డ్రైవింగ్ సీట్లోంచి చూసి తల పంకిస్తూ హుందాగా స్వీకరించింది శారద. ఆమె కారు పార్క్ చేసి ఒక్కింత గర్వంతో అడుగులు వేస్తూ లోపలకు చేరింది. కారణం ఆ రోజు తాను కెరియర్ మొదలుపెట్టిన తారీఖు కావడంతో మరింత ఆత్మవిశ్వాసంతో లోపలికి అడుగులు వేసింది. ఆమెను చూడగానే స్టాఫ్ ఒకింత భయంతో, మరికొంత ఆరాధనతో చూడటం ఆమె నిత్యం గమనిస్తూ ఉంటుంది. శారద ఓ […]