May 9, 2024

డయాస్పోరా జీవన కథనం – నాతిచరామి

రచన: కోసూరి ఉమాభారతి ‘బేలార్ మెడికల్ స్కూల్’ వారి ‘థొరాసిక్ సర్జరీ’ తదుపరి ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాడు విశ్వనాధ్. సర్జరీ చీఫ్, డా. రెనాల్డ్ జాన్సన్ నుండి అభినందనలు అందుకుని… సంతోషంగా బయటకి నడిచాడు. అమెరికాలో ‘థొరాసిక్ సర్జన్’ గా స్థిరపడాలన్న అతని కల సాకారమయ్యే అవకాశం రానే వచ్చింది. కార్ స్టార్ట్ చేసి మెడికల్ స్కూల్ గేట్ దాటాడు విశ్వనాధ్. హౌస్టన్ లోని ‘బేలర్ మెడికల్ ఇన్స్టిట్యూట్’ లోనే ఫెలోషిప్ చేసే అవకాశం రావడం […]

మాలిక పత్రిక నవంబర్ 2023 సంచికకు స్వాగతం

  స్వాగతం… సుస్వాగతం… ప్రియ మిత్రులు, సాహితీ మిత్రులు, రచయతలకు, పాఠకులకు మాలిక కొత్త సంచికకు సాదర ఆహ్వానం. ముందుగా క్షమాపణ కోరుతున్నాము. సాంకేతిక కారణాల వల్ల గత మాసం అక్టోబర్ 2023 సంచిక విడుదల చేయలేకపోయాము. తెలుగువారి అనే కాక భారతీయులందరికీ ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా. నవరాత్రులు, బతుకమ్మ పండుగ జరుపుకున్నాము. రాబోయే దీపాల పండుగ దీపావళి పండగ మీ అందరికీ సంతోషాలను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీ రచనలు పంపవలసిన చిరునామా:maalikapatrika@gmail.com 1. […]

ప్రాయశ్చిత్తం – 5

రచన: గిరిజారాణి కలవల గరాజ్ లో కారు పార్కింగ్ చేసి లోపలికి రాగానే హాల్లో టివీ చూస్తున్న కొడుకు రుషి, “ఎక్కడకి వెళ్ళావు డాడీ! ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దాం. విన్నీ బయట తినేసి వస్తానంది.” అన్నాడు. ఆ మాటలలో తల్లి ప్రసక్తే లేదు. నిట్టూరుస్తూ సురేంద్ర తన రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకుని వచ్చేసరికి, రుషి రెడీమేడ్ చపాతీలని పెనం మీద కాల్చి తండ్రికీ, […]

సినీ భేతాళ కథలు – ధ్రువతార

రచన: డా. కె.వివేకానందమూర్తి తెలుగు సినిమాలు కొత్త రిలీజులన్నీ విరివిగా చూస్తున్నా, విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని కండువాలా భుజం మీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రమార్కా! ఈ మధ్య కథల్లో బరువు తగ్గిపోతోంది. నేను శవాన్నయి బరువెక్కి పోతున్నాను. అంచేత నీకు శ్రమ కలుగకుండా ఒక కథ చెప్తాను’ అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. – కాలింగ్ బెల్ మోగింది. భ్రమరాంబ తలుపు తీసి, విభ్రమాంబ అయిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ, ‘జై […]

అమ్మమ్మ – 50

రచన: గిరిజా పీసపాటి ఇక తప్పదన్నట్లు గబగబా అన్నీ సర్దేసి, బయట ఉన్న మారుతీ వేన్ దగ్గరకు వెళ్ళింది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కనిపించారు గణేష్‌గారు. గిరిజ కారు దగ్గరకు రాగానే ఉల్లాస్ వెనుక సీట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. గిరిజ వెనుక సీట్లో కూర్చోగానే, డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో ఉల్లాస్ కూర్చున్నాడు. గిరిజ చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ ఇంటి ముందు వేన్ ఆగగానే “లోపలికి రండి సర్” అంది గిరిజ మర్యాదగా. “నో […]

లోపలి ఖాళీ – ధృవధర్మాలు

రచన: ప్రొ.రామా చంద్రమౌళి ‘‘బెట్టర్‌ యు సుసైడ్‌’’ గుసగుసగా అంది శిశిర సిగ్గుతో తలవంచుకుని. ప్రక్కనే రాయిలా కూర్చుని చోద్యాన్ని చూస్తున్న సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌, యాభై రెండేండ్ల తండ్రి రామభద్రాన్ని చూస్తూ. నిజానికి అతని ముఖం మసిపట్టిన మట్టి కంచుడు అడుగులా ఉండాలె. కాని తోమిన రాగి చెంబులా ఎర్రగా, వికారంగా ఉంది. ఆ క్షణం అప్పుడు.. అక్కడ జరుగుతున్న సందర్భమేమిటంటే.. రాష్ట్రంలోని ఐదుచోట్ల ఏకకాలంలో రామభద్రం ఆస్తులపై సి బి ఐ […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -3

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 4. ప్రేమ ప్రకటన మిగతా ఆ వయసులో ఉండే చాలామంది అమ్మాయిల్లాగే విదేశాల్లో సెటిల్ అయిన ఎంతో మంది డాక్టర్ల సంబంధాలు వరదలా వచ్చిపడ్డాయి. ప్రతి సంబంధమూ ఏదో ఒక వంక పెట్టి తిరగగొట్టేదాన్ని. ఈ విషయ్ం సలీమ్ తో చర్చించి ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. నా మనసులో మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే అది సలీమ్ తప్ప మరొకరు కాదని నిశ్చయించుకున్నాను. ఇంకెవరినో పెళ్ళి చేసుకుని […]

వైద్య నారాయణుడు

రచన: G.S.S. కళ్యాణి. సమయం సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న నారాయణ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. అంతలో, “బాబుగారూ!! మళ్ళీ పడ్డదండీ! తొరగా రండీ!”, అంటూ నారాయణను కంగారుగా పిలిచాడు కోనయ్య. “వస్తున్నా! వస్తున్నా! ఇంతకీ ఎవరూ? ఆ పడింది ఎవరూ?? నీ భార్య కోకిలేనా?”, అంటూ టేబుల్ పైనున్న స్టెతస్కోపును మేడలో వేసుకుని, కుర్చీలోంచి లేచి ఒక్క ఉదుటున గది బయటకి వచ్చాడు నారాయణ. “నా […]

మారిన తీరు

రచన: లక్ష్మీ రాఘవ కొడుకు వెంకటేశు మాటలు విని శానా కోపం వచ్చింది రామయ్యకు “మా చేత కాదురా. ఎట్లా బతుకుతున్నామో ఆలోచన సెయ్యి.” కాస్త గట్టిగానే అన్నాడు. “ఏమి బతుకు నాయనా? అప్పుడు తాతను చూసినా, ఇప్పుడు నిన్ను చూస్తావున్నా, ఏంది మారింది? అందరి గుడ్డల మురికి వదిలించి మనం పూసుకున్నట్టు వుంది. నీట్ గా ఇస్త్రీ చేసిస్తే వాళ్ళు దర్జాగా ఉంటే చేసిన మనమేమో నలిగిన బట్టల్లోనే వుంటూ…ఛీ …? ఎట్లో నా మొండికి […]

ప్రియనేస్తమా

రచన: శ్యామదాసి వాసుదేవా! విజయక్కా, ఏంటి తల్లీ బిజీనా, మాకు కూడ కొంచం సమయం కేటాయించండి ప్లీజ్! మాటతో పాటే నవ్వూ కలిసుండేది ఝాన్సీకి. ఆ పలకరింపుతో కూడిన చమత్కారం ఇక నాకు వినిపించదు. నాలుగు రోజుల క్రితం నాకు ఫోను చేసి అక్కా! మందుల వల్ల చాలా మత్తుగా వుంటున్నది. కొంచం సేపు పడుకుని నీతో మళ్ళీ మాట్లాడుతాను. ఈ వేళ సత్సంగానికి కూడ అటెండ్ కాలేకపోయాను. అంటూ మాట్లాడిన ఆ స్వరం ఇక నేను […]