May 4, 2024

నమ్మక ద్రోహం

రచన: లక్ష్మీ ఏలూరి “ఓయ్…! హనుమంతురావు… నీకు మన బాస్ ఏమన్నా చెప్పారా!?అని మల్లేష్ అడిగాడు. “ఆ… చెప్పారు, మనం ఆఫీసులో కొన్ని పోస్ట్ లకు ఇంటర్వూ లు జరుగుతాయని, వాటికి అప్లై చేయమన్నారు. దాని కొరకు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ కి వెళ్లి సీనియారిటీ లెటర్ తెచ్చి అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయమన్నారు”అని హనుమంత రావు చెప్పాడు. “నాకు కూడా అదే చెప్పారు, నేను వెళ్లి మన ఇద్దరి సీనియారిటీ లెటర్స్ తెస్తాను లే” అని మల్లేష్ […]

పునర్జన్మ

రచన: G.S.S. కళ్యాణి సమయం సాయంత్రం మూడు గంటలు కావస్తోంది. నగరంలోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ ఆసుపత్రిలో మంచంపై పడుకుని ఉన్న ప్రసాదరావుకి మెల్లిగా స్పృహ వస్తోంది. అలా ఎన్ని గంటలు పడుకున్నాడో తెలియదు, కానీ తన భార్య కళావతి తనున్న గది బయట నిలబడి ఎరితోనో మాట్లాడుతూ ఉంటే, అస్పష్టంగా వినపడుతున్న ఆ మాటలను వినడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు. “డాక్టరుగారూ! మావారిని బ్రతికించుకునే మార్గమే లేదంటారా? ప్లీజ్ డాక్టర్!! మీరే ఏదో ఒక మార్గం చూపించి […]

భగవంతుని స్వరూపం

రచన: సి. హెచ్. ప్రతాప్ ఒక చిత్రకారుడు మంచి మంచి చిత్రాలను గీస్తూ ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తిని సంపాదించుకున్నాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ద్వారకలో వున్న శ్రీకృష్ణుడు నగరంలోని కవులను, కళాకారులను పిలిచి ఘనంగా సత్కరిస్తున్నారని అతనికి తెలిసింది. ఎలాగైనా తన ప్రతిభ శ్రీ కృష్ణుని ముందు ప్రదర్శించి శ్రీకృష్ణుడి నుండి కూడా ఆమోదం పొందాలని అతను ధృఢంగా నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తాన ఆ చిత్రకారుడు ద్వారక వెళ్ళి శ్రీ కృష్ణుడి […]

విషాదాన్ని విస్మరించు..!

రచన: ధరిత్రి ఎమ్ జీవితం ఓ పయనం ఎత్తు పల్లాలు దాటుతూ సాగే గమనం రాత్రి… పగలు.. అనివార్యం ఆగమనం.. నిష్క్రమణ.. ఆగమనం.. నిష్క్రమణ.. ! నిరంతర భ్రమణం ! చీకటీ.. వెలుగూ .. అంతే కదా ! మరెందుకీ వేదన ! రాత్రి లేక పగటికీ కష్టం లేక సుఖానికీ ఉన్నదా విలువ ! రెండింటి సమాహారమే బ్రతుకన్నది… పచ్చి నిజం ! అలా సాగితేనే కద… జన్మ సార్థకం !! అందుకే… నేస్తమా… చీకటికి […]

మాలిక పత్రిక నవంబర్ 2022 సంచికకు స్వాగతం

స్వాగతం… సుస్వాగతం. చలిచలిగా… గిలిగిలిగా… లేత చలిగాలులు, చిరు వానజల్లులతో వణికిస్తున్న కాలాన్ని స్వాగతిస్తూ,  మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, యాత్రామాలికలు, ధారావాహికలు, వ్యాసాలు, కార్టూన్స్ మోసుకుంటూ వచ్చింది మాలిక పత్రిక నవంబర్ సంచిక.. ఈ మాసపు సంచికలో శ్రీమతి సంధ్యా యల్లాప్రగడగారి ధారావాహిక మోదుగపూలు ముగిసిపోతోంది. అతి త్వరలో సంధ్యగారినుండి మరో ధారావాహిక కోసం ఎదురుచూస్తున్నాము. ప్రముఖ, అభిమాన రచయిత్రులు స్వాతీ శ్రీపాద, గిరిజారాణి కలవలగార్లు మాలిక పత్రిక కోసమే కొత్త సీరియల్స్ […]

మోదుగపూలు – 16

రచన: సంధ్యా యల్లాప్రగడ “ఈ ఫోటోలు వీరు ఎవరు సార్‌? మీకేమవుతారు? మీ దగ్గరకెట్ట వచ్చాయి!” అడిగాడు వివేక్. “ఇవి మా ప్యామిలి ఫోటోలు…” అని వివేక్‌ను చూస్తూ “ఫ్యామిలినా…?” “అవును. ఈ కూర్చున్న ఆయన గోండు రాజు హీర్ దేశ్ షా. బ్రీటీషు వారు తీసేసిన గోండు రాజు. చుట్టూ ఉన్నవారు ఆయన తమ్ములు నలుగురు. ఆయనకు ఆరుగురు కుమారులు. నీవు చూపిన ఆ చిట్టచివరున్న నిలుచున్నాయన చివరి కొడుకు” చెప్పాడాయన. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. […]

వెంటాడే కథలు – 14

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

చంద్రోదయం 34

రచన: మన్నెం శారద ఆ వెంటనే ఆ చూపులు పేలవంగా విడిపోయేయి. “ఆరోగ్యం జాగ్రత్త. నువ్వనవసరమైన భయాల్ని వదిలించుకుని, ఎవరి మాటలూ వినకుండా నానీని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఏమన్నా అయితే నానీ గతేవిటో ఆలోచించి ఏవయినా చెయ్యి.” సారథి ఎటో చూస్తూ ఆ మాటలనేసి వెళ్లిపోయేడు. అతని నిరాదరణ చూస్తుంటే ఆమెకు గుండె పగిలిపోతోంది. ఇక తన ముఖం జీవితంలో చూడడు, తనని దగ్గరకి తీసుకోడు. అయిపోయింది. తన కల చెదిరిపోయింది. జానకమ్మ మాటలు విని […]