April 27, 2024

పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు

రచన: డా. వివేకానందమూర్తి “మళ్లా కొత్త జావా కొంటావా?” అని అడిగితే “నాకు జావా వొద్దు. ఇండోనేషియా వద్దు. ఊరికే ఇచ్చినా పుచ్చుకోను” అని ఖండితంగా చెప్పేశాడు. * * * అవాళ అర్జంటు పనిమీద జావా మీద అర్జంటుగా అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి బయల్దేరాడు చెన్నకేశవ. చీకట్లో కొన్న బండి చీకటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రయాణం చేస్తోంది. కాని చీకటిని ఎవరు చీల్చగలరు? ఎందుకు చీల్చుదురు? చీకటి చీలిపోతే చీకట్లో బతికే దౌర్భాగ్యులకు బతుకు […]

తాత్పర్యం – విజాతి మనుషులు వికర్షించబడ్తారు

రచన: – రామా చంద్రమౌళి “అసలు అందం అంటే ఏమిటి శివరావ్ “..అంది మనోరమ..ఆరోజు రాత్రి..తమ పెళ్ళై అప్పటికి ఒక పదిరోజులైందో లేదో..అంతే. కొత్తగా..హైదరాబాద్లో..కిరాయి అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన తొలి దినాలు..శీతాకాలం రాత్రి..పదిగంటలు..డిసెంబర్ నెల..సన్నగా చలి..కిటికీలోనుండి చూస్తే..అప్పుడప్పుడే మంచుదుప్పటి కప్పుకుంటున్న నగరం..దూరంగా నిప్పుల కణికల్లా కరెంట్ దీపాల కుప్పలు..మిణుకు మిణుకు. అప్పుడు మనోరమ తను రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సిసిఎంబి నుండి ఒక గంటక్రితమే వచ్చి..వంట చేసి..ఇద్దరూ తిన్న తర్వాత..యధాలాపంగా పక్కను […]

జీవన వేదం -3

రచన: స్వాతీ శ్రీపాద “పిల్లను తీసుకు వెళ్తే బాగుండేది” అది ఏ నూటొక్కసారో అతని తల్లి అనడం. “ఉన్నపళంగా తీసుకువెళ్ళడం అంటే కుదిరే పనేనా? నేనా ఇద్దరు ముగ్గురితో కలిసి ఉంటున్నాను. మరో ఇల్లు వెతుక్కోవాలి. కొత్త ఉద్యోగం తీరిక దొరకాలి. ” అంటూ నసిగాడు. సీతకూ దిగులు దిగులుగానే ఉంది. కాని అతను చెప్పినదీ నిజమే. చదువులు ఇంకా పూర్తికానట్టే మరి. జీవితంలో ఎదగాలన్న కాంక్ష ఉన్నప్పుడు దాన్ని అదిమి పెట్టడం మంచిది కాదుగా. రవికిరణ్ […]

సాఫ్ట్‌వేర్ కధలు – కలేపా – కోతిమీ

రచన: కంభంపాటి రవీంద్ర స్టాండ్ అప్ కాల్ లో, విశాలి తన టీం చేసిన టాస్క్ స్టేటస్ వివరిస్తూండగా సన్నగా వినిపించిందా ఏడుపు . ‘‘జస్ట్ ఎ మినిట్” అని వీడియో ఆఫ్ చేసి, కాల్ మ్యూట్ లో పెట్టి ‘‘మురళీ .. అనన్య ఏడుస్తున్నట్టుంది .. కొంచెం చూడు .. ఇక్కడ స్టాండ్ అప్ కాల్ లో బిజీగా ఉన్నాను” విశాలి గెట్టిగా అరిచింది ‘‘ఏడుస్తున్నది అనన్య కాదు అలేఖ్య .. నేను కూడా మా […]

నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు

రచన: రమా శాండిల్య ఈ సారి నా కర్ణాటక యాత్రానుభవాలులో రెండు క్షత్రాలను గురించి వ్రాస్తున్నాను. అవి మొదటిది నంజనగూడు, రెండవది దొడ్డ మల్లూరు. 1. శ్రీ నంజుండేశ్వర స్వామి, కర్ణాటక, మైసూర్! నంజన గూడు! కర్ణాటక యాత్రలలో భాగంగా, నంజనగూడు యాత్ర అనుకోకుండా ఈ మధ్య చేసాము. చాలా మంచి యాత్రగా దీనిని చెప్పుకోవచ్చు! భక్తజన సులభుడు ఈ నంజనగూడు శ్రీ కంఠేశ్వరుడు. దక్షిణ కాశీగా పిలవబడే ఈ నంజనగూడు, భక్తుల సర్వ రోగాలనూ పోగొట్టే […]

చర్య – ప్రతిచర్య

రచన: రాజ్యలక్ష్మి బి రఘురాం ఒక చిన్న కంపెనీలో చిరుద్యోగి. ఐదేళ్ల కొడుకు, ఒద్దికగా గుట్టుగా సంసారం నడిపే భార్య, చిన్న అద్దిల్లు. బస్ స్టాప్ వీధి ఒక చివర వుంటే, యిల్లు వీధి మరో చివర వుంటుంది. రోజూ పదినిమిషాల ముందు బస్ స్టాప్ చేరుతాడు. ఆ వీధి పెద్దగా సందడి వుండదు. ఒక్కోసారి బస్సు వేగంగా వచ్చి ఒక నిమిషం ఆగి వేగంగా వెళ్లిపోతుంది. అందుకే రఘు ముందుగా చేరి బస్సు కోసం క్యూలో […]

ఆట పట్టింపు

రచన: ప్రకాశ లక్ష్మి వేణూ, వనజా అన్నా చెల్లెళ్ళు. వనజకు పది సంవత్సరాల వయస్సులో వారి తల్లిదండ్రులు ఒక బందువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్ళి వస్తూ వుండగా జరిగిన యాక్సిడెంట్లో మరణించారు. అప్పటికే వేణూ పెళ్లి అయ్యి జాబ్ చేస్తున్నాడు. వేణూ భార్య రాధ మంచి అణుకువ గల పిల్ల. అడపడచు రాధను చాలా ప్రేమగా చూసుకొనేది. కానీ వేణూ ఇంకా గారాబంగా చూసుకొనేవాడు. దాంతో వనజకు పెంకితనం, ముక్కోపం అలవాటు అయింది. అలా అని […]

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది. లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని […]

అమ్మమ్మ – 41

రచన: గిరిజ పీసపాటి వీళ్ళ నవ్వులు విన్న అన్నపూర్ణ ఆంటీ తలుపు తీసి, వీళ్ళను చూస్తూ “ఎన్నాళ్ళు అయిందండీ మీరు ఇలా హాయిగా నవ్వగా చూసి. అన్నయ్య గారు వెళ్ళిపోయాక మీరందరూ అసలు నవ్వడమే మర్చిపోయి, మర మనుషుల్లా మారిపోయారు. మీ ఇంట్లో మళ్ళీ మునుపటిలా నవ్వులు వినిపిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. మీరు నలుగురూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. అప్లికేషన్ పోస్ట్ చేసి, చాలా రోజులు ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందేమోనని […]

భావ కాలుష్యం

రచన: వసంతరావు నాగులవంచ కాలుష్యాలు నానా విధములు. భౌతిక కాలుష్యం కంటే భావ కాలుష్యం మిక్కిలి ప్రమాదకరమైనది. మానవుని ఆలోచనా విధానంలో వ్యతిరేక భావాలు చోటుచేసుకున్నప్పుడు మనసు మాలిన్యమౌతుంది. తత్ఫలితంగా వచ్చే ఫలితాలు కూడా చెడ్డగానె ఉంటాయి. జరుగవలసిన పనికూడా సక్రమంగా జరుగదు. మనసుకు శరీరానికి అంతులేని అవినాభావ సంబంధం ఉంది. మనసు తేలికగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై శరీరాన్ని ఆరోగ్యవంతంగా, కర్మలను చేయడానికి మిక్కిలి అనుకూలంగా ఉంచుతుంది. భావాలు వ్యతిరేకమైనప్పుడు శరీరం […]