May 6, 2024

వెంటాడే కథలు 11 – బేబీ సిట్టర్

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా […]

పరవశానికి పాత(ర) కథలు – చావు

రచన: డా.వివేకానందమూర్తి (యు.కె) శ్రీనివాసులుకి చచ్చిపోదామనిపించింది. ఇదివరకు ఇలా చాలాసార్లు అనిపించింది. కష్టమొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదామనుకుంటాడు. అతనికి కష్టాలు చాలాసార్లు వచ్చాయి. అందుకని చాలాసార్లు చచ్చిపోదామనుకున్నాడు. శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు, శారీరకంగా చచ్చిపోదామనుకుంటాడు. కష్టాలొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు; చావు మీది కోరికని అతనికి మనస్సు నేర్పింది. శ్రీనివాసులి మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ వుంటుంది. కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెదుక్కున్నప్పుడు శ్రీనివాసులుకి ‘చావు’ సమాధానంగా నిలుస్తుంది. శ్రీనివాసులికి ఇప్పుడు బ్రతుకు చావులా […]

చంద్రోదయం – 31

రచన: మన్నెం శారద “రేపు నేను విజయవాడ వెళ్తున్నాను. ఒక్కర్తివీ వుండగలవా?” అన్నాడు సారథి భోజనాల దగ్గర. “ఎందుకు? అంది. “శేఖర్ వాళ్ల నాన్నగారు అర్జెంటుగా రమ్మని టెలిగ్రాం ఇచ్చేరు.” “మీతో ఏం పని?” భ్రుకుటి ముడిచి అడిగింది. “ఏమో నాకెలా తెలుస్తుంది?” ఆమె అన్నం కెలుకుతూ కూర్చుంది. “ఏం అలా అయిపోయేవ్?” అతను అనునయంగా అడిగేడు. “మీరు వెళ్లకపోతేనేం?” ఎదురు ప్రశ్నించింది. “బాగుండదు. శేఖర్ పోయి వాళ్లెంతగానో కృంగిపోయి వుంటారు. ఎందుకో అవసరముండే రమ్మని వుంటారు. […]

తాత్పర్యం – సొరంగం

రచన:- రామా చంద్రమౌళి   కల భళ్ళున చిట్లి చెదిరిపోయింది. నల్లని ఒక మహాబిలంలోనుండి. . చిక్కని చీకటిని చీల్చుకుంటూ. . తెల్లగా వందల వేల సంఖ్యలో బిలబిలమని పావురాల మహోత్సర్గం. విచ్చుకుంటున్న రెక్కల జీవధ్వని. ఒక ధవళ వర్ణార్నవంలోకి పక్షులన్నీ ఎగిరి ఎగిరి. . ఆకాశం వివర్ణమై. . దూరంగా. . సూర్యోదయమౌతూ. . బంగారురంగు. . కాంతి జల. అంతా నిశ్శబ్దం. . దీర్ఘ. . గాఢ. . సాంద్ర నిశ్శబ్దం. లోపల. . […]

అమ్మమ్మ – 38

రచన: గిరిజ పీసపాటి   కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు విని ఆలోచనలో పడింది నాగ. కాసేపటికి గిల్ మేన్ కంపెనీ రిప్రజెంటేటివ్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఆయనతో ఆరోజు ఆయన కవర్ చెయ్యబోయే ఏరియాలు, డాక్టర్స్ లిస్ట్ వివరాలు మాట్లాడసాగింది. ఇంతలో కృష్ణమూర్తిగారు కూడా బేంక్ నుండి వచ్చి వీరితో జాయిన్ అయారు. కాసేపు మాట్లాడాక సురేష్ గారు డాక్టర్స్ విజిట్ కోసం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే కృష్ణమూర్తిగారు జేబులోంచి కొంత డబ్బు తీసి నాగ […]

యాత్రామాలిక – బెంగళూరులోని అమ్మవారి ఆలయాలు

రచన: రమా శాండిల్య శ్రావణమాసం సందర్భంగా, బెంగుళూర్ లోని కొన్ని అమ్మవార్ల దేవాలయాలను గురించిన వివరాలు. అన్నీ నేను దర్శనం చేసుకున్న అమ్మవారి ఆలయాలను గురించి మాత్రమే వ్రాస్తున్నాను. అవి, బనశంకరీ, గంగమ్మ, రాజరాజేశ్వరి, శృంగేరి శారదామాత కొలువైన శంకర మఠం, అన్ణమ్మ, సోమేశ్వరాలయంలో ఉన్న కామాక్షి అమ్మవారు, సుందరేశ్వర సమేత మీనాక్షి అమ్మవారు, సూర్య దేవాలయంలో ఉన్న వైష్ణవి మాత, గవి గంగాథరుడి ఆలయంలో కొలువైన పార్వతి, సప్తమాతృకలు, బందాకాళీ ఆలయాలను గురించి తెలుసుకుందాము. *** […]

యాత్రామాలిక – ముక్తినాథ్

రచన: నాగలక్ష్మి కర్రా కైలాశ్ మానససరోవరం యాత్ర చేసుకున్నాక నేపాలులో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేసుకోవాలనిపించింది. సరే గూగుల్ లో చూసుకొని ఓ ట్రావెల్స్ వాళ్లని సంప్రదించి బేరసారాల తరువాత మేం మొత్తం ఏడుగురం బయలుదేరేం. మేం మాట్లాడుకున్న పేకేజీ ప్రకారం రెండురోజులు ఖాట్మండు, ఒకరోజు జనకపూర్, ఒక రోజు పోకర, ఒక రోజు ‘జోమ్ సోమ్’, తిరుగు ప్రయాణంలో ఒక రోజు పోకర, రెండురోజులు ఖాట్మండు. మొత్తం మా పాకేజీ ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు. […]

‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

రచన: ధరిత్రిదేవి. ఎమ్ “అబ్బ! ఏమిటీ, నా కాళ్లు ఇలా ఇరుక్కుపోయాయి! బాబోయ్!. . రావడంలేదేంటి?. . ” మగతగా కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతున్న పరమేశ్వర్రావు ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీటులోంచి కదలబోయాడు. కానీ సాధ్యం కాలేదతనికి. ఎందుకో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. ముందు సీటులో బైఠాయించిన ఆసామీ ఇంట్లో డన్‌లప్ బెడ్ మీద ఆరాంగా పడుకున్న చందాన వెనక్కి జారగిలబడి ఎంచక్కా నిద్రిస్తున్నాడు. అతను బస్సులో ప్రయాణిస్తున్నానన్న స్పృహలో కూడా ఉన్నట్టు […]

తథాస్తు

రచన: సి. హెచ్. ప్రతాప్ సీతాపురంలో కృష్ణయ్య, రాధమ్మ అనే దంపతులు వుంటున్నారు. వారికి కడు బీద కుటుంబం. పెళ్ళయి పదేళ్లయినా పిల్లలు కలగలేదు. జరుగుబాటు కష్టం అవుతున్నా నైతిక విలువలకు, మానవత్వానికి పెద్ద పీట వేసేవారు ఆ దంపతులు. తాతల కాలం నాటి పది సెంట్ల స్థలంలో ఇల్లుకు పోగా మిగిలిన జాగాలో కూరలు పండిస్తూ, వాటిని బజారులో అమ్ముకొని, వచ్చిన డబ్బుతో తృప్తిగా జీవించేవారు. ఏనాడు కూడా తమది కష్టంతో కూడుకున్న జీవితం అని […]

అందమైన అనుబంధం

రచన: రాజ్యలక్ష్మి బి “బావా, మన పెళ్లి జరగబోయే ముందు నీతో నా మనసులోని భావాలు పంచుకోవాలనుంది “అన్నది సరస్వతి కృష్ణవంశీతో. “సరూ, నా దగ్గర మొహమాటమెందుకు? తప్పకుండా పంచుకుందాం. సాయంకాలం గుడి దగ్గర పార్కులో కలుద్దాం “అన్నాడు వంశీ. ఇద్దరూ పార్కులో కలిసారు. “బావా మనం చిన్నప్పట్నుంచి బావామరదళ్ళుగా పెరిగాం, అరమరికలు లేకుండా ఆడుకున్నాం, పాడుకున్నాం. నీ మనసేమిటో నాకు తెలుసు, నా మనసేమిటో నీకు తెలుసు. నా చదువు ఇంటర్మీడియట్ తో ఆగిపోయింది. నువ్వు […]