April 26, 2024

కాసులపేరు

రచన: సావిత్రి దుడ్డు నాన్నమ్మగారు చూపిస్తున్న నగ చాలా బావుంది. చిన్న బంగారు చాక్లెట్ బిళ్ళలు వరుసలా ఉంది. వదిన కోసం చేయించాలి అని బంగారం కొట్టు పెద్దయ్యని రమ్మన్నారు. మా అమ్మ పక్కన కూర్చుని, తన చీర నలిపేస్తూ తనని ఊపేస్తూ “అమ్మ, నాకు ఎప్పుడు కొంటావు?” అని అడిగాను. పెద్దయ్యిన తర్వాత కొనుక్కుందాము అంది అమ్మ. యెంత పెద్ద అవ్వాలి? నేను పెద్దదాన్నయ్యాను అన్నావు కదా. గొడవ చెయ్యకూడదని! అని అన్నాను. ఏమి సమాధానం […]

నింగిని మెరిసిన వర్ణచిత్రం!!

రచన:ముక్కమల్ల ధరిత్రీ దేవి మిట్టమధ్యాహ్నపువేళ ఎండ కాస్తున్న సమయాన మొదలయ్యింది ఉన్నట్టుండి జల్లున… వాన !! మల్లెలు కురిసిన చందాన ! నేనూహించని ఆనందం ! చేరింది చెంతకు..అతి నిశ్శబ్దంగా…చిత్రం! నింగిని భానుడి కిరణాల మెరుపు ఒకవంక చిరుజల్లుతో చల్లని చిరుగాలి మరోవంక ఆపై…తడిసిన మట్టి సువాసనలింకొంత ! ఆస్వాదిస్తూ ఆరుబయటికొచ్చి ఆకసం వేపు చూశా ఒకపరి అరెరే !! రంగు రంగుల హరివిల్లు !! మెల్లిమెల్లిగా పరుచుకుంటూ ప్రత్యక్షం విశాల గగనపు ‘కాన్వాసు’ మీద ! […]

జగన్మాత

రచన: ప్రకాశలక్ష్మి అక్రరమాలలోని మొదటి అక్షరం”అ”. అ అంటే అమ్మేగా మరి। ఆదికి,అనాదికి మూలం అమ్మ। సమస్త సృష్టికి మాతృరూపం అమ్మ। ధరణి పైన నడయాడే దేవత అమ్మ। దుష్ట శిక్షణ , శిష్టరక్షణ చేసి, సమస్త మానవాళికి రక్షణ ఇచ్చేది అమ్మ। అమ్మ ప్రేమ అమృతం,అదేకదా ..మనకు ఆధారం పాల సంద్రం లో పుట్టిన క్షీరాబ్ధి కన్యక అమ్మ। సృష్టి స్థితి లయ కారిణి అమ్మ। ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత ఆషాడమాసం బోనాలజాతరలు, శ్రావణమాస లక్ష్మీ […]

*సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం*

రచన: రమా శాండిల్య బెంగుళూర్ నుంచి ఒక్కరోజులో వెళ్ళి, తిరిగి రాగలిగిన అద్భుతమైన వినోద, విజ్ఞాన, ఆధ్యాత్మిక, చారిత్రక యాత్ర, ఈ సారి నేను వ్రాస్తున్న ఈ యాత్రాదర్శిని. బెంగుళూర్ మా ఇంటినుంచి, ఉదయం ఆరుగంటలకు బయలుదేరి, సాయంత్రం ఏడుగంటలకు ఇంటికొచ్చేసాము. ఈ ట్రిప్పులో, మేము చూసిన స్థలాలు, సోమనాథ్ పురాలోని, శ్రీ కేశవస్వామి ఆలయం. ఈ మధ్యలో ఏ ఆలయానికి ఇంత ‘థ్రిల్’ అయి చూసిన అనుభవమే లేదు. అంత అద్భుతమైన ఆలయం. రెండవది, ఒక […]

కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”

రచన: శ్యామసుందరరావు ఒకసారి వేటాడాలన్న ఆసక్తితో చేది రాజు వసు తన పరివారముతో వేటకు బయలుదేరాడు కొంచము సేపు వేటాడినాక అలసిపోవటం వల్ల ఆ ప్రాంతములోని ఒక ఆశ్రమాన్ని చేరి అక్కడి ఆశ్రమ ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణానికి సంతోషపడి తాను ప్రస్తుతము గడుపుతున్న జీవితము మీద విరక్తి కలిగింది.ఈ భోగభాగ్యాలు సుఖాలు అన్ని అశాశ్వతమని పరమాత్ముడే శాశ్వతమని నిర్ణయించుకొని అన్నిటిని త్యజించి తపస్సు ప్రారంభించాడు.ఈ తపస్సు తన ఇంద్రపదవికి అన్న అనుమానంతో రాజు కోరకుండానే ఇంద్రుడు ఇతర […]

మాలిక మాసపత్రిక ఆగస్ట్ 2022 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక రచయితలు, మిత్రులు అందరికీ స్వాగతం.. శ్రావణమాసపు శుభాకాంక్షలు.. రాబోయేదంతా అమ్మవారి పండగ రోజులే.. మండే ఎండలు దాటి, వర్షాలథాటి తగ్గి ప్రకృతి అంతా పువ్వులతో రంగులమయంగా మారి మనోహరంగా ఉంటుంది. ఈ రెండు నెలలు కూడా అమ్మవారికి, అమ్మాయిలకు, అమ్మలకు కూడా పరమ ప్రియమైనవి. బోనాలు అయిపోయాయి, ఇక వరుసగా వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, దసరా నవరాత్రులు, బతుకమ్మ, దసరా, దీపావళి… బుుతువుల మార్పులతో వచ్చే ఇబ్బందులు, ప్రమాదాలు, ఆరోగ్యసమస్యలనుండి అందరినీ కాపాడాలని […]

కంభంపాటి కథలు – మతి”మెరుపు”

రచన: కంభంపాటి రవీంద్ర ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూంటే , తను చెప్పింది, “పక్క ఫ్లాట్ లో కొత్తగా ఓ ఫ్యామిలీ వచ్చేరు . మళయాళీ వాళ్ళట !” “ఊహూఁ” “ఊహూఁ అనడం కాదు… అతను మీ కాలేజీయేనట” “మా కాలేజీ అంటే…అందులో ప్రతీ ఏడాదీ ఓ బ్యాచ్ బయటకి వస్తూంటుంది… అందులో అతను ఏ ఏడాది బ్యాచో” “ఏ ఏడాదో అయితే… మీకెందుకు చెబుతాను? మీ బ్యాచేనట” “అవునా? అతను చెప్పేడా ?” “లేదు… ఆవిడ […]

మోదుగపూలు – 13

రచన: సంధ్య యల్లాప్రగడ ఆడిటోరియంలో ఏర్పడిన ట్రాన్సు లాంటి నిశబ్ధం తెర వెనుక ఉన్న మధును, వివేక్‌ను, విద్యార్థులను కంగారు పెట్టింది. “ఏంటి ఒక్కరు చప్పట్లు కొట్టరు?” అన్నాడు మధు సార్‌. “ఎవరికీ అర్థం కాలేదా?” విచిత్రమైన డైలమాలో పడిపోతూ అన్నాడు వివేక్‌. “మేము మీరు చెప్పినట్లే చేశాము కదా సార్” అంటూ పాత్రలు వేసిన పిల్లలు చుట్టూ చేరారు. “ప్రసాదరావుసార్‌ కూడా చప్పుడు చెయ్యడా? లేక మనకు వినపడటంలేదా?” అన్నాడు వివేక్ కంగారుగా.. “చూద్దాం. ముందు […]