May 8, 2024

పిల్లల మనసు

రచన: లక్ష్మీ రాఘవ ‘”మమ్మీ ఈ వారం గిరిజా ఆంటీ వస్తున్నారా? కనుక్కో” హాస్టల్ నుండీ కొడుకు కౌశిక్ ఫోనులో ప్రత్యేకంగా చెప్పడం ఆశ్చర్యం వేసింది. “ఫోన్ చేసి అడుగుతాను. నేనైతే వస్తాను వీకెండ్ . నాన్న రావటానికి కుదరదు. ” “సరే మమ్మీ” ***** ఎంసెట్ కోచింగ్ వున్న రెసిడెన్షియల్ స్కూల్ ల్లో వేసాక పేరెంట్స్ శనివారం కానీ ఆదివారం కానీ వెళ్లి 2 గంటలు గడపవచ్చు. చదువు గురించీ, వాళ్ళ కంఫర్ట్ గురించీ మంచీ […]

ఎందుకోసం?.

డా.కె. మీరాబాయి అమ్మా! ఆలస్యం అయిపోతూంది తొందరగా రా “ అంటూ హడావిడి పెట్టింది అపర్ణ. “ కాస్త ముందు గుర్తు చేయవచ్చు కదా “ గబ గబ మెట్లు దిగింది రమ. శనివారం స్కూలుకు సెలవు రోజైనా వర్క్ యూనిఫాం వేసుకుని మూడు ముప్పావుకే తయారై పోయి అమ్మను తొందర పెడుతోంది అపర్ణ. చదువుతున్నది పన్నెండో తరగతి. వయసు చూస్తే పద్ధెనిమిదో సంవత్సరం నిండ లేదు. అప్పుడే స్వతంత్రంగా సంపాదించాలనే వుబలాటం ఏమిటో అర్థం కాక […]

సౌందర్య భారతం

రచన: మణికుమారి గోవిందరాజుల “వేదా ఎక్కడికెళ్తున్నావే? పిన్ని వద్దని చెప్పింది కదా? మళ్ళీ అక్కడికేనా?” “అవునక్కా!” “పెద్దవాళ్ళు వద్దని చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే కదా?” “అక్కా! నేను చేసేది కూడా మన మంచికే అక్కా! అందరమూ మనకెందుకులే అనుకుంటే ఎలా అక్కా?” “ఏమోనే! నువు చేస్తున్నది మంచికా చెడుకా అనేది కాదు. కాని వద్దన్నప్పుడు చేయడం ఎందుకు?” అడుగుతున్న కీర్తనను జాలిగా చూసింది వేద. “అక్కా నీకొకటి చూపిస్తాను రా…” అని […]

భిన్నధృవాలు

రచన: మంథా భానుమతి “ఈ సంగతి తెలుసా? సుబ్బన్న భార్య సీత, సుబ్బన్నని విదిలేసిందిట!” కాఫీ కలుపుతున్న సరోజ వెనక్కి తిరిగి అలా నిర్ఘాంతపోయి ఉండిపోయింది రమ మాటలు విని. “ముందా కాఫీ సంగచ్చూడు తల్లీ! సుబ్బన్న ఎక్కడికీ పోడు కానీ..” రమ హెచ్చరించింది. సరోజ, రమ ఆరో క్లాసు నుంచీ డిగ్రీ అయే వరకూ కలిసి చదువుకున్నారు. పెళ్లిళ్లు అయాక కూడా ఒకే ఊరిలో ఉండటంతో నిరాటంకంగా సాగుతోంది వారి స్నేహం. వారానికొక సారైనా కలిసి […]

గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది

రచన : శ్రీపాద శ్రీనివాస్ ఉదయాన్నే 5.30 కి లేవడం…అమ్మ నిద్ర లేచిందో లేదో చూసుకోవడం..బయటకి వెళ్ళి పాలు తెచ్చి వాటిని మరగబెట్టి అమ్మని నిద్ర లేపడం, తదుపరి ఇంటి పనుల్లో అమ్మకి సహాయపడుతూ దైనందిన జీవితానికి ఉపక్రమించడం….ఇది రోజువారి మోహనవంశీ జీవితం….!!!! ప్రతిరోజులాగే తనకి ఉదయం 5.30 కి నిద్ర నుండి మెలుకవ వచ్చింది..అవును బయటకి వెళ్ళి పాలుతేవాలి అనుకుంటూ ఆవలిస్తూ నిద్ర లేచాడు మోహనవంశీ..అమ్మ నిద్రలేచిందో లేదో చూద్దాం అనుకుంటూ ఒక్కసారి అమ్మ మంచం […]

జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”

రచన: గిరిజారాణి కలవల ” జలజం.. ఏమోయ్. జలజం.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. వంటింట్లోంచి చుయ్ చుయ్ లు వినపడ్డం లేదూ! ఇంకా వంట మొదలెట్టలేదా?” జలజాపతి పొట్ట నిమురుకుంటూ హాల్లో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చాడు. బెడ్ షీట్లు మారుస్తున్న జలజం. దుప్పటి అక్కడ విసిరికొట్టి ఒక్కసారిగా గయ్ మంది.” చుయ్ చుయ్ లు వినపడ్డం లేదా? ఇప్పుడు టైమింకా పదయిందంతే.. గంట కితమేగా పొట్ట నిండుగా కట్టుపొంగలి లాగించారు.. అప్పుడే ఎలకలు పరిగెడుతున్నాయా? […]

నథింగ్ బట్ స్పెషల్

రచన: లక్ష్మీ చామర్తి ” మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ”, “త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ”. పాట వస్తోంది టీవీలో. ఒకప్పుడు ఈ పాట వింటే ఆడ జన్మ ఎత్తినందుకు ఎంతో గర్వంగా అనిపించేది. ఈ రోజు ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చింది స్ఫూర్తి. ఉతకాల్సిన బట్టల్ని మిషన్లో వేసి బయటకు చూస్తూ నిల్చుంది. ఎదురింటి బోర్డు సుహాసిని ఎంఏ పిహెచ్ డి లెక్చరర్, పక్కనే […]

సంధ్యాదీపం

రచన: లక్ష్మీ పద్మజ ‘‘ఒసేయ్‌ రంగీ ఆ కాగులో నీళ్ళుపోసి అంటించవే… అమ్మాయి వచ్చి స్నానం చేస్తుంది. ‘‘ఒరేయ్‌ కొండా వాకిళ్ళంతా శుభ్రంగా వూడ్పించు. అమెరికా నుండి వస్తున్న నా మనవరాలికి అంతా నీట్‌గా ఉండాలిరా. ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తొంది నా తల్లి నన్ను వెతుక్కుంటూ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను… మళ్ళీ ఇన్నాళ్లకు అదృష్టం కలిగింది. ఆ తర్వాత పై మేడ మీద గది శుభ్రం చేయించు అక్కడ ఏ.సి. అన్నీ పని చేస్తున్నయా లేదో […]

మనసుకు చికిత్స

రచన: లక్ష్మీ రాఘవ అక్క భారతి వచ్చిందని చాలా సంతోష౦గా వుంది మూర్తికి. ఒక వయసు తరువాత చిన్ననాటి బాంధవ్యాలు గానీ జ్ఞాపకాలు కానీ తలుచుకుంటూ వుంటే చాలా అపురూపంగా వుంటాయి. రెండు రోజులు ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మరీ ఆనందపడిపోయారు ఇద్దరూ ఆ వయసులో. అక్కా, తమ్ముళ్ళ ముచ్చట్లు వింటూ మురిసింది మూర్తి భార్య రాధ కూడా. భారతి వున్న వూరికి దగ్గరగా ట్రాన్స్ఫర్ అవగానే వెళ్లి భారతిని చూసి వచ్చాడు మూర్తి. అక్క కోడలు […]

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల “నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి . అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. . మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది. ”కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్. “ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి యెంత ఇబ్బంది పడుతున్నావో అని మాకు యెంత బెంగగా వుంటుందొ తెలుసా?” కంఠం రుద్దమయింది. “ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను. […]