May 7, 2024

తరం – అనంతం

రచన : సోమ సుధేష్ణ హరిణి ఇంట్లోకి రాగానే సుజాత ఎదురుగా వెళ్లి మనవరాలిని గట్టిగా కౌగిలించుకుంది. హరిణి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక క్షణం చూసింది. మనవరాలి కళ్ళల్లోంచి కారుతున్న కన్నీటిని ప్రేమగా తుడుస్తూ భుజాలపై చేయివేసి లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చుంది. నిన్నంతా ఫోనులో జరిగిన తంతు గురించి చెప్పి గుండె లవిసి పోయేలా ఏడ్చే మనవరాలిని వెంటనే తన దగ్గరకు రమ్మని చెప్పింది. కారు డ్రైవ్ చేయడం మొదలు […]

నేను సైతం

రచన: సుధ ఆత్రేయ జీవితమనేది గమ్యం కాదు గమనం మాత్రమే… నా పేరు అఖిల్ నేనో పెద్ద అంతర్జాతీయ ఫుడ్ బిజినెస్ కంపెనీకు ఒక డైరెక్టర్ను. సగటు భారతీయుడి కల అయిన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాసము. పెద్ద హోదా మంచి జీతము. భార్య, ఇద్దరు పిల్లలు. నాకు కెరీర్ లో పై స్థాయికి చేరుకోవాలని చిన్నప్పటినుంచి కోరిక. అందుకు తగ్గట్టుగానే కష్టపడిచదివా. చదువంతా ఐఐటీ లోనే సాగింది. క్యాంపస్ లోనే జాబ్. కోరుకున్నట్టు గానే చాల […]

మజిలీ

రచన: డా.కె.మీరాబాయి మారుతీ కారు గుత్తి బస్ స్టేషన్ లో హోటల్ ముందు ఆగింది. “ఇక్కడ దోసె బావుంటుంది.” కారులోనుండి దిగుతూ అన్నాడు మాధవమూర్తి. మంజుల చిన్నగా నవ్వింది. మాధవమూర్తి భోజన ప్రియుడు. ఎప్పుడో పదేళ్ళ క్రిందట నెల్లూరు మనోరమ హొటల్ లో తిన్న పూరీ కూర రుచి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు.. మంజుల చేతి గడియారం చూసుకుంది. రెండు గంటల సేపు ఎక్కడా ఆపకుండా కారు నడిపిన అలసట భర్త ముఖంలో కనబడింది. ఎండ ఎక్కక […]

చిన్నారి మనసు….

రచన: మణి గోవిందరాజుల అత్తకు, అత్త పిల్లలకు జరుగుతున్న వైభోగాన్ని కుతూహలంగా ఇంతలేసి కళ్ళేసుకుని పరిశీలిస్తున్నది ఎనిమిదేళ్ళ చిన్నారి. నిన్ననే దర్జీ వాడొచ్చి అత్తకు కుట్టిన కొత్త జాకెట్లూ ,అత్త పిల్లలకు కుట్టిన పట్టు లంగాలూ ఇచ్చి వెళ్ళాడు. . “పట్టు లంగాలైతే ఎంత బాగున్నాయో చెప్పలేను. ఒక్కసారి ముట్టుకుని చూట్టానికి కూడా ఇవ్వలేదు” గొణుక్కుంది చిన్నారి మనసులో. నాక్కూడా కావాలని చిన్నారి గొడవ చేసింది. కాని అమ్మ పక్కకు తీసుకెళ్ళి నోరు మూసి రహస్యంగా తొడపాశం […]

నేను…

రచన- డా లక్ష్మి రాఘవ నన్ను అందంగా తయారు చేస్తున్నారు అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు. నా ముఖం ఇంకా ఎంత అందంగా ఉండాలో అని మాట్లాడుతూంటే సిగ్గుపడి పోయాను. అసలే నా నిండా అందమైన ఆలోచనలు, వాటికి తోడు అలంకరణతో అద్బుతంగా అవుతుందంటే ఎవరికీ ఆనందం కలగదు? పైగా “ఎంత ఖర్చయినా పరవాలేదు ఎంత బాగుండాలంటే చూడగానే కావాలని అనిపించాలి” అన్నారు నా వాళ్ళు. ఇక నా ఆనందానికి హద్దులు లేవు! చూడ్డానికి బాగుండటానికి, […]

జలజాక్షి.. సంగీతం కోచింగ్..

రచన: గిరిజారాణి కలవల ఎప్పుడో చిన్నప్పుడు.. కాసిని వర్ణాలూ.. ఇంకాసిని కీర్తనలూ గట్రా.. ఏవో నేర్చుకుంది మన జలజం.. వాళ్ళ బామ్మ బతికున్ననాళ్ళూ సంగీత సాధన చేసాననిపించి.. ఏవో కొన్ని రాగాలని ముక్కున పట్టింది. ఇంటి ఆడపిల్ల చక్కగా సంగీతాలాపన చేస్తోంటే.. సరస్వతీదేవి నట్టింట వీణ వాయించినట్టే వుంటుందని బామ్మ పట్టుబట్టి.. మాష్టారిని ఇంటికి పిలిపించి.. జలజాక్షికి సంగీతం నేర్పించింది. ఆ మాష్టారు కూడా.. జలజానికి తగిన మనిషే… శంకరాభరణం సినిమాలో దాసు కేరక్టరే అనుకోండి.. చక్కటి […]

చిన్నారితల్లి నా చిట్టితల్లి

రచన: తులసి భాను నాన్నా అంటూ వెనుకనుంచీ మెడచుట్టూ చేతులు వేసి గారాలు పోతోంది 28 యేళ్ళ చిట్టితల్లి, తన తండ్రి ఆనంద్ దగ్గర. ఏమ్మా ఏం కావాలీ అన్నాడు ఆనంద్ తన పని ఆపేసి. నాన్నా ఇప్పుడు పెళ్ళి వద్దు నాకు అంది దిగులుగా రేణుక తండ్రి చెవుల్లో రహస్యంగా. తల్లి వింటే తిడుతుందని భయం మరి,ఇన్నేళ్ళొచ్చాయి, పెళ్ళి వద్దు వద్దు అని ఇన్నేళ్ళు సాగదీసావు, ఇంకా ఇప్పుడు కూడా దాటేయాలని చూస్తే ఊరుకోను అని […]

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ. “నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, […]

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం. పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, […]

ఖజానా

రచన : సోమ సుధేష్ణ రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర […]