April 26, 2024

అమ్మమ్మ – 6

రచన: గిరిజ పీసపాటి నాగకి జ్వరం ఎక్కువగా ఉండడంతో తమ ఇంటిలోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టాక తెల్లవార్లూ నాగను కనిపెట్టుకుని కూర్చున్నారు తాతయ్య, అమ్మమ్మ, పెద్దన్నయ్య, వాళ్ళ అమ్మగారు. గంట గంటకూ నాగకి జ్వరం పెరగసాగింది. తెల్లవారేసరికి నాగకి ఒళ్ళంతా‌ కుంకుడు గింజల‌ పరిమాణంలో కండలు పోసేసి పెద్దమ్మవారు పోసింది. నాలుక మీద, నాలుక కింద, ఆఖరికి కంట్లో కూడా కుండలు పోసాయి. వాటివల్ల విపరీతమైన దురదలు, మంట, జ్వరంతో నాలుగు సంవత్సరాల వయసు గల నాగ […]

ఎగురనీయండి. ఎదగనీయండి

రచన: మీరా సుబ్రహ్మణ్యం సరోజ నేను కలిసి చదువుకున్నాము. ఓకే వూళ్ళో వేరే సంస్థలలో ఉద్యోగం చేస్తున్నాము. నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది సరొజ. ఈ పాతికేళ్ళ స్నేహంలో తన కుటుంబ సభ్యులూ నాకు ఆత్మీయులయ్యారు. గత పదిహేను సంవత్సరాలుగా జీవితంతో వొంటరి పోరాటం చేస్తొంది సరోజ. పెళ్ళైన నాలుగేళ్ళకే సరోజ భర్త రవి స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపొయాడు. అప్పటికి మూడేళ్ళ పసివాడు సాయి. సాయి కోసమే తన బ్రతుకు అన్నట్టు తల్లి తండ్రి […]

లేచింది మహిళ

రచన : సోమ సుధేష్ణ   భారతికి నిద్ర రావడం లేదు. మూగబోయిన మనసుకు ఊపిరి ఆడటం లేదు. మనసేనాడో  మొద్దు బారిపోయింది. శరీరం చలించడం మానేసి చాన్నాళ్ళయింది. భర్త చనిపోయాడని బాధా లేదు, సంతోషమూ లేదు. దట్టమైన అడవిలో నడుస్తూ బయట ప్రపంచాన్ని చూస్తానా ! చూడనా! అనుకుంటూ జీవితమంతా నడిచి, అలసి పోయి ఆశ వదులు కున్నప్పుడు వెలుతురు కనిపిస్తుంది. అలవాటులేని వెలుతురు- అలవాటైన చీకటి- దేవుణ్ణి తలుచుకోవడం కూడా మరిచి పోయింది. యాంత్రికంగా […]

క్షమయా ధరిత్రే కాని……

రచన:  మణి గోవిందరాజుల   విలేఖరుల చేతుల్లోని ఫ్లాష్ లైట్లు చక చకా వెలిగిపోతున్నాయి. అక్కడ అంతా హడావుడిగా వుంది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు. హంతకురాలిని చూడడానికి జనం విరగబడి పోతున్నారు. “చీ!చి!  . . అమ్మ అన్నపదానికే అవమానం తెచ్చింది” యెవరో చీదరించుకుంటున్నారు. “ అసలు కన్నకొడుకు కాదేమో. . అందుకే అలా చేయగలిగింది. ” “మన దేశం పరువు తీసింది కదా?ఇలాంటి వాళ్ళను వురి తీయాలి ఆలో చించకుండా” “ప్రపంచ దేశాల్లో మనం […]

‘ఉషోదయం’

రచన: నండూరి సుందరీ నాగమణి   “స్వాతంత్ర్యమె మా జన్మహక్కనీ చాటండీ!”రేడియో లో వినిపిస్తున్న ఘంటసాల వారి దేశభక్తి గేయాన్ని వింటూ మేను పులకించిపోతుండగా రెండు చేతులూ జోడించి కళ్ళుమూసుకుని ఒక ధ్యానంలో ఉండిపోయాడు గిరిధారి. “అంకుల్, అంకుల్!”తలుపు కొట్టటంతో ధ్యాన భంగమై లేచి తలుపు తీసాడు. ఎదురుగా ఎదురింటి వారి మనవరాలు కుముద.ఆ పిల్ల వెనకాలే మరో పిల్లవాడు… “మేమంతా ఆడుకుంటూ ఉంటే బంతి కిటికీలోంచిమీ ఇంట్లో పడింది…” అంది సోఫా క్రింద చూపిస్తూ. తీసుకోమన్నట్టు […]

“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు “విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి. భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది. “ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది. గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను. “ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?” “ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు […]

పరికిణీ

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ “అమ్మా..! రా అమ్మా..! కేక్ కట్ చేద్దూగానీ..  లేమ్మా.. నీకోసం కేక్ తెచ్చానమ్మా ” బ్రతిమాలుతోంది అమాయకంగా పర్ణిక, బెడ్రూం లో నిస్తేజంగా పడుకుని ఉన్న జయంతిని. ” ప్లీజ్ పర్ణిక నాకు ఇష్టం లేదు… గెట్ లాస్ట్ , ప్లీజ్ లీవ్ మి ఎలోన్” , హిస్టీరిక్ గా అరిచింది జయంతి.  ఎప్పుడూ పల్లెత్తు మాట అనని అమ్మ అలా అరిచే సరికి విస్తుపోయింది పదకొండేళ్ళ పర్ణిక. అంతలో వాకిలి తలుపు […]

జలజం టీవీ వంట.

రచన: గిరిజరాణి కలవల ” ఆహా.. నా వంటా…ఓహో..నే..తింటా” టివీ షో వారిని ఎప్పుడో.. మన జూలీ తన ఇంటికి రమ్మని పెట్టుకున్న పిలుపు.. ఈనాటికి వాళ్ళు కరుణించి.. ఫలానా రోజున మీ ఇంటికి వస్తాము.. మంచి వంట చేయండి.. రికార్డు చేస్తామని కబురు చేసారు. ఇక మన జూలీ మొహం చూడాలి.. ఆనందంతో తబ్బిబ్బు అయిపోయింది.. వీధి మొత్తం టాంటాం టముకు వేసి చెప్పింది. మూతి ముఫ్ఫై సార్లు తిప్పుకున్నవారు కొందరైతే.. ఆ.. ఇంతే.. ఇలాగే […]

చీకటిలో చిరుదివ్వె

రచన: మణికుమారి గోవిందరాజుల పడక్కుర్చీలో కూర్చుని ఊగుతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నది శాంత.. చేతిలో తమ్ముడు ఎర్రడు రాసిన వుత్తరం అలానే ఉంది. అప్పటికి ఎన్నిసార్లు చదివిందో. చదివిన ప్రతిసారీ గుండెల్లో బాధ రెట్టింపవుతున్నది.. ఏడాదిగా మర్చిపోయిన గతాన్ని అది కూకటి వేళ్ళతో పైకి లాగుతున్నది.వద్దనుకున్న బంధాలను వదిలించుకోలేవంటున్నది. బాధ పడటం నీ జన్మహక్కు..కాదనుకుంటే కుదరదంటున్నది. కళ్ళల్లోనుండి నీళ్ళు కారుతున్నది కూడా తెలియటం లేదు. ఇంతలో లాండ్ లైన్ ఫోన్ మోగింది. కళ్ళుతుడుచుకుని యెవరా అని […]

అమ్మడు

రచన: డా. కె. మీరాబాయి ” అమ్మడు వెళ్ళిపోయాక నాకు పిచ్చెక్కినట్టు వుంది ” అన్న అక్క స్నేహితురాలి మాటలు వినబడి అక్కడే ఆగాడు నిఖిల్. ” నిజమే . ఇంట్లో వున్నంత సేపూ మన చుట్టు తిరుగుతూ వుండి అలవాటైన వాళ్ళు వూరెళ్ళితే దిక్కు తోచదు ప్రమీలా .” ఆక్క ఒదార్పుగా అంది. ” అసలే జనముద్దు పిల్ల. అందులోను వయసులో వుంది .నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు . కాస్త పొట్టిగా బొద్దుగా వున్నా […]