May 5, 2024

స్వచ్ఛ భారతము

రచన: చల్లా పార్వతి స్వచ్ఛ భారతమును సాధించుదామని బాహ్య భారతమును శుద్ధి చేసినా మనుజుల లోపల పట్టిన మకిలిని శుభ్రపరచుట మన తరమగునా పంచభూతాలనుపయోగించి బాహ్య సమాజమును శుద్ధి చేయవచ్చు మన చేతలతో పంచభూతాలను కలుషితం చేస్తూ భావితరాల జీవనయానం కష్టతరం చేసే మనమే కామా భవిత పాటి శత్రువులం మన అంతః శుద్ధి చేయుట ఎవరి తరం ప్రకృతి విరుద్ధ ప్రయోగాలతో వనరులన్నీ నాశనం చేస్తుంటే ఎదుర్కొనక తప్పదు మానవాళికి వాటి పరిణామాలు ప్రకృతి ప్రకోపిస్తే […]

వర్షం…. వర్షం…

రచన :  శ్రీకాంత గుమ్ములూరి.   హర్షం ఇవ్వని వర్షం గట్టు తెగిన కాలవ గుట్ట పొంగి పొరలే వెల్లువ వరదతో పాటు బురద   కొట్టుకుపోయే చెట్టులు పట్టుకు వేళ్ళాడే జీవులు అందుకోబోయే అన్నలు లబో దిబో మనే తల్లులు   గళ్ళు పడ్డ ఇళ్ళు నీరు కారే చూరు చెమ్మకి చివికిన గోడలు దుర్గంధపు మార్గాలు   మురికి గుంటల్లో దోమలు కలిగించే డెంగూ, మలేరియాలు తిండి పై ముసిరే ఈగలూ అందించే పలు […]

వినతి

రచన:  జి.భానువర్ధన్   అన్నార్తుల కేకలే నీకు సంకీర్తనలు.. దాహార్తుల కన్నీటి బొట్లే నీకు అభిషేకాలు.. అనాధల ఆక్రందలనే నీకు నైవేద్యాలు.. మసకబారిన బడుగు బతుకులే నీకు సంతర్పణలు.. అయినా నీవు  ప్రసన్నుడవు కావేల? నీ ప్రచండ కోపాగ్నిన దహించుట ఏల? ఉన్నోడికి వరాల ఝల్లులు .. లేనోడికి శాపాల కొరడా దెబ్బలు..   ఓ దేవా..! ఈ వివక్షత నీకు మేలా? ఇది నీ సృష్టి లోపమా ..? మా దృష్టి లోపమా ..? తేల్చుకోలేక […]

నీ జ్ఞాపకంలో

రచన, చిత్రం : కృష్ణ అశోక్. గుండె గూటిలో నీవు అనే జ్ఞాపకం ఒక అద్భుతం… ఈ జీవితానికి జతకాలేమేమోకానీ మనసులో నిరంతరజతగా మరుజన్మ వరకూ జీవిస్తూ.. నిర్జీవిస్తూ… నీ జాబిలి చెక్కిలి చుంబనాల చెమరింపుల వర్ణాల జిలుగులలో భ్రమిస్తూ.. పరిభ్రమిస్తూ… చుక్కలను తాకే నీ జ్ఞాన పరిపక్వత వెలుగుల ఆరాలను చేరేందుకు శ్రమిస్తూ.. విశ్రమిస్తూ… అంతర్యామివై నాలో నగ్నంగా కదిలే నీ ఆత్మతో అలౌకిక స్వప్నంలో రమిస్తూ.. విరమిస్తూ… గుండెల కౌగిళ్ళలో బిగించాలనిపించే దేహారహిత నీ […]

సంఘర్షణ

రచన: వంజారి రోహిణి     ” నిరంతర ఘర్షణ క్షణ క్షణం కీచులాట నాలోని నాస్తిక, ఆస్తికత్వాలకు… తక్కెడలో తూకపు వస్తువుల్లా ఒకసారి నాస్తికత్వం పైకొస్తే మరోసారి ఆస్తికత్వానిది పై చేయి అవుతుంది… అరాచకాలు,అబలల ఆక్రందనలు, పసిమొగ్గల చిదిమివేతలు చూసినపుడు మనిషి ఉలితో చెక్కి దేవుణ్ణి చేసిన రాతిబొమ్మ హృదయం లేని పాషాణమే అని నాలోని నాస్తికత్వం వేదనతో గొంతు చించుకుంటుంది… మళ్ళీ ఎక్కడో ఓ చోట ఓ కామాంధుడికి శిక్ష పడి ధర్మం గెలిచిన […]

నానీలు

  రచన: అద్విత శ్రీరాగం   1 . నీ కోసం నా కనుల పుష్పాలు వికసించాయి అన్వేషణ పరిమళాలతోనే . 2 . నీ అడుగులు నా హృదయంలో ధ్వనిస్తున్నాయి నేను పరచిన పూలమీద . 3 . నా ఓణీ గాలితో  ఏదో ఊసులాడుతోంది మేఘ సందేశం పంపటానికి. 4 . మౌనం నాకెంత ఇష్టమో ! హృదయ పత్రంపై ప్రేమలేఖ రాయటం . 5 . ప్రయాణం గమ్యం నీవే సౌమ్యం నీవే […]

మేలుకొలుపు!

రచన:- నాగులవంచ వసంతరావు జీవితమంటేనే కష్టసుఖముల పెనుగులాట మర్మం తెలుసుకుంటే మనకది వెలుగుబాట లక్ష్యనిష్ఠలో నీకు కలిగిన మరపు చేస్తుంది జీవితానికి అంతులేని చెరుపు గరిటెడంత కృషిచేసి గొప్పగా పొంగిపోకు గంపెడంత ఫలితంరాలేదని దిగులుగా కృంగిపోకు క్షణికోద్రేకంలో చేసిన తప్పు తెస్తుంది జీవితానికెంతో ముప్పు గతాన్ని మరువనంతకాలం ఉంటుంది పురోగతి మరచిన మరుక్షణమే అవుతుంది అధోగతి సహజ జీవనమే సద్గతికి రహదారి విలాస జీవితమే వినాశనానికి వారధి చదువు నేర్పిన చక్కని సంస్కారాన్ని నిలువెత్తు స్వార్థం స్వాహా […]

ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )

రచన: మూలా వీరేశ్వరరావు   నీ కష్టాలను ఫిల్టర్ చేసి నాకు ఫిల్టర్ కాఫీ ఇచ్చావు ఇంటి ధూళినే మధూళి గా ధరించి ఉదయాన్ని మధోదయంగా మార్చావు ! గిన్నెలు కూడా నీ కన్నులతో మాట్లాడతాయని వంటిల్లు వదిలి పుట్టింటికి వెళ్ళినప్పుడే అర్ధమైంది ! గుట్టలు గా పెరిగిన నా బట్టలు నీ చేతిలో ఏ మంత్రముందో మల్లెల దొంతరలుగా మారిపోతాయి ! వంటింట్లో సామానులన్నీ నీ వుంటే శిక్షణ పొందిన సైనికులై నీ ఆజ్ఞతో అమృతానికి […]

‘పర’ వశం…

  రచన, చిత్రం : కృష్ణ అశోక్ గోవులు కాచే వయసుకే గోపెమ్మ చేతిలో చిక్కాను, ఆమె కమ్మని కబుర్ల ముద్దలు ప్రేమ పెదవుల ముద్దులు మొదలు..   వయసు తెలిసే వేళకే ఓ అంకం మొదలయ్యింది… ఒళ్ళంతా చిన్ని చిన్ని మోహాల మొలకలు లేలేత చిగుళ్ళు వేసి పరువపు గుర్తులుగా కొంచెం కొంచెం ఎదుగుతూ… ‘పరవశం’ కి అర్ధం తెలియకుండానే మనసు తనువు ‘పర’వశము…   తొలిరోజుల నాటిన ఆ ప్రేమమొక్క నాతోపాటు ఎదుగుతూనే ఉంది.. […]

అనుభవాలు….

రచన, చిత్రం : కాంత గుమ్ములూరి   ఐపోయిన సెలవులు మొదలైన బడులు పిల్లల నిట్టూర్పులు మండే ఎండలు ఉక్క పోతలు కొత్త పుస్తకాలు అర్ధంకాని పాఠాలు తెలియని భయాలు ఉపాధ్యాయుల బెదిరింపులు సహాధ్యాయుల వెక్కిరింతలు తండ్రుల సవాళ్లు తల్లుల ఓదార్పులు కొత్త స్నేహాలు విడువని కబుర్లు ప్రాణ స్నేహితులు కలిసి అల్లర్లు ఎఱ్ఱ రిబ్బన్లు రెండేసి జడలు తురిమిన మల్లెలు వేసవి గుబాళింపులు తొలకరి వానలు రంగుల గొడుగులు తడిసిన సంచులు పిల్లల కేరింతలు ఎదిగే […]