May 8, 2024

మనం ఇలా ఉంటామెందుకు?

రచన: వసంతశ్రీ పొద్దున్న లేస్తూనే దేముణ్ణి పూజిస్తాం- ఇంట్లో ఇల్లాలిపై మాత్రం కసుర్లు. శివుడు తనలో అర్ధ భాగమిచ్చాడని తలుస్తూ- నీకేమీ తెలీదని భార్యని దెప్పి పొడుస్తూ. పుస్తకాన్ని సరస్వతీ అని నమస్కరిస్తుంటాం- ప్రతీదానికీ పేపర్ చెత్త కోసం వాడతాం. అగరబత్తి డబ్బా పైన ఉండే దేముని బొమ్మనీ దాస్తాం- ప్రతీ అబద్దానికీ దేముడిపై ఒట్టేస్తూ. లక్ష్మీ దేవిని పూజిస్తూ- లక్ష్మీ బాంబుని పెల్చేస్తూ దీపావళి. ప్రతీ రోజూ గుడి కెళ్లాలని ప్రయత్నిస్తాం- వెళ్ళినా వరసలోనిలబడకుండా ముందుకు […]

తపస్సు – మొదటి సమిధ

రచన:- రామా చంద్రమౌళి ఔను .. ఈ శరీరం ఒక పుస్తకమే .. సంహిత బీళ్ళు, అరణ్యాలు , నదులు, పర్వతాలు .. అన్నీ ఈ దేహంలోనే .. సుప్త సముద్రాలు , జ్వలితాకాశాలు పుట వెనుక పుట తిప్పుతూ ఎన్ని యుగాలుగానో .. ఈ బూజుపట్టిన గ్రంథాల పురాపరిమళం హోమర్ లు, వ్యాసులు, కంఫ్యూషియస్ లు, సూఫీలు అన్నీ రక్తనదుల్లో కొట్టుకుపోతూ రాజ్యావశేషాలు ఏ చక్రవర్తి జాడించి సింహాసనంపైకి బొంగరాన్నో , ఖడ్గాన్నో విసిరినా అది […]

అంతర్యుద్ధం

రచన: మూలా వీరేశ్వరరావు పుట్టక ముందే ఎదో పెద్ద కుట్ర జరిగింది ! జాతి అని, మతమని, కులమని, లింగమని నా మీద ముద్ర వేశారు ! నన్ను నేను చూసే అవకాశం లేదు ! చదువేదో మొదలయ్యాక ఇప్పుడు 90 శాతం 30 శాతం ఒకే చోట కూర్చునే అనివార్య స్థితి అంతర్యుద్దానికి సిద్ధం చేస్తుంది ! జంధ్యం పోగు,మాంసము పేగు పెనవేసుకొని సాగే పరిస్థితి ! కులాల కొలనులో కలహాల అలలు ! సామాజిక […]

ఎల్. జి. బి. టి.

రచన – శ్రీకాంత గుమ్ములూరి. అనాది నుండి మన సమాజంలో ఎన్నెన్ని వర్ణాలు !!! కులం మతం జాతి లింగం ఎన్నెన్నో విభాగాలు. వీటన్నింటినీ సంతరించుకుని వైషమ్యాల కక్షలు !! ఒక అతివ మరొక అతివను మోహించిందని ఒక పురుషుడు వేరొక పురుషునితో రమించాడని ద్విలింగాత్మక మైధునంలో లైంగికానుభూతి బడసారని పురుషుడు స్త్రీ వలె మరి స్త్రీ పురుష ప్రవృత్తి చూపారని నపుంసకత్వపు పుటకను పొందిన వారు నష్ట జాతకులని వారంతా ప్రకృతికే విరుద్ధమని వారి జీవనమే […]

నరుడు నరుడౌట…

రచన -దాసరాజు రామారావు. కలలు దాటి కన్నీళ్లు దాటి వలలు దాటి వాగువంకలు దాటి గడప దాటి కడుపు దాటి భ్రమలు దాటి పరిభ్రమలు దాటి ఆశలు దాటి ఆశ్రయాలు దాటి పొక్కిళ్లు దాటి వెక్కిళ్లు దాటి చికిత్సలు దాటి విచికిత్సలు దాటి హింసలు దాటి అహింసలు  దాటి ప్రయాణాలు దాటి ప్రయాసలు దాటి వాయిదాలు దాటి ఫాయిదాలు దాటి అడ్డాలు దాటి గడ్డాలు దాటి హత్యలు దాటి ఆత్మహత్యలు దాటి ఆవృతాలు దాటి అనృతాలు  దాటి […]

బాల్యం… ఓ అద్భుతలోకం, ఓ సుందర స్వప్నం

రచన: శ్రీధర్ చౌడారపు   ఆ కళ్ళు నిష్కల్మషాలు ఆ పెదాలపై అనుక్షణం నవ్వు తాండవిస్తూంటుంది అది బోసినవ్వో? భళ్ళుమన్న నవ్వో అక్కడ సిగ్గు బుగ్గల్లో ఎరుపుతో తలదాచుకుంటూంది అక్కడ ఉక్రోషం కాళ్ళను నేలకు బలంగా తాటిస్తుంటూంది అక్కడ కోపం “గీ”మంటూ “గయ్యి”మంటూ అరుస్తూంటుంది అక్కడ ఆశ కళ్ళను పెద్దవి చేసుకుని పెదాలు తడుపుకుంటూంటుంది అక్కడ నిరాశ సర్వం కోల్పోయి దిగాలుగా కూర్చుంటుంది అక్కడ గెలుపు దిగంతాలకెగురుతుంటుంది అక్కడ ఓటమి భోరుమని ఏడుస్తూంటుంది అక్కడ ఆనందం అంతులేని […]

జీవితపుటంచులు

  రచన: మూల వీరేశ్వరరావు     అంచుల దాక వచ్చాక అంచనాలు ఎందుకు ? అంచుల దగ్గర అర్దాల వెతుకు లాట అర్ధ రహితం ! గతం జైలులో జ్జాపకాల సంకెళ్ళేసుకున్న మనో విహంగానికి రెక్కలు ఏవి ? మతంతో మతి తప్పిన మర్కటాలకు జీవిత మార్మికత ఏలా తెలుస్తుంది ? కొలతలతో వెతలు చెందే వాడికి జీవితం ఉత్సవ మని ఎప్పుడు అవగతమవుతుంది ? , మిత్రమా రా కాంతి రహదారిపై ముద్రలు లేని […]

తన్మయి

రచన: శారద యామిని తటాలున పెదవిని ముద్దాడిన వానచినుకు.. ముందునాడే సమర్పించుకున్న మైమరపు.. తలపుల కొలిమిలో రాజుకున్న తపనలు.. దృష్టికి రాకనే మానిపోయినవేవో గాయపు గుర్తులు.. ఆత్మనెపుడో నింపుకున్న ఆలింగనపు తమకాలు.. ప్రేమ అకారణమయినపుడు, మధువులూరు పెదవంచున ముదమయూఖమై ఫలియించినపుడు.. పడమటి సంధ్య కాంతులన్నీ అరచేత గోరింట పూయించుకున్నపుడు.. మరులుగొలిపే నీ అడుగుల మల్లెల బారున నా ఆలోచనల మరువాలల్లుకున్నపుడు.. నీ ఊసుల హరివిల్లుకు నా ఊపిరి రంగును పులుముకున్నపుడు.. ఆరుబయట మందారాన్నై పూచి.. నీ రాకకై […]

ఆనందం..

రచన: బి.రాజ్యలక్ష్మి   ప్రతి మనిషి లో  మరో వ్యక్తిత్వం తప్పనిసరి !అంతర్లీన  ఆలోచనలు  భావాలూ  మెరుగుపడిన  స్మృతులు  అసలుమనిషి జాడలు  మనకు తెలియకుండానే  తెలుపుతాం! ఒకరోజు  ఆలా  కళ్ళుమూసుకుని  ఆలోచనలలోనికి  నన్ను  నేను  తొంగి  చూసుకున్నాను !కలం  నన్ను  పలుకరించింది ! గళం  పలుకమన్నది !కానీ  మనసుమాత్రం  మరోలోకం లో మధుర మురళిని  ముద్దాడింది !నల్లనయ్య  మోహన  వంశి   అలలతేరుపై నాముందు  వాలింది ! నిజం !సాగరతీరం , సంధ్యాసమయం  పున్నమి రేయి  జాలువారే  వెన్నెల  […]

🌷 *మొగ్గలు*🌷

రచన:- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఆలోచనలకు భావాలతో అంకురార్పణ చేస్తేనే కానీ అక్షరాలు రసగంగకవితాప్రవాహాలై పరుగెడుతాయి ఆలోచనలు మేధస్సుకు పూచిన పువ్వులు ఉదయాలు సుప్రభాతగానాలను వినిపిస్తేనే కానీ మట్టిమనుషులు వేకువను ముద్దాడే వెలుగవుతారు ఉదయాలు కోడికూతల రాగాలకు ప్రతీకలు కెరటాలు అలజడులతో పోరుసల్పితేనే కానీ సాగరం గంభీరమైన తన అస్తిత్వాన్ని చాటుకోదు కెరటాలు ఆటుపోట్లను భరించే నిర్ణిద్రగానాలు కిరణాలు వెలుగుబాణాలను సంధింపజేస్తేనే కానీ తిమిరం ఎప్పటికైనా ఓటమి అంచున నిలబడాల్సిందే కిరణాలు అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివిటీలు మనిషి […]