April 27, 2024

ఏం చేయలేము మనం

రచన: రాజేశ్వరి…. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతకంటే ఏం చేయలేము మనం, ఫేస్బుక్ లో ఓ నల్ల చిత్రం, పోస్టులో నాలుగు వరసల నల్ల సాహిత్యం, అంతే, అంతకంటే ఏం చేయలేము మనం, అయ్యో అని ఒక నిట్టూర్పు, ఆగ్గితపు చర్చలు చూస్తూ రిమోట్ విసిరేయడం, అంతే, అంతకంటే ఏం చేయలేము మనం ప్రాణత్యాగానికి విలువ కట్టలేం ప్రాణాన్ని కాపాడలేం, అంతే మనం, ఏం చేయలేము, అసువులు బాసిన అమరజీవుల, అనాధకుటుంబాలకు అపన్నహస్తం అందించి, వారి త్యాగాలకు […]

ఓ మగవాడా….!!!

రచన: పారనంది శాంతకుమారి ఓ మగవాడా…..ప్రేమకు పగవాడా! అమ్మ ప్రేమతో,నాన్న జాలితో వీచే గాలితో,పూచే పూలతో అందాలతో,అనుబంధాలతో ఆత్మీయతలతో,అమాయకత్వంతో ఆడుకుంటావు ఆస్తులతో,దోస్తులతో అబద్ధాలతో,నిబద్ధాలతో అంతరాత్మతో,పరమాత్మతో అందరితో ఆడుకుంటావు. అవకాశాలను వాడుకుంటావు, అవసరమొస్తే వేడుకుంటావు అది తీరాక ప్రాణాలనైనా తోడుకుంటావు నీతిలేని రీతినీది,పాపభీతి లేని జాతి నీది సిగ్గు లేని శాసనం నీది,స్థిరంలేని ఆసనం నీది వగపెరుగని వ్యసనం నీది,వలపెరుగని హృదయం నీది. ఎక్కివచ్చిన మెట్లను ఎగతాళి చేసే ఎడద నీది, మెక్కివచ్చిన తిండిని ఎగాదిగాచూసే బెడద నీది, […]

ఏమైంది. ?????

రచన – శ్రీకాంత గుమ్ములూరి. బుడిబుడి నడకల బుజ్జి పాపాయి తడబడు అడుగుల బుల్లి బుజ్జాయి…. ఇల్లంతా …ఒకటే పరుగు … అడ్డూ ఆపూ లేకుండా… కాళ్ళకడ్డొచ్చిన వస్తువేదైనా…. చిన్నదైనా…పెద్దదైనా…లెక్కచేయక వాటిమీద అడుగులు వేస్తూ… వాటిని తప్పించు కుంటూ… అతి లాఘవంగా…. ఆనందంగా…. నెలవంక నవ్వుతో…. సిరి వెన్నెల మోముతో….. తాను చూచినది చేతితో తాకాలని… దానిని నోట్లో పెట్టుకొని రుచి చూడాలని…. అసలదేమిటో…దాని అంతు చూడాలని! గోడ మీద గండు చీమ …వడివడి గా పాకుతోంది. […]

ఆ బాల్యమే

రచన: మూలా వీరేశ్వరరావు   జ్ఞాపకాల లోయల్లో చిగురించే ఆ బాల్యమే ఇప్పటికి దిశా నిర్దేశం చేస్తోంది !   అసత్యానికి మనస్సు సమీపించి నప్పుడల్లా “హరిశ్చంద్ర” నాటకం కనుల కొలను లో నిండి పోతుంది !   అన్న దమ్ముల పై “వ్యాజ్యాని” కై బంధువులు ఆజ్యం పోసి నపుడు అమ్మ చెప్పిన రామాయణమే ఎదుట నిలిచింది !   నారి పీడన కై తలపడి నప్పుడు విడివడిన ఆ ద్రౌపది కేశమే వెంటాడింది !   లంచాని […]

ప్రేమవ్యధ…!!

రచన, చిత్రం: కృష్ణ అశోక్ పెనవేసుకున్న ప్రేమ పోగులు ఒక్కొక్కటి విడివడి తెగిపోవడం నా కంటిపాపకి కనిపిస్తుంది… గుండెలో రాసుకున్న ప్రేమాక్షర నక్షత్త్రాలు ఆకాశం నుండి ఉల్కల్లా నేలకు రాలడం నా మనసు కిటికీనుండి చూస్తూనే ఉంది… మైత్రి మమకారాలు మాట రాక గుండెగొంతులోనే కరుడు కట్టినట్టు మస్తిష్కపు కేన్వాసు వర్ణిస్తూనే ఉంది… సిరుల విరుల ఊసులన్నీ నీరుగారి నిన్నునన్ను ముంచేస్తున్న సునామీల్లా మనిద్దరినీ చెల్లాచెదురుగా చేయడం నా భవిష్యవాణి చెవిలో చెప్తున్నట్టు వినిపిస్తుంది… ఈ నిట్టూర్పుల […]

విలువ

రచన: పారనంది శాంతకుమారి   నెగిటివ్ ఆలోచన వల్లే పాజిటివ్ ఆలోచనకు విలువ అమావాశ్యవల్లే పౌర్ణమికి విలువ. వేదనవల్లే వేడుకకు విలువ. మరుపువల్లే జ్ఞాపకానికి విలువ. రాత్రి వల్లే పగటికి విలువ. గరళం వల్లే సుధకు విలువ. ఓటమి వల్లే గెలుపుకు విలువ. పోకవల్లే రాకకు విలువ. అబద్ధం వల్లే నిజానికి విలువ. చెడువల్లే మంచికి విలువ. మృగతత్వం వల్లే మానవత్వానికి విలువ. ఒంటరితనంవల్లే జంటతనంకు విలువ. దు:ఖంవల్లే సుఖానికి విలువ. వేసవివల్లే వెన్నెలకు విలువ. కఠినత్వంవల్లే […]

ముత్యాల సరాలు

రచన: ఎమ్.ఎస్.వి గంగరాజు ఆకాశపు టంచులు చూద్దాం సముద్రాల లోతులు చూద్దాం చుక్కలెన్నొ లెక్కలు వేద్దాం గ్రహములపై శోధన చేద్దాం! యాంత్రికమౌ బాటను విడిచీ విజ్ఞానపు వెలుగులు పరచీ విశ్వశాంతి భువిపై పంచే వేడుకకై తపనలు పడదాం! వేల కోట్ల పైకం ఉన్నా ఇంకా మరి కావాలంటూ గోల చేసి దోచుకు పోయే దగాకోర్ల భరతం పడదాం! సమతుల్యపు సద్భావనముల్ సమయోచిత సహకారములన్ జనములలో పెంపొందించే సద్భావన సాధ్యం చేద్దాం! సంకుచితమౌ స్వార్ధం విడిచీ సర్వ జనుల […]

అతన్ని చూశాకే…

రచన: పారనంది శాంతకుమారి. కబుర్లు చెప్పి కార్యాలను ఎలాసాధించుకోవచ్చో, బులిపించి బుట్టలో ఎలా వేసుకోవచ్చో, క్రిగంటి చూపుతోకవ్వించిఎలాకరిగించవచ్చో, మమతలమైకంలో ముంచివేసి ఎలామరిగించవచ్చో, దీనత్వంలోకి దించివేసి ఎలా దగాచేయవచ్చో, కవ్వించి ఎలా కోటలోపాగా వేయవచ్చో, సణుగుడుతో సాధించి ఎలా సాధించవచ్చో, విపరీతమైనవెర్రితోఅర్ధరహితంగా ఎలావాదించవచ్చో, మోమాటపడుతూనే ముగ్గులోకి ఎలా దించవచ్చో, మౌనంతోనేమురిపిస్తూఎలా ముంచవచ్చో, మాయచేసి ఎలా లోయలోకి త్రోయవచ్చో, మనసు విరిచి ఎలా ఆశలను అంతం చేయవచ్చో, జీవితమంటే ఉన్న ఆసక్తిని ఎలా నశింపచేయవచ్చో, నిర్దయతో ఎలా విలయం సృష్టించవచ్చో, […]

స్వచ్ఛ భారతము

రచన: చల్లా పార్వతి స్వచ్ఛ భారతమును సాధించుదామని బాహ్య భారతమును శుద్ధి చేసినా మనుజుల లోపల పట్టిన మకిలిని శుభ్రపరచుట మన తరమగునా పంచభూతాలనుపయోగించి బాహ్య సమాజమును శుద్ధి చేయవచ్చు మన చేతలతో పంచభూతాలను కలుషితం చేస్తూ భావితరాల జీవనయానం కష్టతరం చేసే మనమే కామా భవిత పాటి శత్రువులం మన అంతః శుద్ధి చేయుట ఎవరి తరం ప్రకృతి విరుద్ధ ప్రయోగాలతో వనరులన్నీ నాశనం చేస్తుంటే ఎదుర్కొనక తప్పదు మానవాళికి వాటి పరిణామాలు ప్రకృతి ప్రకోపిస్తే […]

వర్షం…. వర్షం…

రచన :  శ్రీకాంత గుమ్ములూరి.   హర్షం ఇవ్వని వర్షం గట్టు తెగిన కాలవ గుట్ట పొంగి పొరలే వెల్లువ వరదతో పాటు బురద   కొట్టుకుపోయే చెట్టులు పట్టుకు వేళ్ళాడే జీవులు అందుకోబోయే అన్నలు లబో దిబో మనే తల్లులు   గళ్ళు పడ్డ ఇళ్ళు నీరు కారే చూరు చెమ్మకి చివికిన గోడలు దుర్గంధపు మార్గాలు   మురికి గుంటల్లో దోమలు కలిగించే డెంగూ, మలేరియాలు తిండి పై ముసిరే ఈగలూ అందించే పలు […]