April 27, 2024

ఎడం

రచన- డా. లక్ష్మి రాఘవ   “సుచిత్ గురించి భయంగా వుంది రూపా” మాలిని గొంతు ఆందోళనగా వుంది ఫోనులో “ఏమయింది?” రూప అడిగింది స్నేహితురాలిని. “ఈమధ్య వాడు కొంచం వేరుగా బిహేవ్ చేస్తున్నాడు” “ఒక సారి ఇంటికి తీసుకురా మాలినీ” “ఇంటి కా? నీ క్లినిక్ కి వద్దామనుకున్నా” “ఈ వారం స్కూల్స్ విజిట్ చెయ్యాలి. కాబట్టి క్లినిక్ కి వెళ్ళను.” “అయితే వాడు స్కూల్ నుండీ రాగానే తీసుకు వస్తా” “చిన్నోడు ఎలా వున్నాడు? రజిత్ […]

ఇల్లాలు

రచన – డా. లక్ష్మి రాఘవ “ఉద్యోగం మానేస్తున్నావా? పిచ్చా ఏమైనా ?” తీవ్రంగా స్పందించింది రేఖ కొలీగ్ సంధ్య. రేఖ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ “పిచ్చేమిటే? అవసరం…” “అవసరమా?ఒకసారి ప్రపంచాన్ని చూడు. ఇలాటి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో జనం.” “నిజమే నేను కూడా చదువు అవగానే మంచి ఉద్యోగం కోసం ఎన్ని ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యాను..” “కదా…అందుకే ఆలోచింపమంటున్నాను. ఒక MNC లో మంచి పొజిషన్ లో ఉంటూ…పెళ్లి అయి కొన్నేళ్ళకే […]

గతం గతః

రచన-డా.లక్ష్మి రాఘవ ఆ గది తలుపులు తీస్తూంటే ఆసక్తిగా తొంగి చూసింది కమల వంటింట్లో నుండీ. అత్తగారు విశాలమ్మ, భర్త సూరి లోపలకు పోయి తలుపులు మూశారు. మామగారు విశ్వనాథం విశ్రాంతిగా పాత వాలుకుర్చీలో కూర్చుని వున్నారు. ఆయనకు ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టి నట్టే వుండదు. వంటింట్లో పని చూసుకుని బయటకు వచ్చేసరికి చేతిలో బ్యాగుతో బయటకు వస్తున్న సూరి, ఆ వెనుకే తలుపుకు తాళం పెడుతున్న అత్తగారు కనిపించారు. ఇద్దరూ విశ్వనాధం దగ్గరికి వెడుతూంటే […]

ఫ్యామిలీ ఫోటో

రచన – డా. లక్ష్మి రాఘవ “వాసూ” రామచంద్ర గొంతు విని రూం నుండి బయటకు వచ్చాడు వాసుదేవరావు. హాల్లోకి వచ్చిన రామచంద్రను చూస్తూ” రా …రా… రామూ” అని ఆహ్వానిస్తూ ముందుకు వచ్చి సోఫాలో కూర్చోమంటూ సైగ చేసి తానూ రామచంద్ర పక్కనే కూర్చున్నాడు. “ఏమైంది నీకు? ఫోను స్విచ్చ్ ఆఫ్ చేస్తే అందరికీ కంగారు కాదా అదీ రెండు రోజులు?” “నీవు ఫోను చేసావా?” “నేను చేస్తే రెండుసార్లు చూసి ఏకంగా ఇంటికే వచ్చి […]