April 27, 2024

ఎందుకోసం?.

డా.కె. మీరాబాయి అమ్మా! ఆలస్యం అయిపోతూంది తొందరగా రా “ అంటూ హడావిడి పెట్టింది అపర్ణ. “ కాస్త ముందు గుర్తు చేయవచ్చు కదా “ గబ గబ మెట్లు దిగింది రమ. శనివారం స్కూలుకు సెలవు రోజైనా వర్క్ యూనిఫాం వేసుకుని మూడు ముప్పావుకే తయారై పోయి అమ్మను తొందర పెడుతోంది అపర్ణ. చదువుతున్నది పన్నెండో తరగతి. వయసు చూస్తే పద్ధెనిమిదో సంవత్సరం నిండ లేదు. అప్పుడే స్వతంత్రంగా సంపాదించాలనే వుబలాటం ఏమిటో అర్థం కాక […]

తప్పంటారా ?

రచన: డాక్టర్. కె. మీరాబాయి సరోజ కథనం :- బి ఎ ఆఖరి సంవత్సరంలో వున్న నేను, ఇంటర్మీడియేట్ తప్పి, ఆటో నడుపుకుంటున్న సందీప్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని కలలో కూడా వూహించలేదు. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు. మేము వుండే హౌసింగ్ బోర్డ్ కాలనీ కి నేను చదివే కాలేజీ చాల దూరం. నాకు మోపేడ్ నడపడం వచ్చినా మా నాన్నది బండి కొనివ్వలేని ఆర్థిక పరిస్థితి. నన్ను ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. […]

మారిపోయెరా కాలం

డా. కె. మీరాబాయి ముందుగా ఒక మాటకూడా చెప్పకుండా సెలవు పెట్టి వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్య పోయింది భారతి. పోయిన నెలలోనే బెంగుళూరు వెళ్ళి కొడుకు ఇంట్లో పదిహేను రోజులు వుండి వచ్చింది. ముప్ఫై అయిదేళ్ళు దాటుతున్నా పెళ్ళి కాని కొడుకు పరిస్థితి తలచుకుంటే భారతికి దిగులుగా వుంటుంది. ఒక అచ్చటా ముచ్చటా లేదు…..పండుగా పబ్బమూ లేదు. పొద్దున్నే ఆ ఎం ఎన్ సి కంపెనీకి పోవడం రాత్రికి వరకు పనిచేసి గూడు చేరడం గానుగెద్దు […]

ఆపద్ధర్మం

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం రావి చెట్టు నీడన చప్టా మీద కూర్చున్న సుందరం చుట్టూ చూసాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో గుడి నిర్మానుష్యంగా వుంది. గర్భ గుడి తలుపులు తెరిచి వున్నప్పుడే అర కొరగా వుంటారు భక్త జనం. ఇక గుడి తలుపులకు తాళం పడ్డాక పిట్ట, పురుగు కూడా కనబడదు ఆవరణలో. ఒక అరటి పండు చేతిలో పెట్టకపోతాడా పూజారి అన్న ఆశతో వచ్చిన సుందరానికి ఆ రోజున తొందరగా పూజ ముగించి, […]

ఖాజాబీబి

రచన: డా.కె . మీరాబాయి (. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం ) చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదు. ” చిగురమ్మోయ్ ” అంటూ వణికే గొంతుతో ఖాజాబీబి కేక వినబడగానే కాలనీ లోని ఇల్లాళ్ళు హడావిడిగా నిద్ర లేచి గుమ్మం లోకి వస్తారు. పేరుకు చింతచిగురు ఖాజాబీబి అని అంటాముగానీ , ఆకు కూరలు, రేగి పళ్ళు, సీతా ఫలాలు, జామ పళ్ళు, ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో ఇంటి ముందుకు తీసుకు […]

ఎగురనీయండి. ఎదగనీయండి

రచన: మీరా సుబ్రహ్మణ్యం సరోజ నేను కలిసి చదువుకున్నాము. ఓకే వూళ్ళో వేరే సంస్థలలో ఉద్యోగం చేస్తున్నాము. నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది సరొజ. ఈ పాతికేళ్ళ స్నేహంలో తన కుటుంబ సభ్యులూ నాకు ఆత్మీయులయ్యారు. గత పదిహేను సంవత్సరాలుగా జీవితంతో వొంటరి పోరాటం చేస్తొంది సరోజ. పెళ్ళైన నాలుగేళ్ళకే సరోజ భర్త రవి స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపొయాడు. అప్పటికి మూడేళ్ళ పసివాడు సాయి. సాయి కోసమే తన బ్రతుకు అన్నట్టు తల్లి తండ్రి […]

అమ్మడు

రచన: డా. కె. మీరాబాయి ” అమ్మడు వెళ్ళిపోయాక నాకు పిచ్చెక్కినట్టు వుంది ” అన్న అక్క స్నేహితురాలి మాటలు వినబడి అక్కడే ఆగాడు నిఖిల్. ” నిజమే . ఇంట్లో వున్నంత సేపూ మన చుట్టు తిరుగుతూ వుండి అలవాటైన వాళ్ళు వూరెళ్ళితే దిక్కు తోచదు ప్రమీలా .” ఆక్క ఒదార్పుగా అంది. ” అసలే జనముద్దు పిల్ల. అందులోను వయసులో వుంది .నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు . కాస్త పొట్టిగా బొద్దుగా వున్నా […]

నలుగురి కోసం

రచన:- డా.  కె.  మీరాబాయి సాయంకాలం ఆరు గంటలు కావొస్తోంది.  శివరాత్రికి చలి శివ శివా అంటూ పరిగెత్తి పోయిందో లేదో గానీ ఎండ మాత్రం కర్నూలు ప్రజల దగ్గరికి బిర బిర పరిగెత్తుకు వచ్చింది . ఫిబ్రవరి నెలాఖరుకే ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగి ఎండ తన ప్రతాపం చూపుతోంది. మామూలుగా ఆ వేళప్పుడు వూళ్ళో ఉన్న టెక్నో స్కూళ్ళు, డిజిటల్ స్కూళ్ళు , ఎంసెట్ నే ధ్యేయంగా మూడో క్లాసు నుండి పిల్లలను రుద్ది […]

మన( నో) ధర్మం

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం తెల్లని రాయంచ లాటి బెంజ్ ఎస్ యూ వి గంటకు యాభై మైళ్ళ వేగంతో ఆరు వందల ఎనభై ఫ్రీ వే మీద కాలిఫోర్నియా లోని శాన్ రామన్ నుండి మిల్పిటాస్ వైపుకు దూసుకు పోతోంది. లోపల కూర్చున్న వారికి మాత్రం పూలరథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంది. కారులో స్టీరియో నుండి ‘ దిద్ద రానీ మహిమల దేవకి సుతుడు” అంటూ బాలకృష్ణ ప్రసాద్ పాడిన అన్నమయ్య పాట వస్తోంది. […]

బూలా ఫిజీ

రచన: మీరా సుబ్రహ్మణ్యం నాడి విమానాశ్రయంలో ఆగిన విమానం నుండి దిగగానే ఇండియాకు వచ్చేసినట్టు అనిపించింది. ట్యాక్సీ కోసం బయకునడుస్తున్న మాకు దారికి ఇరువైపులా ఎర్రని మందార పూలు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ప్రయాణంలో మధ్యలో ఫిజీ లో నాలుగు రోజులు గడపాలని ముందుగానే అక్కడ డెనరవ్ ద్వీపంలో ఎస్టేట్స్ అనే రిసార్ట్ లో ఇల్లు తీసుకుంది అమ్మాయి. ఫిజీ దీవులు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. ఎక్కడ చూసినా […]