April 26, 2024

లోపలి ఖాళీ – మృత్యువు యొక్క మృత్యువు

రచన: డా. రామా చంద్రమౌళి ఎదురుగా ఎర్రగా సూర్యోదయమౌతోంది. గత రెండేళ్లుగా తమ శాస్త్రవేత్తల బృందం జరుపుతున్న జన్యు మార్పుల, జన్యు పరివర్తనల ప్రయోగాలకోసం కొలంబియా ప్రభుత్వ అనుమతితో నిర్మించు కున్న విశాలమైన ప్రయోగశాల… వసతి గృహాల సముదాయంలోని… ఒక గృహంలో… కిటికీలోనుండి తదేకంగా చూస్తోంది నలభైరెండేళ్ల డాక్టర్‌ నీల. ‘ ద సైంటిస్ట్‌’ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ మృత్యువునే పరిహసిస్తూ…మనిషికి జరామరణాలు లేని ఇమ్మోర్టాలిటీని… శాశ్వతత్వాన్ని… పెర్పెట్యువాలిటీని… మనిషికి అమర త్వాన్ని ఆపాదించగల, పునర్‌ యవ్వనాన్ని ప్రసాదించగల […]

లోపలి ఖాళీ – లోపల సముద్రం… పైన ఆకాశం…

రచన: రామా చంద్రమౌళి అంతా నిశ్శబ్దం. ఇరవై ఎనిమిదేళ్ల ముక్త కళ్ళు తెరవలేదు. మేల్కొంది. సోయి కలుగుతూ తన ఉనికి మెలమెల్లగా జ్ఞప్తికొస్తోందామెకు. రాత్రి… ఒంటిగంటనుండి … గంటన్నర సేపు… ఒకటే యుద్ధం ఇంట్లో… శేషు… తను. ఇల్లంతా ధ్వంసమైపోయింది. వస్తువులన్నీ విసిరేయబడి… పగిలిపోయి… ముక్కలుముక్కలైపోయి… చిందరవందరగా… గ్లాస్‌ లు… పళ్ళేలు… ఫ్లవర్‌ వేజ్‌ లు… కుర్చీలు… డోర్‌ కర్టెన్లు… టేబుల్‌ పైనున్న వస్తువులన్నీ… పెన్‌ స్టాండ్‌…ప్యాడ్స్‌…గడియారం…బోన్‌ సాయి మొక్కలు… ఒక మర్రి చెట్టు… ఒక కోనిఫర్‌. […]

తాత్పర్యం – సొరంగం

రచన:- రామా చంద్రమౌళి కల భళ్ళున చిట్లి చెదిరిపోయింది. నల్లని ఒక మహాబిలంలోనుండి..చిక్కని చీకటిని చీల్చుకుంటూ..తెల్లగా వందల వేల సంఖ్యలో బిలబిలమని పావురాల మహోత్సర్గం.విచ్చుకుంటున్న రెక్కల జీవధ్వని.ఒక ధవళ వర్ణార్నవంలోకి పక్షులన్నీ ఎగిరి ఎగిరి..ఆకాశం వివర్ణమై..దూరంగా..సూర్యోదయమౌతూ..బంగారురంగు..కాంతి జల. అంతా నిశ్శబ్దం..దీర్ఘ..గాఢ..సాంద్ర నిశ్శబ్దం. లోపల..గుండెల్లో ఏదో మృదు ప్రకంపన.అర్థ చైతన్య..పార్శ్వజాగ్రదావస్థలో..వినీవినబడని సారంగీ విషాద గంభీర రాగ ధార. ఏదో అవ్యక్త వ్యవస్థ ..విచ్ఛిన్నమౌతున్నట్టో..లేక సంలీనమై సంయుక్తమౌతున్నట్టో..విద్యుత్ప్రవాహమేదో ప్రవహిస్తోంది ఆపాదమస్తకం ఒక తాదాత్మ్య పారవశ్యంలో. భాష చాలదు కొన్ని అనుభూతులను […]

తాత్పర్యం – పరిథి

రచన- రామా చంద్రమౌళి “నీకేమి కావాలో నీకు తెలుసా రామక్రిష్ణా” అన్నాడు ఆ రోజు అన్నయ్య…అకస్మాత్తుగా. అర్థం కాలేదు. అభావంగా…శూన్యంగా చూశాను. “డబ్బు…పెద్ద ఉద్యోగం…విశాలమైన సుందర భవనం…కార్లూ వగైరా సుఖాలూ…బ్యాంక్ బ్యాలెన్స్ లు…పేరు ప్రతిష్ట…ఆరోగ్యం…ప్రశాంతత…ఇలా చాలా ఉన్నాయి కదా…వీటిలో నీకేమి కావాలో నీకు స్పష్టంగా తెలుసా?” అన్నాడు మళ్ళీ. తెలియదు…నిజానికి అన్నయ్య ఈ ప్రశ్న వేసేదాకా నాకేమికావాలో నాకే తెలియదనే విషయం తెలియదు. “తెలుసుకోవడం అవసరమనే విషయం తెలుసా?” “ఔను…తెలుసుకోవడం అవసరమే”అన్నాను చటుక్కున అప్రయత్నంగానే. “ఇది…మనిషి ఒక […]

తాత్పర్యం – దిగడానికి కూడా మెట్లు కావాలి

రచన: – రామా చంద్రమౌళి రాత్రి పదీ నలభై నిముషాలు. డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు. అటు చివర. ఎప్పటిదో. పాతది. దొడ్డు సిమెంట్ మొగురాలతో. సిమెంట్ పలకతో చేసిన బోర్డ్. పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు. ‘నయీ ఢిల్లీ ‘. పైన గుడ్డి వెలుగు. కొంచెం చీకటికూడా. వెలుతురు నీటిజలలా జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా. మంచుతెర. పైగా పల్చగా చీకటి […]

తపోముద్రల వెనుక

రచన: రామా చంద్రమౌళి తలుపులు మూసి ఉంటాయి కొన్నిసార్లు తలుపులు మూసివేయబడ్తాయి మూసినా, మూసివేయబడ్డా వెనుకా, లోపలా గోప్యంగా ఉన్నది ఏమిటన్నదే ప్రశ్న – ముందు ఒక ఛాతీ ఉంటుంది వెనుక ఒక గుండెనో, ఒక హృదయమో ఉంటుందని తెలుస్తుంది అరే .. ఒక నది తనను తాను విప్పుకుని అలలు అలలుగా ప్రవాహమై వికసిస్తున్నపుడు భరించగలవా నువ్వు జలసౌందర్య బీభత్సమధురాకృతిని ప్రశాంతత నీలిమేఘాల వెనుకనో తపోముద్రల వెనుక విలీనతలోనో అప్పుడే వికసిస్తున్న పువ్వు ముఖంలోనో ఉంటుందనుకోవడం […]

లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి   ఆమె లీలావతి – పదవ తరగతి అప్పటిదాకా ‘లీలావతి గణితం’ చదువుతోంది.. అన్నీ లెక్కలు కాలం – దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్ తో బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి 2 చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్ ” ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపం లోనే ఉండదు చెత్త […]

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి చటుక్కున మెలకువ వస్తుంది నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో తిరిగొచ్చిన తర్వాత ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే ఎవరో తరుముతున్నట్టు ఎవరో ప్రశ్నిస్తున్నట్టు ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ తనకోసం తను […]

మణికర్ణిక

రచన: ప్రొఫెసర్ రామా చంద్రమౌళి తనెవరో తనకే తెలియని మణికర్ణిక భస్మసింహాసనంపై కూర్చుని గంగా హారతిని చూస్తోంది కటిక చీకట్లో యుగయుగాలుగా అంతే స్త్రీని హింసించి , వధించి , సతిని యాభైరెండు ఖండాలుగా ఖండించినపుడు ఇక్కడ వారణాసి తటిపై ‘ కర్ణాభరణం ‘ ఒక శక్తిపీఠమై మొలిస్తే కన్యాకుమారిలో తెగ్గొట్టబడ్డ ఆదిమ స్త్రీ పవిత్ర పాదాలు రక్తసిక్తమై చుట్టూ ఆవర్తనాలౌతూ సముద్రాలూ, నదులూ దుఃఖితలైనాయి – అంబాడ్తున్న మణికర్ణికను ఎవరో శ్మశానాల మధ్య విడిచి వెళ్ళారు […]