April 27, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”

రచన: డా. విజయలక్ష్మీ పండిట్ ఓ ప్రకృతీ ..స్త్రీ..ఆకాశంలో సగమా..! నీవు నీ ఇంట్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా నీవు బాధ్యత నెరిగిన నిజమయిన కూతురువి తల్లివి ఇల్లాలివి, నీ పసి బిడ్డల ఆనందాన్ని నీవు పూర్తిగా అనుభవించ లేకపోవచ్చు నీ ఇంటిని అలంకరించలేక పోవచ్చు కానీ నీ జీవితాన్ని గౌరవంగా అందంగా మలుచుకుంటున్న నీవే నీ జీవితశిల్పివి, ఆర్థికంగా నీకు నీవే నీ ఆలంబనై నీ జీవిత భాగస్వామి ప్రియసఖివై కాలంతో పాటు ఎరుకతో నడుస్తూ […]

విశ్వపుత్రిక వీక్షణం – ఇండియా నుండి న్యూయార్క్ 20 నిముషాలలో

రచన: డా.విజయలక్ష్మీ పండిట్ ”తేజా ఇటురా ఈ వీడియోలో ఇండియా నుండి న్యూయార్క్‌ ఇరవై నిముషాలలో, అని వ్రాసుంది చూడు” ఇది కరెక్టేనా దాదాపు 24 గంటల అమెరికా ప్రయాణమంటే విసుగొస్తుంది. మరి ఈ వీడియోలో అలా ఉందేంటి.. వీడియో మొదటనుండి చూడలేదు. ఇప్పుడే ఐపాడ్‌ ఓపన్‌ చేశాను” అని లక్ష్మి మనవడు తేజస్‌ను పిలిచింది. తనకు టైమ్‌ చిక్కినపుడు మంచి వీడియోలు డాక్యుమెంటరీస్‌, సినిమాలు సెలక్టివ్‌గా చూస్తుంటుంది లక్ష్మి. లక్ష్మి ఎమ్‌.ఎస్‌.సి చదివి బాటని లెక్చరర్‌గా […]

విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి

రచన: డా.విజయలక్ష్మీ పండిట్. దివ్య తన రెండునెలల కూతురు విశాలాక్షికి పాలిస్తూ పాప చిరుపెదవులతో తనపాలు కుడుస్తున్నప్పటి ఆ మాతృత్వపు మాధుర్యాన్ని కళ్ళుమూసుకుని అనుభవిస్తూ ఆస్వాదిస్తూంది. ఆ మాతృత్వపు అనుభూతి దివ్యలో అలజడిని రేపుతూంది. తన మనోసంద్రంలో తాను తప్పుచేశానన్న పచ్ఛాతాప కెరటాలు లేచిపడుతున్నాయి. వాళ్ళ అమ్మ విశాలాక్షి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి దివ్యను. “ఎంత నిర్లక్ష్యం చేసి ఎంత చులకనగా చూసిందితను అమ్మను” తలుచుకున్న దివ్యకు కంట్లో నీళ్ళుతిరిగి చెంపలపై కారాయి. హృదయం బరువెక్కింది అమ్మ జ్ఞాపకాలతో […]

విశ్వపుత్రిక వీక్షణం – “మైండ్ సెట్”

రచన: విజయలక్ష్మీ పండిట్ “మనసును స్థిరం చేసుకోమ్మా గీతా! ఈ కాలప్రభావంవల్ల మనుషుల జీవితాలలో మా తరం ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. మనం చేసే మంచి ప్రయత్నం ఫలించనపుడు, పరిస్థితి మన చేయిదాటిపోయినపుడు, మనం జీవితమంతా వగచే బదులు కాలానికనుగుణంగా, పరిస్థితికి రాజీపడి మైండ్ సెట్ చేసుకుని మన జీవితాన్ని నరకం చేసుకోకుండా బతకాల్సి వస్తూంది. జరిగినదానికి నీ జీవితాన్ని బలి ఇవ్వకుండా, ధైర్యంగా ఆలోచించి మనసును సమాధాన పరచుకుని ఒక నిర్ణయం చేసుకో !” కాలం […]

విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”

రచన: విజయలక్ష్మీ పండిట్   అది చలికాలం.ఉదయం ఆరు గంటలకు  మదనపల్లెలో రైలు దిగి  నాగరాజు తెచ్చిన వ్యాన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేప్పటికి ఏడుగంటలు కావస్తోంది. సూట్కేస్ ఇంట్లో పెట్టి నాగరాజు వెళ్ళాడు. వెళ్ళేప్పటికి అమ్మ ,నాన్న సుజాత మేలుకొని ఉన్నారు. సుజాత వంటపనే కాకుండా అమ్మ నాన్నకు  సహాయం చేస్తుంది వాళ్ళ అవసరాలలో. నేను గడపలో అడుగు పెట్టగానే ఇంట్లోనుంచి కాఫీ వాసన నా ముక్కుపుటాలలో దూరి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది. మా అమ్మ […]

విశ్వపుత్రిక వీక్షణం – కలల రెక్కలు

రచన: విజయలక్ష్మీ పండిట్ సాయంకాలం మిద్దెపైన వాకింగ్ చేస్తూంది విరజ. టప్ మని శబ్దం రావడంతో వెనుతిరిగి చూసింది. రెక్కతెగి రక్తం కారుతూ పడివుంది ఒక పావురం. ఒకరెక్కతో ఎగరడానికి ప్రయత్నిస్తూంది.  కాని వీలుకాక రెక్కను టపటపలాడిస్తూ శరీరాన్ని లాగుతూంది కష్టపడి.  క్రిందపడిన రక్తం చుక్కల పై తెగిన రెక్కను క్రిందలాగుతూ పోవడంతో ఎఱ్ఱగా రక్తం గీతలు పడ్డాయి. “అయ్యో పాపం ఎట్లా తెగింది నీ రెక్క “ అంటూ విరజ పావురాన్ని చేతుల్లోకి తీసుకుని రెక్కను […]