April 26, 2024

పదచంద్రిక – 7 -వెయ్యి రూపాయిల బహుమతి

కూర్పరి : సత్యసాయి కొవ్వలి

మీ సమాధానాలు పంపించవలసిన చిరునామా editor@maalika.org

 మీ సమాధానాలు పంపవలసిన చిరునామా : editor@maalika.org… ఆఖరుతేదీ : August 30.. 2012

అడ్డం

1. ఉన్నవి 7. అందులో 3, 4 ఇక్కడ (2)

2.ఇసకలో దొర్లడంలో కూడా భక్తి ఉందట (5)

6. అలా జీతం పైన ఓన్లీ ఒన్సే వస్తుందిట. తీసేసుకోండి (4)

7. సింతే. కానీ కొద్దిగానే, పర్వాలేదు (3)

9. తినగానే వేసేది (2)

10. ఇక్కడ ఓసారి వ్రాసినది ఎవరూ మార్చలేరు. మనలో ఎవరూ వ్రాయలేదే మరి (3)

12. ఈ కారాలా, హమ్మో, అంటే ఆర్తనాదాలే (2)

13. దీని పరిమళం మరవగలమా (3)

14. బోడిగుండు జవరాలికి మంచి వరాలు కూడానా (4)

17. పే చెయ్యకుండా కూ చుక్ చుక్ కూపంలోకి నో ఎంట్రీ (2)

19. శబ్దం – 8 నిలువులో చేసినట్లే (2)

20. మా వంశీయులు వ్రాసిన కథలు పస లేకుండా ఎలా పూడుస్తాయి తంబీ (9)

25.అందరు జనులూ బాగుండాలా, మంచి కల (3)

26. అందరూ మొర పెట్టుకుంటే ఈరాక్షసిని హరి చంపాడు (2)

27. వాణి మంచి వరుస కట్టాడు. ఎవరి స్టైలు వాళ్ళది (2)

28. మానల్గురికీ 2 శేర్ల పాలు చాలా, మరి మీ ఇద్దరికీ (4)

30. చింతకీ, కాళ్ళకీ తప్పకుండా ఉండేవివే (3)

31. నీరసంలో కూడా బలమిచ్చేంత సరసమా (2)

32.ఉన్నబలంలో సగం ఇక్కడే ఉంటే మిగతాది ఎక్కడో మనకెందుకు (3)

33. 30 నిలువు వీటిని ఏకోపిష్టిముని మీదో వేస్తాయేమో.. కాలిపోతాయి (3)

34. ఉన్నవి 7. అందులో మొదటిది (1)

37. 1 అడ్డంతర్వాత వస్తే వణికి తమకంగా వినచ్చు. 16 నిలువు మొదలు కలిస్తే దురద పెట్టచ్చు జాగ్రత్త

38. ఉన్నవి 7.  కార్తికేయా.  వాటిలో ఓరెండు పనీ పాటూ లేకుండా నీక్షేత్రంలో కూడా వచ్చి పడ్డాయా (2)

39. అంత్యాక్షరి.. అయితే వెనకనుంచి (4)

 

నిలువు

1. నండూరి సుబ్బారావు రేడియోనాటకం అనగానే గుర్తొచ్చే పాత్ర (4)

2.ఏమిటీ! మీ ఆయన గారు కూడా తొణక్కుండా మాట్లాడకుండా పలక పుచ్చుకుని కూచుంటారా? (8)

3.తిరగేసి తిన్నా, బిల్లివ్వకుండా తిన్నా గారె, గారే (2)

4.ఏంటి పాడితే దీపాలు వెలుగుతాయా,  తానంత గొప్పవాడా (3)

5.కన్నడా పాలు, తెలుగు పాలు కలిపితే పెళ్ళికొచ్చినవారికీ గది సరిపోతుంది .. కానీ పాతగా ఉందేమో (4)

8.పేరుకి సింహగర్జనే… కానీ దేశీ ‘రా’గంలా ఆలపిస్తే వినసొంపే (4)

11.సరూకి కోపం వస్తే చాలు .. ఇలా బగబగ లాడేస్తుంది … ఏం చేస్తాం (2)

15.ఈరోజుల్లో నూతులెక్కడున్నాయి .. వీటిని వరాలుగా పొదగడానికి (3)

16.ఉన్నవే 7. అందులో ఇంకో రెండిక్కడ (2)

18. వీటితో మేడలు కట్టచ్చు, ఆడి కట్టిన మేడలు అమ్మచ్చు (5)

20. ఎప్పుడొస్తుందో  ఈనెల. పెళ్ళి చేసుకోవాలి (4)

21. ససరే, ఇంత భాగించినా ఇంకా నత్తి మిగిలిందా (4)

22. ఈ రంగడు వీటిని ముందు పెట్టుకుని అమ్ముతాడా, అనుభవిస్తాడా (2)

23. లూథర కింగేమైనా వీటిని అదుపులో పెట్టగలడా, పాపం, సుబ్బారావే ఏంచెయ్యలేక పోతున్నాడు (3)

24. జుట్టుని చంపడమా, జుట్టు కోసం చంపడమా చెప్పినవారికో హారం (5)

27. అబ్బే అంత పొడుగేం కాదు, రెండు చేతులూ చాపినంత (2)

29. ఇది ఎప్పుడూ వంకరే, అందుకని లఘువుగా చెప్తే చాలు (3)

30.ఇవి ఎక్కడపడితే అక్కడ 33 అడ్డంగా వేస్తాయి చిరాగ్గా (3)

35. ఊర్మిళ కి ఎడాపెడా చేరి నక్కఅరిచిందా (2)

36. డాక్టరా పాడా… అదో మహారాష్ట్ర ఇంటిపేరంతే (2)

 

మీ సమాధానాలు పంపించవలసిన చిరునామా editor@maalika.org