June 19, 2024

మా గురించి…

మాలికకు స్వాగతం. సంక్రాంతి, ఉగాది, శ్రావణ పౌర్ణమి, దీపావళి సందర్భంగా వెలువడే ఈ త్రైమాసిక పత్రిక ఇది. దీనిని వెలువరించటానికి మాకు సహాయపడుతున్న అనేకమంది శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇప్పటికే అచ్చులోను, అంతర్జాలంలోనూ ఇన్నిన్ని పత్రికలు ఉన్నాయి కదా, కొత్తగా మీ పత్రిక ఏమి సాధించబోతోంది అని మమ్మల్ని చాలామందే అడిగారు. అనంతమైన ఈ సాహిత్య ప్రపంచంలో ఇంకా కనుగొనబడని వింతలు విశేషాలూ చాలానే ఉన్నాయి. అమూల్యమైన కృషి చేసి అద్భుతమైన ఫలితాలు సాధించిన అచ్చు మరియు వెబ్ పత్రికలకు అందనివాటిని అందుకోవటం కోసమే మా ఈ తపన. సాహిత్యానికి, సమాచార స్రవంతికి అంతిమ ఘడియలు సమీపించాయని నిర్ణయింపబడేవరకూ మా ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే శ్రేష్టత, ప్రమాణాలే ఆధారంగా నడుస్తున్న ప్రస్తుత పత్రికలకు, వాటిలో ప్రచురించగలిగే సామర్ధ్యం ఉండి,  ఆ అవకాశాలు చేజిక్కించుకోలేనివారికి మధ్య వారధిలా కూడా ఈ పత్రిక ఉపయోగపడాలనేది మా ఆకాంక్ష. ఇంకా మట్టిలో మిగిలి ఉన్న మాణిక్యాలని వెలికి తీయటం కూడా మా లక్ష్యాలలో ఒకటి.

మిత్రుడు ఆర్కే అన్నట్టు, ఇజాల ఇనపసంకెళ్ల నుంచీ, వాదాల సంకుచిత దృష్టినుంచీ  ప్రపంచాన్ని చూడని మేము అనుసరించే సిద్ధాంతాలు, “ఈశావాస్య మిదం సర్వం”, “ఏకం సత్ విప్రా బహుదా వదంతే”.మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ పత్రిక గమనం ఒకే దిశలో ఉండదు. “రచయితలు-పాఠకులు” అనే నిర్దేశిత నమూనాకు బదులుగా వెబ్ 2.0ను అనుకరిస్తూ పాఠకులని కూడా వ్యాఖ్యల ద్వారా లేక ఇతర పధ్ధతుల ద్వారా రచయితలుగా మార్చే ప్రయత్నం ఈ పత్రికద్వారా మేము చేస్తున్నాం. పత్రికాపరంగా జరిగే చర్చలలో సమాచార సాగరం చిలకబడి దానిలోనుండి జ్ఞానామృతం పుట్టుకొస్తే మా ఈ చిన్ని ప్రయత్నం సఫలీకృతమయినట్లే.

ఇక మా బృందం విషయానికి వస్తే ,
ఈ వెబ్ సైటు మీకు కనబడటానికి ముఖ్యకారణమైన వట్టిపల్లి శ్రీను & కుప్పాల రంజీత్ (ఆర్కే),  వారికి సహాయ సహకారాలందించిన ఆత్రేయ విమల్ & నారుమంచి పద్మ, వ్యాసాలను ఈ సైటుకెక్కించటంలో రాత్రింబవళ్ళూ శ్రమించిన పిరియా రవి & ఇంద్రకంటి కార్తీక్, ప్రచారపరంగానూ & ఇతరత్రా సహాయాన్నందించిన మంచుపల్లకీ, శ్రీనివాస్ చౌదరి, డాలస్ కృష్ణ, భాస్కర రామరాజు, శ్రావ్య వట్టికూటి మరియు మీ భవదీయుడు మాలిక ముఖ్యసభ్యులు. మాలిక లోగోలకు అందాలు అద్దిన భండారు శివ & ధరణీరాయ్ చౌదరి గార్లకు, ఇతరత్రా సహాయం చేసిన తారకు మా కృతజ్ఞతలు.

ఈ పత్రిక నిర్వాహకులు:  జ్యోతి వలబోజు, ఉమ కోసూరి, కౌటిల్య, కుమార్ ఎన్, డా. రాజశేఖర్ గంగవంశం, రాజ్ కుమార్ ఆదూరి, సాయిరాం మరియు డా. గౌతమి జలగడుగుల.

సంపాదకవర్గంలో సభ్యులతో పాటు డా.దేవకీదేవి, డా.రాఘవమ్మ, డా.సీతాలక్ష్మి ఉన్నారు. మా శ్రేయోభిలాషులు, మాకు సన్నిహితులయిన  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.అనుమాండ్ల భూమయ్యగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

– (మాలిక బృందం తరపున) వెలమకన్ని భరద్వాజ్

 

7 thoughts on “మా గురించి…

  1. మాలికను మొదటిసారిగా వీక్షించాను. మొలకెత్తిన రచనా వ్యాసాంగానికి చక్కని సాంగత్యం. నేనొక ప్రభుత్వ సంస్థ విశ్రాంతాధికారిని, తెలుగు భాష మీద ఎనలేని మక్కువ. నేను సరదాగా రాసిన కొన్ని కవితా సంకలనాలను మీకు పంపితే మీరు అంగీకరిస్తారా
    అభినందనలతో………. శివరామకృష్ణ ఎన్.వి.

  2. అన౦తమైన ఈ విశ్వ౦ లో మీ సాహిత్య మేధా యజ్ఞ౦ నిర౦తర౦ కొనసాగాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238