May 25, 2024

సంపాదకీయం… ‘మారుతున్న ఆప్యాయతలు, విలువలు?……

రచన: కోసూరి ఉమాభారతి     Thanks to the Artist Krishna Ashok “ఆడపిల్లకే… ఆప్యాయతలు, అనురాగాలు తెలుస్తాయి.  సానుకూలంగా స్పందించే మనసున్నది కూడా ఆడదానికే,” అని అనాదిగా ఉన్నదే, మనం విన్నదే.  ఆనాటి ఆ స్త్రీ పెదవి విప్పేది కాదు.  దురుసుగా మాట్లాడేది కాదు.  చాటుగా అణకువుగా ఉంటూ, కుటుంబానికి అమృత హస్తంతో సేవలు మాత్రం అందించేది.  వెలుగు నిస్తూ కరిగే కొవొత్తితో పోల్చేవారు ఆమెని. మరి ఈనాడు, ఇంచుమించు ప్రతి యింట ఆడపిల్ల […]

ఓహో గులాబి బాలా – పారసీక ఛందస్సు – 1

రచన: జెజ్జాల కృష్ణమోహన రావు                 ఈ వ్యాసము ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారికి స్మృత్యంజలిగా వ్రాయబడినది.  వారికి గజలులు ఇష్టము కనుక అవి కూడ ఇందులో నున్నాయి. శ్రీనివాస్ గారు  సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, బహుభాషాకోవిదుడు, కవి, వాగ్గేయకారుడు, పరిశోధకుడు. వారు పాడిన ఓహో గులాబిబాలా అనే పాట శ్రోతలను ఆకట్టుకొన్న పాటలలో మఱువరానిది. ఈ పాట పల్లవి ఇలా సాగుతుంది –   ఓహో […]

మాలిక పదచంద్రిక – 9, Rs.1000 బహుమతి

మాలిక పదచంద్రిక కూర్పరి : సత్యసాయి కొవ్వలి మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ:   జూన్ 10 సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org ఆధారాలు అడ్డం   1 పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు 2 దీనితోకని పట్టుకుని ఓ పద్యం లాగించచ్చు 4 ఘృష్ణేశ్వరనివాసం – కవితావాసం 6 మన రాజులగురించీ, రాజ్యాల గురించి కథలు తిరగేసి రాసినా సరే ఏముంది గర్వ కారణం 8 తడిపొడి …. తాళం 11 […]

కవి మిత్రులు మానాపురం రాజా చంద్రశేఖర్‌తో ముఖాముఖి:

ముఖాముఖి నిర్వహణ: బులుసు సరోజినీదేవి మాలిక అనే అంతర్జాల పత్రిక ఒక కవిని పరిచయం చెయ్యమని చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చిన కవి శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. కవిత్వం పట్ల అతనికుండే ఆరాధనాభావం నాకు బాగా నచ్చింది. అతనిది కూడా మా ఊరే! కలలకు పుట్టినిల్లైన విజయనగరంలో అతని పరిచయం జరిగింది. “ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ తరవున గ్రూప్ డిస్కషన్‌లో అనుకోకుండా చంద్రశేఖర్‌గారు కవి అని తెలుసుకున్నాను. నేను తమాషాగా ‘నేను కూడా కవిత్వం రాయవచ్చునా?’ […]

సంభవం

 రచన: సూర్యదేవర రామ్మోహన్ రావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/     మనిషి చనిపోగానే క్రయోనికల్‌గా అతని శవాన్ని సస్పెండ్ చేసి, అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి, తిరిగి అతడ్ని బ్రతికించేందుకు చేస్తున్న అధ్బుత శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన మొట్టమొధటి నవల- సంభవం మృత్యువుని జయించటానికి ప్రపంచవ్యాప్తంగా, అతి రహస్యంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన తొలి నవల- సంభవం చనిపోయిన మనిషి శరీరాన్ని భద్రపరిచి ప్రాణం పోయగలిగే అవకాశం సైన్స్‌కి లభించినప్పుడు ఆ ప్రాణిలోకి పూర్వపు ఆత్మే ప్రవేశిస్తుందా? […]

బుల్లి ‘తెర’పెన్నుతో బ్నిం

  1981లో పత్రికల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోకి టైటిల్స్ రాసిచ్చే పనితో ఎంటర్ అయ్యాను. కధేంటి? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అంటూ… అడిగి, తగిన కార్టూన్ బొమ్మలు వేసి ఇచ్చిన అప్పటి టైటిల్స్ ఒక కొత్తదనంతో వుండేది. బ్లాక్ పేపర్ మీద తెల్లటి అక్షరాలు రాయడం చేతకాక తెల్లకాగితం మీద నల్లటి అక్షరాలు రాసిచ్చేవాణ్ని. మీర్ గారిలాంటి ఒకరిద్దరు మహానుభావులు దాన్ని వాళ్ళకి కావలస్నినట్టు టెక్నాలజీని వుపయోగించుకుని మార్చుకునే వాళ్ళు. మిగిలిన వారికోసం రంగులు, రంగుకాగితాలు, […]

‘ఏమి హాయిలే హలా!’

రచన: నండూరి సుందరీ నాగమణి   నవంబరు నెల మూడో  వారం. చలి పులిలా వణికిస్తోంది. మా హైదరాబాద్ లో చలి మరింత ఎక్కువ. స్వెట్టర్ వేసుకొని, మఫ్లర్ కట్టుకొని, రగ్గు కప్పుకున్నా కూడా వణుకు ఆగటంలేదసలు. తెల్లవారిపోయినట్టుంది. మా వాళ్ళందరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. రగ్గును మొహం మీదికి లాక్కుంటూ, బద్ధకంగా ప్రక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నాను. నా పేరు పరిమళ. కూకట్ పల్లి లోని ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను. మావారి ఆఫీస్ […]

సంస్కృత సాహిత్యములో ప్రముఖ కవయిత్రులు.

రచన: కొరిడె విశ్వనాథ శర్మ,  మహోన్నతమైన ప్రాచీన భారతీయ సంస్కృతీ నాగరికతలకు దర్పణమువంటిది వైదిక వాఙ్మయము. అది మొదలుకొని నేటి వరకును సంస్కృతవాఙ్మయమునందు గణనీయముగా సారస్వతసేవయొనరించిన మహిళామణులెందరో మనకు కానవచ్చుచున్నారు. వైదిక వాఙ్మయముపరిశీలించిన ఆత్మజ్ఞాన సముత్తీర్ణులైన గార్గి,మైత్రేయి మున్నగు వారు  జగత్ప్రసిద్ధులైయ్యిరి. విశ్వవార, అపాల, లోపాముద్ర మొదలుగాగల గృహిణులుమంత్రదర్శినులుగా పేరొందియున్నారు. తనభర్తయైన మండనమిశ్రునకు జగద్గురు ఆదిశంకరులకును జరిగిన వాదమునకు న్యాయాధిపురాలుగా నుండిన ఊభయభారతి మిక్కిలి ప్రసిద్ధురాలైయ్యెను.   శ్లో. గోధా ఘోషా విశ్వవారా పాలేషా మ్మాతృకర్షికా, బ్రాహుర్నామా […]

రాముడుండాడు…రాజ్జిముండాది. – కేశవరెడ్డి

రచన:చక్రధర్                                                                                                             భూస్వాములో .. దొరలో.. జమీందారులో.. మోతుబరీ రైతులో.. కార్పొరేట్ మేధావులో .. ఎవరైతేనేమిటి ? సామాన్యుల జీవనావసరాలని.. నిసిస్సహాయతనీ .. బలహీనతనీ ఆధారం చేసుకొని  ఏళ్ళకి ఏళ్ళు శ్రమదోపిడీ చేసి కూలీలుగా, జీవమున్న యంత్రాలుగా మార్చే పెట్టుబడి దారీ వ్యవస్థ..ఆ చట్రంలో ఇరుక్కొని బతుకీడ్చే సామాన్యుని బతుకే ఈ కథ. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆసరాగా నిలిచి ఊతమిచ్చేదే మన గవర్నమెంటు. అందుకే అది చేసే చట్టాలుకూడా సామాన్యుడి ఎదుగుదలకి ఉపయోగపడవు. అది […]

ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం

రచన- మధురవాణి   “బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ఫలితంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారి సూచన” అంటూ రేడియోలో చెప్తున్న వార్తాహరుడి స్వరం మృదువుగా, ప్రశాంతంగా వినిపిస్తోంది. సమయం సాయంకాలం నాలుగే అయినప్పటికీ అప్పటికే ఆకాశంలో సూర్యుడు చక్కా సెలవు పుచ్చేసుకోవడం మూలానా, కాలమేఘాలన్నీ గుమిగూడి అత్యవసర సమావేశం పెట్టుకోడం వల్లా అప్పుడే […]