May 5, 2024

అనగనగా బ్నిం కధలు – 5 పెళ్ళానికి ప్రేమలేఖ

రచన: బ్నింbnim

గళం ; ఝాన్సీ

 

అనగనగా బ్నిం కధలు…

కథలో వినే కథ ‘పెళ్ళానికి ప్రేమలేఖ ‘చాలా మందికి నచ్చిన కథలలో ఒకటి- ఇందులో రెండు పాయింట్ల కలనేత కథని కనీళ్ళతో తడిపింది-‘ఝాన్సీ’ చదివారు. భర్త చనిపోయిన భార్యకి ముత్తయిదువు వేషం తీసేయడానికి ఆడంగులు పడే ఆరాటం..ఆ ఉబలాటం చూస్తే సంప్రదాయాన్ని సర్వనాశనం చెయ్యాలన్న కోపం-బాధా కలిగేది- ఇది వాస్తవ సంఘటన లోంచి కలిగిన వేదనే- ఇక రెండోది థేంక్స్ చెప్పడం, చేతకానితనానికి జాలి పడుతూ రాసింది- నాకు ఈ పాయింటు కూడా చాల విలువైనది- భార్యని మనసులో ఎంత మెచ్చుకుంటాడో ప్రతి మగాడూ-కానీ ఒక్కసారైనా థేంక్స్ చెప్పడు. చెప్పక్కర్లేదు, కనీసం ‘తన ‘ఆనందాన్ని వ్యక్తపరచడు! ఆయనగారు మొగుడు. మామూలు మగాడికన్నా ‘స్ట్రిక్ట్’ గా ఉంటాడు…కానీ ఫలితం..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *