May 3, 2024

మౌనరాగం -4

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com కాలాన్ని ఎవరూ ఆపలేరు. మంచీ` చెడూ లేకుండా మట్టిని ప్రోగు చేసే పిచ్చివాడిలా తనపని తను చేసుకుపోతుంది.  స్థిరమని భావించే ప్రతి వస్తువును హరించి వేస్తుంది.  వెంటనే వైద్యుడిలా మారి మంచిమందును అందిస్తుంది. అన్వేష్‌ థర్డ్‌ సెమ్‌కి వచ్చాడు. ఎం.బి.ఎ. లో అత్యంత ఆదరణ పొందుతున్న స్పెషలైజేషన్‌ ‘హూమన్‌ రిసోర్సెర్స్‌ మేనేజ్‌మెంట్‌’.  మానవ వనరులకి కంపెనీలలో ప్రాధాన్యం పెరిగేకొద్ది ఈ స్పెషలైజేషన్‌కి డిమాండ్‌ పెరిగింది. అన్వేష్‌లో మంచి పోటీతత్వం, ఎదుటివారిని […]

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ – అనుభవాలు-జ్ఞాపకాలు-1

రచన: వనం జ్వాలా నరసింహారావు  ఖద్దరు దుస్తులేసుకుంటున్న ఆయన్ను కాంగ్రెసువాదన్నారు, స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో ఆయన పాల్గొన్న విధానాన్ని తెలిసినవారు ఆయన్ను మార్క్సిస్టు అన్నారు. కాదు.. కాదు… ఆయనో సినిమా మనిషన్నారు మరి కొందరు. నిజానికి ఆయనకు అవన్నీ వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందర్నీ పలకరిస్తూ, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా మెసిలే ఆ వ్యక్తే శ్రీ కె.బి.తిలక్. ఆయనో మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో… అక్కడ వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిలో ఆయన కనిపిస్తాడు. సినీ కార్మికుల బాధామయగాధలు […]

గర్భాశయపు సమస్యలు-3

 రచన: డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ ., పి.హెచ్.డి.   అవుటుగ్రంధి (థైరాయిడ్ గ్లాండ్) వ్యాధి- అధిక రక్తస్రావం   పైన మెయిన్ హెడ్డింగు దాని క్రింద సబ్ హెడ్డింగు చూస్తుంటే అసలు థైరాయిడిసము ఏమిటి? దానితో రక్తవ్యవస్థకు పనేమిటి? అదీ వీటివల్ల గర్భాశయానికి సమస్యయేమిటి? అనే ఆశ్చర్యకరపు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ… ఈ మూడింటికీ ఒక అద్భుతమైన లింకుందండీ! అది తెలుసుకోవడానికి  ఒక కేస్ స్టడీ పరిశీలిద్దాం.   మహారాష్ట్ర లోని పూనె సిటీలో ప్రసిద్దిచెందిన […]

అండమాన్ డైరీ – 2

రచన: దాసరి అమరేంద్ర    ప్రకాష్ – ప్రశాంతిల సాహచర్యమూ, గైడెన్సుల పుణ్యమా అని అండమాన్ చేరిన మొదటి రోజునే ‘అదేదో స్వంత ఊరు’ అన్నంత చనువు కుదిపేసింది… ‘కొత్త ప్రాంతం’ అన్న బెరుకూ, వెరపూ – వాటికి చోటే లేదు.. బాగా పొద్దు పోయేదాకా కబుర్లు…మర్నాటి మూడు ద్వీపాల యాత్రకు మానసికంగా సిద్ధం… ఇంకా ఇండోనేషియాలో ఉన్నట్టుగా – ఈ పర్వత శ్రేణులు ఒకప్పుడు నిప్పులు గక్కే అగ్నిపర్వతాలట. ఇప్పటికీ ఆ అవశేషం ‘బారెన్ ఐలెండ్’ […]

“మా బాబాయి మాట”

  రచన: మంధా భానుమతి                                           “మా బాబాయి మాట.. అంటూ ఏక వచనం ప్రయోగిస్తావేమిటి? నే చెప్పింది ఒక్క మాటేనా.. ఆ ఒక్క మాట తోనే ఆపేద్దామనా? ఏంటి కథ..” “అబ్బెబ్బే.. కోంపడకు బాబాయ్. మాట వరసకన్నాను. నీవి మాటలెందుకయ్యాయి.. ముత్యాల సరాలు. అవే ఒక్కొక్కటీ అలా అలా విదుల్దామని.” “అంతేనా.. అలాగైతే కానిచ్చేయ్.. మరి ఆ మాటకి ముందూ వెనుకా..” “కథలేనా.. అవి లేపోతే తేనె పానకం లేని గారెలా చప్పగా […]

అనగనగా బ్నిం కధలు -7 (అంకుల్)

రచన: బ్నిం  చదివినది : ఝాన్సీ   “నా కొడుకు నీకు మొగుడుగా పనికిరాడు. మా ఇంట్లో పెళ్లికి హడావుడి  పడుతున్నారు. నేనొచ్చినట్లు మీ ఇంట్లోనూ తెలియనియ్యకు. నీకు మంచి కుర్రాడితో పెళ్లయ్యాక ఆశీర్వచనం తీసుకోవడానికి నాకు కబురుపెట్టు” తన కొడుకు పెళ్లాడబోతున్న అమ్మాయికి కాబోయే మావగారు చెప్పిన మాటలు. కధలో ఇలాంటి పాత్ర జీవితంలో కనపడదు అనుకుంటున్నారు కదూ… ఉంటే… ఆశ్చర్యపోవద్దు! గానీ…. చాలా మంది తండ్రులకి కొడుకులమీద అభయం వుంటుంది. కాబోయే కోడళ్లపై జాలి […]

సరిగమలు – గలగలలు – 4

రచన: మాధవపెద్ది సురేష్ 16-31 December 2002   మా మామ్మ సుందరమ్మ గారికీ, తాతగారు లక్ష్మినరసయ్యగారికీ బహునంతానం. కొంతమంది చనిపోగా మిగిలిన 5మంది అన్నదమ్ముల్లో మధ్యముడు సత్యనారాయణ. ఆయనే మాధవపెద్ది సత్యం. మా తాత లక్ష్మి నరసయ్యగారికి ‘పేక’ అంటే చాలా ఇష్టం. పే అంటే పేకాట, కా అంటే కాంగ్రెస్. ఆయన చాలా నీతీ, నిజాయితీ ఉన్న సీనియర్ కాంగ్రెస్ రాజకీయవాది. సుమారు 20 ఎకరాల ఆస్థి మొత్తం కాంగ్రెస్‌కి సమర్పించారు. గాందేయవాది, మా […]

సంభవం – 9

రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ – See more at: http://magazine.maalika.org/2013/12/04/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-7/#sthash.Fdr0xOmb.dpuf suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ – See more at: http://magazine.maalika.org/2014/01/01/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-7-2/#sthash.V1Bwj1Ve.dpuf రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com   http://www.suryadevararammohanrao.com/ అలసట వల్ల రెండు క్షణాలు కళ్ళు మూసుకున్న దిశకు చటుక్కున మెలుకువొచ్చింది. వింత కల, భయంకరమైన కల… తల పక్కకి తిప్పి చూసింది. డా!! సవ్యసాచి ఏకాగ్రతతో జీప్ డ్రైవ్ చేస్తున్నాడు.. తనెక్కుడుందో తెల్సుకోడానికి ఆమెకు కొన్ని క్షణాలు పట్టింది. జీపు అడవి మార్గంలో ప్రయాణం […]

నిన్న నేను ఆత్మహత్య చేసుకున్నాను

రచన: భవాని ఫణి   అవును, ఎవరికోసం బ్రతకాలి హరివిల్లువంటి ఉనికి లేని  ప్రేమ కోసం, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎంతకాలం ఎదురుచూడాలి?   నమ్మకమనే కనిపించని  కొక్కానికి జీవితాన్ని ఎన్నిసార్లు  వ్రేలాడదీయాలి ఎండమావిలా ఊరించే సంతోషం కోసం ఎంత దూరమని పరుగులు తియ్యాలి?   అడుగడుగునా ఎదురయ్యే అవమానాల్ని సమాజపు అంగడిలో కొనుక్కుని మరీ ఈ దేహానికి ఎందుకు తగిలించుకోవాలి మనసుని ఎందుకు అయినకాడికి అమ్ముకోవాలి?   తనది కాని కాంతిని దొంగిలించి వెన్నెల […]

కడలి వదిలేసిన కెరటం

  రచన: తిలక్ బొమ్మరాజు   పదాలను పేర్చనా బాధలను కూర్చనా ఇప్పుడిక్కడ   నువ్వొదిలేసిన ఈ దేహాన్ని ప్రేమించనా నన్నుగా మిగిల్చిన నీ జ్ఞాపకాలనా?   అప్పుడెప్పుడొ[ నా పక్కన కూర్చున్నావు… ఇప్పటికీ ఆ గుర్తులలానె` ఉన్నాయి గుండె సంధుల్లో ఎవరొ[ అచ్చుపోసినట్టు   నీకే … పున్నమిలో అడవి నవ్వినట్టు ఉంటావు గోముగా నేను మాత్రం ఒంటరిగానే మిగిలాను రెక్కలు  తెగిన పక్షిలా ఇంకా నీ ఊహలనే దిద్దుతూ   ఎన్నిసార్లు నువ్వున్నటుగా రమిస్తానొ […]