April 30, 2024

గర్భాశయపు సమస్యలు-4

 రచన:  డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ                    పి.హెచ్.డి.   స్త్రీ హార్మోను ‘ఈస్ట్రోజెన్’ అసాధారణత్వం- ముందస్తు రుతువరతి-రుమటాయిడ్ కీళ్ళవాపు [low estrogen levels cause early menopause with high risk of rheumatoid arthritis (RA)]   మహిళల జీవితంలో రెండు ముఖ్యమైన దశలు- పుట్టినప్పటినుండి రుతుక్రమం మొదలయ్యేదాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక మరొక దశ. ఈ రుతుక్రమం నిలిచిపోయే దశని రుతువిరతి లేదా మెనోపాజ్ అని అంటారు. […]

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు-2

రచన: వనం జ్వాలా నరసింహారావు కామ్రేడ్స్ తో కలిసి… క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా అరెస్టయిన తిలక్‌‍ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి ముందర ఓ రెండు వారాలు ఏలూరు సబ్ జైలులో వుంచారని చెప్పుకున్నాం గదా. అక్కడున్న రోజులను గుర్తు చేసుకుంటూ, ఉద్యమాల ఊపిరి తీసే ప్రయత్నాలు అప్పట్లో ఎలా జరిగా యోనని సూచనప్రాయంగా చెప్పారు. తన కంటే వయస్సులో పెద్ద వారైన మోతె నారాయణరావు గారు, కార్వంచి రామమూర్తి గారు తిలక్‌‍తో పాటు జైల్లో […]

మౌనరాగం – 5

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com – See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-4/#sthash.iMqJo7rG.dpuf http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com రోజులు గడుస్తున్నాయి. లంచ్‌ బ్రేక్‌లో పత్రికాఫీసు స్టాఫ్‌లో కొంతమంది బైక్‌ల మిాద ఇళ్లకెళ్లారు.  కొంతమంది లంచ్‌రూంలో కూర్చుని లంచ్‌ చేస్తున్నారు. సుభాష్‌చంద్రకి ఇంటి దగ్గర నుండి లంచ్‌ రాగానే తన ఛాంబర్‌ లోంచి బయటకొచ్చి లంచ్‌రూంలోకి వెళ్తూ ఒంటరిగా కూర్చుని వున్న దేదీప్యను చూసి ఆగిపోయాడు. ‘‘దేదీప్యా! లంచ్‌ చేశావా?’’ అంటూ దేదీప్యను పలకరించాడు. ఆయన్ని చూడగానే లేచి నిలబడింది […]

బ్రహ్మ పురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము -2

    రచన: విశ్వనాధశర్మ కొరిడె పుత్ర తీర్థ విశిష్టత గోదావరి యందు మరొక ప్రసిద్ధమైన తీర్థమొకటి కలదు. దాని పేరు ‘పుత్ర తీర్థం’. అట్టి దాని నామ శ్రవణము చేతనే సమస్త అభీష్టములను పొందగలడు. పూర్వమున దితి , తన పుత్రులు, దనుపుత్రులు కూడా యుద్ధములందు నశించుచుండగా  తన సవితి పుత్రులైన ఆదిత్యులు అభివృద్ధిని పొందుతుండుట గమనించి, మిక్కిలి దుఃఖమును పొందినదై  దనువు దగ్గరికి వెళ్ళినది. ఆయనతో తన దుఃఖానికి కారణాన్ని తెలిపి ,  “ఆర్యా!  ! […]

కళారూపాలు – 2 బుర్రకధ

రచన: ఉషాబాల గంటి జాతి సంస్కృతిని కళలు సాహిత్యము, ప్రతిబింబింప జేస్తాయి. కళలే జాతికి జీవనాడులు. ఇలాంటి కళల్లో తెలుగు జానపద సాహిత్య కళారంగాలలో ఒక మహత్తర ప్రక్రియ బుర్రకథ. తెలుగు మాట తెలుగు పాట తెలుగు ఆహార్యం , తెలుగు పలుకుబడి , తెలుగుదనము, మూర్తీభవించిన కథ బుర్రకథ. అంతేకాక దేశ, జాతి సంస్కృతి లోని విశిష్టతను , సామాజిక వ్యవస్తలోని లోపాలను, బహిర్గతం చేసే కళారూపంగా బుర్రకథ ప్రసిద్ధి పొందింది   బుర్రకథ చరిత్ర: […]