April 28, 2024

మాలిక పత్రిక మార్చి 2014 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు   శుభాకాంక్షలు …హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా  మిమ్మల్ని అలరిస్తున్నాయని తలుస్తాం. ఈ నెలతో సూర్యదేవర రామ్మోహనరావుగారి సంభవం సీరియల్ ముగుస్తుంది.  మిమ్మల్ని మెప్పించే మరిన్ని మంచి రచనలు అందించగలమని హామీ ఇస్తూ, మీ అభిప్రాయలను ఆహ్వానిస్తూ  ఈ మార్చి నెల సంచికలోని అంశాలు.. 1. మాలిక పదచంద్రిక మార్చ్ 2014 2. అండమాన్ డైరీ – 3 3. విజయగీతాలు […]

మాలిక పదచంద్రిక – మార్చి 2014

  కూర్పరి : సత్యసాయి కొవ్వలి            గత మాసంలో లాగానే ఈసారి కూడా పదచంద్రిక సులభతరం చేసిపెట్టాం. ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  అతి పెద్ద పదంలోకేవలం 5 అక్షరాలే. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  మార్చి 30 2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org   మినీ గడి 1 1 õ 2       õ […]

అండమాన్ డైరీ – 3

రచన: దాసరి అమరేంద్ర   హేవలాక్ అండమాన్ పరిభాషలో ఓ పెద్ద ద్వీపం. ఉత్తర దక్షిణాలుగా ఓ పదిహేను కిలోమీటర్ల పొడవు, సగటున అయిదు కిలో మీటర్ల వెడల్పు – అంతా కలసి నూటపది చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం, ఆరేడువేల జనసంఖ్య. పోర్ట్ బ్లెయిర్‌కు దగ్గరగా ఉండటం దీని పాపులారిటీకి ఒక కారణమయితే వర్ణనాతీతమయిన సాగర సౌందర్యం ముఖ్యమైన కారణం.. జెట్టిలో దిగగానే మా లోకల్ గైడు – ప్రకాష్ ఏర్పాటు చేసిన మనిషి వచ్చి […]

జయమ్ము నిశ్చయమ్మురా – త్ర్యస్ర గతి

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు    పాటలను, పద్యములను వ్రాయునప్పుడు ఒక ప్రత్యేక గతిలో వ్రాస్తే వాటిలో ఒక తూగు నిండియుంటుంది.  మనకు సుపరిచితములైన గతులు – త్ర్యస్ర, చతురస్ర, ఖండ గతులు.  వీటికి వరుసగా మూడు, నాలుగు, ఐదు మాత్రలు ఉంటాయి.  రెండు గతులు కలిసి ఉంటే దానిని మిశ్రగతి అంటాము.  ఈ లఘు వ్యాసములో అన్నిటికంటె తేలికైన త్ర్యస్రగతిని వివరిస్తాను.  సున్నను ఉపయోగించకుండ మూడు సంఖ్యను మూడు విధములుగా మనము పొందవచ్చును.  అవి […]

మాయానగరం – 2

రచన: భువనచంద్ర  హాలీవుడ్ సినిమాని బాలీవుడ్డూ.. బాలీవుడ్ సినిమాని టాలీవుడ్డూ అనుసరించినట్టు గుడిసెలవాళ్లు కూడా మహానగర ‘రస్తా’లని అనుకరిస్తూ ఆ సందులని ‘గాంధీ’ రోడ్డనీ, అంబేద్కర్ రోడ్డనీ, ఇందిరాగాంధీ రోడ్దనీ పేర్లు పెట్టారు. ఆ నాలుగ్గజాల సందులకే పేర్లు పెట్టటానికి సందులోని వాళ్లంతా కనీసం నలభై మీటింగ్స్ పెట్టి అసెంబ్లీలోలాగా నానా గలాటాలూ చేసారు. ఆ సందుల్లో మనుషుల్తోపాటు పందులూ, యధేచ్చగా తిరుగుతుంటాయి. ఒక్కోసారి మంత్రిగారు ‘విజిట్’ చేసినట్టు ఇళ్ళల్లోకి (గుడిసెల్లోకి) చొరబడుతూ ఉంటాయి. నిజం చెబితే, […]

హ్యూమరధం – 3

రచన: రావికొండలరావు   హాసం ప్రచురణ జోక్ చేసిన ఆయనా? మేమా?   మద్రాసు చేరిన కొత్తలో పనీ పాటా ఏమీ వుండేది కాదు. వేషాలు వెతుక్కోవడమా – స్క్రిప్టులో, కథలో రాసేయడమా – అనే అలోచల్లోనే తెల్లారి పోయేది. అసిస్టెంట్ డైరెక్టరు ఉద్యోగం వున్నా, షూటింగ్ లేని రోజుల్లో ఖాళీ.. పొట్టి ప్రసాదు, నేనూ పొద్దున్నే బయల్దేరి నుంగంబాకం నుంచి టీ నగర్ వరకు తిరిగేవాళ్లం. బస్సెక్కితే డబ్బులు దండగ. ఆ డబ్బుల్తో కాఫీలు తాగొచ్చు. […]

సంభవం – 10

రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com   http://www.suryadevararammohanrao.com/ – See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-9/#sthash.NtQuInVL.dpuf   రచన: సూర్యదేవర రామ్మోహనరావు     suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/   సైంటిస్టులందరూ కళ్లార్పకుండా కంప్యూటరు మానిటర్స్ వైపు చూస్తున్నారు. విశ్వంభరరావు ప్రతి అవయవం కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది విజేత. వన్..టు…త్రీ…ఫోర్…ఫైఫ్….సిక్స్…. సెవెన్… హార్ట్ బీట్‌ను అబ్జర్వ్ చేస్తోందామె. పక్కనున్న చార్ట్‌ను తీసుకుని, అందులో వున్న ఒక్కొక్క పాయింటు దగ్గర మార్కు చేస్తోందామె. నర్వ్స్ సిస్టమ్ ఓ.కె… ఆక్సిజెన్ ఫ్లో ఓ.కె…. సిస్టమ్ ఆఫ్ ది […]

అనగనగా బ్నిం కధలు – 8 (షాలిని)

రచన: బ్నిం చదివినది : ఐనంపూడి శ్రీలక్ష్మి   డబ్బెంత పాపిష్టిదో కన్నవాళ్ల మీద మమకారాన్న్ని చంపేస్తుంది. “కన్నవాళ్లు” అంటే తల్లితండ్రులు అని కాదు! తాము కన్నవాళ్లని కూడా. అచ్చం ఇలాగే జరిగింది ఈ కథలో. శాలిని ఆత్మహత్య.. “చేయబడింది..” మనీమయం అయిపోయిన జగత్తులో మమత కరువై సంపాదించే చెట్టులా బతకలేని కాల్(సెంటర్) గాల్.. శాలినికి డబ్బు కిక్కు ఇవ్వలేదు. తల్లితండ్రులకి పేరుకున్న “ఆశ” ఆమె ఆత్మని చంపేసింది. ఆమె బతుకుని బాకుగా చేసి కన్నవాళ్లకేసి విసిరేసింది!! […]

సరిగమల గలగలలు – 5 తాతినేని చలపతిరావు

రచన: మాధవపెద్ది సురేష్   శ్రీ తాతినేని చలపతిరావుగారు అన్నయ రమేష్‌ని Playback Singer గా, నన్ను Instrumental Playerగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. 1971లో ‘దత్తపుత్రుడు’ సినిమాలో ‘మనసైన ఓ చినదాన’ అనే పాట నాగేశ్వరరావు గారికి ఘంటసాలగారు పాడారు. ఆయనతో పాటు ‘యోడ్‌లింగ్స్’ అన్నయ్య పాడాడు. ‘నవ్వులు’ రమోలా గారు పాడారు. తరువాత గురువుగారే ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాలో నాగభూషణం గారికి సోలో సాంగ్ పాడించారు. ఆ సినిమాకు శ్రీ కె. వాసుగారు […]