May 4, 2024

పద్యమాలిక – 4

padyamalika_Jan_2015_1

J K Mohana Rao

 

పండుగ నాఁడీ రోజవ,

నెండఁగ నా కడుపు వచ్చె – నేకాదశియున్,

దిండిని వదలిన బుణ్యము,

దండిగఁ దిన గల్గు ముదము, – ధర్మ మ్మేమో?

 

మీ రథమును లాగంగా

నీ రమణీకి బలము లేదు – యిది నిజము సుమా

ధారిత్రియె వచ్చెఁ గదలి

యౌరా యా విష్ణుమాయ – లతిశయము గదా!

 

రాతిరి వేసిన ముగ్గును

రాతిరి వర్షమ్ము తుడువ – రథము మరుగయెన్

జేతను నట్టులె నిడితిన్

బ్రీతిగఁ జూడండి నాదు – ప్రియమగు రథమున్

 

 

చూడండి పక్కింటి – చుప్పనాతిన్ని

తాడుతో లాగింది – తా నా రథాన్ని

కత్తిరిస్తా దాని – కర్ణ నాసికల

కుత్తుకం బిసుకుతా – కుయ్యో యనంగ

 

మందును గొట్టిరి చాల ప-
సందుగ సతిపతులు రాత్రి – స్వారస్యముగా
పెందలకడ లేచి రథ
మ్మెందుండెనొ యనుచుఁ జూచి – రెల్ల దిశలలో

 

 

Sivaramakrishna Prasad

 

కం. వెల్కంన్యూఇయ రుకు రా!

చిల్కంగనురావెమాకుసిరిసంపదలే

మేల్కొందుమునీరాకకు

పల్కెద మేస్వాగతంబుభారీగానే

 

కదిలింది కదిలింది కమనీయ రథము

మొదలైంది మొదలైంది భోగభాగ్యంబు

సంపదలనిడుచు సంక్రాంతి సరము

యుంపుగ యలరించు యానంద పథము

ఏతాడు నాపంగ నెవ్వారితరము

యీతీరు విడితేరు యిటువైపుపంపు

 

ఆ.వె. అదిగొ తాడు మాది యారథముయుమాదె

లాగి తోడ్కొ బోయె లాగు మదియె

రథము గాదు వదిన రథముబోలుపతము

పిల్లవాడు లాగి పీకుకెళుచు

మొగుడ !సూసి నావ పోరిసల్లంగుండ

రథము ముగ్గు వేసి లాగ మనియె

పిదప యర్ధ మయ్యె పిచ్చిమా లోకమా!

పోరి నెత్తు కెల్లె పోరగాడు

 

 

ChandramouliSuryanaryana

 

నా రధము ముగ్గునకు నీ

వా రజ్జువు గీసినావు వద్దంటినిగా

యా రాక్షసి మన ముగ్గును

తేరగ తనులాగుకొనియె తెలివన్ననిదే

 

రధమున్నది యూరందు వి

వధముల నూరేగనేగ వనితా నీవా

వెధవసణుగుడాపకనీ

విధముగ మాట్లాడ వారు విందురు సుమ్మా

(వివధము= త్రోవ )

 

సిగ్గన్నది లేకుండగ

దిగ్గన నారధముముగ్గు తేరగదోచన్

గగ్గోలెట్టించెద! నే

నగ్గిని! నినుబుగ్గిచేతునాగ్రహముగొనన్!

 

రధముముగ్గు వేసె రమణీ లలామంబు

ముగ్గుకతక బెట్టె మొగుడు త్రాడు

నిదురలేచిజూడ నిరుగింట రధముండ

మొగుని దూర సాగె మోహనాంగి

 

 

మేరా రంగోలీకో

చోరీ కర్కే లియావొ చోరు పడోసన్

తేరా రస్సీనె కియా

సారా మెహ్నత్ ఖరాబు సయ్యా మేరే

 

మత్త కోకిల :-

రంగులద్ది రధమ్ముముగ్గును రాత్రి వేసితి వాకిటన్

ఖంగుతింటిని ముగ్గుగానక ఖాళి ముంగిలి కాంచగన్

దొంగయాపొరుగింటిదే తన దుష్ట బుద్ధి నెరుంగుదున్

నంగనాచిల స్వంతముగ్గని నమ్మబల్కెతనందరిన్

 

ముగ్గును వేసినాను కడు ముచ్చట గొల్పు రధంబు వోలె – ని
స్సిగ్గుగ ప్రక్క యింట గల చిల్లర చేష్టల భామ చూసి తా
నెగ్గని తెల్సి గూడ రధ మెత్తుకు పోయి తనింట నిల్పగా
భగ్గన నాదుమానసము వ్రాయగ బూనితి తిట్టుపద్యమున్

 

చక్కంగా నే వేసితి
చుక్కలనన్నింటి గలిపి సుందర రధమున్
గ్రక్కున తా లాగుకొనియె
పక్కింటిది దానినుప్పుపాతరవేయన్

పిచ్చిగ నాలోచించిన
కచ్చితముగ వచ్చునిట్టి కలలే సుమ్మా
యెచ్చటి కినిపోదు రధము
మ్రుచ్చిలికొనుటెక్క డైన ముగ్గునలవియే
(మ్రుచ్చిలి కొను = దొంగిలించు )

 

మీముగ్గును దోచితినని
యేమిటియాకూత బుద్ధి యింతయు లేదా
నీ మొగుడే మైకములో
నా ముంగిలిలోన వేసినాడా ముగ్గున్

 

Srinivas Iduri

 

హైజాక్ చేసెను ముగ్గును

వైజాగు వనిత మునుపటి వైరము తోడన్

బేజారుగ చూసెనతివ

చేజారిన తన రధమును చేష్టలు యుడిగెన్

 

 

GoliSastry

 

ఆ రథము ముగ్గు నేరిచి

మీరే యొక గంటలోన మెచ్చగ రథమున్

తీరుగ నిచ్చట వేయుడు

మీరినచో నేను లోన మీరిక బయటే !

 

ముప్పది గంటల లోగా
గొప్పగ నేర్పించు ” బుక్కు ” కొనితేవయ్యా !
చప్పున నేరిచి మ్రుగ్గులు
చెప్పెద దానికిని బుద్ధి చిచ్ఛీ ! ఛీ ఛీ !

 

ఇదెనా శపథము, వినవే !
పది దినముల లోపు నాదు పతిచే దానిన్
పదిరెట్లు మించు మ్రుగ్గును
వదలక వేయించ గలను, పందెము, పోవే !

 

కొడుకు, కోడలి కాముగ్గు కొంచెమైన
వేయ రాదులె, చూడగా వేకువందు
నీకు నేర్పిన ముగ్గేల నీటుగాను
దానిముంగిట నిల్చెనో త్వరగ చెప్పు.

 

చుక్కను ద్రావిన నీవే
చక్కగ గత రాత్రి ముగ్గు చక చక రధమున్
చుక్కలతో నెటు వేసితొ
తిక్కల నామగడ చూడు, తిమ్మిరి దీతున్.

 

సీసము:
పనికిరాని తలపు పట్టి కాలిచి వేయ
మనకు భోగి యనుచు మంట జెప్పు
చిక్కులెన్నొ గలుగ చుక్కలే యనుకొని
ముందుకేగుడనుచు ముగ్గు చెప్పు
బద్ధకమ్ము వదల భగవానుడే మెచ్చు
ననుచును హరిదాసు డరచి చెప్పు
పంటలందిన వారు పరులకష్టముగని
కొద్దిగిమ్మని గంగిరెద్దు చెప్పు

తేటగీతి:
పుణ్య పథమందు దిరుగగ మాన్యులగుచు
నుందురనుచును సూర్యుండు నోర్మి జెప్పు
మకర సంక్రాంతి మనకు క్షేమకరముగను
క్రాంతి చూపించు గావుత శాంతి నింపి.

 

 

VoletiSrinivasaBhanu

 

రామ చంద్రు పాదరజము సోకినయంత

రాతి నుంచి వెడలె నాతి యపుడు

పడతి చూపు సోకి పక్కింటి అరదమ్ము

ముగ్గు నేడు ప్రాణ మొచ్చి కదలె

 

 

VenkataSubbaSahadevuduGunda

 

ప్రక్కింటి యన్న గారే

చక్కగ ముగ్గట్లు వైచి సరదా జూడన్!

టెక్కేమో వదినమ్మది!

గ్రక్కున మీరట్లువేయఁ గదలిన మేలౌ!

 

తెల్లారకముందుగ నే

కల్లాపిని జల్లినదిట! కైపున మీరున్

త్రుల్లుచు ముగ్గటు వేయగ!

నుల్లాసపు నాపెఁ జూడ నుడుకదె నాకున్!

 

 

Bss Prasad

 

అట్ట ముగ్గు తెచ్చి యతికించ వాకిట

తెల్ల వారి జూ డ నిల్లు దాటె

ముగ్గు కదిపి కుక్క మూలనక్కె బెదిరి

తాడు కట్టు పతికి తగవు మిగిలె

 

పడతులు పండగ ముగ్గులు

వడివడి వేయగ కడకును వాకిట దరిలో

బుడిబుడి మురిపెము తగవులు

పొడుపులు తప్పవు పొడుపున పోటీ పెరగన్

 

చుక్కలు కలుపుచు ముగ్గులు

చక్కగ వేయగ వనితలు చతురత జూపన్

ప్రక్కని చేరునట పతియు

మక్కువ తోజూసి ముగ్గు మగువను మెచ్చన్

 

రంగుల ముగ్గుల చక్కని

సంగడితో సంకురాత్రి సందడి దీరన్

ముంగిట రథములు జేరును

అంగులతో నంబరీషు నారాధించన్

 

కడిగి ముగ్గు పెట్ట కాంత గడప జూడ

పెంట చేసె కూన ఇంటి ముందు

పరుగు లిడుచు వచ్చె భర్త కేక వినగ

కుక్క పెంచు వార్కి కోటి వెతలు

 

 

NagaJyothiRamana

 

చూసితి రా ముగ్గు రధము

వేసితి కష్టము యనకనె -వేడుకతోడన్

నాసిరకము పొరుగావిడ

భేషని తనుదొంగిలించె- బేషరమవుచున్

 

అంగన యందము పొగడగ

చొంగలు గారే విధమున-జొచ్చుకు రాకన్

రంగు రధము వేయు విధము

హంగుగ గమనించిదెలుపు-హత్తెరియనకన్

 

వలదు తాడననుచు వనితెంతజెప్పినా

వినక మొగుడు తాను వింత జూసె

పొరుగు ఇంటి ఇంతి పొగరుగా రథమునూ

పట్టి ఇంటి ముందు పెట్టె నేడు….

 

 

Gopala Krishna Rao Pantula

 

పెండ్ల మన్న యెంతొ ప్రీతి తోడను పతి

రాత్రి పూట వేసె రథము ముగ్గు

తాడు లాగి దాన్ని తన యింటి ముంగిట

నిలిపె పొరుగు యింటి నీల వేణి.

 

 

SailajaAkundi

 

స్టిక్కరు నరదమ్ము నిడన్

స్టిక్కవ్వక నది యెగిరెను చిత్రము గనరే

పక్కింటికి చేరె నహహ!

చిక్కులు కొనితెచ్చి పెట్టె శ్రీవారికిలన్ !!!

 

చుక్కల ముగ్గును వేయగ

పక్కింటావిడయెదాని పట్టుకు బోయెన్

కిక్కురు మనకుండ రధము

చక్కగ మనయింటివైపు జరుపుము నాధా !!!

 

 

సూరి మకరరాశి నజేరు సూచనగను

సంకు రాతిరి మరునాడు సంబరముగ

కలిమి గోరెడి కాంతలు కనుమ నాడు

రధము ముగ్గును వేతురు రమ్యముగను!!!

 

 

SrinivasaBharadwaj Kishore

 

ఇక్కడ వేసిన ఆరథ

మక్కడి కేవిధిని చేరె నబ్బాయనుచున్

కుక్కయు నబ్బుర పడగా

బిక్కమొగము వేసెమగడు బిడియము తోడన్

 

పక్క వనిత మన రథమును

చక్కగ నా తాడు వాడి చతురత తోడన్

(చిక్కబరచుకునె చూడని)

చిక్కించుకునెను చూడని

అక్కసు తీరంగ దిట్టె యతివపెనిమిటిన్

 

కొత్తగ వచ్చిన కోడలు
జిత్తుల ముంచెత్తి మాయజేసనదా అం
తెత్తు రథము వేసితివట
ఉత్తగ చూస్తుండిపోతి వుత్తివెధవలా

 

వాకిల మనదో కాదో
మైకములో తెలియరాక మతిపోయినదే
చీకటిలో వేయ రథము
వేకువజాముననగుపడె వీధిచివరలో

 

బాగ ముగ్గు వేసి బక్కెట్టు తోనీరు
పోయు తెలివి చూచి పోయె మతులు
తేరు నీట తేలు తీరు చూచినదేమొ
నవ్వు చుండె నామె నదిగొ చూడు

 

పోరి ఇంటి బైట ఫోకట్ల ముగ్గేసి
బైట కండ్ల వడగ బీటు వేయ
కూన మగడు చూస్త కూసుంటడేమిర
బొక్క లిరగ దీయ బోడ చూడు

 

 

Sonti Prabhakara Sastry

 

ఇంటి ముంగిటేల •ఇంతుల సిగపట్లు,
ఇంతకూ నవతికి •పించినట్టి
ముగ్గు , తప్పు పట్ట •ముప్పుమన్కేలనే
చింత వలదు, సంత •చెంత నుండ!

 

Chakravarthula Kiran

 

దక్కెను ఛాన్సు నాకని రథమ్మునె ఎత్తుకుపోవజూసెనే!
ఎక్కడికెందు బోగలదు? అహీన పరాక్రముడౌ ధవుండ వీ
టక్కరి సాగనిత్తువే… హుటాహుటి తానిక దాగవచ్చునే…
చిక్కినదింక! ముగ్గు తుడిచేయుము ష్యూరు, మదీయ వల్లభా!

 

 

Arka Somayaji

 

ప్రక్కింటి రాధ మగడా
చుక్కలలో రధము ముగ్గు సొగసుగ లాగెన్,
మక్కికి మక్కీగా మన
ప్రక్కన తమరేయ నాదు పరువున్నిలుచున్.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *