May 7, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 3

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి

”నాకేమైనా తెలుసా? ఎందుకంత ఆయాస పడతావ్‌! ఇంత పెద్ద హాస్పిటల్‌కి తీసుకొస్తే బ్రతకదా! నిన్ను చూస్తుంటే ముందు నువ్వు పోయేలా వున్నావ్‌! అటు వెళ్లి కూర్చో! ఆ కారాయన ఎవరో మంచి హాస్పిటల్‌కే తీసుకొచ్చాడు” అంటూ అంకిరెడ్డి వైపు చూపించింది తారమ్మ. ఆయన మీద ఆమెకు కోపం వస్తోంది. ఇన్ని అంతస్తులున్న హాస్పిటల్‌ని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఒక్క అంతస్తు, అదీ రంగువెలసి చెడువాసన వచ్చే హాస్పిటల్‌. అందులో ఒక్క డాక్టరు మాత్రమే వుండేవాడు. లేదంటే నర్సే డాక్టర్‌లా పని చేస్తుండేది. ఆడవాళ్లకి కాన్పులైనా, ఊరి తగాదాల్లో తలలు పగిలినా, పొలాలల్లో పాములు, తేళ్లు కరిచినా, ఎద్దు పొడిచినా ఒక్కటేమి ఎలాిం ఆపద వచ్చినా ఆ హాస్పిటల్‌కే వెళ్లేవాళ్లు. మొన్న సౌమ్య పత్తిచేలో పురుగుల మందు తాగినప్పుడు కూడా గవర్నమ్‌ెం హాస్పిటల్లోనే వుంచారు. ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఈ హాస్పిటల్లో ఎన్ని డబ్బులవుతాయో ఏమోనన్నదే ఆమె మనసును పులిలా పీక్కుతింటోంది.
తారమ్మ కూర్చోమన్నా శేషేంద్ర కూర్చోలేదు. అటు ఇటు ఆరాటంగా తిరుగుతున్నాడు. కొడుకును వెతుక్కుంటున్నాడు. అటు నాలుగు అడుగులు వెయ్యగానే నరేంద్ర, అంకిరెడ్డి విశాలమైన కిటికీ పక్కన నిలబడి దిగాలుగా చూస్తుండడం గ్లాసుల్లోంచి కన్పిచింది. అంకిరెడ్డిని ఇటు చూడగానే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాడు శేషేంద్ర.
శేషేంద్రను చూసి ”నరేంద్రా! ఆయన మీ నాన్నగారా?” అని అడిగాడు అంకిరెడ్డి.
”అవునంకుల్‌! మా నాన్నగారే!” అన్నాడు నరేంద్ర.
అంతలో ఒక నర్స్‌ వచ్చి ”మిమ్మల్ని డాక్టర్‌ గారు రమ్మంటున్నారు” అని నరేంద్రను పిలవటంతో ”మీరిలా కూర్చోండి అంకుల్‌! నేనిప్పుడే వస్తాను” అంటూ డాక్టర్‌ గారి గదిలోకి వెళ్లాడు నరేంద్ర.
అప్పటికే సౌమ్యకు అన్ని టెస్ట్‌లు చేసి రిపోర్ట్స్‌ రెడీ చేశారు. ట్రీట్మెంటు కూడా జరుగుతోంది.
నరేంద్రను కూర్చోబెట్టి డాక్టర్‌ గారు సౌమ్య రిపోర్ట్స్‌ను చూపిస్తూ ఆమె హెల్త్‌ కండీషన్‌ గురించి వివరంగా చెప్పారు. ఆమెకు ఇవ్వబోతున్న ట్రీట్మెంటు గురించి కూడా చెప్పాడు.
డాక్టర్‌ గారు చెబుతున్నంతసేపు మామూలుగానే విన్నా పక్కకెళ్లాక బోరున ఏడవాలనిపించింది నరేంద్రకు… తనను తను తమాయించుకొని అంకిరెడ్డి దగ్గరకి వచ్చాడు.
”డాక్టర్‌ గారు ఏమన్నారు నరేంద్రా?” నరేంద్ర కొద్ది దూరంలో వుండగానే లేచి ఎదురెళ్లి ఆత్రుతగా అడిగాడు అంకిరెడ్డి.
”పర్వాలేదన్నారంకుల్‌! భయపడాల్సిందేమీలేదట! కాకుంటే సౌమ్యను కొద్దిరోజులు హాస్పిటల్‌లో వుంచాలన్నారు”
” అదేంటి?” వెంటనే అడిగాడు అంకిరెడ్డి.
”బావిలో దూకడం వల్ల నీళ్లు లంగ్స్‌లోకి పోయి బ్రెయిన్‌కి, బాడీకి ఆక్సిజన్‌ అందటం లేదట. దానివల్లనే కోమాలోకి వెళ్లింది. వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ అవసరమంటున్నారు” అన్నాడు నరేంద్ర.
”ఎంత ప్రమాదం జరిగిందయ్యా నరేంద్రా!” అప్రయత్నంగానే అన్నాడు అంకిరెడ్డి.
నరేంద్ర మ్లాడలేదు. ”ఒక్క నిముషం అంకుల్‌” అంటూ హాస్పిటల్‌ కాంపౌండ్‌లోపల సౌమ్య సమాచారం కోసం ఎదురుచూస్తూ నిలబడివున్న తమ ఊరివాళ్ల దగ్గరకి వెళ్లాడు. అతను వెళ్లగానే అక్కడా, ఇక్కడా కూర్చుని వున్నవాళ్లంతా లేచి అతని చుట్టూ చేరారు.
”ఎలా వుంది నరేంద్రా సౌమ్య?” అని ఆత్రంగా అభిమానంగా అడిగారు.
”పర్వాలేదన్నారు డాక్టర్లు. మీరు ఊరెళ్లండి! ఇవాళో, రేపో సౌమ్యను తీసుకొని ఇంటి కొస్తాం!” అని వాళ్లకి అబద్దం చెప్పాడు. నిజానికి డాక్టర్లు సౌమ్య బ్రతుకుతుందన్న గ్యారంటీ ఇవ్వలేదు. మా ప్రయత్నం మేము చేస్తాము. తర్వాత మీ అదృష్టం అన్నారు. గరళాన్ని కంఠంలో వుంచుకున్న శివుడిలా డాక్టర్లు చెప్పింది బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుని కునారిల్లుతున్నాడు నరేంద్ర.
నరేంద్ర ఊరివాళ్లతో మ్లాడుతున్నప్పుడు అతని తండ్రి శేషేంద్ర నరేంద్ర దగ్గరకి వచ్చి ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ కొడుకు పక్కనే నిలబడి వున్నాడు. ‘అయ్యో! నా కొడుక్కి ఎంత కష్టం వచ్చింది’ అన్న బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది.
గేటు పక్కన కూర్చుని వున్న తారమ్మ అక్కడే వుంది. కొడుకు తన దగ్గరకి వచ్చి మ్లాడతాడని కొడుకు వైపే చూస్తోంది. అతనికంత టైం లేనట్లు వెంటనే లోపలకెళ్లాడు. బాధపడింది తారమ్మ. తనని కొడుకు ప్టించుకోవడం లేదన్నది ఆమెకు స్పష్టంగా అర్థమైంది.
నరేంద్ర అంకిరెడ్డి దగ్గరకి వెళ్లి ”అంకుల్‌! మీరు కూడా ఇంటి కెళ్లండి! ఆంటీ కంగారు పడతారు. ఇప్పటికే బాగా ఆలశ్యం అయింది. ఇక్కడ నేను చూసుకుంటాను ” అన్నాడు.
”మరి నువ్వు నాకు అప్పుడప్పుడు కాల్‌ చేసి మాట్లాడుతూ వుండు. టేక్‌కేర్‌!” అని భుజం తట్టి ఆయన కారు వైపు వెళ్తుంటే ఆ ఊరివాళ్లంతా గేటు దగ్గర వున్న తారమ్మ వైపు చూసి ”ఇదంతా ఈ తారమ్మ వల్లనే జరిగింది. పాపం! ఆ నరేంద్ర భార్య కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో!! ఇలాిం వాళ్లు ఎందుకో ఏమో పిల్లల్ని పిల్లల్లా చూడరు. బద్ద శత్రువుల్లా చూసి వాళ్ల ఉసురు పోసుకుంటుంటారు “ అని అనుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు.
కారులో కూర్చుంటున్న అంకిరెడ్డికి వాళ్ల మాటలు కొద్దికొద్దిగా విన్పించాయి. పల్లెటూరు వాళ్లు కావడంతో ఏదీ మనసులో వుంచుకోరు. పైకి అంటే ఏమైనా అనుకుంటారేమోనన్న భయం కూడా వాళ్లలో వుండదు. వాళ్ల మాటతీరు, వేషధారణ బాగా వెనకబడిన ప్రాంతానికి చెందినట్లు వున్నా, ఆప్యాయతలకేం తక్కువ లేనట్లుంది. కానీ ఏ ఇంటి కోడలికైనా ఊరివాళ్ల ఆప్యాయత కన్నా ఇంట్లోవాళ్ళ భద్రతే ముఖ్యం…
కారులో కూర్చున్నాక అంకిరెడ్డి మనసంతా ఎవరో నలిపినట్లైంది. నరేంద్ర కుటుంబ సభ్యుల గురించే ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు. ఆయనకు త్వరగా ఇంటి కెళ్లాలని వుంది. కానీ ఇంటి కెళ్లినా ఇదంతా భార్యతో చెప్పుకోలేడు. ఆమె మానసిక స్థితి చాలా బలహీనంగా వుంది. ఆయన ఎంత వద్దనుకున్నా నరేంద్ర వాళ్ల పొలంలో వుండే బావి. సౌమ్య వెళ్లి ఆ బావిలో దూకటం. సౌమ్య దూకిన వెంటనే నరేంద్ర వెళ్లి దూకటం ఆమెను బావిలోంచి బయటకు తీయటం. ముఖ్యంగా ఆ ఊరి జనం, వాళ్ల మాటలు, తారమ్మ ప్రవర్తన, నరేంద్ర తండ్రి నిస్సహాయత గుర్తొస్తున్నాయి.
ఇంికెళ్లాడు అంకిరెడ్డి.
ఆయన ఇంటి కెళ్లాక ఎవరితో ఏమీ మ్లాడలేదు.
రాత్రి ఎనిమి దాక ఆఫీసు నుండి ఇంటికొచ్చిన మోక్ష ”ఏం జరిగింది మామయ్యా! అత్తయ్య అదోలా వున్నారు? మీరు మాట్లాడడం లేదట… ఉదయం నుండి ఎక్కడికెళ్లింది చెప్పలేదట… వేరే అర్థాలతో బాధపడుతున్నారు. వెళ్లి మాట్లాడండి మామయ్యా! ఈ వయసులో ఆమెకెందుకు అలాంటి బాధలు? లేవకుండా పడుకునే వుంది” అంది.
”నువ్వు కూర్చో!” అంటూ ఆయన జరిగింది మొత్తం మోక్షను కూర్చో బెట్టి చెప్పాడు.
”ఇప్పుడు చెప్పు! ఇవన్నీ మీ అత్తయ్యతో చెబితే ఎలా వుంటుంది?” అన్నాడు.
”వద్దులెండి! ఆమె చిన్నదానికే భయపడుతుంది. ఇలాంటి వెందుకు చెప్పటం. మీరు మౌనంగానే వుండండి. నేను ఏదో ఒక అబద్దం చెబుతాను. ఒక్కోసారి అబద్దాలు చెప్పటం కూడా అవసరమే! మీరెలాగూ చెప్పలేరు” అంటూ మోక్ష వెళ్లి మాధవీలత దగ్గర కూర్చుంది. తన ఏర్‌టెల్‌ ఆఫీసులో ఆ రోజు జరిగిన సంగతులు చెబుతూ కొద్దిసేపు నవ్వించింది. ఆ తర్వాత ”మామయ్య వాళ్ల ఆఫీసులో ఏదో ప్రాబ్లమ్‌ వచ్చిందట అత్తయ్యా! దాన్ని ఆయన సాల్వ్‌ చేసే హడావుడిలో వున్నారు. ఆయన్ని మీరేం కదిలించకండి! ఇలాంటప్పుడే మనం వాళ్లకి సపోర్టుగా వుండాలి. వాళ్లు మాట్లాడకపోయినా మనం మాట్లాడాలి. లేకుంటే వాళ్లు బయటకెళ్లి ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. నేను మీకు చెప్పాలా ఇలాంటివి…? రండి! ఇవాళ ఇద్దరం కలిసే వంట చేద్దాం! రోజూ మీరు చేస్తేనే కదా మేమంతా తినేవాళ్లం” అంటూ ఆమెను లేపుకుని వంటగదిలోకి తీసికెళ్లింది మోక్ష. వాళ్లిద్దరు అత్తాకోడళ్లన్న మాటేకాని చాలా స్నేహంగా వుాంరు. మోక్ష మాటంటే అంకిరెడ్డికి, మాధవీలతకి వేదం కూడా…
జ జ జ
…అక్కడ హాస్పిటల్‌ గేటు దగ్గర కూర్చుని వున్న తారమ్మ కొడుకు తనతో మ్లాడకుండా ఊరి జనంతో మ్లాడి లోపలకెళ్లిపోయాడన్నది మనసులో పెట్టుకుని అలిగి ఇంటి ముఖం పెట్టింది. అది చూసి ఆమె భర్త ”ఆగు తారమ్మా!” అంటూ ఆమె వెంటబడ్డాడు. ఆమె ఆగలేదు. రోడ్డుమీద బస్‌లు, లారీలు ఆగనట్లే ఆమెకూడా ఆగడం లేదు. ”ఎందుకే ఆగమంటే ఆగవు. కొడుకు కోడలు హాస్పిటల్లో వుంటే మనం ఇంటి కెళ్లి ఏం చెయ్యాలే! వండుకుని తినాలా?” అంటూ బాధగా నెత్తీనోరు కొట్టుకుంటూ అరిచాడు.
”నువ్వు ఎన్నైనా అనుకో, ఎంతైనా కొట్టుకో నేను ఆగనంటే ఆగను. నువ్వెందుకు నా వెంట వస్తున్నావ్‌! నువ్వు వెళ్లు. వాడి దగ్గరకే! నాకెవరూ లేరనుకుంటున్నా! వాడికే అంత పొగరుంటే నాకెంత వుండాలి. ఊరివాళ్లకిచ్చే విలువ నాకివ్వడా? నేను వాడి కళ్లకు కన్పించనా? అసలేమనుకుంటున్నాడు నా గురించి? ఈ తారమ్మదేముందిలే అనుకుంటున్నాడా?” అంది.
”వాడు మన కొడుకే…”
”నువ్వు నోరు మూసుకో! వాడు మన కొడుకు కాదు. ఆ నల్లదాని మొగుడు”
”సరేలే! అలాగేలే! శాంతపడు”
”నువ్వో పిచ్చిమారాజువి. ఓ కోపం లేదు, రోషం లేదు. ఎవరెలా వున్నా నీపాికి నువ్వు ఏమీ జరగనట్లే వుంటావ్! నావల్ల కాదు. వాడు నీ ఒక్కడికే కొడుకు. కావాలంటే నువ్వెళ్లు. నేను రాను. నన్ను బలవంతం చేశావంటే అదిగో ఆ లారీ కింద పడి చస్తా!” అంది.
శేషేంద్ర టక్కున ఆగిపోయాడు. ఆమె అన్నంత పని చేస్తుందని భయపడ్డాడు. ఆమెతో ఇంటి కెళ్ళకుండా తిరిగి హాస్పిటల్‌కి వెళ్లాడు. ఆయన హాస్పిటల్‌కి వెళ్లాక ‘మీ అమ్మ అలిగి ఇంటి కెళ్లిందిరా!’ అని కొడుకుతో చెప్పాలని ప్రయత్నించాడు. అప్పటి కే నరేంద్ర చాలా హడావుడిగా తిరుగుతున్నాడు. పిలిచినా పలికే పరిస్థితిలో లేడు.
జ జ జ
సౌమ్యను ఫలాన హాస్పిటల్‌కి తీసికెళ్లారని తెలియగానే సౌమ్య తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చారు… వాళ్లు ఎప్పుడైనా ఆ సిటీ కి రావాలంటే మూడు గంటలు ప్రయాణం చెయ్యాలి. సిటీ లోకి వచ్చాక ఆ హాస్పిటల్‌కి వెళ్డానికి సరిగ్గా గంట పట్టింది. అప్పటికే వాళ్ల గుండెలు ఏ క్షణంలో ఆగిపోతాయో అన్నంతగా భయపడ్డారు.
ఐ సి యులో వున్న కూతుర్ని చూశాక సౌమ్య తల్లి ఓబులమ్మకు నోట్లోంచి మాట రావడం ఆగిపోయింది. అసలే చిన్నకూతురు మెచ్యూర్‌ కావటంతో ఉదయం నుండి ఆమె ఆ హడావుడిలో వుంది. ఇప్పుడు ఈ కూతుర్ని ఇలా చూడగానే గుండెలు బాదుకోవటం మొదలు పెట్టింది.
సౌమ్య తండ్రి శ్రీపతి సౌమ్యను చూడగానే భుజం మీద కండువాను నోట్లో కుక్కుకుని మౌనంగా దుఃఖిస్తున్నాడు. తన కూతురు అత్త చేతిలో అవస్థ పడుతుందని విన్నారు కాని ఇంత దుస్థితిలో వుందనుకోలేదు. ఏదో చిన్నపిల్ల అత్తగారు చెప్పింది అర్థం చేసుకోలేక ఆవిడ కోపానికి గురవుతుందనుకున్నారు కానీ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. అప్పికీ ఒకరోజు సౌమ్య తన దగ్గర కూర్చుని ”నాన్నా! మా అత్తగారికి ఆ ఊరిలో అంత మంచి పేరేం లేదు. అది మనం పెళ్లికి ముందు తెలుసుకోలేకపోయాం. చెబితే బాధపడతారని మీకు నేను చెప్పటం లేదు కాని మా అత్తగారు నన్ను మనిషిలా చూడటం లేదు. నోికి ఎంతొస్తే అంత అనేస్తుంది. నామీద కోపంతో నిన్నూ, అమ్మను కూడా తిడుతుంది. డైరెక్ట్‌గా తిడితే నేను అర్థం చేసుకుంటానని కోళ్లమీద, మేకలమీద, గొర్రెల మీద, గేదెల మీద పెట్టి నానాతిట్లు తిడుతోంది. ఆయన లేకుండా నేనక్కడ వుండలేను నాన్నా!” అని… తనే అర్థం చేసుకోలేకపోయాడు. ‘ మొదట్లో అలాగే వుంటుందిలేమ్మా! సర్దుకో!’ అన్నాడు. అననైతే అన్నాడు కాని తన బిడ్డ బాధను సరైన సమయంలో గుర్తించలేదు. అందుకేనేమో ఇప్పుడు కోమాలో వున్న సౌమ్య ‘ఎన్ని బాధలని పడాలి నాన్నా!’ అని తనవైపే చూస్తున్నట్లు వుంది. నిలదీస్తున్నట్లే వుంది. తండ్రివి నీకంత మౌనం తగునా? అని సూిగా అడుగుతున్నట్లే వుంది. జీవంతో వున్న శవంలాంటి తన కూతుర్ని ఇకపై ఎలా మాట్లాడించగలడు? ఎలా నవ్వించగలడు? ఎలా నడిపించగలడు? కడుపు రగిలి, రగిలి అగ్నిగుండమై నరేంద్ర రెండు చేతుల్ని గ్టిగా పట్టుకున్నాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. ఆయన చేతులు వణుకుతుండడంతో ఆయన పట్టుకున్న నరేంద్ర చేతులు కూడా సన్నగా కదులుతున్నాయి.
”అయ్యా! నరేంద్రా!” అంటూ బావురుమన్నాడు.
”ఊరుకోండి మామయ్యా!” అని మాత్రమే అనగలిగాడు నరేంద్ర. అదికూడా స్పష్టంగా అనలేకపోతున్నాడు.
”నువ్వు నచ్చే కదయ్యా నా బిడ్డను పెళ్లి చేసుకున్నావ్‌! మీరందరు వుండి కూడా దాన్నిలా చెయ్యొచ్చా?” అని దీనంగా అడిగాడు శ్రీపతి.
ఆయన ప్రశ్న నేరుగా వెళ్లి నరేంద్ర గుండెల్లో దిగింది.
శ్రీపతి నిలబడి సౌమ్యను చూస్తున్నకొద్ది ఆయన కళ్లలో నీళ్లూరుతున్నాయి. అందుకే నరేంద్ర ఆయన భుజాల చుట్టూ చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ వెయిిింగ్‌ హాల్లోకి తీసికెళ్లి అక్కడ వున్న కుర్చీలో కూర్చో బెట్టాడు. ఓబులమ్మ ఏడుపు కట్టలు తెగిన చెరువే అయింది. అది ఆగే ఉధృతి కాదు. నర్స్‌ వచ్చి ఆమెను హత్తుకున్నట్లే నిలబడి నెమ్మదిగా ఆమెను నెడుతూ ”అమ్మా! పేష్‌ం ముందు మీరిలా ఏడవకూడదు. డాక్టర్‌ గారు చూస్తే కోప్పడతారు. రండి! మీరెక్కడ కూర్చోవాలో చూపెడతాను” అంటూ ఆమెను తీసికెళ్లి వెయిిింగ్‌ హాల్లో వదిలింది. అక్కడ వున్న భర్తను, అల్లుడిని చూడగానే ఆమె ఇంకా గ్టిగా ఏడ్చింది. చుట్టూ కూర్చుని వున్నవాళ్లు వాళ్ల లోకంలో వాళ్లున్నా ఆమెను కూడా చూస్తున్నారు.
భార్య ఏడుపు చూసి శ్రీపతి మరింత కంగారు పడిపోతూ మళ్లీ నరేంద్ర చేతులు పట్టుకున్నాడు. ”నరేంద్రా! నా కూతురు చేసిన తప్పిేం? అది మీ అమ్మగారిమీద ఎన్ని చెప్పినా మేము వినేవాళ్లం కూడా కాదే! దాని తరుపున ఒక్కసారి కూడా మేము మ్లాడలేదే! అది మీరెలా చెబితే అలా వింటూనే వుందికదా! చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే మాతో చెప్పివుండొచ్చు కదా! ఈ నరకమేంటి దానికి? కన్న కడుపులు ఎంత ఘోషిస్తున్నాయో చూస్తున్నావుగా!” అంటూ ఆయన తన కడుపు మీద చేయి పెట్టుకున్నాడు.
శ్రీపతి మాటలు ఆయన ప్రవర్తన నరేంద్రను మరింత బాధ పెట్టాయి.
ఓబులమ్మ ఏడుస్తుంటే భర్త మాటలు విన్పించవని వెంటనే ఏడుపు ఆపి భర్త మాటల్ని వినసాగింది. అయినా ఆమె కళ్లూ, ముఖము ఏడుపుతో ఏకమై వుంది. సన్నగా ఎక్కిళ్లు కూడా పెడుతోంది.
”ఎంత ఏడిస్తే మా బాధ తీరుతుంది నరేంద్రా! అల్లుడు 6 నెలలు ఊరిలో వుండడని తెలిసినా ధైర్యం చేసి పిల్లనిచ్చాం! అమ్మ అయినా, భర్త అయినా, తండ్రి అయినా మీ అమ్మ తారమ్మే అనుకున్నాం. కానీ ఆమె అలా వున్నదెప్పుడు? ఆమధ్యనెప్పుడో ఒకసారి ఆమె ఇంట్లో తిరుగుతున్నప్పుడు నా బిడ్డ మంచం మీద కూర్చుందని పక్కింటోళ్ళనీ, ఎదురింటోళ్ళని తీసుకొచ్చి చూపించిందట… వాళ్ల ముందే సౌమ్యను నిలబెట్టి ‘నేను నీకు అత్తనా! కోడలినానే! నాముందే మంచంమ్మీద కూర్చుంటావా?? నన్నేమనుకుంటున్నావ్‌! ఏదో పల్లెటూరిది, దీనికేం తెలియదులే అనుకుంటున్నావా? అత్తంటే గౌరవం లేని నువ్వు మొగుడుతో కాపురం ఎలా చేస్తావే!’ అంటూ పొలం తీసికెళ్లి ఎర్రి ఎండలో పత్తిచేలో గంటలు, గంటలు నిలబెట్టేసిందిట… ఇది మాకు సౌమ్య చెప్పలేదు. ‘మీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే! మీకేం చెప్పినా వృధా! మీరొట్టి పిరికోళ్ళు. ఆడపిల్ల బాధపడుతూ నాలుగు మాటలు చెబుతుంటే వినాలంటేనే భయం మీకు… ఇప్పుడు నేను నవ్వినా ఒకటే! ఏడ్చినా ఒకటే! రెండూ పట్టవు. ప్టించుకుంటే నేనొచ్చి మీ ఇంో్ల వుాంనని మీ భయం’ అని మా మీద కోప్పడి అది ఈ మధ్యన మాతో మ్లాడటమే మానేసింది. దాన్ని ఎండలో నిలబ్టెిన విషయం మీ ఊరివాళ్ల ద్వారా తెలిసినా మీ అమ్మగారిని మేమేమీ అనలేదు నరేంద్రా. దానికి పెళ్లిచేసి పంపే వరకు ఒక్కరోజు కూడా దాన్ని మేము పొలం తీసికెళ్లలేదు. ఎండ ఎలా వుంటుందో దానికి తెలియకుండా పెంచుకున్నాం. అలాిం దాన్ని అంతసేపు ఎండలో నిలబ్టెిందని తెలిసి కూడా మేం నోరెత్తలేదు. అన్నీ మనసులోనే అణుచుకున్నాం!” అన్నాడు శ్రీపతి.
చుట్టూ వున్నవాళ్లు ఆసక్తిగా వింటుంటే ‘ఇంకాపు’ అన్నట్లు మోచేత్తో రహస్యంగా భర్తను పొడిచింది ఓబులమ్మ. ఆయన వెంటనే మ్లాడటం ఆపేశాడు. వియ్యపురాలిని ఏమీ అనకు అన్నట్లు చూసింది. భార్యను అర్థం చేసుకున్నాడాయన.
…సౌమ్య తిరిగి కోలుకుంటుందో లేదో తెలియకపోయినా, సౌమ్య భవిష్యత్తుపై వాళ్లకు ఇంకా ఏదో ఆశ వున్నట్లు తారమ్మ గురించి మ్లాడడం అంతితో ఆపేశారు. అది వాళ్ల సంస్కారమో లేక బిడ్డ బ్రతుకు మీద వున్న మమకారమో లేక చేతకానితనమో తెలియదు కాని అలా వాళ్లు ఆగిపోవటం వల్లనే నరేంద్ర వాళ్లందరి ముందు తేలికైపోలేదు. అప్పికే నరేంద్ర సిగ్గుతో చితికిపోతున్నాడు. ప్రాణం చచ్చిపోతున్నట్లనిపించింది.
నరేంద్ర బావమరిది రాజు వచ్చాడు. అతను కూడా డాక్టరే కాబ్టి నరేంద్రను తీసికెళ్లి డాక్టర్‌ గారితో మాట్లాడి వచ్చాడు. రాజు తల్లి దండ్రుల పక్కన కూర్చుని ధైర్యం చెబుతుంటే నరేంద్ర అక్కడే వున్నాడు.
రాజుకి ఫోన్‌ రావటంతో తల్లిదండ్రులకి ఏడవద్దని మరోమారు చెప్పి వెళ్లిపోయాడు.
సౌమ్యను చూడాలని ఓబులమ్మ వాళ్ల వీధి చివరి ఇల్లామె వచ్చింది. సౌమ్యను చూసి చాలా విచార వదనంతో వెయిటింగ్ హాల్లోకి వచ్చింది. నరేంద్రను పలకరించింది. ఓబులమ్మ, శ్రీపతిల దగ్గరకి వెళ్లింది.
”ఓబులమ్మా! ఇంకా ఎంతసేపు కూర్చుాంవిక్కడ? సౌమ్యను చూసు కోడానికి నరేంద్ర లేడా? నువ్వు నీ మొగుడ్ని తీసుకుని వెంటనే ఇంటి కెళ్లు. అక్కడ నీ చిన్నకూతురు ఒక్కతే వుంది. అది ఇప్పుడు ఒంటరిగా వుండే స్థితి కాదని తెలిసి కూడా ఇక్కడే కూర్చుంటే ఎలా?” అంది.
వాళ్లకు అంతవరకు చిన్నకూతురు గుర్తే రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చి వెంటనే లేచి కళ్లు తుడుచుకుంటూ నరేంద్రకో మాట చెప్పి ఊరెళ్లిపోయారు.
నరేంద్ర ఒంటరిగా మిగిలిపోయాడు.
జ జ జ
నాలుగు రోజుల తర్వాత అంకిరెడ్డి నరేంద్రకి కాల్‌ చేసి సౌమ్యను చూడానికి హాస్పిటల్‌కి వస్తున్నట్లు చెప్పాడు.
అది కార్పోరేట్ హాస్పిటల్‌ కాబట్టి సౌమ్యకు మంచి ట్రీట్మెంట్ అందుతోంది. ఆమెను ఐసియులోనే వుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నరేంద్ర ప్రస్తుతం తనున్న సిట్యువేషన్‌ని పై అధికారులకి తెలుపుకున్నాడు. అతను ఊరెళ్లకుండా హాస్పిటల్లోనే వున్నాడు. వెయిిింగ్‌ హాల్లో కూర్చుని డాక్టర్లు పిలిచినప్పుడు లేచి లోపలికి వెళ్లి వస్తున్నాడు. అవసరమైన మందులు, ఇంజక్షన్స్‌ తెచ్చి ఇస్తున్నాడు. ఆమె హెల్త్‌ కండిషన్‌, ఆమెకు వాళ్లు ఇస్తున్న ీ్‌మ్‌ెంని ఎప్పికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. అంతేకాదు అక్కడ ఒక నర్స్‌ ఎప్పికీ వున్నా సౌమ్యకు బట్టలు మార్పించటం, బట్టలు తెచ్చివ్వటం, తల దువ్వటం లాిం పనులు అతనే చేస్తున్నాడు. ఎంత కార్పొర్‌ే హాస్పిటల్‌ అయితే మాత్రం నర్స్‌లు సొంత మనుషులు కాలేరు. పేషంట్లను విసుక్కోవటం, చిరాకు పడడం వుంటుంది. సౌమ్య దగ్గర వున్న నర్స్‌లకి నరేంద్ర అలాంటి అవకాశం ఇవ్వడం లేదు.
అదంతా చూసి నరేంద్ర మామ శ్రీపతి ”అయ్యా! నరేంద్రా! నువ్వు నా కూతురికి భర్తవా? తల్లివా?” అంటూ నరేంద్ర రెండు చేతుల్ని పట్టుకొని కళ్ల కద్దుకున్నాడు. కృతజ్ఞతగా చూశాడు.
అదే సమయంలో తారమ్మ వచ్చింది. ఆమెకు ఊరివాళ్లు హాస్పిటల్లో వున్న సౌమ్య ఎలా వుందో, నరేంద్ర సౌమ్యకు ఏం చేస్తున్నాడో ఆశ్చర్యపోతూ, మెచ్చుకుంటూ చెప్పారు. అది వినగానే బస్సెక్కి వచ్చేసింది. శ్రీపతిని చూడగానే ”ఏమయ్యా శ్రీపతీ! నీ కూతురుకి మీరు చెయ్యాల్సిన పనులు నా కొడుకు చేత చేయిస్తారా? ఏదీ నీ భార్య. నాలుగు దులిపేస్తా! హాస్పిటల్లో వుండే నీ పెద్ద కూతురుకన్నా ఇంో్ల వుండే నీ చిన్నకూతురు ఎక్కువైందా మీకు?” అంది.
ఆమె అడిగే విధానానికి వెయిటింగ్ హాల్లో వున్నవాళ్లంతా బిత్తరపోయి చూస్తున్నారు. శ్రీపతి నరాలు చచ్చుబడినట్లయ్యాడు. నరేంద్రకు తల్లిని చూస్తుంటే అపరకాళికి తక్కువ మహంకాళికి ఎక్కువ అన్నట్లుంది. ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు.
”నీకు నీ కూతురెక్కువైతే నాకు నా కొడుకు ఎక్కువ. మీరంతా ఇంట్లో వుండి ఆ మతిలేని దానికి నా కొడుకు చేత హాస్పిటల్లో సేవలు చేయిస్తారా? ఎంత ధైర్యం నీకు? వాడి వైపున మాట్లాడేవాళ్లు లేరనేగా నీ ధీమా!” అని ఇంకా ఆమె ఏదో అంటుండగానే నర్స్‌ వచ్చి నరేంద్రవైపు చూసి ”మిమ్మల్ని డాక్టర్‌ గారు పిలుస్తున్నారు” అనగానే నరేంద్ర డాక్టర్‌ దగ్గరకి వెళ్లాడు.
అల్లుడు వెళ్లగానే శ్రీపతి అక్కడి నుండి ఎలా మాయమయ్యాడో కాని అక్కడ లేడు. పిల్లనిచ్చిన కాడ మాటలు తక్కువగా మ్లాడాలని ఆయనెప్పుడూ మౌనంగానే వుాండు. అదీ తారమ్మ దగ్గర అసలే నోరెత్తడు. కానీ ఇప్పుడు తన కూతురికి జరిగింది అన్యాయమని అరవాలని వున్నా నరేంద్ర సౌమ్యకు చేస్తున్న సేవలకు కట్టుబడిపోయాడు.
తారమ్మ చుట్టూ చూసింది. కుర్చీలో కూర్చుని వున్నవాళ్లలో ఒక్కరు కూడా ఆమెకు తెలిసినవాళ్లు లేరు. కోపాన్ని తగ్గించుకుంది, తమాయించుకుని అక్కడే కూర్చుంది. సౌమ్య దగ్గరకు వెళ్లలేదు.
అంకిరెడ్డి వచ్చాడు. నేరుగా సౌమ్య దగ్గరకు వెళ్లి ఆమెను చూసి వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు. నరేంద్ర మందులకోసం వెళితే అతనొచ్చే వరకు కూర్చుందామని అక్కడ కూర్చున్నాడు.
తారమ్మ ఆయన్ని చూడగానే ”ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించింది నువ్వే కదూ!” అన్నట్లు ఆయన వైపు గుర్రుగా చూసింది.
ఆమె చూపులకు అర్థం తెలుస్తున్నా ఆయన అదేం ప్టించుకోకుండా తన పక్కన కూర్చున్నతన్ని పలకరించాడు. అతను అంకిరెడ్డితో చక్కగా మ్లాడుతున్నాడు. ఆయన మాటల్ని బట్టి ఆయన ఒక ఈవెంట్ మేనేజర్‌ అని తెలిసింది. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీమెంబర్స్‌ కూడా అక్కడే కూర్చుని వున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన తండ్రికి లోన ట్రీట్మెంట్ జరుగుతోంది. వాళ్లను చూస్తుంటే అంకిరెడ్డికి ఆశ్చర్యంగా వుంది. మానవ సంబంధాలు లేవాంరు. పెద్దవాళ్లను చూడరాంరు. మరి ఒక ఈవ్‌ెం మేనేజర్‌గా బాధ్యత గల స్థానంలో వుండి కూడా తమ విలువైన సమయాన్ని లెక్క చెయ్యకుండా తన ఫ్యామిలీతో సహా వచ్చి వెయిిింగ్‌ రూంలో గడుపుతున్న వీళ్ల మాటేమి? అదే అడిగాడు అంకిరెడ్డి.
”ఆయన నాకు తండ్రి కదా సర్‌! నాకు నా టైం కన్నా, నేను ఆ టైంలో సంపాయించే డబ్బుకన్నా ఆయనే నాకు ముఖ్యం. నాకు ఏది ముఖ్యం అన్పిస్తే నా ఫ్యామిలీకి కూడా అది ముఖ్యమే. మనకు ఏది కావాలో మనకే ఒక స్పష్టత, ఒక గ్రహింపు లేనప్పుడు జీవితం వృధా కదా! నేను ఏది చేసినా నా కుటుంబం కోసమే చేస్తాను. నా తండ్రి ఇక ఒకరోజు బ్రతుకుతాడో రెండు రోజులు బ్రతుకుతాడో! అదీ నేను మంచి వైద్యం ఇప్పిస్తే! అదే లేకుంటే నాలుగురోజులు ముందే పోయేవాడేమో! పోయాక, పోయినవాళ్లను మళ్లీ చూడగలమా? ఎంత చూసినా, వాళ్ల కోసం ఎంత చేసినా ఈ చివరి గడియల్లోనే” అన్నాడు ఈవెంట్ మేనేజర్‌.
అంతలో నరేంద్ర వచ్చాడు.
తారమ్మ తన తలమీద వున్న గుడ్డను గడ్డం క్రిందకు గట్టిగా బిగించి కట్టుకుని ఆ ఈవెంట్ మేనేజర్‌ మాటల్ని వింటోంది. ఆ గదిలో వున్న ఏ.సి. లాగే ఆమెకూడా చల్లబడి కూర్చుని వుంది. ఆమెను అలా చూస్తుంటే నరేంద్రకు కొంత ధైర్యం వచ్చింది… తనను చూడగానే మళ్లీ ఎక్కడ కేకలు వేస్తుందో అని భయపడుతూనే వెయిటింగ్ హాల్లోకి వచ్చాడు.
”ఎంతయినా మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగానే వుంది సార్‌!” అన్నాడు అంకిరెడ్డి.
”మీరు నన్ను చూసి ఆశ్చర్యపోకండి! ఇదిగో ఈ నరేంద్రను చూసి ఆశ్చర్యపోండి! అతనొక సైనికుడు. దేశాన్ని కాపాడవలసిన స్థానంలో వున్నవాడు. అతనే తన భార్యకోసం, అంటే ఒకే ఒక్క ప్రాణి కోసం ఎంత చేస్తున్నాడు. ఎంతయినా, ఎంత చేసినా ఒక మనిషి విలువ, ముఖ్యంగా మన ఇంట్లో వున్న మనుషుల విలువ తెలిస్తేనే కద సర్‌ మన విలువ పెరుగుతుంది. మన విలువను మనం కాపాడుకోలేనప్పుడు ఎంత విలువైన పని చేసి ఏం లాభం? దాన్ని ఎవరు చూస్తారు? ఎవరు గౌరవిస్తారు? అది ఎవరి కోసం? ఎవరికోసం ఎంత చేసినా మనకోసం కూడా మనం కొంత చేసుకోవాలి కదా!” అన్నాడు.
”కానీ నరేంద్ర చేస్తున్న జాబ్‌ చాలా ప్రమాదకరమైంది సార్‌! నేనతన్ని మళ్లీ వెళ్లొద్దనే చెబుతున్నాను. ఎందుకంటే మొన్న ముంబై డాక్‌యార్డ్‌లో పేలుడుకు గురైన ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలాంతర్గామిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నా – ప్రమాద సమయంలో జలాంతర్గామిలో వున్న ముగ్గురు అధికారులతో సహా నేవీ సిబ్బంది అంతా మరణించి వుంటారనే అనుమానిస్తున్నారు. దీన్ని బట్టి అక్కడికెళ్తే యుద్ధాలు రాకుండానే ప్రాణాలను కోల్పోవటం నిజమే కదా! ఇలాంటి వి చూస్తుంటే భయంగా వుండదా సార్‌? మా అబ్బాయి కూడా ఆర్మీలో వున్నాడు. నాకు వాడు అక్కడ వుండడం కూడా ఇష్టం లేదు” అన్నాడు.
చెవులు రిక్కించి వింటోంది తారమ్మ.
ఈవెంట్ మేనేజర్‌ నవ్వి ”మీరలాిం భయాలేం పెట్టుకోకండి సర్‌!” అన్నాడు.
”భయమెందుకు వుండదు సర్‌! వాడు నా కొడుకు. నా కళ్లముందు లేడు. ఎక్కడో ఆర్మీలో వున్నాడు. ప్రాణాలతో వుాండో వుండడో గ్యారీం లేని జాబ్‌ అది. పైగా చిన్న వయసు… ఇంత వృద్ధుడైనా మీ తండ్రి ఒక సెకెన్‌ ప్రాణంతో వున్నా చాలు. పోతే మళ్ళీ చూడలేమన్న ఆలోచనలో వున్నారు మీరు… అలాంటప్పుడు నాకన్నా చిన్నవాడు నా కొడుకు మీద నాకెన్ని భయాలుండాలి. ఎన్ని ఆశలు వుండాలి… చెప్పండి సర్‌!” అన్నాడు.
”అవుననుకోండి! కానీ ఆ దేవుడు మనిషి తల్లి కడుపులోంచి బయటకొస్తున్నప్పుడే చనిపోయే క్షణాలను కూడా నిర్ణయించి పంపుతాడట… అది మధ్యలో మారదు. మన చేతిలో లేదు. మీ అబ్బాయిలో ఒక ఇంజనీర్‌లో ఒక డాక్టర్‌లో వుండే లక్ష్యాలు, గమ్యాలు లేకపోవచ్చు. కానీ దేశసేవ చెయ్యాలన్న తపన వుంది. దేశం కోసం ప్రాణాలను అర్పించానికి సిద్ధంగా వున్నాడతను. అతనే కాదు బార్డర్‌లో నిలబడి గన్ను పట్టుకొని వుండే ప్రతి సైనికుడు గొప్పవాడే. వాళ్ళు చనిపోవటం ఏమి సార్‌! వాళ్లు చనిపోరు…వీరమరణం పొందుతారు… వాళ్లు వీరులు సర్‌! వాళ్ల గురించి భయపడకండి!” అన్నాడు.
అంకిరెడ్డి పెదవి విరిచి ”మా వాడి దగ్గర అంతేం లేదు లెండి! వాడు చదువు దొంగ! టెన్త్‌ రెండుసార్లు, ఇంటర్‌ ఒకసారి తప్పి ఇక్కడ ఏ పనీ దొరక్క, ఖాళీగా వుండి ఇంో్ల కూర్చుని తిండి తినలేక అక్కడకెళ్లాడు. వాడ్ని తలచుకుని అనుక్షణం నేనిక్కడ భయపడి చస్తున్నాను” అన్నాడు.
ఆయన గంభీరంగా చూస్తూ ”నీ కొడుకులో ఎక్కడో ఏ మూలో దేశభక్తి లేకుంటే అంతదూరం వెళ్లడు అంకిరెడ్డి గారూ! అక్కడ కూడా కాంపిీషన్‌ బాగానే ఉంటుంది. టెన్త్‌ కాని, ఇంటర్‌ కాని, డిగ్రీ కాని ఫెయిలయిన వాళ్లంతా సైన్యంలోకి వెళ్తున్నారా? అలా ఎంతమంది వెళ్తున్నారు? ఎవరూ వెళ్లటం లేదు. అసలు చాలామందికి నేవీ అంటే ఏమి? ఏర్‌ఫోర్స్‌ అంటే ఏమి? ఆర్మీ అంటే ఏమి? వాి విధులు, ధర్మాలు ఏమి అన్నది కూడా పూర్తిగా తెలియదు. ప్రస్తుతం బ్రతుకు భారమైన ప్రతి యువకుడి అడుగులు మహానగరాలవైపే పడుతున్నాయి. వాళ్లలో చాలామంది ఏదో దొరికినపని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో తినడం, మద్యం, మాదకద్రవ్యాలు సేవించడం… ఫుట్పాత్‌లు, రైలుప్టాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల కింద పడుకోవడం చేస్తున్నారు. ఇలాిం వారు దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో వున్నారట. వీళ్లంతా అయినవాళ్లకి దూరమై, నయం కాని వ్యాధులకి గురై, మాదక ద్రవ్యాలకు బానిసలై కిక దారిద్య్రంతో ప్రతిరోజూ వందమందికిపైగా చనిపోతున్నారట. ఇది నేను కల్పించి చెబుతున్నది కాదు” అంటూ ఆగాడాయన.
ఊపిరి బిగబట్టి వింటున్నవారంతా. ఇంకా ఏం చెబుతాడో అన్నట్ల్లు ఆయనవైపే చూస్తున్నారు.
”నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో’ తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. గుర్తు తెలియని మృతుల సంఖ్య మహారాష్ట్రలో ఎక్కువగా వుండగా, తమిళనాడుది తర్వాత స్థానం అట. ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో వుంది. ఇప్పుడు చెప్పండి! చావులన్నిలో ఏ చావు గొప్పది? అందరం చనిపోయేవాళ్లమే! చనిపోనివారెవరు? ఏది జరిగినా ఒక ప్రయోజనాన్ని ఆశించి జరగటం ముఖ్యం కదా!” అన్నాడాయన.
తారమ్మ ఒకసారి నరేంద్ర వైపు ఇంకోసారి ఈవ్‌ెం మేనేజర్‌వైపు ఆ తర్వాత అంకిరెడ్డి వైపు చూస్తోంది. ఆమెకు ప్రతి మాటా అర్ధమవుతోంది. సడన్‌గా లేచి ఇంికెళ్లింది. వెళ్తూ వెళ్తూ ఒక్కక్షణం ఆగి అద్దాల్లోంచి సౌమ్యను చూసి వెళ్లింది.
నరేంద్ర తల్లి వెళ్లటం గమనించి ”ఏది ఏమైనా నేను ఇక్కడ ఇంకో రెండు రోజులు మాత్రమే వుాంను అంకుల్‌! ఆ తర్వాత వెళ్లాలి. సౌమ్యను ఇంకా ఇరవై రోజుల వరకు ఇక్కడే వుంచాలన్నారు డాక్టర్లు. ఆ తర్వాత ఆమెను ఇంికి తీసుకెళ్లవచ్చు. నేను అక్కడికి వెళ్లాక సౌమ్య పరిస్థితి ఎలా అన్నదే నాకు అర్ధం కావడం లేదు” అన్నాడు.
అంకిరెడ్డి ఆలోచించి ”మనం ఒకసారి మీ అత్తామామలతో మ్లాడి చూద్దాం నరేంద్రా! మీ బావమరిది డాక్టర్‌ కాబ్టి అతనితో కూడా మ్లాడి చూద్దాం! వాళ్లు మ్లాడేదాన్ని బ్టి మనం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు” అన్నాడు.
నరేంద్ర ఏం మ్లాడలేదు.
ఈవెంట్ మేనేజర్‌ వింటున్నాడు కాని వాళ్ల మాటల్లో కల్పించుకుని మ్లాడలేదు.
కొద్దిసేపు కూర్చుని ”సరే! నరేంద్రా! ఇక నేను ఇంికెళ్తాను. టేక్కేర్‌!” అంటూ అంకిరెడ్డి వెళ్లిపోయాడు.
జ జ జ
అంకిరెడ్డి ఒకి రెండు సార్లు డా. రాజును చూసి వుండటం వల్లనో, లేక నరేంద్ర ‘మీరొకసారి రాజుతో మ్లాడి చూడండి అంకుల్‌!’ అని చెప్పటం వల్లనో, లేక నరేంద్ర ముంబై వెళ్లాల్సిన టైం దగ్గర పడుతుండటం వల్లనో తెలియదు కాని అంకిరెడ్డి రాజుకి ఫోన్‌చేసి సౌమ్య విషయం మాట్లాడాడు.
రాజు ”మీ అభిమానానికి కృతజ్ఞతలు అంకుల్‌!” అంటూ ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు.
”అంకుల్‌! మీరు మా పేరెంట్స్ తో మాట్లాడినా నేను చెప్పిందే చెబుతారు. నాదోమాట, నా పేరెంట్స్ దో మాట కాదు. సౌమ్య విషయంలో ఎన్నో విధాలుగా మ్లాడుకుని మేమొక నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం!” అన్నాడు.
” ఏంటి బాబూ! ఆ నిర్ణయం… ఇంటి ఆడపిల్ల కష్టంలో వున్నప్పుడు పరాయివాళ్లలా మాట్లాడటమా!”
”మేము పరాయివాళ్లం ఎందుకవుతాం అంకుల్‌! మా చెల్లిని పెంచి, పెద్దచేసి పెళ్లి చేశాం. అది ఏదో ఒక ప్రమాదంలో పడినప్పుడల్లా పనులు పోగొట్టుకొని పరిగెత్తుకొస్తున్నాం. అయినా ప్రాణం తీసుకోబోవటం దాని తప్పు కాదా? తారమ్మ నోటి మనిషి అయితే కావచ్చు కాని తప్పు అంతా ఆమెదే అని కూడా ఎందుకనుకోవాలి? ఆమె తత్వం ఇదీ అని తెలిసి కూడా ఆమె ఏది మ్లాడినా దాన్ని నెగిెవ్‌గా తీసుకోవడం, అదేం అంటే ప్రాణాలు తీసుకోవటం.. ప్రాణాలు అంత తేలిగ్గా వున్నాయా అంకుల్‌?”
”నా ప్రశ్నకు నువ్విచ్చే సమాధానం ఇదేనా రాజు? నువ్వు డాక్టర్‌వి. ఆమెను సేఫ్‌సైడ్‌లో వుంచాల్సిన బాధ్యత నీకు లేదా?”
”అదిప్పుడు సేఫ్‌సైడ్‌లోనే వుందంకుల్‌. కరక్ట్‌ ప్లేస్‌లోనే వుంది. మంచి పేరున్న హాస్పిటల్లోనే జాయిన్‌ చేశారు మీరు. తొందరగానే కోలుకుంటుంది. డోంట్ వర్రీ!” అన్నాడు.
”అది కాదు రాజు. నరేంద్ర ముంబై వెళ్లాక సౌమ్యను ఎవరు చూడాలి. ఆమె బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఆమె అత్తగారి సంగతి మనం చూస్తూనే వున్నాం. నరేంద్ర వెళ్లాక హాస్పిటల్లో మీరెవరో ఒకరు వుండాలిగా! ఆ తర్వాత ఆమెను కొంతకాలం మీ ఇంట్లో వుంచుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం” అన్నాడు.
”అలా కుదరదు అంకుల్‌. నాకు నా హాస్పిటల్‌ వర్క్‌తోనే సరిపోతుంది. మా అమ్మ మా చిన్న చెల్లిని చూసుకోవాలి. మా నాన్న సౌమ్యను చూసుకోలేడు. అయినా సౌమ్యను మేమెందుకు చూడాలి అంకుల్‌! ఆమెకు అత్త వుంది. మామ వున్నాడు. భర్త ముంబై వెళ్లినా అప్పుడప్పుడు వచ్చి చూసుకోగలడు. వాళ్లెవరూ లేకుంటే కదా మేము దాని గురించి ఆలోచించాలి?”
”అదే వుంటే ఇన్ని మాటలెందుకు రాజు? వాళ్ల గురించి మనకు తెలియదా?”
”వాళ్లు అలాగే వుాంరంకుల్‌! మా చెల్లెలుకు పెళ్లయిన కొత్తలో ‘మీరు మీ కొడుకును డాక్టర్ని చదివిస్తున్నారు. కూతుర్ని టెన్త్‌లోనే మాన్పించారు. ఇదేం పద్ధతి?’ అంటూ మా అమ్మతో గొడవ పెట్టుకుంది తారమ్మ. అది మా ఇష్టం అంకుల్‌! ఆడపిల్లను అంత వరకే చదివించాలనుకున్నాం. అంతే చదివించాం. మా బావగారికి అదెంతవరకు చదివిందో తెలిసే పెళ్లిచేసుకున్నాడు. అది వదిలేసి ఇప్పుడు తారమ్మ ఏదో అంోందని మా నేివిీకి విరుద్ధంగా వుండలేం కదా! నేను డాక్టర్నయి రోగులకు సేవ చెయ్యాలనుకున్నాను. ఆడపిల్ల కదా! దాన్ని గృహిణిగా వుంచాలనుకున్నాం. పెళ్లి చేశాం! ఇదేమైనా పెద్ద నేరమా?” అన్నాడు రాజు.
”కాదనుకో! అత్తగారింట్లో మీ చెల్లెలు పడుతున్న బాధలు కూడా మీకు తెలియనివి కావు. అందుకే ఆలోచించమంటున్నాను” అన్నాడు అంకిరెడ్డి.
”ఆలోచించానికేం లేదంకుల్‌! ఎవరు వుండాల్సిన స్థానంలో వాళ్లు వుండాలి” అన్నాడు రాజు.
”నువ్వు మొది నుండి ఇంతేనటగా!”
”అంటే! మీరేమంటున్నారో నాకు అర్ధం కావడం లేదంకుల్‌!”
”సౌమ్యను నరేంద్ర వాళ్ల మదర్‌కి దూరంగా వుంచి చదివించాలనుకుంటే నువ్వు వద్దన్నావట!”
”దూరంగా వుంచితే దానికి అక్కడ సెక్యూరిీ ఎవరంకుల్‌! అలా అనుకుంటే మేమే చదివించేవాళ్లంగా! పెళ్లెందుకు చేస్తాం! దానికి అత్తా, మామా, భర్త, కుటుంబ భద్రత వుండాలనేగా పెళ్లి చేశాం. అదంతా పక్కనప్టిె అదెక్కడికో వెళ్లి ఒంటరిగా చదివి ఏం చేస్తుంది? జాబ్‌ చేస్తుందా? జాబ్‌ చేస్తూ కూడా ఒంటరిగా వుండాల్సిందేగా! అప్పుడు మాత్రం దానికి సెక్యూరిటీ ఎవరు? చదువు పేరుతో, జాబ్‌ పేరుతో, ఆడపిల్లను ఒంటరిగా వదిలి నీ పాటికి నువ్వు బ్రతుకు, పో…. రెక్కలు మొలిచాయి కదా అని వదిలేస్తే ఆ లైఫ్‌ దాన్నెంత భయపెడు తుందో నాకు తెలుసు! చివరికి అదెంత ప్రెస్టేషన్‌లోకి వెళ్తుందో నేను ఊహించగలను. అందుకే దాన్ని ఎక్కడో వుంచి చదివించానికి మేము ఒప్పుకోలేదు” అన్నాడు.
”మీరు ఒప్పుకోకపోవటం ఎంత వరకు కరక్టో నాకు తెలియదు కాని మీ బావగారి మాట కూడా మీరు వినాలి కదా! అలా విని వుంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి వుండేది కాదేమో!” అన్నాడు అంకిరెడ్డి.
”అలా అని ఎందుకనుకోవాలి అంకుల్‌! ఒక కోడల్ని అత్తగారు ఎన్ని బాధలు ప్టిెనా మాటకు మాట అనకుండా కాస్త తగ్గితే ఆ ఇంో్ల ఆ కోడలికి వుండేంత రక్షణ బయటకెళ్తే వుంటుందా? ఇప్పుడు నిద్ర లేచినప్పి నుండి నా చెల్లెలికి వాళ్ల అత్త మాత్రమే కన్పిస్తుంది. అదే బయటకెళ్తే?? ఇంతకన్నా ఎక్కువ ప్రమాదంలో ఇరుక్కోదన్న గ్యారంటీ ఏమి? ఇప్పుడు కనీసం ప్రాణంతోనైనా వుంది. అప్పుడు అదికూడా వుండేది కాదేమో!” అన్నాడు.
ఆయన ఆశ్చర్యపోతూ ”నువ్వొక డాక్టర్‌వై వుండి నీ చెల్లెలు విషయంలో సరిగా ఆలోచించడం లేదేమో రాజు! అదీ ఈ కాలంలో చెయ్యాల్సిన ఆలోచనలు కావు నీవి…”
”ఏ కాలంలోనైనా ఒక ఆడపిల్ల గురించి చెయ్యాల్సిన ఆలోచనలే నేను చేస్తున్నాను అంకుల్‌! అది నా చెల్లెలు. పరాయిది కాదు. ఏదో నాలుగు మాటలు చెప్పి ‘ఇలా అయితే బాగుంటుందేమో… అలా అయితే బాగుంటుందేమో’ అని అనానికి… ఇలా అయితేనే బావుంటుందన్న కచ్చితమైన ఆలోచన నాది… ఎప్పుడైనా మనవాళ్ల దగ్గరే మనకు సెక్యూరిీ వుంటుంది అంకుల్‌. మనవాళ్లే మనల్ని బాగా చూస్తారు. మనస్పర్ధలు ఎంతోకాలం వుండవు. సౌమ్యవాళ్ల అత్తగారి దగ్గర వుంటేనే దానికి సేఫ్టీ… అలా కాకుండా సౌమ్యను మేము తీసికెళ్తే వాళ్ల అత్తా కోడళ్ల రిలేషన్‌ బ్రేక్‌ అవుతుంది. మాక్కూడా సౌమ్యను మా ఇంో్ల వుంచుకుంటే అవమానాలు ఎదురవుతాయి. మనశ్శాంతిగా ఉండదు. అందుకే వద్దనుకుంటున్నాం. అప్పుడప్పుడు ఎలాగూ మా బావగారు వచ్చి వెళ్తూనే వుంటారు. మేము కూడా వెళ్లి చూసి వస్తుాంం. ఇంతకన్నా నేను కాని మా పేరెంట్స్ కాని సౌమ్య విషయంలో మాట్లాడేదేమీ లేదు” అన్నాడు.
అంకిరెడ్డి కోపంగా ఫోన్‌ పెట్టేశాడు. ఆయనకెందుకో రాజు మాటలు నచ్చటం లేదు. ఏ అన్నయ్య అయినా ఇలా మాట్లాతాడా? పుట్టించిన వాళ్లు ఒక ఆడపిల్ల పట్ల ఇంత నిర్దయగా వుంటారా? రాజువి కాని, వాళ్ల తల్లిదండ్రులవి కాని స్వార్ధపు ఆలోచనలుగా అన్పిస్తున్నాయి. రాజుకి ఫోన్‌ చెయ్యక ముందు ఆయనలో వున్న ఆలోచనలు వేరు. ఇప్పుడు వస్తున్న ఆలోచనలు వేరు. నరేంద్ర ఆయన కొడుకు స్నేహితుడే అయినా ఇప్పుడు ఆయనకు కూడా బాగా దగ్గరయ్యాడు. అందుకే ఆయన నరేంద్ర అడిగితే ఏ సహాయం చెయ్యానికైనా సిద్ధంగా వున్నాడు. ఇది నరేంద్రకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. రాజుతో మ్లాడినట్లు వెంటనే నరేంద్రకి చెప్పేశాడు.
జ జ జ
హాస్పిటల్‌ నుండి ఇంటి కెళ్లాడు నరేంద్ర.
పంపు దగ్గర నిలబడి చాలాసేపు స్నానం చేశాడు.
ఫ్రష్షప్పయి బ్యాగ్‌ సర్దుకుంటున్నాడు.
అతను ముంబై వెళ్లకుండా ఇంకొక్క క్షణం కూడా ఆగడానికి లేదు. చివరిక్షణం వరకు చూశాడు తల్లి సమాధానం కోసం… తల్లికాని, తండ్రి కాని సౌమ్య గురించి ఒక్కమాట కూడా మ్లాడలేదు. ఆఖరికి అతనే ఒక నిర్ణయానికి వచ్చాడు. రాత్రంతా హాస్పిటల్‌లో వెయిటింగ్ హాల్లో కూర్చుని ఒంటరిగానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. సౌమ్య బాగున్నప్పుడు ఏ విషయమైనా ఆమెతో చెప్పుకునేవాడు. తల్లి తర్వాత అన్నీ ఆమే అన్నట్లుండేది. ఇప్పుడా అవకాశం లేకుండా ఆమె కోమాలో వుండటం అతనికో బాణం దెబ్బ అయింది. ఆమె బాగుంటే అసలీ నిర్ణయం తీసుకోనిచ్చేది కాదేమో!
శేషేంద్ర సందేహాన్ని ఆపుకోలేక ”నువ్వు వెళితే కోడల్ని ఎవరు చూస్తారు నరేంద్రా! వాళ్లవాళ్లేమైనా చూస్తామన్నారా? వాళ్లతో మ్లాడావా?” అడిగాడు.
నరేంద్ర వెంటనే మ్లాడకుండా ఒక్కక్షణం ఆగి ఆ తర్వాత
”వాళ్లెందుకు చూస్తారు నాన్నా! సౌమ్య నా మనిషా! వాళ్ల మనిషా? సౌమ్యతో వాళ్లకేం పని వుంది చెప్పు!” అన్నాడు.
”అది కాదురా! నువ్వు వెళ్తుంటే ఎలా అని అడుగుతున్నాను. నువ్వుంటే అన్నీ చూసుకుంటావ్! మరి హాస్పిటల్లో కోడలికి తగిన ఏర్పాట్లు ఏమైనా చేసి వెళ్తున్నావా?” అన్నాడు.
”ఏర్పాట్లు ఏముంటాయి నాన్నా! నర్స్‌లేమైనా మన మనుషులా? ఏదో చూస్తారు. మనలాగా చూడరు కదా! నేనయితే ఇప్పుడు తప్పనిసరిగా వెళ్లాలి. అయినా నేనేం అక్కడ వుండానికి వెళ్లటం లేదు. మళ్లీ రావానికే వెళ్తున్నాను. వచ్చాక ఇక వెళ్లను. ఇక్కడే వుండిపోతాను” అన్నాడు.
”మళ్లీ వెళ్లవా?” ఉలిక్కిపడ్డాడు శేషేంద్ర. ఆయన భార్య తారమ్మ కూడా నోరెళ్ల బెట్టేసింది… ఆమె కొడుకు ఇంికి రావడం, స్నానం చెయ్యటం, బ్యాగ్‌ సర్దుకోవటం మౌనంగా చూస్తూనే వుంది. కొడుకు మ్లాడితేనే మ్లాడాలని ముఖాన్ని సీరియస్‌గా పెట్టుకొని తిరుగుతోంది. కొడుకు అలా అనగానే ీవీ స్క్రీన్‌ మీద స్క్రోలింగ్‌ ఆగినట్లు కొడుక్కి నాలుగు అడుగుల దూరంలో ఆగి బిత్తరపోయి చూస్తోంది.
”అలా రావానికి వుండదేమో కదా నరేంద్రా? ఎలా వస్తావ్‌? 20 సంవత్సరాల వరకు నేవీలోనే వుంటానని బాండేదో రాసిచ్చానన్నావే? వాళ్లు నిన్ను మధ్యలో రానిస్తారా?” చాలా నెమ్మదిగా కొడుక్కి ఏమాత్రం కోపం రాకుండా అడిగాడు శేషేంద్ర.
”నా సొంత రిక్వెస్ట్‌ మీద రానిస్తారేమో ట్రై చేస్తాను నాన్నా! కోమాలో వున్న నా భార్యకు నా అవసరం వుంది. నేను తప్ప ఎవరు చూస్తారు తనని… నా కుటుంబ సమస్యలు, సౌమ్యకు డాక్టర్లు ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి పై అధికారులకి చెప్పుకుని రిక్వెస్ట్‌ పెట్టు కుంటాను. కారణాలు సరిగా వుంటే నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్‌ చేస్తారు. లేకుంటే లేరు. అక్కడే వుండిపోవలసి వస్తుంది. ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్‌ వున్నాయి”
”మరి ఇక్కడికొచ్చి ఏం చేస్తావురా?”
”వచ్చాక ఆలోచిస్తాను నాన్నా!”
”నేవీ వాళ్లు డబ్బు లేమైనా ఇస్తారా?”
”ఇవ్వరు. నేను మధ్యలోనే వచ్చేస్తున్నాను కదా! నేవీ నుండి నాకు రావలసిన బెనిఫిట్స్ కూడా ఇకపై రావు. నేను ఇంతవరకు వుంచుకున్న సేవింగ్స్‌ మాత్రమే నాకు వస్తాయి. అంతేకాదు, నేను ఇక్కడికి వచ్చేశాక వాళ్ల నుండి నాకు ఎలాిం సెక్యూరిీ అందదు. బెనిఫ్స్‌ితో పాటు సెక్యూరిటీ కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఇక్కడ వుండే మామూలు సివిల్‌ పర్సన్‌లాగే అయిపోతాను” అన్నాడు నరేంద్ర.
ఇన్నిరోజులు నేవీ డ్రస్‌లో బలమైన భుజాలతో, ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న కళ్లతో కన్పించే కొడుకు ఇప్పటి కే చాలా మారిపోయి కన్పిస్తున్నాడు. అతను లోగడ అప్పుడప్పుడు నేవీలోంచి ఇంికొచ్చి తిరిగి నేవీలోకి వెళ్తూ బస్‌ ఎక్కుతున్నా దిగుతున్నా తారమ్మ గుండె సంతోషంతో పొంగుతుండేది. కంటినిండా కొడుకునే చూసుకునేది. ఒక నావికుడిని కన్నతల్లి అనుభూతి ఎలా వుంటుందో ఆమె గొప్పగా అనుభవించేది. ఇక పూర్తిగా ఇక్కడికి వస్తే నరేంద్ర అలా వుాండా?
”ఇక్కడకొచ్చేస్తే నువ్వింకేం పని చెయ్యగలవు నరేంద్రా! ఏదో ఒక పని అయితే వుండాలిగా!” తండ్రిగా ఆయనలో వున్న భయాన్ని ఆయన బయట పెట్టాడు శేషేంద్ర.
బ్యాగ్‌ జిప్‌ సరిగా పడకపోతే దాన్ని మళ్లీ లాగి దానివైపే చూస్తూ ”సౌమ్య కాస్త కోలుకున్నాక హైదరాబాదు వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటాను లే నాన్నా! మన ఊరిలో అయితే వుండను” అన్నాడు నరేంద్ర.
హైదరాబాద్‌ అనగానే తారమ్మ గుండె జల్లుమంది. హాస్పిటల్‌ వెయిిింగ్‌ హాల్లో ఈవ్‌ెం మేనేజర్‌ అంకిరెడ్డితో మ్లాడిన మాటలు గుర్తొచ్చాయి. హైదరాబాదు వెళ్తే తన కొడుకు కూడా మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసై చాలీచాలని జీతంతో కడుపు మాడ్చుకుంటూ ప్‌ుపాత్‌లు, రైలుప్టాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల కింద పడుకుంటాడేమో! పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లకే ఉద్యోగాలు దొరకడం లేదంటున్నారు. తన కొడుక్కి వెళ్లగానే ఎవరిస్తారు ఉద్యోగం? ఉద్యోగం లేకుండా ఆ ఉలుకూ, పలుకూ లేనిదాన్ని వెంటబెట్టుకెళ్లి ఏం చేస్తాడు? ఈవెంట్ మేనేజర్‌ అన్నట్లు వీళ్లిద్దరు కూడా చివరకి గుర్తు తెలియని మృతుల సంఖ్యలోకి చేరిపోతారా?!!” వణికింది తారమ్మ.
…తన కొడుకు అలా ఎప్పటికీ కాకూడదు. వాడొక సైనికుడు. సైనికుడుగానే బ్రతకాలి. సైనికుడుగానే మరణించాలి. తనుకూడా మామూలు తల్లిలా వుండకూడదు. ఒక వీరుని కన్న తల్లిలా వుండాలి… వీరుని తల్లిలాగే చావాలి. ఏదైనా బలంగా కావాలనుకున్నప్పుడు కొంత కోల్పోవాలి. కొంత రాజీపడాలి. ఏదీ లేకుండా ఏదీ రాదు. బిడ్డల్ని అందరూ కాంరు. ఆ బిడ్డల్ని బాగా డబ్బు సంపాయించుకునే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుకుాంరు. అది అందరూ చేసే పనే…! కానీ తన కొడుకు చేస్తున్న పనిలో డబ్బుకన్నా దేశ సేవ వుంది. దేశభక్తి ఉంది. దేశం కోసం చావానికైనా సిద్ధపడి బార్డర్‌లో గన్ను పట్టుకొని గస్తీ తిరుగుతాడు… ఇవి మామూలువాళ్లు చేసే పనులు కావు. అలాిం కొడుకును నిర్వీర్యుణ్ణి చేసి, దానికి తగిన పరిస్థితుల్ని కల్పించి ఇప్పికే చాలా పాపం చేసుకుంది.
ఒక్క ఉదుటున కొడుకు దగ్గరకు వెళ్లింది తారమ్మ. బ్యాగ్‌ జిప్పు పట్టుకొని వున్న కొడుకు చేయి పట్టుకొని ”నువ్వు వెళ్లు నరేంద్రా! మళ్లీ రావద్దు” అంది. ఆమె గొంతు వణికింది.
”నేనొస్తానంటే రావద్దాంవేంటమ్మా! నీకు తెలియదులే! సౌమ్య కోసం నేను రావాలి. నాకు దేశం కన్నా నా భార్య ముఖ్యం” అన్నాడు.
”నీ భార్య ఎక్కడికి పోతుందిరా! నేనున్నాను కదా!” అంది. ఇంకా ఆమె గొంతు వణుకుతూనే వుంది. ఏదో తప్పుచేసి, ఆ తప్పును సరిదిద్దుకోబోయేటప్పుడు కలిగే మార్పు అది.
”ఈ నమ్మకం ఒకప్పుడు వున్నది కాని ఇప్పుడు లేదమ్మా! నేను వెంటనే వచ్చేస్తాను. అక్కడ వుండను. నేను వచ్చే వరకు సౌమ్యను వాళ్ల మదర్‌ చూసుకుాంరు. రాజుకి అలా చూసుకోమని చెప్పే వెళ్తాను”
”వాళ్లెవర్రా చూసుకోానికి… నా కోడల్ని వాళ్లు చూసేదేిం? నేను లేనా? మీ నాన్న లేడా? సౌమ్య హాస్పిటల్లో ఎన్నిరోజులు వుంటుందో అన్ని రోజులు నేను హాస్పిటల్లోనే వుాంను. నువ్వేం భయపడకు. తర్వాత మన ఇంటికి తీసుకొచ్చుకొని జాగ్రత్తగా చూసుకుంటాం! నువ్వెళ్లు. మళ్లీ రాకు. వచ్చి నువ్విక్కడ చేసే పనులు కూడా ఏమీ లేవు” అంది. ఆమె అప్పటి కప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది.
”అలా ఎందుకు అనుకోవాలమ్మా! వచ్చాక ఏదో ఒక పని వెతుక్కుంటానుగా! పనులు చేసేవాళ్లకి పనులు లేకపోవటం ఏంటి? ఏదో ఒక పని దొరుకుతుందిలే!” అన్నాడు.
”ఎంత చెప్పినా వినవారా నువ్వు… కోడల్ని నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా! సౌమ్య గురించి వాళ్ల వాళ్లకేం చెప్పకు. నేను చూసుకుంటాను” అంటూ భరోసా ఇచ్చింది.
”వద్దులేమ్మా!”
”ఎందుకురా?”
”ఎందుకంటే ఇకముందు సౌమ్యకు జరగరానిది ఏమైనా జరిగితే దానికి కారణం నువ్వే అంటారు. అప్పుడిక పోలీసులు, కేసులు అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావ్! నీవల్లనే సౌమ్య ఒకసారి సూసైడ్‌ చేసుకోవటం, మళ్లీ బావిలో దూకటం జరిగిందన్న విషయం ఊరందరికీ తెలిసిపోయింది. అయినా ఎవరూ నోరెత్తలేదు. ఈసారి ఏం జరిగినా అందులో నీ తప్పేం లేకపోయినా నీవల్లనే జరిగిందాంరు. ఈ రెండుసార్లు నీమీదకి ఎవరూ రాలేదు కాని ఈసారి తప్పకుండా వస్తారు. మనం మన సేఫ్‌సైడ్‌ కూడా చూసుకోవాలి కదా! నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా, ఏమైనా చేసినా నేను తట్టుకోలేను. ఉన్న బాధకు మరో బాధను ఎందుకు తోడు చేసుకోవాలి” అన్నాడు నరేంద్ర.
ఆమె ఒక్కక్షణం షాక్‌లోకి వెళ్లింది.
”మన ఊరివాళ్లు మౌనంగా వుండటం వల్ల ఏదీ బయటకి రావటం లేదు. అదే సౌమ్య తల్లిదండ్రులు ఏమాత్రం నోరు విప్పినా పోలీసులొస్తారు. న్యూస్‌రిపోర్టర్స్‌ వస్తారు. వాళ్లు పోలీసుల దగ్గర వివరాలు సేకరించి టీ.వీ ఛానల్స్‌కి రిపోర్ట్స్‌ ఇస్తారు. అప్పుడు టీ.వీ ఛానల్స్‌ వూరుకోవు, బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ స్క్రోలింగ్స్‌ వేస్తారు. దాన్ని అన్ని చానల్స్‌ టెలికాస్ట్‌ చేస్తాయి. నేను నేవీలో వుండేవాడ్ని కాబ్టి నేషనల్‌ ఛానల్స్‌ కూడా ఆ న్యూస్‌ని కవర్‌ చేస్తాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన దగ్గరకి మహిళా మండలి కార్యకర్తలు, సైకాలజిస్ట్‌లు కూడా వస్తుంటారు. నువ్వు వాళ్లను తట్టుకోలేవు. ఇంట్లోనే కదా! కోడల్ని ఏమంటే ఏముందిలే అని నీలాంటి అత్తగార్లు అనుకుంటే అనుకోవచ్చు కాని ఆ తర్వాత దాని పర్యవసానం ఘోరంగా వుంటుందమ్మా! ఇదంతా ఎందుకు చెప్పు! నేను నాభార్యతో ఎటైనా వెళ్లిపోతా! అలా కాకుండా నేను నేవీలోనే వుండి ఆమెను మీ దగ్గర వుంచితే ఏం జరుగుతుందో చూస్తున్నాంగా… దానివల్ల మీకు కష్టమే! మాకు కష్టమే!” అన్నాడు.
ఆమె కొడుకువైపు చూడకుండా తలవాల్చి నేలవైపు ఆలోచనగా చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *