May 7, 2024

యాత్రామాలిక: భారతీయులలో పెద్దగా ప్రాచుర్యం లేని అమెరికాలో చూడదగ్గ ప్రదేశాలు – మొదటి భాగం.

రచన: భరద్వాజ్ వెలమకన్ని

అమెరికా గురించి సందర్శకులు మాట్లాడుకునేడప్పుడు వారి నోళ్ళలో ముఖ్యంగా నానేవి నయాగరా, లిబర్టీ విగ్రహం, వైట్ హౌస్, గ్రేండ్ కేన్యన్, హాలీవుడ్, డిస్నీ, ఓర్లాండో, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లాంటి ప్రదేశాలు. చాలా మంది అమేరికా వసులైన భారతీయులకు కూడా ఈ ప్రదేశాలు మాత్రమే తెలుసు. అయితే అమోఘమైన ప్రకృతి సౌందర్యం అమేరికా స్వంతం. చాలా నేషనల్ పార్కులు సందర్శకులను ఒక అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తాయి. ఈ వ్యాసంలో మనం భారతీయుల్లో పెద్దగా ప్రాచుర్యం లేని కొన్ని ప్రదేశాలని వివిధ భాగాల్లో పరిశీలిద్దాం. ఈ భాగం లో మనం చూడబోయేది మాంటేనా రాష్ట్రం కెనడా సరిహద్దులో గల గ్లేషియర్ నేషనల్ పార్క్.సుమారు 1600 వదల చదరపు మైళ్ళ ప్రాతంలో విస్తరించియున్న ఈ పార్క్ సౌందర్యాన్ని వర్ణించడం చాలా కష్టం. కొండలు, తోటలు, చెరువులు, ట్రైళ్లతో నయనానందకరంగా ఉండే ప్రాంతమిది. ప్రకృతి ఆరాధకులకి భూతల స్వర్గమే.  కేవలం ట్రైళ్ళ పొడవే 700 మైళ్ళదాకా ఉంటుంది.  కొన్ని చెరువుల్లో అయితే అడుగునున్న రాళ్ళు కూడా వడ్డున నిలుచున్న వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ పార్క్ లో చూడదగ్గ ప్రదేశాలు
1: గోయింగ్ టూ ద సన్ రోడ్: పార్క్ ఒక మూల నుండీ మరొక మూల దాకా వెయ్యబడిన రోడ్ ఇది. సందర్శకులకి అతి ముఖ్యమైనది. దీని పొడుగు కేవలం 50 మైళ్ళే అయినా దారిలో తగిలే విశేషాలు, సుందర దృశ్యాలు దీనిని ఒకటి లేదా రెండు రోజుల పనిగా మారుస్తాయి. వేసవిలో మొత్తం 50 మైళ్ళూ డ్రైవ్ చెయ్యవచ్చు, శీతాకాలంలో మంచువల్ల ఇది కేవలం 12 మైళ్ళకు మాత్రమే పరిమితం. తప్పనిసరిగా పార్క్ లో చూడవలసింది ఇది. కేవలం ఇది చూసే వచ్చేసే వారు కోకొల్లలు.
2. మెక్ డానల్డ్ సరస్సు & లోయ: 500 వందల అడుగుల లోతు, పది మైళ్ళ పొడవు ఉండే ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. ఈ లోయ అనేక చెట్లు, జంతువులకు, హైకింగ్ ట్రైళ్లకూ  ప్రసిద్ధి చెందింది.
3. సెయింట్ మేరీ లోయ: పార్క్ లో తూర్పున ఉండే ఈ  లోయ/సరస్సు ప్రాంతంలో వివిధ రకాలైన వృక్ష, జంతుసంపదే కాకుండా నేటివ్ అమేరికన్లకు సంబంధించిన విశేషాలు కనువిందు చేస్తాయి.
4. నోర్త్ ఫోర్క్: జనసంచారానికి దూరంగా ఉండే ఈ ప్రాంతంలో వివిధ కాలాల్లో రగిలిన కార్చిచ్చుల కారణంగా అడవుల్లో ఏర్పడిన అంతరాలను ప్రత్యక్షంగా చూడవచ్చు.
5. వివిధ రకాలైన మంచు కొండలు.
మాంటేనా లోని హెలెనా, మిసౌలా, బిల్లింగ్స్ విమానాశ్రయాలు దీనికి దగ్గర. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఉత్తర భాగం నుండి కారులో అయిదారు గంటలలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ పార్క్ ఛాయాచిత్రాలు కొన్ని ఇక్కడ:
p1 10704897_10203869552193321_2113243333_n 10579825_10203869676756435_660903993_n 10614052_10203869240425527_29994269_n 10694856_10203868811734810_1214961084_n 10668352_10203870007284698_1698758787_n 10707978_10203869684756635_29599042_n 10694955_10203869242065568_1266329781_n 10639722_10203869705557155_2835237641710348337_n p2 10583347_10203869239705509_605239951_n 10706406_10203869675036392_222100575_n 10386817_10203869705077143_7323137304942335669_n 10705136_10203869732037817_2125047151_n 10685074_10203869239945515_1681637611_n 10399980_10203868810454778_3048769569708925138_n 10653681_10203868807454703_3353918814727281652_n 10656666_10203868810334775_1280555722_n 10520791_10203869707437202_7507511018411857398_n 10705347_10203869242425577_234680586_n

1 thought on “యాత్రామాలిక: భారతీయులలో పెద్దగా ప్రాచుర్యం లేని అమెరికాలో చూడదగ్గ ప్రదేశాలు – మొదటి భాగం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *