May 3, 2024

జీవితపు మలి దశ వాస్తవాలు-పరిశీలన !!

సమీక్ష: పుష్యమి సాగర్

Jeevitapu malidaSa

జీవితంలో మూడు దశలు ఉంటాయి బాల్యం, యవ్వనం, వృధ్యాప్యం. బాల్యం నుంచి యవ్వనం దాక పరిగెత్తిన మనిషి వృధ్యాప్యం వచ్చేసరికి డీలా పడతాడు. ఎంతటి గొప్ప వాడయినా వార్ధక్యం బారిన పడవలసిందే. సమస్యలు కేవలం మొదటి రెండు దశల్లో నే నా …. చివరి దశ అయిన వృధ్యాప్యం లో కూడా వచ్చే సమస్యలని చర్చించే పుస్తకం “ఈ వార్ధక్యం వరమా ? శాపమా ?”. ఈ పుస్తక రచయిత్రిగారు వృధ్యాప్యం అంశం పై ఎంతో పరిశోధించి కనుగొన్న పరిష్కారాలు బాగున్నాయి. కడుపున పుట్టిన వాల్లే పట్టించుకోని అమానవీయ స్థితి లో ఉన్న సమాజం లో నేను వున్నాను అంటూ వారి సమస్యలని లోకం ముందుకు తీసుకు రావడం ముదావహం. ఈ పుస్తకం లో వున్న మొత్తం 28 వ్యాసాలు చదువుతున్నప్పుడు మనిషి అన్నవాడికి తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి. కొడుకుల దుర్మార్గానికి కూతుర్ల అత్యాశ కి ఎందరో తల్లి తండ్రులు దిక్కు మొక్కు లేకుండా చనిపోతున్నారు. ఓ సారి పుస్తకం లో ని వ్యాసాల పై క్లుప్తం గా చర్చిద్దాం అంతం కాదు ఆరంభం లో, ఓ కన్న తల్లి చిన్న కొడుకు పై కేసు వేస్తుంది ఎందుకంటే తన భర్త తాగుడు అలవాటు వుండటం వలన చిన్న కొడుకు తాగించి ఆస్తి పైన సంతకం పెట్టించు కున్నాడు అని. తనకి పెన్షన్ జీవితాంతం వస్తుంది. అయితే చాలా ఎవరోకరి సహాయం కావాలి ఆ వృధ్యాప్యం లో అందుకే ఆ పెన్షన్ పెద్ద కొడిక్కి ఇస్తాను. ఎవరి దగ్గర పడి ఉండను, చితి కూడా పెట్టనవసరం లేదు అంటూ శరీరాన్ని మెడికల్ కాలేజీ కి డొనేట్ చేస్తుంది ఎంత గొప్ప మనసు కదా!!

“అరవైలో ఇరవై” అనే వ్యాసం లో అరవైలలో ఇరవైలాగా వుంటే చాల వరకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు అన్న సత్యాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఈ వ్యాసం లో తన భర్త చేసే పనులకు అందరు ఏమనుకుంటారో అని మధన పడుతుంది కాని తరువాత ఒకరికోసం మరొకరు జీవించడం ముసలితనం లో కూడా సాధ్యమే అని నిరూపించారు. ఇక హరిప్రియ దేవి గారి వ్యాసం చదివాకా పోరాటానికి వయసు తో సంబంధం లేదు అనిపిస్తుంది. తన భర్త అయిన జానకీనాథ్ చౌదరి ప్రబుత్వ కళాశాల అధ్యాపకుడు చనిపోతే సర్వీస్ లేదు అన్న కారణం గా పించన్ రాదూ అని కళాశాల వారు చెప్పినప్పుడు తన భర్త కు రావాల్సిన నగదు ను పించను ను డెబ్బై ఏళ్ళ వరకు పోరాడి చివరికి ఎలా సాదించిం దీ… చూడొచ్చు. పోరాటం చే చేసయినా మన హక్కులను మనమే కాపాడుకోవాలి అన్న సత్యం నిజం!! ఆ ముసలితనం లో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అందరు అవహేళన చేస్తున్నా మొక్కవోని ధైర్యం తో పోరాడటం మరెందరికో స్ఫూర్తి ని ఇచ్చింది (డెబ్బైలలో కూడా పోరాడి గెలవచ్చు). జెండా పండుగ నాడు స్వాతంత్ర్య సమరయోధులకు శాలువా కప్పి చేతులు దులుపుకోవడం కాదు స్వతంత్ర దేశాన్ని కాపాడుతూ ఉండటమే మీ నుంచి ఆశిస్తున్నాము అంటూ స్వతంత్ర సమరయోధుల ఆకాంక్ష ని తొంబై ఏళ్ళ అమర్ నాథ్ పాత్ర చెప్పినప్పుడు నిజం అనిపించక మానదు దేశం కోసం నడుములు బిగించి పోరాడే నాయకులూ రావాలని ఆశిస్తారు తప్పులేదు కదా (స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్ష ). పరోపకారం ఇదం శరీరం అన్నారు పెద్దలు అదే పెద్దలు తమ కొడుకు ఫ్యూచర్ కోసమో, మనవడి కోసమో కళ్ళను, అవయవాలను దానం చేసి మరో క్రొత్త జీవితం ఇవ్వాలి అనుకోడం ఎంత గొప్ప భావన కదా !

ఎనభయి ఏళ్ళ వృద్ధురాలు తన మనవడి చూపు రావడానికి బ్రతికి ఉండగానే కళ్ళను త్యాగం చెయ్యటానికి వచ్చినప్పుడు చెయ్యి ఎత్తి మొక్కాలి అనిపిస్తుంది ఎవరికైనా. అలాగే తాను చనిపోయాక తన శరీర భాగాలని అవసరం వున్న వారికి అమర్చాలని కోరడం ..నికోలస్ గ్రేస్ లాంటి వ్యక్తులకే సాద్యం. ఇవన్నీ చేసేది ఉడుకు రక్తం వాళ్ళు కాదు వయసు ఉడికి చేవ చచ్చిన ముసలి వాళ్ళు, సమాజం చేత చీత్కరించబడిన వాళ్ళు. యువకులు ఆత్మ హత్య చేసుకోవడం లో అర్థం వుంది కాని వృద్ధుల కు ఆత్మ హత్య చేసుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? వృద్ధులకు కరువు అయిన ఆదరణ వలన. నిరాశావాదం , అసహయత లాంటి లక్షణాలు ఆత్మ హత్యలకి ప్రేరేపిస్తుంది. మనం ఎంతో అబివృద్ధి చెందిన దేశం గా పేర్కొన్న అమెరికా లో 65 ఏళ్ళు దాటినవారు 1.9 శాతం వున్నారు కాని అందులో ఆత్మ హత్య చేసుకునేవారి సంఖ్య పెరుగుతుంది, ఇది సత్యం. వృధ్యాప్యం లో జీవిత భాగస్వామి ని కోల్పోతే? ఇద్దరు ఒకేసారి కను మూస్తే చిక్కు లేదు. కాని ఒకరు విడిచి మరొకరు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్తే కొడుకులు చూడక, కూతరు దగ్గరికి రానియ్యక నరకం అనుభవిస్తారు. ఇలాంటి వాటికి పరిష్కారమే “వృధ్యాప్యం లో మరో విహాహం, సహా జీవనం”. ఈ వ్యాసం లో రాజేశ్వరి అనే వృద్ధురాలు తన తోటి సమూహానికి ఎలా స్ఫూర్తి నింపి కొత్త జీవితానికి అర్థం చెప్పిందో చక్కగా వివరించారు. “తోడూ -నీడ” అనే సంస్థ ని ఏర్పాటు చేసి తోటి వారికీ ఆదర్శం గా నిలిచింది . “కొంతమంది యువకులు పుట్టుక తో వృద్ధులు ” అన్నాడో సిని కవి. ఆ మాట నిజమే ఈ కాలపు యువత లో పేరుకొన్న బద్ధకం పని చెయ్యని ఆసక్తి గమనించవచ్చు. వయసు మళ్ళిన వారు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో “వయసు మళ్ళినా ఇప్పటికీ పవర్ ఫుల్ అంటూ వృధ్యాప్యం లో ఉన్నా కూడా ఇప్పటి యువత కు ఏ మాత్రం తీసిపోకుండా పనులు చెయ్యడం తెలపడం బాగుంది. ఈ వ్యాసం లో డాక్టర్ గుప్త గారు చెప్పింది వాస్తవం. పక్కవారిని గురించి ఆలోచించడం మొదలు పెడితే మనని గురించి ఆలోచించడం ఆటోమేటిక్ గా మర్చిపోతాము.

పొరుగు వారికి సాయపడగానే మనకు కలిగే ఆనందం కడుపు నిండా భోజనం చేసినా కలగదు అన్న మాటల్లో ఎంతో నిజం ఉంది ..అందుకే తోటి వారికి సహాయకారి గా ఉండాలి అంటారు. వృద్ధుల కు ఎవరూ సహాయం చెయ్యరు. ఆస్తి కోసం కొడుకు కూతురు తన ముందే కొట్టుకు చావడం, తనని కొట్టడం లాంటివి చూసి భయపడి రాత్రి కి రాత్రే వృద్ధాశ్రమం లో కి వెళ్లి తలదాచుకున్న కునాల్ స్థితి ఎంత దయనీయం! అందుకే వాళ్ళ పై కేసు పెట్టింది. ఇది జరిగింది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లో, ఇదే వ్యాసం లో బెంగళూర్ కి చెందిన సుమిత్ర నీళ్ళ గది లో పడి కాలు విరిగితే హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాడు కొడుకు. కాలు నయం అయినా వచ్చి తీసుకు పొమ్మనా తీసుకు పోరు. చివరికి తల కొరివి పెట్టడానికి కూడా తీరిక ఉండదు. అనాధ లా వదిలేసి పొమ్మనడం ఏ సంస్కృతి నేర్పింది వీళ్ళకి అందుకే వృద్ధుల పక్షాన వాదించే ప్లీడరు కావాలని చాల బాగా వివరించారు.

“కన్నవారిని కడదేరుస్తున్న కన్న కొడుకులు” అనే వ్యాసం లో కొడుకుల దురాగతాలను చూసాక కళ్ళ లో నీళ్ళు చిప్పిల్లాయి. 75 ఏళ్ళ వృద్ధుడు కొడుకు చేతిలో దెబ్బలు తిని మరణించాడు. ఇది నిజంగా జరిగిందే. “పితృ దేవోభవ” అనే ఈ దేశం లో తండ్రి ని కొడుకు హత్య చెయ్యడం జరిగింది అంటే ఈ దేశం లో నీతి ఎంత గా దిగజారిపోయిందో చూడండి. ఇదే దాంట్లో ఓ 40 ఏళ్ళ కొడుకు దేశం లో తల్లి తండ్రులకి ఓ ఉత్తరం రాసాడు …ఇండియా కి స్వాతంత్ర్యం వచ్చిన కూడా పిల్ల లు మాత్రం ఇంకా స్వతంత్రులు కాలేదు, లెక్చర్ లతో వేదించ కండి .. ఇంకా పిల్లలు లేరని, పెళ్లి కాలేదని ఇలా రక రకాలు గా వేదించ కండి అని అంటారు, ఎంత దారుణం కదా. మన ఉన్నతి కోసం శ్రమ పడ్డ వాళ్ళు ఒక మాట చెప్పటం తప్పు అయిపోయింది అంటున్నారు.

కన్న కొడుకులు కూతుళ్ళు ఉన్న కూడా బిక్షాటన చెయ్యాల్సిన స్తితి కి సిగ్గు పడాలి. కొడుకు ల కోసం జీవితాన్ని ధారపోసిన వారు చివరి అంకం లో కొడుకు దగ్గర కన్నా వీధుల్లో బిక్షం ఎత్తుకొని బతకడం గౌరవం అనుకుంటున్నారు భిక్షాటన లో స్వేచ్చగా బతుకుతున్న పెద్దలు. పిల్లలు ఎంత కౄరస్వభావులు గా మారారో కదా? “భిక్షాటన లో స్వేచ్చగా బతుకుతున్న పెద్దలు” అనే వ్యాసం లో చర్చిందంతా ఇదే హృదయానికి హత్తుకుంటుంది. వృద్ధుల సమస్యల కోసం వృద్ధులే పోరాడాలి.

నగరం లో అత్యాధునిక వృద్ధాశ్రమ పోకడలను “hyfi వృద్ధాశ్రమం లో వృద్ధులు” అనే వ్యాసం లో ఎంతో బాగా చెప్పారు. డబ్బు వుంటుంది. సౌకర్యాలు ఉంటాయి సమయానికి అన్నీఅమర్చుతారు కానీ ప్రతిసారీ అనిపిస్తుంది లోకం నుంచి విడిచి వెళితే అన్ని వున్నా అనాధ లా వెళ్ళాల్సిందే కదా, ఆఖరి రోజుల్లో పిల్ల ల చేతిలో చనిపోతే బాగుండు అని…. కొడుకు తల్లిదండ్రులకు చనిపోయాక పున్నామ నరకం నుండి తప్పిస్తాడుట, అది నిజం గా జరుగుతుందో జరుగదో గానీ.

ఇది ఎంత నిర్దయగా వుంది కదా..వృద్ధులకు వైద్యం అనవసరమా??. అనవసరమే అంటారు హైదరాబాద్ కి దగ్గర లో ఉన్న ఓ పల్లెటూరు లో. ఆ పల్లెటూరి లో ఓ వ్యక్తి ఎండకి ఎండి, వానకి తడిసి వుంటే ఒక్కరు పట్టించుకోకుండా తమ మానాన తాము పోతూ వుంటారు. చివరికి ఆ వృద్ధుడు కన్ను మూస్తాడు. ఎంత దౌర్బ్యగ్యం కళ్ళ ముందు ఓ మనిషి అలా వుంటే పట్టించుకోకుండా వెళ్ళడం? మరి వృద్ధులకు వైద్యం అనవసరం కాదా?. ఇంకో కధ లో 92 ఏళ్ళ బామ్మ ని ఆసుపత్రి లో చేర్పించితే మెల్లగా కోలుకుంది ఆవిడా స్థితి కి రావడానికి కారణం ఆవిడ కూతురు అని తెలిసింది. పోషకాహారం ఇవ్వకుండా నాణ్యతలేని మామూలు ఆహారాన్ని పెట్టి చెయ్యి దులుపుకొని పోవడం మానవత్వం అనిపించుకోదు. ఇవి కేవలం కొన్ని మాత్రమె.. ఇంకా ఇందులో “వృద్ధులను వేదించే వంటరితనం, ” “వెనకబడిన తెగలలో వృద్ధులు” “వృద్ధుల సమస్యల పై పరిశోధనలు” లాంటి మంచి వ్యాసాలు వున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *