May 4, 2024

అతడిలొ సగం  

రచన: ధనలక్ష్మి సైదు

 

ఆకాశంలొ అర్దభాగస్తులం …

అవకాశాలలొ మూడోవంతు భాగస్తులం

పెదవి విరుపులకు వెరవణి వేణీలం …

ధృడబీజాలమై అంకురిస్తున్న శరీరిలం

తృణీకరించబడుతున్న ఆడజాతి రత్నాలం ..

బాల్య మందు అలివేణిలం ..

కన్యగా పూబంతులం ..

యవ్వనమున సవంతికలం ..

పలుకుటలొ తియ్యమ్రానులం ..

ముదుప్రాయమున అలసిన మందాకినీలం ..

అణిచిపెట్టినా ఆరడిపెట్టినా

మెట్టినింటిని విడువని గృహిణులం..

“అ”తగా”డి” మ”ది”లో “ఆడది”గా రూపాలం ..

కుడి ఎడమలు చూడని తోడులం ..

ఎప్పటికి అతడి వెనకుండే మరో  రూపాలం ..

నినదించిన నిరసించిన నీరసించినా

వీడని మేఘమాలికలం వింజామరులం ..

అతగాడి సహకారంతొ సంపూర్ణులం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *