May 1, 2024

అలరించే సైన్స్ ఫిక్షన్ (కల్పన) నవల – నీలీ ఆకుపచ్చ

సమీక్ష   –పుష్యమీ సాగర్ 

 మధు

రచయితచిత్తర్వు మధు  

 

తెలుగులో సైన్స్ ఫిక్షన్ నవలలు ఎన్నో వచ్చాయి. అవన్నీ వేటికవే విభిన్నత కలిగినవి అని చెప్పవచ్చు. సైన్స్ ఫిక్షన్ ని పాఠకులు ఎక్కవగా ఇష్టపడరు అని చాలా మంది అఫోహ పడతారు. కాని ఈ “నీలీ-ఆకుపచ్చ” చదివాక ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.  కొంత విజ్ఞానాన్ని, మరికొంత వినోదాన్ని అందిస్తూ సాగిపోయే ఈ నవల ఆద్యంతం ఆకట్టుకుంటుంది.   “విశ్వశక్తి” అనే శక్తి తో భవిష్యత్ లో మాయలు మంత్రాలు చేయవచ్చుఅనే ఒక అందమైన ఉహని కల్పించి నిజంగానే జరుగుతుందా అన్నమాయ లో పడేస్తారు. ఇది చదివాక ఎవరికైనా కలల్లో ప్రయాణం చేస్తూ గ్రహాంతర కాలనీ లోకి షికారుకు వెళ్ళాలని అనిపిస్తుంది.  ఇది కేవలం ఊహాజనితము అయినప్పటికీ, భవిష్యత్ లో సైన్స్ పురోగతి సాధించిన తరువాత నిజం కూడా కావొచ్చు. మనిషి ఎంత పురోగతి సాధించినా, మంచి కి, చెడు కి మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అన్నినవలలు లాగే ఇది కూడా సాగితే దీనికి ప్రత్యేకత ఏమి ఉంటుంది. దీనికి ఓ విభిన్నమైన ప్రత్యేక అంశం ఉన్నదీ అదే (సీక్వెల్)..కొనసాగింపు. సాధారణంగా సినిమాలకు మాత్రమే “సీక్వెల్” ఉంటుంది అనుకుంటాము. కానీ ఓ నవలకి కొనసాగింపు గా రావడం అన్నది ప్రత్యేకం కదా…ఇంతకీ దేనికి కొనసాగింపు? చూద్దాము.

భవిష్యత్తులో సాగే కధనం, నాల్గో సహస్రాబ్ది “కుజుడి కోసం” నవల కి ఇది కొనసాగింపు (సీక్వెల్) మొదటి సగభాగం తెలుసుకోకుండా రెండో దానికి వెళ్ళలేము.  అసలు మొదటి భాగమైన “కుజుడి కోసం” లో కధేంటో టూకీ గా తెలుసుకుందాం. అంగారక గ్రహయాత్ర ని ముగించుకొని హాని ఆమ్రపాలి భూమి మీదికి తిరిగివస్తాడు. సయోనిపై మోజుతో మరల అంగారక గ్రహానికి వెళ్ళినా హాని కి భ్రమలు తొలిగిపోతాయి. అరుణ భూముల చక్రవర్తి అయినా సమూరా చేతి లో బందీ అవుతాడు. కుజుడి మీద ఉన్న ఒలంపస్ శిఖరం మీద దాచబడి ఉన్న అమరత్వం ప్రసాదించే ఔషదాన్ని తెచ్చి తనకివ్వాలని సమూరా!. ఎలాగోలా దాన్ని తెచ్చి ఇస్తాడు హనీ. ఆ తరువాత   మానవ కాలనీకి, మాంత్రిక రాజ్యం అరుణ భూములకి మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం అకస్మాత్తు గా యుద్ధ రూపంలోకి మారడంతో హనీ యుద్ధం చేస్తాడు. కుజ గ్రహపు మాంత్రికుల వద్ద శిక్షణ పొంది విశ్వశక్తిని కరతలామలకం చేసుకుంటాడు హనీ.

ఈ క్రమంలోనే తనలో జన్యు సంబంధమైన ప్రత్యేక శక్తి ఉంది అని, అది తనకి పుట్టుకతోనే లభించింది అని తెలుసుకుంటాడు.  అమృత ఔషధం తాగితే శక్తులు నశిస్తాయన్న నిజాన్ని దాచి పెట్టి, సమూరా ఆ ఔషధాన్ని సేవించేలా చేస్తాడు హనీ. దాంతో విశ్వాన్ని జయించాలన్న తన ఆశయం నెరవేరక పోయేసరికి హనీ మీద పగ పడతాడు సమూరా ..కుజుడి మీద మానవులకి, అరుణ భూముల పాలకులకి, మధ్య సంధి కుదిర్చి అరుణ భూములకు తన స్నేహితుడు మీరోస్స్ ని ప్రభువుగా చేస్తాడు హనీ..కుజ గ్రహం మీద మానవులు హనీ ని సత్కరిస్తారు. కాని చివరికి వాళ్ళు కూడా హనీని అనుమానించి వెంటాడతారు. గురుడి ఉపగ్రహం గ్వానిమోడ్ నుంచి వచ్చిన ఎనిమోయిడ్ (Yenimoid) ని మానవ సైనిక అధికారి జనరల్ గ్యని అశ్వశాల నుంచి రక్షించే క్రమం లో మానవులకి శత్రువు అవుతాడు …ఎలాగోలా తప్పించుకొని భూమి చేరుతాడు. తిరిగి వచ్చాక ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం లో అధ్యాపకుడి గా తన ఉద్యోగంలో కొనసాగుతుంటారు. అయినా గ్రహాంతర దుష్ట మాంత్రికులు వెంటాడుతుంటారు…వీరే కాకుండా ఎర్త్ కౌన్సెల్ వాళ్ళు కూడా హనీ ఆమ్రపాలి కి అడ్డు తగులుతూనే ఉంటుంది. భూమి మీద విశ్వశక్తి ని ప్రయోగించడం నిషేధించిన కారణం గా ఎర్త్ కౌన్సెల్ ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది.

“కుజుడి కోసం” నవలకిది అద్భుతమైన కొనసాగింపు. ఈసారి కధా స్థలం భూమి…మొదటి భాగం అంతా టూకీగా ఎందుకు వివరించాల్సి వచ్చింది అంటే…సీక్వెల్ సినిమా అయితే మొదటి భాగం చివరి నుంచి మొదలు పెడతారు. మరి నవల సీక్వెల్ కి అయితే ముందు బాగం లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి కదా…ఇక రెండో భాగం అంతా కూడా ఆసక్తికరం గా ఉంటుంది …ఇక ఈ కొనసాగింపు నవల కూడా ఎక్కడ బిగిసడలకుండా చదివించారు.

ఇక రెండో భాగం లో హనీ ఆమ్రపాలి భూభాగంలో తను చనిపోతున్నాడు అనే కలతోనే మొదలు అవుతుంది. కుజుడి నుంచి (భూగ్రహం దుష్ట మాంత్రికులు “టెలిపతి” ద్వారా హాని ని లోబర్చుకుంటారు) ఒలంపస్ పర్వతం పై ఉన్న అమృతాన్ని తెచ్చి సమూరా కి ఇచ్చేస్తాడు. తను కోల్పోయిన శక్తులను తిరిగి తీసుకు వచ్చే “వెండి క్రొవ్వొత్తి” కోసం గ్రహాంతర మాంత్రికులు వెతుకుతుంటారు. ఇటు హాని తన తల్లి తండ్రులను చంపిన గ్రహాంతర మాంత్రికులు కోసం వెతుకుతుంటాడు. అతనికి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, తన తల్లి తండ్రులను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? …విశ్వశక్తి ని ఉపయోగించి మానవులకు మంచి చేస్తున్న తన తల్లి తండ్రులను చంపవలసిన అవసరం మాంత్రికులకు ఏముంది?.ఇత్యాది ప్రశ్నలను తెలుసుకోవడానికి యత్నిస్తాడు. ఈ విషయాలన్నీధరణి మామయ్య సహాయంతో తెలుసుకుంటాడు. గ్రహాంతర వాసుల కు అద్భుత శక్తులను ఇవ్వగల వెండి క్రొవ్వొత్తిని హాని, ఆమ్రపాలి గ్రామం లో భైరవ దేవాలయంలో దాగుంది అని తెలుసుకుంటాడు దానికి ఆమ్రపాలి నే సరి అయిన వ్యక్తి గా మాంత్రికులు ఎంచుకుంటారు. ఎందుకంటే నిస్వార్ధం గా, నిర్మలం గా మంచివారికి మాత్రమే ఆ శక్తులు ఉన్న వెండి క్రొవ్వొత్తి కనిపిస్తుంది. అతను మాత్రమే దాన్ని సొంతం చేసుకోగలడు. తన యాంత్రిక స్నేహితుడు అయిన “యురేకస్” మరియు ఆమ్రపాలి గ్రామ పెద్ద కూతురు అయిన ప్రకృతి తో కలిసి గ్రహాంతర వాసులని మట్టు పెట్టడం చివరికి జరుగుతుంది. ఎర్త్ కౌన్సెల్ వారు, నావికా దళం వారు హాని ఆమ్రపాలి కి సహకరిస్తారు. ఇంకా ఆమ్రపాలి ప్రయత్నాలకు విశ్వ శక్తి ఎలా తోడ్పడింది, అనుభవజ్ఞుల మాంత్రిక సంఘం ఏర్పరిచిన నియమ నిబంధనలు, వారిచే గుర్తించబడిన మాంత్రికుల ర్యాంకు వంటి వాటిని ఎన్నో చూడొచ్చు.

నవలలో చాల ఆశ్చర్య కరమైన అంశాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. నాల్గవ సహస్రాబ్దిలో విడివిడిగా ఉన్న దేశాలన్నీ “ప్రపంచ దేశాలు” గా మారిపోతాయి. 2050 లో 4 వ ప్రపంచ యుద్ధం లో చిన్న దేశాలన్నీ నాశనం చెయ్యడం, ప్రపంచ దేశాలన్నీ కలిపి “ఎర్త్ కౌన్సిల్” ఏర్పడటం లాంటివి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచిక అని చెప్పవచ్చు. అలాగే విశ్వశక్తి సహాయం తో భైరవ ఆలయంలో (ఆమ్రపాలి గ్రామం) లో నాగబంధాన్ని చేధించిన విధానం. ఆ తరువాత అంతరిక్షం లో వెళ్ళే స్పేస్ ఎలివేటర్ ని చేరుకోవడం, దానికి ఎర్త్ కౌన్సిల్ మరియు నావికా దళం అత్యాధునిక టెక్నాలజీ తో వారికి సహకరించడం ఇవన్నీ చాల గొప్పగా వింత గొలిపేలా అనిపిస్తాయి.

ఈ నీలి-ఆకుపచ్చ నవలని చదువుతుంటే “టైం మెషీన్” సినిమా చూసినట్టు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇన్ని మాటలకంటే మీరు అందరు “నీలి-ఆకుపచ్” సైన్స్ ఫిక్షన్ నవలని చదివి అందమైన ఉహాలోకంలో విహరించండి. మంచి నవలని అందించిన చిత్తర్వు మధు గారికి అభినందనలు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *