April 28, 2024

కుంభేశ్వరుని కోవెల కుంభకోణం

రచన: నాగలక్ష్మి కర్రా

శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం, ఉపవాసాలు చెయ్యడం, శివుని భజిస్తూ, స్తుతిస్తూ రాత్రంతా జాగరణ హిందువులకు ఆనవాయితీ.

పంచభూత లింగాల గురించి విన్నాం, మంచులింగం గురించి విన్నాం, జ్యోతిర్లింగాల గురించి విన్నాం, స్వయంభూలింగాల గురించి విన్నాం కానీ శివుడు స్వయంగా ఇసుకను అమృతంతో కలిపి చేసిన శివలింగం గురించి విన్నారా? లేదా? అయితే నేను వివరిస్తాను వినండి.

kumbhakoanam pic-3

తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో తంజావూరుకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం అనే పట్టణంవుంది. ఈ వూరిలో లెక్కకు మించిన కోవెలలు వున్నాయి. అందులో ఊరికి మధ్యలో ఇలా అనే బదులు ఈ కోవెల చుట్టూ పట్టణం పెరిగింది అంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కోవెల కలియుగం మొదలయినప్పుడు వెలిసింది కాబట్టి. శైవుల పరమ పవిత్రమైన 275 పాదాల యాత్రాస్థలాలలో ఒకటిగా గుర్తింపబడింది.

సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రతీ యుగాంతానికి ముందు అన్ని జీవుల బీజములు కుండలో భద్రపరిచి ప్రళయానంతరం కుండలోని బీజములతో సృష్టి మొదలుపెట్టేవాడుట. కలియుగ ప్రవేశానంతరం కూడా అలాగే సృష్టి చేస్తూ వుండగా శివుడు ఆ కుండను తన బాణముతో బ్రద్దలకొట్టెనట. ఆ కుండ ముక్కలుపడ్డ ప్రదేశాలలో కాలాతరాన శివుడు, విష్ణువు స్వయభువులుగా వెలిసేరని పురాణ కధనం.

kumbhakoanam pic-4

ద్వాపరంలో ప్రళయానికి ముందు కుంభేశ్వరుని లింగం వున్న చోట కుండను బ్రహ్మ భద్రపరిచేడుట. ఆ కుండ వున్నచోటే ఈశ్వరుని కొలవైవుండి భక్తులను అనుగ్రహించవలసిందిగా బ్రహ్మ కోరగా శివుడు అందుకు అంగీకరించి కావేరి నది నుండి ఇసుకను తెచ్చి అమృతముతో కలిపి లింగము చేసి ప్రతిష్టించెనట. ఈ లింగము ఇసుకతో చేయబడినది కాబట్టి ఈ లింగానికి అభిషేకం చేయరు.

కుంభేశ్వరుని కోవెల కుంభకోణం రేలు స్టేషనుకి సుమారు ఒక కిలోమీటరు దూరం, బస్సు స్టాండుకి అరకిలోమీటరు దూరంలోనూ వుంది. ఈ కోవెల సుమారు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివుంది. కుంభకోణంలో వున్న ప్రతీ కోవెల చాలా పెద్దవి.

కోవెల మొత్తం తిరిగి చూసేసరికి కాళ్ళ నొప్పులు తప్పవు. అలా అని చూడడం మానలేము, శిల్ప సంపద అంతగొప్పగా వుంటుంది. ఈ కోవెలకి అర ఫర్లాంగు దూరంలో మరో నాలుగు కోవెలలు వుండడం మరో విశేషం. అన్నే పెద్ద కోవెలలే.

Kumbakonam-1

కుంభేశ్వరుని కోవెల చుట్టూ పెద్ద రాతి ప్రహరీ గోడ, నాలుగు వైపులా నాలిపిస్తాయి. వాటిని దాటుకొని వెళ్ళి ఉగు పెద్ద గోపుర ద్వారాలను కలుగు వుంటుంది. వీటిలో తూర్పున వున్న గోపురం 11 అంతస్తులను కలిగి 39 మీటర్ల ఎత్తు వుండగా మిగితవి 9 అంతస్తులు వుంటాయి, మందిరాన్ని ఏడవ శతాబ్దం లో చోళ రాజులు నిర్మించగా 15 వ శతాబ్దంలోనాయక రాజులచే పునరుద్ధరింపబడించి. ముఖమండపం దాటి లోపలికి వెళితే రాతి స్థంబాల మంటపంలో వివిధ దేవతా మూర్తులకు చెందిన వెండి వాహనాలు కనువిందు చేస్తాయి. ఆయా పర్వదినాలలో దేవతా మూర్తులను ఊరేగించడానికి వాటిని ఉపయోగిస్తారు. మరో ప్రక్క ఏనుగుశాలలు, గోశాలలు కనిపిస్తాయి. వాటిని దాటుకొని వెళ్ళి ద్వజస్థంభం ప్రక్కనుంచి 16 స్థంభాల సభామంటపం చేరుతాం, దీనిని విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఒకే రాతి మీద చెక్కిన ఇరవైయేడు నక్షత్రాల్, పన్నెండురాశులు. దీని వెనుకవున్న మంటపాన్ని నవరాత్రి మంటపం అంటారు. ఇందులో నవరాత్రులలో బొమ్మలకొలువు పెడతారు. ఆ తొమ్మిది రోజులూ అమ్మవారికి జరిపే అన్ని సేవలూ ఆ మంటపం లో చేస్తారు. బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతూ పూజ చేసి హారతి, ఉయ్యాలసేవ, పవళింపుసేవలు సామవేదం ప్రకారం జరుపుతారు. ఆ మంత్రోచ్చారణ, శ్రావ్యత వింటూ, సేవలను చూస్తూ వుంటే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతుంది. గత సంవత్సరంలో దసరా నవరాత్రులకు అక్కడవుండి ఆ ఆనందాన్ని అనుభవించేము. ఇక్కడవున్న ఆరు తలల కుమారస్వామి, రాతినాగస్వరం, కిరాటమూర్తులను చూసుకొని మధ్యమండపానికి చేరుకొని కుంభేశ్వరుని దర్శించుకుంటాం. ఎదురుగా ఎడమవైపున “మంత్రపీఠేశ్వరి మంగళాంబిక” గా విరాజిల్లుతున్న పారవ్తీ దేవిని దర్శించుకుంటాము. ఇక్కడ అమ్మ వారి శక్తిపీఠమని, పరతంత్ర, పరతంత్ర భెదిని యని “అప్పార్” స్తుతించాడు. కుడివైపునవున్న “సోమస్కందు” ని దర్శించుకొని బయట ప్రాకారంలో వున్న నళ్వారులు, 63 నయన్మారులు ( వీరు పరమ శివభక్తులుగా పేరు పొందిన వారు). తమిళనాడు ప్రసిద్ద శైవమందిరాలలో వీరి విగ్రహాలు ఉండడం సాధారణం గా చూస్తూ వుంటాం. వీరిని దర్శించుకున్న తరువాత వీరభద్రుడు, సప్తకన్యలు, విశాలాక్షి, విశ్వనాధుడు, వినాయకుడు, కార్తికేయుడు, అన్నపూర్ణా, గజలక్ష్మి, సరస్వతి, జేష్ఠదేవి, దుర్గా, సంధికేశుడు, కురుతీర్ధ, అరుకాల వినాయకుడు, నంది బలిపీఠం, సభా వినాయకుడు, విశ్వనాధుడు, నటరాజు విగ్రహా వుంటాయి. ఇవి కాక జ్వరహరేశ్వరుడు, నవనీతరావు, వినాయకుడు, చంద్రుడు, సూర్యుడు, వల్లభ గణపతి మొదలయిన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. కుంభేశ్వరుని కోవెలకు సంబంధించి ఏడు పవిత్రమైన స్నానఘట్టాలను పేర్కొంటారు అవి మహామహోఅం తటాకం, పోతునారు తీర్ధం,వరుణ తీర్ధం, కశ్యపతీర్ధం, చక్రతీర్ధం, మాతంగతీర్ధం, భగవతీర్ధం, కుంభేశ్వరుని కోవెల ప్రకారంలో మంగశకూపం, అశ్వనాగతీర్ధం, కురుతీర్ధం అన్ర మూడు మూతులు, చంద్రతీర్ధం, సూర్య తీర్ధం, గౌతమ తీర్ధం, వరాహ్త్ర్ర్ర్ధ, అనే నాలుగు పుష్కరిణులు వున్నాయి. కుంభేశరును పూజించుకుంటే అకాలమృత్యదోషాలు తిలగుతాయని భక్తుల నమ్మకం.

కుంభేశ్వరుని కోవెలకు సంబంధించి ఏడు పవిత్రమైన స్నానఘట్టాలను పేర్కొంటారు అవి మహామహోఅం తటాకం, పోతునారు తీర్ధం,వరుణ తీర్ధం, కశ్యపతీర్ధం, చక్రతీర్ధం, మాతంగతీర్ధం, భగవతీర్ధం, కుంభేశ్వరుని కోవెల ప్రకారంలో మంగశకూపం, అశ్వనాగతీర్ధం, కురుతీర్ధం అన్ర మూడు మూతులు, చంద్రతీర్ధం, సూర్య తీర్ధం, గౌతమ తీర్ధం, వరాహ్త్ర్ర్ర్ధ, అనే నాలుగు పుష్కరిణులు వున్నాయి. కుంభేశరును పూజించుకుంటే అకాలమృత్యదోషాలు తిలగుతాయని భక్తుల నమ్మకం.

 

Kumbakonam-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *