April 28, 2024

సమరుచుల ఉగాది పెన్నిధి….

 రచన: డా. శ్రీసత్య గౌతమి

SONY DSC
SONY DSC

మరి సమభావాల సంఘీభావం మనిషికి ఏది?    

 

వేపపూత నయగారాలు మీనాక్షి పద్మహస్తాలు

మావిడాకు చిగురులు శ్రీహరుని నేత్రాలు

ఆ రెంట దాగుడు మూతలు మన జీవితాన

వెలుగు నీడలు తీపి చేదులు

.

ఆ విధాతల ఆనంద కేళీ విలాసం

చైత్రమాల చక్కెరకేళీ తీపి గురుతుల అంకురం

ఆపై ఉప్పు పులుపు వగరులు వెరసి షడ్రచుల రస ఉగాది సేవనం

గ్రీష్మ కాంచన సుప్రభం వసంత ప్రభావిత కిరణం

నూతనోత్సాహాల హేమంతవర్ణం ఉగాది ఆరంభం

.

మనిషికి ఇట్టి ప్రకృతి లిఖించిన సమరుచుల ఉగాది పెన్నిధి

మరి సమభావాల సంఘీభావం మనిషికి ఏది?

ఒక్కసారి ప్రకృతే చైత్రం తో సంఘీభావం కోల్పోతే చైత్రానికి ఆరంభమేది?

చైత్రం రానిదే కోకిలకు కుహు కుహు స్వరాలేవీ?

మానుష జీవిత ఉగాదికి నూతనోత్సాహ సౌరభాలేవీ?

.

కాలాతీతం గా కాలాయాపన చేసే సౌలభ్యం ప్రకృతికే విధించని ఆ విధాతలు

అసంఘీభావ జాలం పెల్లుబికి కసి తీరని వారూ… వంచితులూ

తీయని మాటలతో నైరాశ్యపు చీకటి ముసుగేసి

భయపడి తూలే బలహీనుల గొంతు నులిమేస్తుంటే

విధించరా మరి … అరిషడ్వర్గపు ద్వారాల వ్రేలాడు మొండెం లేని మొండు తలల తలవ్రాతలు!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *