గడిలోదాగిన వైజ్ఞానిక నుడి -1

కూర్పు: డా.(శ్రీమతి)చాగంటి కృష్ణకుమారి

 

ఆధారాలు:
అడ్దం:
1.క్షారలోహాల ( alkali metals) కుటుంబానికి చెందిన దీనిని ఫొటొ సెల్ ల తయారీలోను , ( component of photocells) వాక్యూమ్ పంపులలో ఆక్సిజన్ ని తొలగించడానికి, ప్రత్యేక మైన రకానికి చెందిన గాజు తయారీలో ఉపయోగపడుతొంది. దీని పేరును గఢమైన ఎరుపు అనే అర్ధమున్నలాటిన్ పదంనుండి గ్రహించారు . ( 5)
4.గడ్డి జాతికి చెందిన దీని శాస్త్రీయనామం Bambusoideae( వెనకనుండిముందుకి (3)
6.చేపలు పట్టడానికి వాడుతారు(2)
7.అంగీకారం(3)
8. కంది పొడిలో వున్నదానిని బంగారపు ఉంగరంలో పొదిగారు(2)
11. దాదాపుగా రంగు రుచిలేని, నీటిలో కరిగే ఒక ప్రోటీన్. కొల్లాజెన్( collagen)నుండి తయారవుతుంది.(4)
12.ఈ f-బ్లాకు మూలకానికి ఎనిరికో ఫెర్మి శాస్త్రజ్ఞుని పేరు ని పెట్టారు(4)
14.పస(2)
15.స్త్రీ (3)
16. అవకాశమ(2)
19.పొటాసియమ్ అల్యూమినియమ్ సల్ఫేట్ ని పొటాష్ – – -అంటారు ( వెనకనుండి ముందుకి (3)
20.ఈ లాంథనైడ్ మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసం [Xe] 4f66s2 ( వెనకనుండి ముందుకి (5)
నిలువు:
1. చిన్ని చిన్ని మామిడి పిందల రుచి (కిందనుండి పైకి (3)
2.ఒకేరకం బొమ్మలు రెండు వుంటే వాటిని ‌- – బొమ్మలంటాం.ఉదాహరణకి రెండు ఎద్దులుంటే జోడెద్దులంటాం. (కిందనుండి పైకి (2)
3.మగ శిశువు కలగడానికి కీలకమైనది y– (కిందనుండి పైకి (4)
4. ఎంచు(కిందనుండి పైకి(2)
5.V అక్షరంతో మొదలయ్యే పేరు గల ఏకైక మూలకం d-బ్లాకు లో వుంది.(5)
9. పొటాష్ ఆలం ని తెలుగులో — అంటారు (3)
10. స్నేహముతో (3)
11.ఈ లోహం వున్న జాతిరత్నాలను పూర్వీకులు ‘ జిర్కాన్’ (zircon) అనేవారు.
13. Nicholas Louis Vauquelin కనుగొన్నాడు.గ్రీకులో క్రోమా అంటే రంగు, దీనిపేరు క్రోమా పదంనుండి పుట్టింది. (4)
17.ఒట్టు(కిందనుండి పైకి(2)
18.ఉచ్చు (2)
20. హిందీ వారు బాజ్రా అని ఇంగ్లీషు వారు pearl millet అనీ అంటారు, శాస్త్రీయనామం Pennisetum glaucum(3)
***

Leave a Comment