March 19, 2024

తొలకరి జల్లు

రచన: ప్రకాశ లక్ష్మి

రోహిణీ కార్తె ఎండ ప్రతాపానికి,
దప్పికతో కడబట్టి అర్రులు చాచి,
అల్లాడి, నెఱ్ఱెలిచ్చిన ధరణి ఎదురుచూసె,
తొలకరి చినుకు రాకకొరకు వేయికనులతో।

నీటి చెలమలు, చెఱువులు, బావులు,
నీరు అడుగంటి, ఆకాశం వంక ఆత్రంగా చూసె,
వాటిలోని జలచరాలు ఆశగా ఎదురు చూసె,
తొలకరి చినుకు ఎన్నడు విందు చేయునా అని।

కొండాకోనా తమ మేనిని మలయమారుత,
సుగంధ సువాసన భరితమైన,
లేత చిగురాకుల సోయగాల హొయల కొరకు,
తొలకరి చినుకుకు ఆహ్వానం పంపె।

బక్కచిక్కిన రైతన్న సూర్య ప్రతాపానికి,
అరచెయ్యి అడ్డుపెట్టి , ఆకాశం వంక,
ఆశగా చూసి,అదునులో చినుకు పడి,
ఆదరంగా ఆదుకోమని తొలకరి చినుకును వేడుకొని,

వచ్చె వచ్చె వాన వరాలవాన,
నేలతల్లి పులకించె, ముత్యపు చిప్ప మురిసె,
వానకోయిల తడిసి నేలంతా,
ఆరుద్ర పురుగుల కుంకుమ రంగుతో మురిసె।

సమస్త మానవాళికి ఆనందమాయ!।

1 thought on “తొలకరి జల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *