May 2, 2024

తప్పదు!

రచన: మంగు కృష్ణకుమారి

శ్రీహర్ష మదాలస మాటలు ఆశ్చర్యపోయి వింటున్నాడు. అతని చేతిలో బంగారం వస్తువు పెట్టిన చిన్న డబ్బా ఉంది.
మదాలస మొహం మీద చిన్నగా నవ్వు తొణికిసలాడుతోంది. దీనికి పూర్వరంగం చాలా ఉంది.
మదాలస తండ్రి సుదర్శనంకి కూతురు అంటే అపరిమితం అయిన ముద్దు. పసితనం‌నించే, ఆ ముద్దు హద్దులు దాటి, ఆఖరికి “తల్లీ, నీకు ఏ గౌను వేయాలి?” అని అడగడం, మరి కొంచెం పెద్దయిన తరవాత బజారుకి ఎత్తుకొని వెళ్ళి, గౌనో, మిడీవో దానికి నచ్చినదే కొనడం దాకా వచ్చింది.
తల్లి కేదారేశ్వరి చూస్తూ ఊరుకోలేక, “నాయనా సుదూ, పిల్ల ఎంత ముద్దయినా సరే దానికి కొంచెం పెద్దవాళ్ళ అదుపూ భయం ఉండాలిరా… అందునా ఆడపిల్లకూడా…” తల్లి మాటలు పూర్తికాకుండానే సుదర్శనం ఓ కేకపెట్టేడు. “ఆ అదుపేదో నువ్వు ఉంచుకుందూ… ఏం నువ్వు నన్ను గారంగా చూడలేదూ, నేనేం పాడయిపోయేనా?” అని రిటార్ట్ ఇచ్చేడు.
కేదారేశ్వరి తనలో తను గొణుక్కుంది. “నేను గారం చేసినా, మీ నాన్న అంకుశంలా ఉండి, నిన్ను క్రమశిక్షణలో ఉంచేరు. ఇప్పుడు మరచిపోయేవులే”
కేదారేశ్వరికి తనేం చేయాలో తెలిసి వచ్చింది.
కోడలితో కూడా చెప్పింది “అమ్మాయ్… వేదా, మీ ఆయన చేస్తున్న గారాలకి మదాలస, రేప్పొద్దుట నీ మాట వింటుందో లేదో… ఓ కంట కనిపెట్టు.”
వేదవతికి కూడా అదే అనుమానం ఉందేమో అత్తగారి మాటలకి భళీ… అన్నట్టు మాటాడి తామిద్దరూ కలిసి మదాలసకి మంచీ చెడ్డా చెప్పాలని, అంతేకాకుండా, కాస్త పెద్దయిన తరవాత పనులు కూడా నేర్పించాలని నిర్ణయించేసింది.
ఇలా మదాలసకి పెద్దల ముద్దు గారాబాలు ఎంత దక్కేయో… అంత క్రమశిక్షణా అలవాటయింది.
శ్రీహర్ష బాల్య స్నేహితుడు మదాలసకి. మదాలసకన్నా ఏడాది చిన్నవాడు.
ఇద్దరి ఇళ్ళూ ఒకే సందులో ఉండడం, ఒకటే స్కూల్ లో చదువుకోడంతో వాళ్ళ స్నేహానికి ఎలాటి అడ్డూ రాలేదు. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు.
ఇద్దరూ కలిసి పార్క్ లో, ఎవరో ఒకరి ఇంటి పెరట్లో, తెగ ఆడేవారు. మదాలసకి ఎన్నో బజారు పనులన్నీ శ్రీహర్షే చేసేవాడు.
తమింట్లొ అరిసెలూ, జంతికలూ లాటివి ఏవిచేసినా హర్షకి పెట్టకుండా మదాలస ఏనాడూ తినేది కాదు. మదాలకి ఇష్టమని, శ్రీహర్ష జీళ్ళు కొనితెచ్చి ఇచ్చేవాడు.
చూస్తూ ఉండగానే హైస్కూల్ చదువు అయిపోయింది. కాలేజ్ చదువు కోసం శ్రీహర్ష విజయవాడ వెళిపోయేడు. మదాలస లోకల్ గా కాలేజ్ లో చేరింది. సెలవులకి కలుస్తూనే ఉన్నారిద్దరూ!
వీళ్ళిద్దరి స్నేహాన్ని కేదారేశ్వరి ఒక కంట కనిపెడుతూనే ఉంది. వేదవతి కాస్త భయపడి పిల్లని దెబ్బలాడదాం అనుకునేసరికి, కేదారేశ్వరే వారించింది‌. “ఇప్పుడేమయిందని? ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. మితిమీరనంతవరకూ, ఫరవాలేదు. ఇంతకీ దీనికి పెళ్ళి చేసేద్దాం అనుకున్నావు కదూ… ఆ మాట ఏమయింది?”
వేదవతి ఉత్సాహంగా ఆరోజే భర్తతో ఎన్ని మంచి సంబంధాలున్నాయో వర్ణించి చెప్పింది. సుదర్శనం మండిపడి, “తొందరేమిటి? నాతల్లిని వదిలి నేనుండలేను…” అని కేకలేసేడు.
కేదారేశ్వరి కొంచెం ఆలోచించి, “అమ్మాయ్ వేదా… అబ్బాయి చెప్పింది నిజమేలెద్దూ… ఈ రోజుల్లో మరీ ఇంత వేగం ఎవరూ పెళ్ళి చేయటం లేదు… ఆగుదాం” అని వారించింది.
మదాలస బిఎ చదువుతూ ఉన్నపుడే శ్రీహర్ష ఇంజనీరింగ్ లో జాయిన్ అయేడు. మదాలస బిఎ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, కేదారేశ్వరి పుట్టింటి వేపు బంధువుల పిల్లడు పెద్ద హోదాలో ఉన్నాడని, వాళ్ళకి మదాలసని కోడలిగా చేసుకోడం అంటే ఇష్టం చూపిస్తున్నారని వార్త తెలిసింది.
కేదారేశ్వరి, వేదవతితో కదిపింది‌.
ఈసారి వేదవతి భర్త దగ్గర గట్టిగా పట్టుపట్టింది. పిల్లడి వివరాలు విని సుదర్శనం కూడా కాస్త తగ్గేడు‌. తరవాత చకచకా అన్నీ జరిగేయి. పెళ్ళిచూపుల్లో, మదాలస పొందికగా మాటాడ్డం, ఆమె రూపం చూసి మగపెళ్ళివాళ్ళందరూ ఫిదా అయిపోయేరు. పెళ్ళి కుదిరిపోయింది.
మదాలస పెళ్ళి అని తెలిసి శ్రీహర్ష సంతోషంగా జూకాలు కొని తీసుకొచ్చి. ఆమెకి చూపించేడు. అతని ఉద్దేశం ఆ రోజునించే మదాలస ఆ జూకాలు ధరించాలని. చూస్తూనే అవి లాక్కుని, చెవులకి పెట్టుకొని వచ్చి తనకి చూపించి మురిసిపోతుందని.
మదాలస కూల్ గా “హర్షా! జూకాలు చాలా బాగున్నాయి. కానీ ఇది నా పెళ్ళిలో మీ అమ్మ చేతిమీద ఇప్పించు.” అన్నాది.
శ్రీహర్ష ఆశ్చర్యంగా, “అదేమిటి?” అన్నాడు.
“అంతే, హర్షా! మనం ఎంత స్నేహితులమయినా నా పెళ్ళి తరవాత ‘చిన్నప్పుడు ఆడిపాడేం కాబట్టి, ఇంకా అదే చనువుతొ అలాగే ఉంటాం’ అంటే బహుశా నేను వెళ్ళబోయే అత్తవారి ఇంట్లో కాబోయే భర్త మనసుకి నచ్చుతుందో లేదో తెలీదు. నేనూ వాళ్ళు అందరం ఒకళ్ళకి ఒకళ్ళం కొత్త వాళ్ళం. మొదట మా బంధం గట్టి పడాలి. ఒకళ్ళకి మరొకళ్ళం అర్థం అవాలి. ఆ తరువాత గానీ మన స్నేహం వాళ్ళకి సహజంగా, పవిత్రంగా అనిపించదు” మదాలస ఆగింది.
“ఏమిటీ? స్నేహంలో‌ పవిత్రతా, అపవిత్రతా ఉంటుందా! అదెలా?” అన్నాడు శ్రీహర్ష.
” స్నేహంలో పవిత్రతా, అపవిత్రతా ఉండదు హర్షా! కానీ ఆడా మగా అనేసరికి, అది కొత్తగా అప్పుడే చూస్తున్న వాళ్ళకి బోధపడడంలో ఉంటుంది. రేప్పొద్దుట మీ అమ్మా నాన్న ఎంచిన పిల్లని, నువ్వు పెళ్ళి చేసుకుంటే, ‘ఆమె బాల్య స్నేహితుడుని’ అంటూ, నీకు అంతవరకూ తెలీని పురుషుడు వస్తే, నీకూ చికాకు అనుమానం రాడం సహజం”
శ్రీహర్ష ఆశ్చర్యంలోంచి తేరుకున్నాడు. “నీలా నేను ఆలోచించలేక పోయాను మదాలసా” అన్నాడు.
“నిజానికి మనం కాస్త పెద్ద అయేసరికి నువ్వు చదువులకోసం దూరం వెళిపోడం వల్లగానీ లేకపొతే మనమీద మనవాళ్ళే ఎన్నో ఆంక్షలు పెట్టి ఉండేవారేమో” అంది మదాలస నవ్వుతూ!
“అయితే బై చెప్పీనా” అన్నాడు శ్రీహర్ష దిగాలుగా!
“అలా అనటం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవే అయినా, అప్పుడప్పుడు పలకరించుకో వచ్చులే. కొన్నేళ్ళు సంసారంలో సెటిల్ అయిపోతే మళ్ళా మన బాల్యస్నేహం రెండు కుటుంబాల స్నేహం అవుతుంది” నవ్వుతూ అంది మదాలస.
ఇదంతా మదాలసకి ఆమె నాయనమ్మ ఇచ్చిన సలహా. నాయనమ్మ వీరాభిమాని అయిన మదాలస… ఆమె సలహా అలా పాటించింది. ఈ విషయం ఎవరికీ ఎప్పటికీ చెప్పలేదు.
*********
శ్రీహర్ష మదాలస మాటలు ఆశ్చర్యపోయి వింటున్నాడు. అతని చేతిలో బంగారం వస్తువు పెట్టిన చిన్న డబ్బా ఉంది.
మదాలస మొహం మీద చిన్నగా నవ్వు తొణికిసలాడుతోంది. దీనికి పూర్వరంగం చాలా ఉంది.
మదాలస తండ్రి సుదర్శనంకి కూతురు అంటే అపరిమితం అయిన ముద్దు. పసితనం‌నించే, ఆ ముద్దు హద్దులు దాటి, ఆఖరికి
“తల్లీ, నీకు ఏ గౌను వేయాలి?…” అని అడగడం, మరి కొంచెం పెద్దయిన తరవాత బజారుకి ఎత్తుకొని వెళ్ళి, గౌనో, మిడీవో దానికి నచ్చినదే కొనడం దాకా వచ్చింది.
తల్లి కేదారేశ్వరి చూస్తూ ఊరుకోలేక,
“నాయనా సుదూ, పిల్ల ఎంత ముద్దయినా సరే దానికి కొంచెం పెద్దవాళ్ళ అదుపూ భయం ఉండాలిరా… అందునా ఆడపిల్లకూడా…” తల్లి మాటలు పూర్తికాకుండానే సుదర్శనం ఓ కేకపెట్టేడు. “ఆ అదుపేదో నువ్వు ఉంచుకుందూ… ఏం నువ్వు నన్ను గారంగా చూడలేదూ, నేనేం పాడయిపోయేనా?” అని రిటార్ట్ ఇచ్చేడు.
కేదారేశ్వరి తనలో తను గొణుక్కుంది. “నేను గారం చేసినా, మీ నాన్న అంకుశంలా ఉండి, నిన్ను క్రమశిక్షణలో ఉంచేరు. ఇప్పుడు మరచిపోయేవులే”
కేదారేశ్వరికి తనేం చేయాలో
తెలిసి వచ్చింది.
కోడలితో కూడా చెప్పింది “అమ్మాయ్… వేదా, మీ ఆయన చేస్తున్న గారాలకి మదాలస, రేప్పొద్దుట నీ మాట వింటుందో లేదో… ఓ కంట కనిపెట్టు.”
వేదవతికి కూడా అదే అనుమానం ఉందేమో అత్తగారి మాటలకి భళీ… అన్నట్టు మాటాడి తామిద్దరూ కలిసి మదాలసకి మంచీ చెడ్డా చెప్పాలని, అంతేకాకుండా, కాస్త పెద్దయిన తరవాత పనులు కూడా నేర్పించాలని నిర్ణయించేసింది.
ఇలా మదాలసకి పెద్దల ముద్దు గారాబాలు ఎంత దక్కేయో… అంత క్రమశిక్షణా అలవాటయింది.
శ్రీహర్ష బాల్య స్నేహితుడు మదాలసకి. మదాలసకన్నా ఏడాది చిన్నవాడు.
ఇద్దరి ఇళ్ళూ ఒకే సందులో ఉండడం, ఒకటే స్కూల్ లో చదువుకోడంతో వాళ్ళ స్నేహానికి ఎలాటి అడ్డూ రాలేదు. ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు.
ఇద్దరూ కలిసి పార్క్ లొ, ఎవరో ఒకరి ఇంటి పెరట్లో, తెగ ఆడేవారు. మదాలసకి ఎన్నో బజారు పనులన్నీ శ్రీహర్షే చేసేవాడు.
తమింట్లొ అరిసెలూ, జంతికలూ లాటివి ఏవిచేసినా హర్షకి పెట్టకుండా మదాలస ఏనాడూ తినేది కాదు. మదాలకి ఇష్టమని, శ్రీహర్ష జీళ్ళు కొనితెచ్చి ఇచ్చేవాడు.
చూస్తూ ఉండగానే హైస్కూల్ చదువు అయిపోయింది. కాలేజ్ చదువు కోసం శ్రీహర్ష విజయవాడ వెళిపోయేడు. మదాలస లోకల్ గా కాలేజ్ లో చేరింది. సెలవులకి కలుస్తూనే ఉన్నారిద్దరూ!
వీళ్ళిద్దరి స్నేహాన్ని కేదారేశ్వరి ఒక కంట కనిపెడుతూనే ఉంది. వేదవతి కాస్త భయపడి పిల్లని దెబ్బలాడదాం అనుకునేసరికి, కేదారేశ్వరే వారించింది‌. “ఇప్పుడేమయిందని. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. మితిమీరనంతవరకూ, ఫరవాలేదు. ఇంతకీ దీనికి పెళ్ళి చేసేద్దాం అనుకున్నావు కదూ… ఆ మాట ఏమయింది?”
వేదవతి ఉత్సాహంగా ఆరోజే భర్తతో ఎన్ని మంచి సంబంధాలున్నాయో వర్ణించి చెప్పింది. సుదర్శనం మండిపడి, ‘తొందరేమిటి? నాతల్లిని వదిలి నేనుండలేను…’ అని కేకలేసేడు.
కేదారేశ్వరి కొంచెం ఆలోచించి, “అమ్మాయ్ వేదా… అబ్బాయి చెప్పింది నిజమేలెద్దూ… ఈ రోజుల్లో మరీ ఇంత వేగం ఎవరూ పెళ్ళి చేయటం లేదు… ఆగుదాం” అని వారించింది.
మదాలస బిఎ చదువుతూ ఉన్నపుడే శ్రీహర్ష ఇంజనీరింగ్ లో జాయిన్ అయేడు. మదాలస బిఎ
లాస్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు, కేదారేశ్వరి పుట్టింటి వేపు బంధువుల పిల్లడు పెద్ద హోదాలో ఉన్నాడని, వాళ్ళకి మదాలసని కోడలిగా చేసుకోడం అంటే ఇష్టం చూపిస్తున్నారని వార్త తెలిసింది.
కేదారేశ్వరి, వేదవతితో కదిపింది‌.
ఈసారి వేదవతి భర్త దగ్గర గట్టిగా పట్టుపట్టింది. పిల్లడి వివరాలు విని సుదర్శనం కూడా కాస్త తగ్గేడు‌. తరవాత చకచకా అన్నీ జరిగేయి. పెళ్ళి చూపుల్లో, మదాలస పొందికగా మాటాడ్డం, ఆమె రూపం చూసి మగపెళ్ళివాళ్ళందరూ ఫిదా అయిపోయేరు. పెళ్ళి కుదిరిపోయింది.
మదాలస పెళ్ళి అని తెలిసి శ్రీహర్ష సంతోషంగా జూకాలు కొని తీసుకొచ్చి. ఆమెకి చూపించేడు. అతని ఉద్దేశం ఆ రోజునించే మదాలస ఆ జూకాలు ధరించాలని. చూస్తూనే అవి లాక్కుని, చెవులకి పెట్టుకొని వచ్చి తనకి చూపించి మురిసిపోతుందని.
మదాలస కూల్ గా “హర్షా! జూకాలు
చాలా బాగున్నాయి. కానీ ఇది నా
పెళ్ళిలో మీ అమ్మ చేతిమీద
ఇప్పించు.” అన్నాది.
శ్రీహర్ష ఆశ్చర్యంగా
“అదేమిటి?…” అన్నాడు.
“అంతే, హర్షా! మనం ఎంత స్నేహితులమయినా నా పెళ్ళి తరవాత ‘చిన్నప్పుడు ఆడిపాడేం కాబట్టి, ఇంకా అదే చనువుతొ అలాగే ఉంటాం’ అంటే బహుశా నేను వెళ్ళబోయే అత్తవారి ఇంట్లో కాబోయే భర్త మనసుకి నచ్చుతుందో లేదో తెలీదు. నేనూ వాళ్ళు అందరం ఒకళ్ళకి ఒకళ్ళం కొత్త వాళ్ళం. మొదట మా బంధం గట్టి పడాలి. ఒకళ్ళకి మరొకళ్ళం అర్థం అవాలి. ఆ తరువాత గానీ మన స్నేహం వాళ్ళకి సహజంగా, పవిత్రంగా అనిపించదు” మదాలస ఆగింది.
“ఏమిటీ? స్నేహంలో‌ పవిత్రతా, అపవిత్రతా ఉంటుందా! అదెలా…?”
అన్నాడు శ్రీహర్ష.
” స్నేహంలో పవిత్రతా, అపవిత్రతా ఉండదు హర్షా! కానీ ఆడా మగా అనేసరికి, అది కొత్తగా అప్పుడే చూస్తున్న వాళ్ళకి బోధపడడంలో ఉంటుంది. రేప్పొద్దుట మీ అమ్మా నాన్న ఎంచిన పిల్లని, నువ్వు పెళ్ళి చేసుకుంటే, ‘ఆమె బాల్య స్నేహితుడుని’ అంటూ, నీకు అంతవరకూ తెలీని పురుషుడు వస్తే, నీకూ చికాకు అనుమానం రాడం సహజం”
శ్రీహర్ణ ఆశ్చర్యంలోంచి తేరుకున్నాడు. “నీలా నేను ఆలోచించ లేకపోయాను మదాలసా” అన్నాడు.
“నిజానికి మనం కాస్త పెద్ద అయేసరికి నువ్వు చదువులకోసం దూరం వెళిపోడం వల్లగానీ లేకపొతే
మన మీద మనవాళ్ళే ఎన్నో ఆంక్షలు పెట్టి ఉండేవారేమో” అంది మదాలస నవ్వుతూ!
“అయితే బై చెప్పీనా” అన్నాడు శ్రీహర్ష దిగాలుగా!
“అలా అనటం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవే అయినా, అప్పుడప్పుడు పలకరించుకో వచ్చులే. కొన్నేళ్ళు సంసారంలో సెటిల్ అయిపోతే మళ్ళా మన బాల్యస్నేహం రెండు కుటుంబాల స్నేహం అవుతుంది” నవ్వుతూ అంది మదాలస.
ఇదంతా మదాలసకి ఆమె నాయనమ్మ ఇచ్చిన సలహా. నాయనమ్మ వీరాభిమాని అయిన మదాలస… ఆమె సలహా అలా పాటించింది. ఈ విషయం ఎవరికీ ఎప్పటికీ చెప్పలేదు.

*****

1 thought on “తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *