April 27, 2024

నలదమయంతి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . మహాభారతములో ధర్మరాజు ,సోదరులు అరణ్యవాసములో అనేక కష్టాలు పడి ఒకసారి వృహదశ్వ అనే ఋషి పుంగవుడిని కలిసి అరణ్యవాసములో వారు అనుభ విస్తున్న కష్టాలను మహర్షికి వివరిస్తాడు ఆ మహర్షి వారి బాధలను తొలగించటానికి అంతకన్నా ఎక్కవ కష్టాలు పడ్డ నల -దమయంతుల కధ వివరిస్తాడు ఎందుకంటే ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోవటం నలుడు రాజ్యాన్ని కోల్పోవటం జూదము ఆడటంవల్లే. ముందు నలుడి గురించి తెలుసుకుందాము. అందగాడు పరాక్రమవంతుడు అయినా నలుడు […]

తేనెలొలుకు తెలుగు – పత్రికలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు మాలిక పత్రిక నిర్వాహకురాలు జ్యోతి వలబోజుగారి ప్రోత్సాహ ప్రోద్బలాలతో గత రెండు సంవత్సరాలుగా తేనెలొలుకు తెలుగు పేరిట వ్యాసాలు రాస్తూ వచ్చాను. పత్రిక నిర్వహణ సంపాదకుల అభిరుచి మేరకు అలరారుతుంది. ఈ విషయంలో జ్యోతి వలబోజుగారిని అభినందించాలి. వారు పరిచయమైనప్పటి నుండి గమనిస్తున్నా ఒకటి ఆమె వ్యక్తిత్వం, రెండు ఆమె పనితీరు రెంటికి రెండు ఆదర్శప్రాయాలే. ముక్కుసూటితనం ఆమె విలక్షణత. చేపట్టిన పనిని సాకల్యంగా అవగాహన చేసుకుని, దానికై శ్రమించి పరిపూర్ణత సాధించటం […]

చైతన్య స్రవంతి (Stream of consciousness)-జేమ్స్ జోయిస్-యులిసెస్

  ​రచన: శారదాప్రసాద్ అంతరంగాన్ని మధిస్తే అద్భుతమైన కావ్యాలు పుట్టుకు వస్తాయి. మనం ఒక గంటసేపు ఆలోచించిన సంఘటలన్నిటినీ, వ్రాస్తే, కొన్ని​వందల పుటల గ్రంధమౌతుంది. 20 వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నూతన సాహిత్య ప్రక్రియకు ఆద్యుడైనవాడు జేమ్స్ జోయిస్. ఆ ప్రక్రియే​ ​stream of consciousness. ఈ​ ​ప్రక్రియలో ఆయన స్పూర్తితో తెలుగులో కూడా చక్కని నవలలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి గోపీచంద్ గారి అసమర్ధుని జీవయాత్ర, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, వినుకొండ నాగరాజు […]

ఏం చేయలేము మనం

రచన: రాజేశ్వరి…. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతకంటే ఏం చేయలేము మనం, ఫేస్బుక్ లో ఓ నల్ల చిత్రం, పోస్టులో నాలుగు వరసల నల్ల సాహిత్యం, అంతే, అంతకంటే ఏం చేయలేము మనం, అయ్యో అని ఒక నిట్టూర్పు, ఆగ్గితపు చర్చలు చూస్తూ రిమోట్ విసిరేయడం, అంతే, అంతకంటే ఏం చేయలేము మనం ప్రాణత్యాగానికి విలువ కట్టలేం ప్రాణాన్ని కాపాడలేం, అంతే మనం, ఏం చేయలేము, అసువులు బాసిన అమరజీవుల, అనాధకుటుంబాలకు అపన్నహస్తం అందించి, వారి త్యాగాలకు […]

ఓ మగవాడా….!!!

రచన: పారనంది శాంతకుమారి ఓ మగవాడా…..ప్రేమకు పగవాడా! అమ్మ ప్రేమతో,నాన్న జాలితో వీచే గాలితో,పూచే పూలతో అందాలతో,అనుబంధాలతో ఆత్మీయతలతో,అమాయకత్వంతో ఆడుకుంటావు ఆస్తులతో,దోస్తులతో అబద్ధాలతో,నిబద్ధాలతో అంతరాత్మతో,పరమాత్మతో అందరితో ఆడుకుంటావు. అవకాశాలను వాడుకుంటావు, అవసరమొస్తే వేడుకుంటావు అది తీరాక ప్రాణాలనైనా తోడుకుంటావు నీతిలేని రీతినీది,పాపభీతి లేని జాతి నీది సిగ్గు లేని శాసనం నీది,స్థిరంలేని ఆసనం నీది వగపెరుగని వ్యసనం నీది,వలపెరుగని హృదయం నీది. ఎక్కివచ్చిన మెట్లను ఎగతాళి చేసే ఎడద నీది, మెక్కివచ్చిన తిండిని ఎగాదిగాచూసే బెడద నీది, […]

మాలిక పత్రిక డిసెంబర్ 2019 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు ఈ సంవత్సరాంతపు సంచికకు తియ్యతియ్యగా స్వాగతం. నా అమెరికా పర్యటన కారణంగా నవంబర్ నెల సంచిక విడుదల చేయడం కుదరలేదు. దానికి క్షమాపణలు కోరుకుంటూ ఈ నెలలో కాసిన్ని ఎక్కువ సాహితీ మిఠాయిలు మీకోసం.. అప్పుడే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా మళ్లీ సంవత్సరం చివరకి వచ్చేసామా అన్నట్టుంది కదా. ఏంటో ఈ కాలానికి ఇంత తొందరపాటు .. అలా వేగంగా […]

‘ధ్యానం’ అంటే ఏమిటి?

రచన: శారదా ప్రసాద్ ఈ మధ్య కొంతమంది మిత్రులు ‘నేను ఫలానా విధంగా ద్యానం చేస్తున్నాను, అది మంచిదేనా అనో లేకపోతే అటువంటి ధ్యానాన్ని ఏమంటారని ‘ఇలాగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ‘ధ్యానం’ అంటే ఏమిటో తెలుసు కోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ మధ్య, చాలా ఊళ్ళల్లో, పెద్ద పెద్ద బానర్లు కట్టి, ‘ మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ వ్యాపారాభివృద్ధి కోసం నేర్చుకోండి సిద్ధ సమాధి […]

చీకటి మూసిన ఏకాంతం – 7

రచన: మన్నెం శారద నవనీతరావు కారేసుకొని సాగర్ ఇంటికొచ్చేడు. సాగర్ ఆయన్ని చూసి “రండి రండి. కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా!” అన్నాడు ఆదరంగా ఆహ్వానిస్తూ. “అంత పనేం లేదులే. ఊరికే చూసి పోదామని వచ్చేను‌. ఎలా వున్నావు?” అనడిగేడాయన కూర్చుంటూ. “బాగానే వున్నాను సర్! ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మొన్న మదర్ అండ్ ఛెయిల్డ్ ఆస్పత్రిలో ఇంటర్వ్యూ వస్తే వెళ్ళొచ్చేను.” “నిశాంత జాబ్ చేయడం లేదా?” “తెలీదు. నే వెళ్ళలేదు. ఈమధ్య మా ఇంటికోసారి […]

“కళ్యాణ వైభోగమే”

రచన: రాము కోల “పెళ్ళి కుదిరింది అనుకోగానే సరిపోయిందా..రూపాయి ఎంత త్వరగా ఖర్చు అవుతుందో కూడా లెక్కేసుకోవాలి.” “ఎమంటావు మావా!” అంటూ నోట్లో ఉన్న పుగాకు కాడ నవులుతు.. పక్కనే ఉన్న గొపయ్య. వైపు చూశాడు చిదానందం. “ఓసోసి! ఊరుకోవోయ్.. పెళ్లి కుదరటమే మా గొప్ప సంగతి. ఇక రూపాయంటావా? మనందరం లేమా ఏటి, తలా ఓ చెయ్య వేస్తే పిల్లకూడా ఓ ఇంటిది అయిపోద్ది. ” “నువ్వు ఏటి దిగులు పడమాక” అంటూ దైర్యం చెపుతున్న […]

నాకూ!! కూతురుంది….

రచన: సుధ ఆత్రేయ అప్పుడే కోచింగ్ సెంటర్ నుండి వచ్చిన నాకు, నీకు ఈ రోజు సాయంత్రం పెళ్లి చూపులు అని హఠాత్తుగా చెప్పింది అమ్మ. “ఇంత హఠాత్తుగానా అమ్మ!!” అంటే “అవును నా బంగారం!! శాపమో వరమో నాకు తెలీదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటిని వదిలి వెళ్లవలసిందే. బహుశా తానెక్కడ ఉన్న దానిని నందనవనంగా మార్చుకోవడం ఒక స్త్రీకి మాత్రమే తెలుసు కాబోలు అందుకేనేమో. అబ్బాయి పేరు మదన్. శ్రీహరికోటలో సైంటిస్ట్ గా పని […]