April 27, 2024

మాటే మంత్రము

రచన: ప్రభాప్రసాద్ “రేపే మనం వూరు వెళుతున్నమ్మోయ్” ఆఫీస్ నుండి వస్తూనే అరిచినట్టుగా చెపుతూ చిన్నపిల్లాడిలా సంతోషపడిపోతు సురేంద్ర సోఫా లో కూర్చుండిపోయాడు. భర్త సంతోషం చూసి తను కూడా ఆనంద పడుతూ కాఫీ చేతికి ఇచ్చి “ఇంత సంతోషం గా వున్నారు. శంకరం మాస్టారిగారి గురించి ఏమైనా తెలిసిందా “అడుగుతూ సోఫా లో కూర్చుంది . “అవును సుధా! ఈ రోజు నా చిన్ననాటి స్నేహితుడు గిరీశం కలిసాడు. శంకరం మాస్టారు ఈ నెలాఖరున అంటే […]

భయం

రచన: రాజ్యలక్ష్మి. బి అరుణకు యేమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. నిజం . ఏదో ఒకరోజు బయటపడి తీరుతుంది. మరి తనేం చెయ్యాలి యిప్పుడు ? ఆ ప్రశ్నకు సమాధానం దొరకక తికమక పడుతున్నది. ఏ వుపాయము తట్టడం లేదు.. యిప్పుడు యేమి చేసినా చిక్కే ! చెయ్యకపోయినా చిక్కే ! అసలే పల్లెటూరు !చిన్న విషయం నిమిషాల్లో గుప్పుమంటుంది. పోనీ తన స్నేహితురాళ్లను అడుగుదామనుకుంటే వాళ్ళు తనని వేళాకోళం పట్టిస్తారేమోనని భయం !పోనీ జరిగినది […]

10. మాలక్ష్మీజ్యువెల్ – ఉగాది కథలపోటి

రచన: సంధ్య యల్లాప్రగడ “భోంచేద్దాం రండి!” రవి పిలిచాడు ప్రభాకరరావును. పలకలేదు ఆయన. ఈ సారి కొద్దిగా గొంతు పెంచి “నాన్నా!” అన్నాడు. “అరుస్తావేం?” విసుక్కున్నాడు ప్రభాకరరావు. “అరవలేదు పిలిచాను. రండి భోజనానికి!” ఇద్దరూ బల్ల దగ్గర చేరారు. “ఏం ఆలోచించావు?” ‘’మీరేమనుకుంటున్నారు?” “లాయరు మురళీ అంకుల్ని సలహా అడుగుతాను”. “సరే!” రెట్టించలేదు రవి. తినటంలో మునిగిపోయాడు. **** “మురళీ! సమస్య వచ్చిందిరా. . ” “నీకేం సమస్యలుంటాయిరా. రిటైర్డు మాష్టారువి. కళ్ళలో పెట్టుకు చూసుకునే కోడలు. […]

అత్తగారూ… ఆడపడుచు…

రచన: — మణి గోవిందరాజుల “రండి రండి వదినగారూ! నిన్న ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. ఈ రోజు ఇంత ఆలస్యంగానా రావడం?” లోపలికి వస్తున్న వియ్యాలవారిని ఎదురెళ్ళి సంతోషంగా ఆహ్వానించారు దమయంతీ వాసుదేవ్ లు. “కాస్త ఊళ్ళో సెంటర్లో ఇల్లు తీసుకోవచ్చుకదండీ. వందసార్లు తిరిగే వాళ్ళం. అబ్బ! వదినగారూ! చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఈ చీరలో సూపరున్నారండీ” సరదాగా మాట్లాడుతూనే పొగడుతూ లోపలికి వచ్చింది పెద్ద వియ్యపురాలు. మురిసిపోయింది దమయంతి. “మీరు మరీను..రండి లోపలికి” చిన్నకోడలు సీమంతం […]

పొరపాటు

రచన: బి. రాజ్యలక్ష్మి   డియర్ రేఖా, ఈ  వుత్తరం చివరివరకూ చదువు ప్లీజ్.  ఆ రోజు నన్ను పిలిచి మరీ ‘ గుడ్ బై ‘ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయావు.  ఒక్క మాట తో మన స్నేహాన్ని విడిచి పెట్టావు, .  రేఖా నాకు తెలిసినంత వరకు నీతో యెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.  ఇతరులకు కష్టం కలిగించే మనస్తత్వం కాదు నాది.  నన్ను యెవరైనా బాధిస్తే నాలో నేనే బాధ పడతాను కానీ […]

“ఇంటర్నేషనల్ కల”

రచన: కవిత బేతి “అమ్మూ! పడుకుందాం రా” భోజనం టేబుల్ మీద పెట్టేసి, హాల్లో ఆడుకుంటున్న కూతురిని బెడ్రూములోకి లాక్కెళ్ళింది శివాని. అక్కడే కూర్చొని లాప్టాపులో చేస్తున్న పని ఆపి, ఓసారి నిట్టూర్చి, రెండుచేతులు తలపైన పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రవి. రవి ఆర్కిటెక్ట్. శివాని మేనమామ కూతురే. చిన్నప్పటినుండి కాదుగాని, ఇంటర్, డిగ్రీలలో ఉన్నప్పుడు మనసులు కలిసాయి. ఇరువైపులా అంగీకారంతో ఆనందంగా పెళ్లి జరిగిపోయింది. పచ్చని పల్లెటూరంత స్వచ్ఛమైన ప్రేమ శివానిది. ఒకరంటే ఒకరికి ప్రాణం. […]

చంద్రహారం.

రచన- కిరణ్మయి గోళ్లమూడి. “ఈ ఏడాది ఇల్లు సంగతి చూడు సూర్యం! గోడలు పెచ్చులూడిపోతున్నాయి! కాంపౌండ్ గోడ విరిగిపోయింది. నీకు చాలా ఖర్చు ఉంది!” అంది కౌసల్య కంచంలో మిరప పళ్ళ పచ్చడిలో కాచిన నెయ్యి వడ్డిస్తూ. “అవునమ్మా!.. పంట డబ్బు చేతికి వచ్చాక ఇల్లు బాగు చేయిద్దాం! ఉగాదికి రెడీ అయిపోతుంది!” అన్నాడు సూర్యం ముద్ద నోట్లో పెట్టుకుంటూ. “సున్నాలు వేసి కూడా ఆరేళ్ళయింది.” పాతబడి పోయి, వెలిసి పోయిన గోడలు చూస్తూ దిగులుగా అంది […]

వినిపించని రాగాలే

రచన: శివలక్ష్మి రాజశేఖరుని ఆమె మనసులో ఏముందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆమె కళ్ళల్లోకి చూసి తన మనసు చదవగలిగే తనను ఎందుకో ఈ మధ్య అర్థం కాని ఆమె ప్రవర్తన గందరగోళంలో పడేస్తోంది. వరండాలో పడక్కుర్చీలో పడుకుని అలోచిస్తున్నాడు పరంధామయ్య. 40 ఏళ్ల తమ సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇసుమంత తరగని స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. ప్రణయ కలహాలు చిలిపి తగాదాలే కానీ పెద్ద అభిప్రాయ భేదాలు ఏవి లేపు […]

మట్టి మగువ ప్రభలు

రచన: కాదంబరి కుసుమాంబ ఏకవీరా దేవి కోవెలలో ప్రదక్షిణలు చేసి, పూజారి స్వామి ఆశీస్సులు అందుకుని, గుడి వసారాలో కూర్చున్నాడు భైరవి రాజ గురు. వృద్ధాప్యం, కాలం – పోటాపోటీగా తన మేనులోని శక్తిని తూకం వేస్తున్నవి. గుడి వరండా పావంచా మెట్లు ఇరు పక్కలా ఏనుగులు ఒద్దికగా కూర్చుని, భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నవి. ఆ బొమ్మలను ప్రేమగా నిమురుతూ కూర్చున్నాడు భైరవ, పల్లె పాకలోని గురుకులం మాదిరి పాఠశాల – ఎర్ర ఏగాణీ తీసుకోకుండా […]

యధారాజా తధాప్రజా

రచన: మోహనరావు మంత్రిప్రగడ ఓ కళ్యాణ మండపంలో ఓ వేడుక జరుగుతోంది. వరసకి బావా, బావా అనుకొనే ఇద్దరు వయోవృద్దులు ఆ కార్యక్రమానికి తమ తమ కుటుంబాలతో సహావచ్చారు. బావ, బావమరదులిద్దరు ప్రక్క ప్రక్కల కుర్చీలేసుకొని కూర్చోన్నారు.”యధారాజా తధాప్రజ అంటే ఏమిటండి బావగారు” అడిగాడు అందులో ఒకాయన. ఆయన పేరు రామనాధంగారు. “ఏంలేదు బావగారు ఏదేశరాజైన ధర్మాత్ముడైతే, ఆ దేశ ప్రజలందరు ధర్మంగా ఉంటారు. అలాగే రాజు దుర్మార్గుడైతే ప్రజలు అలాగే ఉంటారని దానర్దం” అని చెప్పారు. […]