May 6, 2024

కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

రచన: సునీత పేరిచర్ల ఎప్పటిలానే నిద్రలేచి‌ ఆఫీస్ కి రెడి అవుదామని లేచి కూర్చుంటే పొద్దుపొద్దున్నే వానా గట్టిగానే పడుతుంది.. ఆ నిద్ర కళ్ళతోనే ఉన్నట్టుండి సడెన్ గా నువ్ గుర్తొచ్చావు ఇంతకుముందు రోజులు ఎలాఉండేవి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకుంటుంటేనే నిద్రమత్తు ఒక్కసారిగా వదిలింది ఆ రోజుల్లో‌ ఇద్దరిలో ఎవరు ముందు లేస్తే వారు మిగిలిన వాళ్లని‌ నిద్ర లేపేవాళ్ళము ఇద్దరికీ ఇష్టమైన ఫుడ్ ఎదైనా కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేస్కునేవాళ్ళం ఒకరి డైరీ […]

కాళోజీ మొగ్గలు

రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తెలంగాణ మాటలను తూటాలుగా పేలుస్తూ అవినీతిపై అక్షరాయుధాలను సంధించినవాడు అధర్మంపై న్యాయపోరాటం చేసినవాడు కాళోజీ కవితలతో నిరంతరం అక్షరయుద్ధం చేస్తూనే ప్రజలను కవితాశక్తితో చైతన్యవంతం చేసినవాడు నడుస్తున్న చరిత్రకు సాక్షీభూతం కాళోజీ నా గొడవ అణిచివేతలను అన్యాయాలను సదా నిరసించి సామాజిక మార్పుకోసం పాటుపడినవాడు సమాజ ప్రగతికోరిన అభ్యుదయవాది కాళోజీ సామాన్యుల ఆక్రందనలకు తిరుగులేని గొంతుకై ఆపన్నహస్తంలా వారిని ఆలింగనం చేసుకున్నవాడు సామాన్యప్రజలకు ఉద్యమగొంతుకైనవాడు కాళోజీ నిజాం వ్యతిరేక పోరాటంలో ముందుకు […]

ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

రచన: చందలూరి నారాయణరావు ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? నిజమే…. ఎవరికీ గుర్తుకు రాలేడు. మరిచాను అన్నది మనసులో ఉన్నా బుద్ధికి మాత్రము దరిదాపులలో లేదు. ఎదురుపడ్డా పలకరించే తీరికలేని బతుకుల్లో ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? మనిషి ఆకాశమంత ఎత్తులో ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని కనిపించని యుద్ధంలో అలసి సొలసి పోతుంటే… ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? రాత్రి నిదుర పోకుండా పగటిని కదలకుండా నిశబ్దం కాపలా కాసే విపత్తు వేళలో అనునిత్యం నిఘాతో నియమ […]

వాన బుడగలం

రచన: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. బుడి బుడి బుడగలం బుడుంగు బుడగలం జడివాన అడుగులం కాపాడితే నీటి మడుగులం పచ్చదనానికి దోస్తులం మానవాళికి ఆస్తులం వేడినేల తాకితే మాయం తడినేలపై కురిస్తే తోయం బుడి బుడి బుడగలం బుడుంగు బుడగలం జడివాన అడుగులం కాపాడితే నీటి మడుగులం.

ఊరు

రచన: సునీత పేరిచర్ల కాలంతో పాటు సాగే పయనంలో చాలా ముందుకు వచ్చేసాను.. ఒక్కసారి వెనక్కి వెళ్లి కొన్ని జ్ఞాపకాలని కొందరు ఆత్మీయులని పలకరించాలని చిన్నప్పటి ఊరు వెళ్ళాను ఊరు మొదట్లో గుల్మొహార్ చెట్టు నన్ను చూడగానే ఆనందంతో తల పైకెత్తి ఆహ్వానించింది ఒకప్పుడు ఎంత అందంగా నిండుగా ఉండేదో.. అప్పటి కళ లేదు …నిర్జీవంగా ఉంది ఏమైంది నేస్తం ఇలా అయిపోయావ్ అని అడిగాను.. మొక్కలైనా , మనుషులయినా ఆత్మీయ స్పర్శ , పిలుపు లేకపోతే […]

చేనేత మొగ్గలు

(ఆగష్టు7 న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా) రచన- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నాగరిక మనిషి నగ్నత్వాన్ని వస్త్రాలతో కప్పుతూనే సమాజానికి హుందాతనాన్నిచ్చే సాంస్కృతిక పతాక దేహసంరక్షణకు పాటుపడిన చేతివృత్తి చేనేతరంగం బంగారు జలతారులతో సీతాకోకచిలుకల బొమ్మలను చీరంచులకు సుందరంగా నేసి వెలుగులు విరజిమ్ముతారు పసిడివెన్నెల వెలుగుజిలుగులు చేనేత పట్టుచీరలు బతుకంతా అప్పుల ఊబిలోనే కూరుకుపోతూనే మగ్గం గుంతలోనే పానాలను వదులుతుంటరు నేత నేసిన మగ్గం గుంతలే నేతన్నలకు సమాధి విదేశీవస్త్రాల మోజులో స్వదేశీ నూలువస్త్రాలను మరచి […]

గజల్

రచన: డా. భీంపల్లి శ్రీకాంత వెల్లువలా ఉప్పొంగే కడలి అలలదెంతా ఆరాటం ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలదెంతా ఆరాటం మంటలై ఎగిసిపడే అగ్గిరవ్వలను చూస్తుంటే చలిని పోగొట్టే వేడిదనపువాడిదెంతా ఆరాటం అజ్ఞానాన్ని తరిమేసే జ్ఞానజ్యోతులను చూస్తుంటే చీకటిని పారదోలే వెలుగుకిరణాలదెంతా ఆరాటం ఆటుపోట్ల అలజడులు జీవితాలను కమ్ముకుంటే నిత్యగాయాలను చెరిపేసే కాలానిదెంతా ఆరాటం హృదయాన్ని సాంత్వనపరిచే కన్నీటిని చూస్తుంటే దిగులును పోగొట్టే మనిషి గుండెదెంతా ఆరాటం తూర్పున ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంటే అంధకారాన్ని పోగొట్టే ఉషాకిరణాలదెంతా ఆరాటం కట్టతెగి […]

గానం.. సంగీతం…

రచన: భాస్కర ఇందుప్రియ పదము పదము వాక్యమవును స్వరము పదము పిలుపు అవును సమర్పణతో ప్రార్థనవును రాగముతో గానమవును మనసులోని భావం తెలిపే మార్గమిదే విప్లవాన్ని నలుదిశలా రగిలించిన అగ్ని ఇదే పసిపిల్లల నిదురబుచ్చు మంత్రమిదే పరమాత్ముడు మోక్షమిచ్చు జ్ఞానమిదే ఇదే ఇదే ఏంటది?… నువు పాడే పాటది … దాని విలువ ఎంతటిది .. వెల కట్టలేని సంపదది.. జననమనేదొక రాగం మరణమనే మరో రాగం ఈ రెండిటి నడుమ సృష్టి పలికేదే నీ జీవనరాగం […]

నీ కోసమై ఎదురు చూసే మా అన్నదాతను కరుణించూ

రచన: మౌనిక స్వాగతం…. సుస్వాగతము…. ఓ వరుణదేవ నీవు తడిచినా…! నీరు అందిస్తావు…. నీడవై వెంటే ఉండి నడిపిస్తావు… నిరంకుశంగా నీ దీవెనలు అందిస్తావు… వచ్చావా నీవూ నీ జగతిలోకి… వచ్చావా నీవూ నీ పుడమిలోకి… వచ్చావా నీవూ నీ ఆవనిలోకి… అరవిచ్చిన ఆనందంతో చినుకులు అడుగులై తాకుతుంటే….. మోము మకరిందుస్తుంది…. మది పులకరిస్తుంది… మనసు పరవసిస్తుంది… ఆ చినుకు జల్లుల హరివిల్లులలో పసితనం పరవళ్ళు తీస్తుంది… ఆ చినుకు జల్లుల వాసంతంలో ధరణి తెచ్చే మకరందం […]

కవి పరిచయం – రాజ్ రెడ్డి

పేరు..రాజ్ రెడ్డి. నివాస స్థలం బెంగళూరు. ప్రవృత్తి పరంగా కవిత్వాన్ని రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. సాహిత్యాన్ని ఔపాసన పడుతుంటారు. కొత్త ప్రదేశాలు చూడటం,అవసరమైనప్పుడల్లా మానవత్వంగా ప్రతిస్పందిస్తూంటారు. ఆశకీ శ్వాసకీ మధ్య సంబంధం తెలియాలంటే ఈయన కవిత్వం చదవాల్సిందే. మనసులు మాట్లాడుకునే ఊసులన్నీ కాగితాన్ని కౌగిలిస్తే వారు రాసినట్టే. “కన్మణీ” అంటూ కమ్మని గారాన్ని ఒలికిస్తూ చదువరులను ఇట్టే కట్టిపడేస్తారు. వసంతమంతా సన్నజాజులై పూసే అమృతహేల, మోహనరాగ పరిమళం మనసుని మీటే వేళ, కొమ్మారెమ్మా ఊహలు గుసగుసలాడినట్టే ఉంటుందీయన […]