May 8, 2024

మోదుగ పూలు – 6

రచన: సంధ్య యల్లాప్రగడ   వివేక్ మరుసటి రోజంతా స్కూల్లో చాలా బిజీగా ఉన్నాడు.  అతనికి ఆ సాయంత్రం ఆరింటికి సమయం చిక్కింది. ఆ టైంలో చంద్రన్న తాతాను అడిగాడు వివేక్‌ “ప్రసాదరావు సార్‌ చెప్పిన ఆ రిసెర్చుచేసేటాయన వచ్చాడా తాతా?” అంటూ. “లేదు సార్ ఏడు కొట్టంగ వస్తనన్నాడు!” బదులిచ్చాడు తాత. అతని కోసము వెయిట్‌ చేస్తూ బయట జండా పోల్ అరుగు దగ్గర కూర్చున్నాడు. అతనికి తన ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది.  “నేను చాలా […]

మోదుగ పూలు .. 5

రచన: సంధ్యా యల్లాప్రగడ సోమవారం సాయంత్రం స్కూలు అయ్యాక వివేక్‌ నెమ్మదిగా వెతుకుతూ చంద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. “తాతా! నీతో మాట్లాడాలి. నీకు టైం ఉన్నప్పుడు నా రూముకు రాగలవా?” అడిగాడు మృదువుగా. “సరే సార్!” చెప్పాడు చంద్రయ్యతాత. వివేక్‌ మరుసటి రోజు లెసన్స్ చూసుకోవటానికి వెళ్ళిపోయాడు. గంట తరువాత తాత వచ్చి తలుపు కొట్టాడు. వివేక్‌ తలుపు తీసి తాతను ఆదరంగా ఆహ్వానించాడు. “తాతా! కూర్చో” బల్లను చూపాడు. చంద్రయ్యతాత కూర్చున్నాడు. “చెప్పు సార్‌ ఏం […]

మోదుగపూలు – 4

రచన: సంధ్య యల్లాప్రగడ ఉదయం ఏడుగంటలకు లేచి బయటకొచ్చిన వివేక్‌కు అంతా హడావిడిగా కనిపించింది. ప్రక్క రూములో ఉన్న సాగర్ సారు ఉన్నాడేమో చూస్తే అతను రెడి అయిపోయి ఉన్నాడప్పటికే. “శుభోదయం సారు” పలకరించాడు వివేక్‌. “లేచారా! మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఉదయం ఐదు నుంచి ఆరు వరకు యోగా ఉంటుంది. పిల్లలందరూ చేస్తారు. కొందరు టీచర్లు కూడా చేస్తారు. మేము ఉదయమే వాకింగ్‌కి వెడతాం. ఈ రోజు వెళ్ళి వచ్చేశాం కూడా” చెప్పాడతను. “అవునా. […]

మోదుగ పూలు – 3

రచన: సంధ్య యల్లాప్రగడ గేటులోంచి లోపలికి ప్రవేశిస్తున్న వివేక్‌ను కొందరు పిల్లలు చూశారు. అది వాళ్ళకు లంచ్‌ టైంలా ఉన్నది. గోల గోలగా దగ్గరకు వచ్చేశారు. అందరూ “నమస్తే సార్!” అంటూ పలకరింపులు. పెద్ద పిల్లలు దగ్గరకు వచ్చి బ్యాగు, పెట్టె అందుకున్నారు చేతుల నుంచి. “ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకుపోండి!” అన్నాడు వివేక్. ఆ ప్రహరిలోకి ప్రవేశించగానే లోపల పెద్ద మైదానము మధ్యలో ఒక ఎత్తు అరుగు, మధ్యన జెండా స్తంభం ఉన్నాయి. రెండు రెండంతస్థుల భవనాలు […]

మోదుగపూలు – 2

రచన: సంధ్యా యల్లాప్రగడ ఆదిలాబాదు అంటేనే అడవులు గుర్తుకు వస్తాయి. రాష్ట్రములో అత్యంత ఎక్కువ అడవులు ఉండి, అందాలతో ఉన్న జిల్లా అది. 75శాతం పచ్చని అడవులు, జలపాతాలతో ప్రకృతి అందాలన్నీ నిలవలుగా ఉన్న జిల్లా అది. అందాలు హస్తకళలు ఉన్నా అక్షరాస్యత 63శాతంలోనే ఉంది. ఆదివాసులు, గిరిజనులు ఉన్న జిల్లా. ఉన్నత విద్య, వైద్యము, కనీస అవసరాలకు ఆదిలాబాదే క్రేంద్రము వాళ్ళకు. ఆదిలాబాదు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు. కాని అడవులకు సరిహద్దులేర్పచగలమా? మహారాష్ట్ర, నాందేడు సంస్కృతులు […]

మోదుగ పూలు – 1

నా మాట: భారతదేశములో ‘వికాసతరంగిణి’గా పేరున్న ఒక Non-Profit Organizationకు అమెరికాలో VTSeva బ్రాంచ్‌ వంటింది. వారు ప్రతి సంవత్సరము అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ సంతతిని ‘ఇంటర్న్‌షిప్’ మీద భారతదేశములోని వారు నడుపుతున్న పాఠశాలలకు తీసుకువెడతారు. ఆ స్కూల్సు ‘గిరిజన పాఠశాలలూ, అంధవిద్యార్థుల పాఠశాలలు’. ఇవి పరమహంసపరివ్యాజులైన శ్రీ. చిన్నజియ్యరు స్వామి వారి అధ్వర్యములో నడుస్తాయి. ఈ internship కు chaperoneలా పిల్లలతో కలసి నేను కూడా ప్రయాణించే అపూర్వ అవకాశమొచ్చింది. అలా మొదటిసారి 2017 […]