May 29, 2022

సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

రచన: రవీంద్ర కంభంపాటి శైలజ ఇంటికి వచ్చి, బయట చెప్పులు విప్పుకుంటూంటే, ఇంట్లో నుంచి అత్తగారి మాటలు వినిపిస్తున్నాయి. ‘అవును.. శైలజ కి కూడా అమెరికా కి వీసా వచ్చింది.. ఊహూ.. అఖిల్ కి డిపెండెంట్ గా కాదు.. వాళ్ళ కంపెనీ వాళ్ళే చేయించేరు.. ఒకవేళ వీసా రాకపోయినా ఊరుకోడుగా.. తన డిపెండెంట్ గానైనా తీసుకుపోతాడు ‘ అంటూ ఆవిడ ఎవరితోనో చెప్పుకుపోతూంది. లోపలికి వచ్చిన శైలజ ని చూసి, ‘పాపం వాడు ఇంకా ఆఫీస్ లోనే […]

సాఫ్ట్ వేర్ కథలు – మైసూరు బజ్జీ

రచన: రవీంద్ర కంభంపాటి కొత్త ఉద్యోగంలో చేరేది ఆ రోజేననేమో.. ఆ రోజు నిశ్చలకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. కాసింత టెన్షన్ కూడా ఉంది. పాత ఉద్యోగంతో పోలిస్తే ఇక్కడ నలభై శాతం జీతం ఎక్కువ ఆఫర్ చేసేరు. పైగా అందమైన కేంపస్, జిమ్మూ గట్రా అదనం ! ఆఫీస్ క్యాంపస్ లోకి అడుగుపెడుతూనే, తల్లి ఫోను, ‘ఏమే.. జాగ్రత్తగా చేరేవా ?’ అంటూ. ‘చిన్న పిల్లనా ఏమిటి ? బాగానే వచ్చేసేను.. చూడు మా […]

సాఫ్ట్‌వేర్ కధలు – తిరగమోత

రచన: కంభంపాటి రవీంద్ర ఏంటో మూడేళ్ళ నుంచీ అదే కంపెనీలో పనిచేస్తున్నా, ఆ రోజు మటుకు రామరాజుకి చాలా కొత్తగా ఉంది. అసలు ఇంతకాలం తను పనిచేసింది ఈ కంపెనీ లోనేనా అనిపించింది కూడా. అంత వింతగా ఉందా ప్రాజెక్ట్ వాతావరణం అతనికి ! టీంలో అందరూ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే భయపడి చస్తున్నారు. ఫ్లోర్ లో ఎక్కడా ఓ నవ్వు లేదు, టీమ్ అందరూ కాస్త గట్టిగా మాట్లాడ్డానికే భయపడిపోతున్నారు. ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ […]

సాఫ్ట్‌వేర్ కథలు – 4.. పులుసులో కరివేపాకు

రచన: కంభంపాటి రవీంద్ర     ఆ రోజు ఆఫీస్ చాలా హడావిడిగా ఉంది.  యూరోప్ నుంచి ఎవరో క్లయింట్ వస్తున్నాడట.  ప్రాజెక్టు మేనేజర్ కి ఒకటే కంగారు,  టెన్షన్.  ఆ రోజు మీటింగులు ఎలా జరుగుతాయో,  వాటిని క్లయింట్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో,  తమ టీం గురించి ఏం కామెంట్లు చేస్తాడో.. బుర్ర నిండా రకరకాల ప్రశ్నలు ! ఇవన్నీ ఓ పక్క.. ఇంకో వైపు..  తమ గురించి క్లయింట్ తమ మేనేజ్‌మెంట్‌కి ఎలాంటి ఫీడ్బాక్ […]

సాఫ్ట్‌వేర్ కథలు – 3. . . . దద్దోజనం

రచన: కంభంపాటి రవీంద్ర   మొట్టమొదటిసారిగా మా గోపాల్ అంటే భలే ఒళ్ళు మండింది ఆ రోజు ! వాడూ,  నేనూ రెండేళ్లుగా ఈ ఎడింబరో లో ఒకే ఫ్లాట్ లో కలిసి ఉంటున్నా,  ఎప్పుడూ మా మధ్య గొడవ పడాల్సినంత విషయాలేవీ జరగలేదు. కానీ ఆ రోజు మటుకు భలే కోపం వచ్చేసింది.  ఎల్లుండి క్రిస్మస్ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆఫీసుకి శెలవు. . .  హాయిగా ఇంట్లో కూచుందాం అనుకుంటూంటే,  ఆ రోజు […]

సాఫ్ట్‌వేర్ కథలు: 2 – పచ్చడి

రచన: రవీంద్ర కంభంపాటి ఉదయం ఎనిమిదిన్నర కావొస్తూంది.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా అటూ ఇటూగా అదే టైముకి వచ్చే ఆ ఐటీ కంపెనీ బస్సు , ఆ రోజు కూడా టైముకే ఆఫీసు చేరుకుంది. అంత సేపూ బస్సులో కూచుని ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్న ఆ కంపెనీ ఉద్యోగులు, బస్సు దిగి, మళ్ళీ ఎవరి ఫోన్ల వేపు వాళ్ళు చూసుకుంటూ ఆఫీసు వేపు నడవడం మొదలెట్టేరు. ఆఫీసు ముందున్న విశాలమైన లాన్ లో […]

సాఫ్ట్‌వేర్ కథలు – 1. మజ్జిగ

రచన: రవీంద్ర కంభంపాటి దీపక్‌కి చాలా విసుగ్గా ఉంది. . గంట నుంచీ తన మేనేజర్ శరత్ క్యాబిన్ ముందు నుంచుని ఉన్నాడు. నిజానికి పదిన్నరకి మీటింగ్. . పదీ ఇరవై ఐదుకే ఆ మీటింగ్ క్యాబిన్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు తను. శరత్‌తో ఇదే గొడవ. . మీటింగ్ అని పిలుస్తాడు. . ఆ మీటింగ్‌లో డిస్కస్ చేసే విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు. . కానీ తన క్యాబిన్‌కి పిలిపించుకోవడం, వచ్చాక వెయిట్ చేయించడం […]