April 26, 2024

అమ్మాయి వెడలెను

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం “అమ్మా! క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా సాన్ హొసె పార్క్ లో దీపాలంకరణ చాలా బాగా చేసారుట. వెళ్ళొద్దామా? “అంది బుజ్జి. “అదికాదే రేపటినుండి అంగళ్ళకు తిరగడం మొదలు పెట్టి పిల్లకు కావాల్సినవన్నీ కొని, అవన్నీ సర్ది, దాన్ని తీసుకు వెళ్ళి దిగబెట్టి రావాలి. ఇప్పుడు అంత దూరం చలిలో కారు నడుపుకుని వెళ్ళిరావడం,పైగా ఈ కరోనా సమయంలో అవసరమా?” అన్నారు మంగమ్మగారు. బుజ్జి గలగలా నవ్వింది. “నాకు తెలుసు అమ్మా. బయటకు వెళ్ళాలి […]

ఒకే గాథ…

గజల్ రచన: ఇరువింటి వెంకటేశ్వర శర్మ నీది, నాది, ఒకే గాథ ముగిసిపోదు ఏన్నటికీ చీకటి వెలుగుల పయనం విసిగిపోదు ఎన్నటికీ ఇరుమనసుల ప్రమాణాల శాసనమే పెళ్ళంటే తొలిచూపుల దృశ్యకవిత చెదిరిపోదు ఎన్నటికీ సతిపతులే అక్షయమౌ అనుపమాన ప్రేమజంట వలపునెంత పంచుకున్న అలసిపోదు ఎన్నటికీ ఒడిదుడుకుల అలలమీద గమనమేగ సంసారం ఎదురీదక మునుముందుకు సాగిపోదు ఎన్నటికీ ఇల్లూ,ఇల్లాలు,సుతులు అందమైన బంధాలూ ముడులువడిన సూత్రమిదీ వీడిపోదు ఎన్నటికీ

ఆదిశేషుడు – వాసుకి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు గంజాయి వనములో తులసి మొక్కలలాగా కద్రువ సంతతి నాగులలో శ్రేష్ఠులు ధర్మనిరతి గలిగి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివులకు ప్రీతిపాత్రులైన వారు ఆదిశేషుడు, వాసుకి. . కశ్యప ప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు అది శేషుడు. కాని తల్లి దుస్సాహసము, తమ్ముల దుష్ట స్వభావమును భరించలేక వారికి దూరముగా తపోమూర్తిగా వెలుగొందాలని తలంచి గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహా తపమాచరింపఁగా, శరీరము శుష్కించిపోగా అప్పుడు బ్రహ్మఅతని సత్యనిష్ఠకును, […]