May 6, 2024

అమ్మ కడుపు చల్లగా

రచన: తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం పిట్స్ బర్గ్ లో విమానం దిగి బయటకు రాగానే వాళ్ళు ఎక్కవలసిన రైలు రావడంతో హడావిడిగా ఎక్కేసారు మంగమ్మగారు మంగపతి గారు. నిముషంలో కంపార్ట్ మెంట్ తలుపు యాంత్రికంగా మూసుకోవడం , రైలు వేగంగా ముందుకు దూసుకు పోవడం జరిగింది. కళ్ళు మూసి తెరిచేంతలో వాళ్ళు దిగవలసిన చోటు వచ్చేసింది. హాండ్ లగేజిగా తెచ్చుకున్న చిన్న సూట్కేసులు లాక్కుంటూ కరౌసిల్ దగ్గరకు వచ్చారు ఆ దంపతులు. వాళ్ళను చూసి గబ గబనడుస్తూ […]

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని […]

గుర్తింపు

రచన: శైలజ విస్సంశెట్టి పిల్లలు రాసిన ఆన్సర్ షీట్స్ దిద్దటానికి ముందు వేసుకుని కూర్చున్న చరితకి మనసు వాటిపై లగ్నం కావటంలేదు. ఈమధ్య చాలాకాలంగా తన మనసులో సన్నగా రాజుకుంటున్న అసంతృప్తి ఇటీవల కాలంలో వటుడింతై అంతై అన్నట్లుగా పెరిగిపోయి ఏ పనిచేస్తున్నా అదే విషయం తన ఆలోచనలకు కేంద్రబిందువు కావటం చరితకి తెలుస్తూనే ఉంది. చేతిలో పెన్నుక్యాప్ మూసివేసి ప్రక్కకు పడేసి తాను కూర్చున్న హాలునంతా ఒక్కసారి పరికించి చూసింది. 8 సంవత్సరాల క్రితం తమ […]

విశ్వపుత్రిక వీక్షణం – “మనసును విను”

రచన: విజయలక్ష్మి పండిట్ రమ ఆదివారం ఉదయం టిఫిన్ కు ఇడ్లీలు చట్నీ వేసిన ప్లేటును డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న భర్త రాజశేఖర్ ముందు పెడుతూ.., “ఏమండీ… మన మనసును విని మనసు కోరినట్టే నడుచుకోడానికి మనకు అన్ని సమయాలలో వీలవుతుందంటారా” అడిగింది భర్తను. అప్పుడప్పుడు శేఖర్ అని పిలుస్తుంది భర్తను. “ఇవాళేంటి నీకు ఉదయాన్నే ధర్మసందేహం కలిగింది” అంటూ ఇడ్లి తుంచి చట్నీలో అద్ది తింటూ … “బలేగుంది ఇడ్లీ సాఫ్టుగా..,”అన్నాడు శేఖర్. రమకు […]

గజల్

రచన: శ్రీరామదాసు అమరనాథ్ అల తాకగానే దరి పులకరించింది నది సొగసుతో తాను పరవశించింది . కల చెదిరి మదిలోన గుబులాయనేమో ఒక మనసుకై తనువు పలవరించింది . తలపైన పూబంతి వికసించెనేమో ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది . ఇలలోన అందాలు దాగున్నవేమో ఒక సొగసు వెన్నెలై పరితపించింది . శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా ‘ ఒక మూగ రస జగతి పలుకరించింది .

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి అనువాదం: అనంత పద్మనాభరావు మార్మిక శూన్యం నిజానికి చాలాసార్లు మనకు ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని ఒక చతురుడి ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస ఇక అన్వేషణ మొదలౌతుంది అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter […]

దీపావళి పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు దీపావళికి సంబంధించిన పదములతో ఉండే వృత్తములను ఏరి పండుగ సందర్భముగా శుభాకాంక్షలతో ఇక్కడ అందిస్తున్నాను. అన్య నామములను కుండలీకరణములలో చూపినాను. * గుర్తుతో నున్నవి నా కల్పనలు. ప్రతి ఛందమునకు రెండు ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో వాడబడిన ఛందములు 20, అవి – దీప్తా, లక్ష్మీ, అర్చిస్సు, భాస, దీపకమాలా, మౌక్తికమాలా, కాంతి, మణిమాలా, ప్రభా, బభ్రులక్ష్మీ, నిగ్గు, దీపక, భామ, భాతి, హరిణీ, కలాపదీపక, దీపికాశిఖ, దీపార్చి, జ్యోతి, దీప. […]

విశ్వపుత్రిక వీక్షణం 2 – తుపాకి సంస్కృతి

రచన: విజయలక్ష్మీ పండిట్ ప్రపంచంలో రాను రాను యుద్ధాలలో చనిపోయే వారి సంఖ్య కంటే తుపాకి సంస్కృతికి బలి అయిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందనిపిస్తుంది. తుపాకి సంస్కృతి అంటే ప్రజలు (సివిలియన్స్‌) తుపాకి లైసెన్స్‌ కలిగి తుపాకులు కలవారు. ఈ తుపాకి సంస్కృతి వల్ల ఆత్మహత్యలు, మాస్‌ షూటింగ్స్‌, ప్రాణాలు పోవడం. మార్చి 21, 2018న అమెరికాలోని ఫ్లోరిడాలో The March for our Lives అని విద్యార్థుల, టీచర్ల, తల్లితండ్రుల అతిపెద్ద ఊరేగింపు దీనికి నిదర్శనం. మర్‌జోరి […]

కౌండిన్య హాస్యకథలు 1 – ఇదేం సరదా

రచన: రమేశ్ కలవల (కౌండిన్య) ఉద్యోగం రీత్యా గోపాలం ఆ ఊరికి ఈ మధ్యనే ఓ నెల క్రితం వచ్చాడు. పట్నంలో పనిచేసి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి ఈ మోస్తరు పల్లెటూర్లో అంతా కొత్తగా అనిపిస్తున్నాయి. గోపాలానికి, అతని భార్య కామాక్షికి ఆఫీసువారు ఇచ్చిన పెద్ద పెంకుటింట్లో అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. ఆ ఇంట్లో పెరట్లోకి నడవగానే ఎదురుగుండా తులసికోట, ఒక ప్రక్క బావి, దాని ఆనుకోని ఎత్తైన కొబ్బరిచెట్లు కనపడటమే కాకుండా మరో […]