May 7, 2024

సంగీతానిది ఏ మతం ?

రచన: కాంత గుమ్మలూరి ఇంట్లో అందరూ సంగీత ప్రియులే. అమ్మేమో చాలామందికి కర్నాటక్ క్లాసికల్ సంగీతం నేర్పిస్తుంది. నాన్నయితే అన్నిరకాలూ హిందుస్తానీ, కర్నాటక్ సంగీతాలే కాక పాత తెలుగూ , హిందీ సినిమా పాటలూ, నిజానికి ఏ భాషయినా పాట బాగుందనిపిస్తే సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటారు. అన్నయ్య డాక్టరీ చదువు. కాలేజీలో ప్రతీ మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ పాల్గొంటాడు.. ప్రైజులు కూడా తెచ్చుకుంటాడు. అక్క హైయర్ సెకండరీ. సంగీతం నేర్చుకుంటోంది. చాలా బాగా పాడుతుంది కూడా. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 32

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “బాలస్తావత్‌ క్రీడాసక్తః – తరుణస్తావత్‌ తరుణీ సక్తః – వృద్ధస్తావత్‌ చింతాసక్తః – పరమే బ్రహ్మణి కో పినసక్తః” ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’ గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం యిది. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. […]

శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి పదకొండు పద్యాలు

రచన: శారదా ప్రసాద్ మిత్రులకు నమస్కారములతో, కొంతమంది శ్రేయోభిలాషులు, హితులు మిత్రులు, కార్తీక మాస సందర్భంలో ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’నుండి కనీసం పది పద్యాలను, వాటి అర్ధాలను తెలియచేయమని ఆశీర్వచనపూర్వకంగా ఆదేశించారు. దానిని శివాజ్ఞగా భావించి, కొన్ని పద్యాలను గురించి చెప్పటానికి ప్రయత్నిస్తాను. విశేషమేమంటే, నేను శ్రీకాళహస్తిలో అయిదు సంవత్సరాలు పనిచేసాను. ఆలయంలో గోడలపై ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’లోని పద్యాలన్నిటినీ చెక్కారు. అలా, నేను ఆ పద్యాలన్నిటినీ అతి జాగ్రత్తగా చదివాను. చాలావరకు నోటికి వచ్చు. అర్ధాలను […]

సుభద్ర జోషి

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు భారతరత్న, మాజీ ప్రధాని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరెన్నికగన్న అటల్ బిహారీ వాజపేయి 10సార్లు లోక్ సభకు , రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక అయిన వ్యక్తి. అటువంటి రికార్డులు సృష్టించిన, ప్రజాదరణ పొందిన, అన్ని పార్టీల నుండి ప్రశంసలు పొందిన మహా రాజకీయవేత్త 1962 లోక్సభ ఎన్నికలలో అయన సుభద్ర జోషి అనే మహిళా చేతిలో ఓటమిని చవి చూడవలసి వచ్చింది రాజకీయాలలో ముఖ్యముగా ఎన్నికలలో గెలుపు ఓటములు సహజము. పెద్దపెద్ద నాయకులు […]

మది మధనం!

రచన: పద్మజ యలమంచిలి తనకెందుకీ వేళ ఇంత అలజడి?? మనసంతా మెలితిప్పినంత బాధగా ఉంది.. ఏదో వెలితి,తెలియని అభద్రతాభావం… అతను చనిపోయాడు..అయితే…నాకెందుకీ బాధ?? అందరూ 11వ రోజని భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా?? ఆఖరుకు అతని తల్లి కట్టుకున్న భార్య, పిల్లలు, అందరూ బానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు?? తనేమిటిలా…ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్కసారైనా అతనితో మాట్లాడింది లేదు..చూసిందీ లేదు…మరెOదుకిలా?? దుఃఖం ఎగదన్నుకొస్తొOది?? నీకు తెలుసా…విజయమ్మగారి అబ్బాయి..ప్రాణం ఇక్కడే పోవాలని రాసిపెట్టున్నట్టుంది. […]

స్పర్శ

రచన: రోహిణి వంజరి చంటి బిడ్డకే తెలుసు అమ్మ పొత్తిళ్ళలోని వెచ్చదనపు స్పర్శ…… ఎడారిలో ఎండమావికే తెలుసు, ఎప్పుడో ఏనాటికో నింగి నుండి జారి పడే వాననీటి స్పర్శ……. యుద్ధవీరునికే తెలుసు విజయం వరించినపుడు భుజం తట్టి అభినందించే అనుంగుల చేతి స్పర్శ……. నిరాశ నిండిన మనసుకే తెలుసు, జీవితంలో ఏది సాధించలేని ఓటమి స్పర్శ……. ఓటమికే తెలుసు, ఓడిపోయినా వీడిపోక వెన్నుతట్టి ధైర్యం చెప్పే మిత్రుని ప్రోత్సాహపు స్పర్శ………. రాఖీ కట్టే సోదరికే తెలుసు సోదరుని […]

అడగాలి

రచన: పారనంది శాంతకుమారి. తల్లితండ్రులను విశాల హృదయం అడగాలి తోబుట్టువులని తీరని బంధం అడగాలి పిల్లలను నవ్వులు అడగాలి పెద్దలను దీవనలు ఆడగాలి ప్రేయసిని మాయని అనుభూతి అడగాలి స్నేహితుడిని అండ అడగాలి భార్యని బాంధవ్యం అడగాలి కనులను కలలు అడగాలి కౌగిలిని వెచ్చదనం అడగాలి తనువును సుఖం అడగాలి మనసును శాంతి అడగాలి బుద్ధిని మౌనం అడగాలి రాత్రిని నిదుర అడగాలి కోరికను తీరమని అడగాలి ఏకాంతాన్ని ఏకాగ్రత అడగాలి జ్ఞానాన్ని అనుభవజ్ఞానం అడగాలి రక్తిని […]

విలువ తెలుసుకో!

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు ఎవరు లేకుంటే నీకు విలువ లేదో, నీవు నిలువ లేవో, గ్రహించలేకున్నావు, నీ అహంకారాన్ని నిగ్రహించలేకున్నావు. ఎవరు నీకు కంటివెలుగై, నీ కాలి అడుగై, నీ గొడుగై, నీకు నీడగా,నీ తోడుగా నిలుస్తున్నారో నీకు గెలుపునిస్తున్నారో తెలియలేకున్నావు. ఆమెను మనసారా కలియలేకున్నావు, ఆమె మనసును తెలియలేకున్నావు. ఆ తోడుని అలుసు చేస్తున్నావు ఆమెతో నీ అనుబంధాన్ని పెళుసు చేసుకుంటున్నావు. నిన్ను పట్టి పీడిస్తున్నది తెలియని అజ్ఞానమనుకోవాలా? తెలియనివ్వని అహంకారమనుకోవాలా? నిజంలో చరించ […]