April 26, 2024

కొత్త చీర

రచన : శ్రీకాంత గుమ్ములూరి. “అన్నవస్త్రాలకి పొతే ఉన్న వస్త్రం ఊడిందిట !!” “ఎవరి మీదే అక్కసు?” అడక్కుండా ఉండలేకపోయింది కొత్తగా పెళ్ళైన అక్కని. “అధముడికి భార్య అయ్యేకన్నా బలవంతుడికి భార్య అవడం మేలు …. ” ఇంకో సామెత దూసుకు వచ్చింది అక్క నోటి నుంచి బాణంలా… ‘పెళ్లై రెండు రోజులైనా కాలేదు అప్పుడే బావని తిట్టుకుంటున్నావా?” చెల్లెలి ప్రశ్న. దానికి ఆమె ఇచ్చిన తలతిక్క జవాబు అత్యంత వినసొంపు !! అనుకున్న పని అంగవస్త్రంలో […]

పాతది .. కొత్తది

రచన: రామా చంద్రమౌళి శీతాకాలపు ఆ ఆదివారం ఉదయం అతను ఆలస్యంగా నిద్రలేచాడు కిటికీ తెరిచి , తలుపు తెరిచి .. వాకిట్లోకి అడుగు పెడ్తే పల్చగా, చల్లగా, గాజుతెరలా మంచుపొర మెట్ల దగ్గర .. మల్లెపాదు మొదట్లో కుక్కపిల్ల పడుకునుంది ముడుచుకుని గేట్ దగ్గర పాల ప్యాకెట్ , రెండు దినపత్రికలు లోపలికొస్తూ ‘ ష్ ‘ అని విదిలిస్తే .. కుక్క కళ్ళు తెరిచి .. చూచి.. లేచి నాలుగడుగులు వెనుకనే నడచి వచ్చి […]

జవాబులు …?

రచన: ఉమాదేవి కల్వకోట ఎవరినడగాలి సంజాయిషీలు? కన్నవారినా, కట్టుకున్నవారినా, సమాజాన్నా, సాంప్రదాయాన్నా? ఎక్కడా దొరకదు ఈ ప్రశ్నలకు సమాధానం. ఎందుకోతెలుసా? ఈ ప్రశ్నలు సంధించేది ఒక నారి. అందుకే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు మరి. ఆడపిల్లకు ప్రతిదశలో, ప్రతిదిశలో సమస్యల సుడిగుండాలకు ఎదురీతే. పిండదశలో బ్రూణహత్యలూ..శిశుదశలో నిర్లక్ష్యవైఖరులు శైశవదశలో ఆంక్షలూ, యవ్వనంలో అఘాయిత్యాలు, వివాహితలకు కట్నాల ఆరళ్ళు, వృద్ధాప్యంలో నిరాదరణలు. ఒక ఆడదైవుండి మరోఆడపిల్లకు జన్మనివ్వడానికి అయిష్టత ఎందుకోతెలుసా? మరో ఆడపిల్ల తనలా బాధలూ, కష్టాలు […]

పల్లె సద్దు

రచన: కొసరాజు కృష్ణప్రసాద్ తూరుపున దినకరుడు పొద్దుపొడవకముందె, చిరునవ్వి నా పల్లె నిదురలేచింది. తల్లి వెనకాలెల్లు కోడిపిల్లల ధ్వనము, దూడ దరిజేరగా పాలనిచ్చే ఎనుము – చుట్టాలు వేంచేయు వార్త మోసుకొచ్చి, నల్ల కాకులు చేయు కావు కావుల రవము! కళ్లాపి స్నానంతొ వాకిళ్ళు తడవగా, వికసించె ముంగిట్లో ముత్యాల ముగ్గులు – సంకురాతిరి శోభ సంతరించుకోగ, రంగవల్లుల మధ్య మెరిసేటి గొబ్బిళ్ళు! అరుగుపైనజేరి పత్రికలు తిరగేస్తు పెద్దమనుషులుజేయు చర్చ సద్దు – సద్దిమూటనుగట్టి, హాలము బండిలొబెట్టి, […]

తోడు

రచన: గవిడి శ్రీనివాస్ ప్రయాణాలు కొన్ని సార్లు ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి . కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది . విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు దారిపొడుగునా రుతువులు పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు ఊపిరి ఊగిసలాట ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు జీవితానికి ముడిపడుతుంటాయి . పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా మబ్బుల నుంచీ జారినపుడు కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని తొడిగినపుడు […]

దయా మరణం !-కవిత

రచన: ఎమ్.వీరేశ్వరరావు దిగులు మొసలికి చిక్కిన ముసలి ! మది గదిలో చుట్టలు చుట్టుకొని విషాదం చిమ్ముతోంది వార్ధక్యం పాము ! ప్రాణం అంచున వేలాడేది దేహం ! సాక్షి గేహం ! నిత్యం మరణ స్మరణం ! రానిది మరణం దొరకనిది కారణం అంతరంగం లో ఎప్పడు అవయవాలతో నిత్యం రణం ! జ్ఞాపకాలు పత్ర రహిత శిశిర పత్రాలు ! బంధాలు తృష్ణ జనించని మృగ తృష్ణలు ! తీతువు కూత ఉన్నా రానిది […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా…  మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మొదటిగా ఒక రచయిత్రితో మరో రచయిత్రి […]

Something Special – ముచ్చర్ల రజనీ శకుంతల

సాహితీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ప్రమదాక్షరి సమావేశాలు మొదలైనవాటిలో చురుగ్గా పాల్గొనే ఒకావిడ కొన్నేళ్ల క్రితం పాఠకులను ఉర్రూతలూగించే రచనలు చేసి ఎన్నో కథలు, వ్యాసాలు, నవలలు, సీరియళ్లు, టీవీ ప్రోగ్రాములు మొదలైనవి చేసిన ప్రముఖ రచయిత్రి అని తెలిస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. నరుడా ఏమి నీ కోరిక, ప్రియా ప్రియతమా, ఒక గుండె సవ్వడి, మనమిద్దరం లాటి పాపులర్ టీవీ సీరియళ్లు,వంశీ ఆర్ట్స్, కళానిలయం, జ్యోత్స కళాపీఠం, మయూరి ఆర్ట్స్ , […]

మణికర్ణిక

రచన: ప్రొఫెసర్ రామా చంద్రమౌళి తనెవరో తనకే తెలియని మణికర్ణిక భస్మసింహాసనంపై కూర్చుని గంగా హారతిని చూస్తోంది కటిక చీకట్లో యుగయుగాలుగా అంతే స్త్రీని హింసించి , వధించి , సతిని యాభైరెండు ఖండాలుగా ఖండించినపుడు ఇక్కడ వారణాసి తటిపై ‘ కర్ణాభరణం ‘ ఒక శక్తిపీఠమై మొలిస్తే కన్యాకుమారిలో తెగ్గొట్టబడ్డ ఆదిమ స్త్రీ పవిత్ర పాదాలు రక్తసిక్తమై చుట్టూ ఆవర్తనాలౌతూ సముద్రాలూ, నదులూ దుఃఖితలైనాయి – అంబాడ్తున్న మణికర్ణికను ఎవరో శ్మశానాల మధ్య విడిచి వెళ్ళారు […]