May 8, 2024

బ్రహ్మలిఖితం 14

రచన: మన్నెం శారద లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది. అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్. లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని. సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో. అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత. “ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” […]

బ్రహ్మలిఖితం 13

రచన: మన్నెం శారద అర్ధరాత్రి దాటింది. ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది. పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది. వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది. కుటుంబరావుకి మెలకువ రాలేదు. ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది. అతను కొద్దిగా నోరు తెరిచి […]

బ్రహ్మలిఖితం 12

రచన: మన్నెం శారద వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి. ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది. తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు […]

బ్రహ్మలిఖితం – 10

రచన: మన్నెం శారద “రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా […]

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద “లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత. చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది. శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది. ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని […]

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది. పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు. లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి […]

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం. ***** లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు. ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి. దూరం నుండే […]