April 27, 2024

కంభంపాటి కథలు – మతి”మెరుపు”

రచన: కంభంపాటి రవీంద్ర ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూంటే , తను చెప్పింది, “పక్క ఫ్లాట్ లో కొత్తగా ఓ ఫ్యామిలీ వచ్చేరు . మళయాళీ వాళ్ళట !” “ఊహూఁ” “ఊహూఁ అనడం కాదు… అతను మీ కాలేజీయేనట” “మా కాలేజీ అంటే…అందులో ప్రతీ ఏడాదీ ఓ బ్యాచ్ బయటకి వస్తూంటుంది… అందులో అతను ఏ ఏడాది బ్యాచో” “ఏ ఏడాదో అయితే… మీకెందుకు చెబుతాను? మీ బ్యాచేనట” “అవునా? అతను చెప్పేడా ?” “లేదు… ఆవిడ […]

కంభంపాటి కథలు – దేవుడికి భయం లేదు

రచన: రవీంద్ర కంభంపాటి సాయంత్రం నాలుగున్నర అవుతూంది. ఆదిలక్ష్మి ఇంటిపక్కనే ఉన్న సందులోకి తిరిగి, వీధి వైపుకి వచ్చింది. ఇంటి ముందుభాగం అద్దెకిచ్చేసేరేమో, తిన్నగా వీధిలోకి వచ్చే వెసులుబాటు లేదు. ఆ సందులోంచి బయటికి వచ్చి, వీధిలోకి తిరిగేసరికి బజ్జీల నూనె వాసన నుంచి, కోడిమాంసం, కోడిగుడ్ల వాసన వరకూ రకరకాల వాసనలొచ్చేయి ! వెనక్కి తిరిగి తన ఇంటి వేపు నిరసనగా చూసింది. ఇంటి ముందు శ్రీ సాయి విలాస్ టిఫిన్స్, నూడుల్స్, కర్రీస్ అనో […]

కంభంపాటి కథలు – అటకెక్కేడు

రచన: రవీంద్ర కంభంపాటి ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ వీధిలో దూరంగా విసిరేసినట్టున్న మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల గంగాలక్ష్మిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు. లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసకమసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం […]

కంభంపాటి కథలు – ‘మొహమా’ ట్టం

రచన: రవీంద్ర కంభంపాటి సర్వేశ్వరరావుదంతా అదో తరహా.. వాడు నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా.. క్లాసులో నాలుగు లెక్కలు బోర్డు మీద రాసి, వాటిని చెయ్యమని కుర్చీలో చిన్న కునుకు తీసిన కమలా టీచర్ గారికి ‘టీచర్ ‘ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి ఒక్కసారి అదిరిపడిందావిడ! ఎదురుగా మొహం మీద మొహం పెట్టి, ‘నా పెన్సిల్ ఇరిగిపోయిందండి.. చెక్కుదామంటే ఎవరి దెగ్గిరా బ్లేడు లేదంటున్నారండి’ అంటున్న సర్వేశ్వర్రావుని చూసి కోపంతో ఊగిపోయిందావిడ […]

కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఈ ఆదివారం మా వకుళ వాళ్ళ గృహప్రవేశం.. ముందే చెబుతున్నాను మనిద్దరం వెళదాం ‘ అని మావారితో అంటే, ‘నాకూ రావాలనే ఉంది.. అసలే ఆమె నీకున్న ఒకే ఒక ఫ్రెండు కదా.. కానీ.. ఈ వీకెండ్ ఆఫీస్ వర్కు.. ఇంట్లోంచి పని చెయ్యక తప్పదు ‘అన్నారాయన ‘ఏదైనా ఫంక్షన్ కి నేనొక్కదాన్నే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ‘ ముభావంగా అన్నాను ‘నిన్నొక్కదాన్నీ పంపడం నాకూ ఇష్టం లేదు.. పోనీ.. ఏ […]

కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

రచన: రవీంద్ర కంభంపాటి చిన్నప్పటి నుంచీ మా కాశీ అత్తయ్యకి నవలల పిచ్చి. ఈ నవల ఆ నవల అని కాదు.. తెలుగు నవల కనిపిస్తే చాలు.. చదవకుండా వదిలిపెట్టేది కాదు! కాశీ అత్తయ్య అంటే ఆవిడేదో కాశీలో ఉంటుందని కాదు.. ఆవిడ పేరు కాశీ అన్నపూర్ణ.. మా తాతగారు ఆవిణ్ణి కాశీ అని పిలిచేవాడట.. దాంతో అదే పేరు ఆవిడ తరం వాళ్ళకీ, మా తరం వాళ్ళకీ ఖాయమైపోయింది. ఆవిడకి పుస్తకాల మీదున్న ఇంట్రెస్టు చూసి, […]

కంభంపాటి కథలు – వాచీ

రచన: రవీంద్ర కంభంపాటి దాలి నాయుడికి ఐదేళ్ల వయసున్నప్పుడనుకుంటా.. వాళ్ళ నాన్న చిట్టినాయుడు చేతికున్న రోలెక్సు స్మగుల్డు వాచీ చూసేడు. తళతళ మెరిసిపోతున్న ఆ వాచీని మెల్లగా వాళ్ళ నాన్న చేతినుంచి లాగడానికి చూసేడు గానీ చిట్టినాయుడు ఓ మొట్టికాయ మొట్టడంతో ఆగిపోయేడు. అప్పటికైతే ఆగేడు గానీ.. ఆ దాలినాయుడి బుర్రలో ఆ వాచీ అలా ప్రింటైపోయింది. ఆ పై ఏడు, కాకినాడెళ్ళినప్పుడు చిట్టినాయుడు ఓ డూప్లికేటు కాసియో వాచీ కొనిచ్చినా పెట్టుకుంటే నీకున్నలాంటి వాచీ పెట్టుకుంటా […]

కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ

రచన: కంభంపాటి రవీంద్ర ‘మధ్యాన్నం బోయనానికి ఇంటికొచ్చెయ్యి .. నిన్ననే దవిలేశ్వరం నుంచి పులసలు తెప్పించి పులుసు కాయించేను .. పైగా మా ఆవిడ ఇయ్యాల ఉదయం పెరుగావడలు చేసింది.. నిన్న ఎండబెట్టిన ఉసిరికాయ వడియాలు ఎండేయంట .. అవి కూడా టేస్టు చూద్దూగాని .. మళ్ళీ మీ హైద్రాబాదు వెళ్ళేవంటే ఇవన్నీ దొరకవు ‘ అంటూ ఉదయాన్నే లోవరాజు ఫోను ‘ఇవన్నీ ఏమో గానీ .. హైదరాబాద్ వెళ్ళేనంటే నీ కధలు మట్టుకు దొరకవు ‘ […]

కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం

రచన: రవీంద్ర కంభంపాటి ఆ రోజు రాజమండ్రిలో లోవరాజు గాడి ఫ్రెండొకడి స్వీటు షాపు ఓపినింగంట ..ఉదయాన్నే బయల్దేరదీసేడు లోవరాజు గాడు. ‘నీ ఫ్రెండెవడో కూడా నాకు తెలీదు , మళ్ళీ నేనెందుకురా బాబూ’ అంటే , ‘ఏమో ..ఎవరు చెప్పొచ్చేరు .. దార్లో నీకు ఏదైనా కధ దొరుకుతుందేమో ‘ అంటూ నవ్వేసరికి , ఇంక తప్పక బయల్దేరేను. ఊరు దాటి హైవే ఎక్కగానే ఉన్న వీర్రాజు హోటలు దగ్గిర ఆడి బండి ఆపి , […]

కంభంపాటి కథలు – సీక్రెట్

రచన: రవీంద్ర కంభంపాటి హ్యుండాయ్ వెర్నా కారు హుషారుగా డ్రైవ్ చేస్తున్న వసంత్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ‘వావ్ ..వెదర్ భలే రొమాంటిగ్గా ఉంది కద’ అన్నాడు. ‘అందుకేగా సరదాగా బయటికి వెళదామని అడిగింది…ఏసీ తగ్గించండి .. కొంచెం చలిగా ఉంది ‘ కొంటెగా నవ్వుతూ దగ్గిరికి జరిగింది సుమ ‘చలిగానే ఉండనీ .. నువ్వు దగ్గిరకి జరిగితే వేడి పెరిగింది ‘ ఎడం చేత్తో సుమ నడుం చుట్టూ చెయ్యేస్తూ, నవ్వేడు వసంత్ అంత […]