May 9, 2024

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు విశ్వవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాని రాను రాను వాడేవాళ్లు తగ్గి భాష ఎక్కడ అంతరించిపోతుందోనన్న భయం కొంతమందికి లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేమో అనిపిస్తుంది కూడా. ఇంత అందమైన మన మాతృభాష అంతరించకుండా ఉండాలంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి అది అందించబడాలి. మన తెలుగులో చాటువులు అని ఉన్నాయి. వాటికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు చాటువంటే ఏమిటి? కవులైన […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను సుసంపన్నం చేసిన మరో దేశీఛందస్సుకు చెందిన ప్రక్రియ ఆటవెలది. ఆటవెలది అనగానే అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం గుర్తుక వస్తుంది ఆటవెలదుల్లో అనేక లౌకిక వాస్తవాలను వెల్లడించిన ప్రజాకవి వేమన. మేడిపండు జూడ మేలిమై యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ ఇలా వందల పద్యాలు వేమన పేరుమీద […]

తేనెలొలుకు తెలుగు-4

రచన: తుమ్మూరి రామ్మోహనరావు కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. . . ఇది నేను చిన్నప్పుడు చూచిరాత కాపీలో అభ్యాసం చేసిన మొదటి పద్యం. దీని తరువాత చీమలుపెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా! […]