April 27, 2024

వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా – 2 (సామాజిక పద్యనాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు 2 వ రంగము (స్కూటర్ స్టాండు వేసి షాపులోకి వెళ్తుంటే చిన్ననాటి మిత్రుడు బ్రహ్మానందం ఎదురయ్యాడు) బ్రహ్మ :- ఒకే సుందరదాసూ ఎన్నాళ్లయ్యిందిరా నిన్ను కలిసి. బాగున్నావా? చెల్లెమ్మ బాగుందా? అదేదో ప్రైవేటు బళ్లో తెలుగు చెప్తుందని చెప్పావు క్రితంసారి కలిసినప్పుడు. ఏమైనా సందేహాలుంటే నన్నడగమని కూడా చెప్పినట్లు గుర్తు. దాసు: అర్జునుడు బాణం మీద బాణం రెండు చేతులతో వేసినట్టు వేసి అడిగిన వాటికి జవాబులు చెప్పకముందే ఇంకేమిటి సంగతులంటావేమిట్రా […]

తేనెలొలుకు తెలుగు –

రచన: తుమ్మూరి రామ్మోహనరావు పద్యప్రేమ-2 దాదాపుగా అన్ని భారతీయ భాషలకు మాతృస్థానంలో ఉన్న సంస్కృతం తెలుగు భాషలో పాలలో చక్కెరలా కలిసిపోయింది. ఎంత తెలుగులోనే మాట్లాడాలని పట్టుదల కలిగిన వారైనా, సంస్కృత భాషను ఇచ్చగించని వారైనా, సంస్కృతపదాలను వాడకుండా మాట్లాడటం కష్టమైనపని. అయితే తొలిదశలో అప్పుడప్పుడప్పుడే తెలుగు భాషకు ఒక లిఖితరూపం ఏర్పడే కాలంలో పద్యరచన సంస్కృత సమాసాలతోనే సాగింది. మచ్చుకి నన్నయ గారి పద్యం చూద్దాం. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ సహితమహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చిదు స్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయకశయ్యయైనయ […]

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు (స్త్రీల పాటలు~ఊర్మిళాదేవి నిద్ర) —————————— ఆదికావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి పాత్రకూ ఓ విశిష్టత ఉంది. సీతారాముల కల్యాణంతో బాటే లక్ష్మణ భరత శతృఘ్నుల వివాహాలు ఊర్మిళా, శ్రుతకీర్తీ, మాండవిలతో జరిగాయి. అందరూ కొత్త దంపతులే. రావణసంహారం రామావతార లక్ష్యం గనుక కైకేయి వరాలడుగటం, రాముని పదునాలుగేళ్ల వనవాసం, రామునితో పాటు సీత కూడా వనాలకు వెళ్లడం, రామునితో పాటు లక్ష్మణుడు కూడా అనుసరించడం-ఇవన్నీ కార్యకారణ సంబంధాలు. కష్టమో నష్టమో రామునితో సీత […]

తేనెలొలుకు తెలుగు. .

రచన: తుమ్మూరి రామ్మోహనరావు గాయనం కొందరికి సహజ లక్షణం. అనాదిగా మాట పాటగా మారి పలువురిని ఆకట్టుకుంది. జన సామాన్యంలో వారికి తెలిసిన విషయాలను పాటలుగట్టే నేర్పు కూడా కొందరికి సహజ లక్షణమే. అలా వెనుకటినుంచీ అలా జానపదుల జీవితాలలో పాట ఒక భాగమయిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా పలు వేడుకలకు పాట ఒక తోడుగా నిలువటం మనకు తెలిసిందే. అలాంటి పాటలు మౌఖికంగా వెలువడి ఆ తరువాత ఆ నోటా ఈ నోటా పాడబడి వాడుకలోకి రావడం […]

తేనెలొలికే తెలుగు-3

రచన: తుమ్మూరి రామ్మోహనరావు మారిషస్ లో సంజీవనరసింహ అప్పడు అనే ఆయన ఉన్నారు. ఆయనకు తెలుగంటే ఎంత అభిమానమంటే, ఆయన మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా ఒక్క ఆంగ్ల పదం దొర్లకుండా మాట్లాడుతారు. ఆంగ్లభాషాపదాలను ఆయన అనువదించే తీరు భలే అనిపిస్తుంది. పరాయి దేశంలో ఉన్నవాళ్లకు మన భాష మీద మమకారం ఎక్కువ. ఆ విషయం అమెరికాలో సైతం గమనించాను. అక్కడిమన వారు మన తీయని తెలుగు పలుకులకై మొహం వాచి ఉంటారు. తెలుగులో మాటాడేవారు కనిపిస్తే చాలు […]

తేనెలొలుకు తెలుగు-2

రచన: తుమ్మూరి రామ్మోహనరావు భాషలోని తియ్యదనం తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్లక తప్పదు. నగరాలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో గ్రామీణ జీవితాల్లోకి తొంగి చూస్తే… అప్పటి ఆటలు, పాటలు, వేడుకలు, సంబరాలు, జాతరలు, బారసాలలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు, పేరంటాలు అన్నీ సాహిత్యంతో ముడిపడి ఉన్నవే. పుట్టిన దగ్గర్నుంచి పుడకల్లోకి చేర్చేదాకా అన్ని సందర్భాలను సాహిత్యమయం చేశారు మనవాళ్లు. పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికి తల్లి చిన్నగా రాగం తీస్తూ పాట పాడుతుంది. ఏమని. . […]