April 27, 2024

కర్ణాటకలో పండుగలు

రచన: రమా శాండిల్య నేను బెంగుళూర్ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఇక్కడ ఉండి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, కర్ణాటక రాష్ట్ర ప్రజలు సంప్రదాయాన్ని చాలా విధిగా పాటిస్తారు. వీరి జీవితంలో సంప్రదాయము, సాహిత్యము, సంగీతం, నృత్యం వంటి విషయాలన్నీ పరంపరగా వస్తున్నాయి. వాటిని వీరు అంతే శ్రద్ధగా అనుసరిస్తున్నారు కూడా! వీరు చేసే పండుగలన్నీ, చాలా మట్టుకు నేను స్వయంగా చూసాను. రంగులమయం వీరి జీవితం. వీరు చాలా విషయాలు పరంపరాగతంగా ఆలోచిస్తారు, […]

నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు

రచన: రమా శాండిల్య ఈ సారి నా కర్ణాటక యాత్రానుభవాలులో రెండు క్షత్రాలను గురించి వ్రాస్తున్నాను. అవి మొదటిది నంజనగూడు, రెండవది దొడ్డ మల్లూరు. 1. శ్రీ నంజుండేశ్వర స్వామి, కర్ణాటక, మైసూర్! నంజన గూడు! కర్ణాటక యాత్రలలో భాగంగా, నంజనగూడు యాత్ర అనుకోకుండా ఈ మధ్య చేసాము. చాలా మంచి యాత్రగా దీనిని చెప్పుకోవచ్చు! భక్తజన సులభుడు ఈ నంజనగూడు శ్రీ కంఠేశ్వరుడు. దక్షిణ కాశీగా పిలవబడే ఈ నంజనగూడు, భక్తుల సర్వ రోగాలనూ పోగొట్టే […]

“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

రచన: రమా శాండిల్య గవి అంటే కన్నడలో, ‘గుహ అని అర్థంట!! పాత బెంగుళూర్ లో అతి పురాతన ఆలయం. గవి గంగాధరాలయం. ఈ ఆలయం ఒక కొండ గుహ లోపల ఉన్నది. ఏ మాత్రము మార్పులు చెయ్యకుండా అలాగే కాపాడుతున్న అతి పురాతన ఆలయం ఈ శివాలయం. పైగా ఎన్నో ప్రాముఖ్యతలున్న ఆలయం ఇది. ఈ ఆలయం సూర్య ప్రతిష్ట అని, ఇక్కడ శివుడితో సమానంగా సూర్యుడికి కూడా ఆరాధన జరుగుతోందని ఇక్కడి పూజారులు చెప్పారు. […]

నా_యాత్రానుభవం_2021_లో_సప్తశృంగి

రచన: రమా శాండిల్య అనుకోకుండా ఒకరోజు, నా దగ్గర యోగా నేర్చుకునే ఒక శిష్యురాలు… విశాఖపట్నం నుండి ఫోన్ చేసింది. “అమ్మా, నాకు షిరిడీ వెళ్లాలనుంది, మీరు కూడా వస్తానంటే ఇరువురం కలిసి ఒక్కరోజులో షిరిడీ చూసి వద్దాము” అన్నది. అప్పుడు కోవిడ్ గురించి భయము కొంచెం తక్కువగానే ఉంది. విశాఖపట్నం నుంచి నా స్టూడెంట్ ‘సంధ్య’ హైదరాబాద్ వచ్చేట్లు, నేను అదే సమయానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునేటట్లు, ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారమే టిక్కెట్స్ […]

మామ్మగారి వంటామె

రచన: రమా శాండిల్య “ఓరి ఓరి ఓరి. . . . ఓ చడీలేదు, చప్పుడూలేదు అజా, ఆనవాలూ మచ్చుక్కి లేవు. . చుంచుమొహంది. . హేంత పనిచేసింది నంగానాచి మొహంది. . . ” హాల్లోని చెక్క ఉయ్యాలలో కూర్చుని గీత చదువుకుంటున్న రంగనాధం తాతగారితో వంటమ్మాయి ‘లక్షుమమ్మ’ గురించి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది సీతమామ్మా. . . “మరే! శుద్ధ చలితేలు వాటం. . . దీని దుంప తెగ, చేతివాటం చూపించడంలో […]

పరిపూర్ణం

రచన : రమ శాండిల్య భానుమూర్తి ఒక మధ్య తరగతి చిరు ఉద్యోగి. అతనికి అమ్మవైపువారి నుంచి కానీ, అత్తగారి వైపునుంచి కానీ ఎటువంటి ఆధారం లేదు. తనకొచ్చే కొంచెం జీతంతో ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలి. సంసారం దానితోనే సర్దుకుపోవాలి. మీనాక్షి, భానుమూర్తికి తగిన భార్య. భర్త తనకిచ్చేదానిలోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ, చిన్నపిల్లలకు తనకొచ్చిన కొద్దిపాటి సంగీతము నేర్పుతూ వారిచ్చిన తృణమో ఫణమో స్వీకరిస్తూ, ఇరుగుపొరుగులకు సహాయపడుతూ చుట్టుపక్కల వారిలో మంచి ఇల్లాలు అనే పేరు […]

అమ్మ ప్రేమించింది..

రచన: రమా శాండిల్య ఉదయం మంచి నిద్రలో ఉండగా ఫోన్ రింగ్ కి మెలుకువ వచ్చి ఫోన్ వైపు చూడగా ‘ హర్ష’ అని కనిపించేసరికి ఇంత పొద్దున్నే వీడేందుకు ఫోన్ చేశాడబ్బా అని ఫోన్ తీసి ఏంటిరా నాన్నా అని కొడుకునడిగాను. “అమ్మా చెప్పేది విను”.. వాడి గొంతులో కంగారు విని పై ప్రాణం పైనే పోయింది…. “ఏమైందిరా!” అన్నా కంగారుగా.. “ఏమి లేదమ్మా కంగారుపడకు నాకు తెలిసిన అమ్మాయి ‘పూర్ణి’ సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో […]

యోగాసనాలు 1

రచన: రమా శాండిల్య హరి ఓం మిత్రులందరికీ శుభోదయ వందనం ఈ రోజు నుంచి యోగాను గురించి తెలుసుకొందాం యోగా అనగానే అందరికీ ఆసనంలో కూర్చోడం అనుకుంటాము. కదలకుండా ఒక చోట కూర్చోవడం అనుకుంటాము కానీ మా గురుదేవులు యోగా అంటే ఒక క్రొత్త అర్థం చెప్పారండి. యోగా అంటే యోగం అంటే మహర్జతకం అని అర్థంట. అందుకే ప్రతి వారు రోజులో కొంత సమయం ఆ యోగాన్ని అనుభవించి తెలుసుకోవాలని అనేవారు. కొంత సమయం యోగా […]