April 27, 2024

కౌండిన్య కథలు – బద్రి

రచన: కౌండిన్య (రమేష్ కలవల) ఆ ఊరులో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపకోవడం ఓ ఆనవాయితి. ఆ ఇంటి ముందు ఎద్దులబండి ఆపి ఒకాయన లోపలకు వెళ్ళాడు. పెరట్లో మంగయ్య గారు ఒళ్ళంతా నూనె రాయించుకుంటూ, అటూ ఆయన రావడం చూసి, ఆ ధాన్యం బస్తాలను జాగ్రత్తగా లోపల పెట్టించమని కసురుతున్నారు. లోపల నుండి వచ్చిన ఇల్లాలు అది చూసి, “ఇదిగో ఈ సంవత్సరం కూడా పందాలతో వీటిని మట్టి కలిపావంటేనా చూడు మరి” అంటూ ఆ […]

కౌండిన్య కథలు – పిండిమర

రచన: రమేశ్ కలవల   “ఏవండి.. ఇక్కడో పిండిమర ఉండాలి?” అని దారిలో పోతున్న మనిషిని ఆపి మరీ అడిగాడు. “ఏ కాలంలో ఉన్నారు మాస్టారు? పిండిమర మూసేసి చాలా ఏళ్ళయ్యింది..” అంటూ వెళ్ళబోయాడు  అతను. “దగ్గరలో ఇంకెక్కడైనా ఉందా?” అని అడిగాడు. “పాత బజార్లో ఉందేమో వెతకండి! అక్కడే గానుగతో చేసే నూనె కూడా బహుసా దొరకవచ్చు” అంటూ నవ్వాడు. ఆ అన్న మాటలు, వెలికినవ్వులో ఉన్న అంతరార్థం తనకు తెలియకపోలేదు. నీలకంఠం ఇదంతా ముందే […]

కౌండిన్య కథలు – మారని పాపారావు

రచన: రమేశ్ కలవల మాయ మాటలతో మభ్యపెట్టడం పాపారావుకు పుట్టుకతో అబ్బిన కళ. సిగరెట్టు బడ్డీకొట్టు దగ్గర మాటల గారడి చేసిడబ్బులు సంపాదించాడు పాపారావు. పట్నం నుండి హోల్ సేల్ లో కొత్త వెరైటీ లైటర్స్ తీసుకురమ్మని చెప్పాడుట ఆ బడ్డీకొట్టు ఓనర్. పాపారావు ఎలాంటి వాడో కొంచెం తెలిసింది కదా, తన గురించి మిగతాది తరువాత తెలిసుకుందాం, ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొని అటు వెడుతుంటే పోస్ట్ మ్యాన్ ఓ టెలిగ్రాం అందచేసాడు. అందులో “తాత […]

కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు

రచన:  రమేష్ కలవల   ఆకు పచ్చని లుంగీ మీద మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ లోంచి బనియను కనపడుతోంది. మెడలో నల్లటి తాయత్తు, కళ్ళకు సుర్మా, ఎర్రగా పండిన నోరు, భుజం మీద వేసుకున్న సంచిలో నెమలి ఈకలతో పాటు సాంబ్రాణికి కావలసిన సామగ్రితో ప్రతిరోజూ ఆ వీధి లో దట్టమైన పొగలలో కనిపించే మస్తాన్ వలి అంటే అందరికీ పరిచయమే. మస్తాన్ వలి కంటే కూడా సాంబ్రాణి వలి గానే అతను అందరికీ తెలుసు. […]

కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం

రచన: రమేశ్ కలవల   ఓరేయ్ ఇలారా.. “ అని పిలుస్తూ” పంతులు గారు వీడికి కూడా శఠగోపురం పెట్టండి” అని అడిగింది శాంతమ్మ గారు. “తల మీద ఇలా ఎందుకు పెడతారు నానమ్మ” అని అడిగాడు. “అదిగో ఆ దేవుడున్నాడు చూసావు.. అదో పెద్ద శక్తి అనమాట. ఏదో ఒక రోజు ఈ పెద్ద శక్తికి తలవంచక తప్పదు నాయనా..అందుకే భక్తిగా బుర్ర వంచి దణ్ణం పెట్టుకో” అంది. వాడు నమస్కారం చేసి నానమ్మతో గుడి […]

కౌండిన్య హాస్యకథలు – కాసాబ్లాంకా

రచన:కౌండిన్య (రమేష్ కలవల) ఆ కొత్తగా వచ్చిన మేనేజర్ గారి పేరు కాకరకాయల సారంగపాణి(కాసా) ఆయన మొహం చూడగానే బ్లాంక్ గా ఉండి హావభావాలు ఏమాత్రం తెలియవు. ఆయన చేరిన ఓ వారం రోజులకే ఆఫీసులో అందరి జీవితాలు కాకరకాయంత చేదుగా తయారయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదు. సారంగపాణి బట్టతల పైన ఒకే ఒక్క జుట్టు ఉండి ఎడారిలో మొలిచిన ఒకే ఒక్క మొక్కలా ఉంటుంది. మరీ కొట్టొచ్చినట్లు కనిపించక పోయినా దగ్గరగా చూసిన వారికి మాత్రం […]

కౌండిన్య హాస్యకథలు – ప్రేమాయణం

రచన: రమేశ్ కలవల ‘రెండు రోజుల నుండి చూస్తున్నా మిమ్మల్ని! ఏంటి చెత్త మా ఇంటిలోకి విసురుతున్నారు?’ అని చిరుకోపంతో అడిగింది పక్కింటి అలేఖ్య. చెత్త కాదండి. తొక్కలు విసిరాను. ‘తొక్కలో… ‘ అనేలోగా ఆ అమ్మాయి అడ్డుకొని ‘మాటలు జాగ్రత్త’ అంది కోపంతో వేలు చూపిస్తూ ‘నే చెప్పేది వినండి. అసలు తొక్కలో ఏముంది అనుకుంటాం కదా. తొక్కలు వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి మీకు తెలుసా? అందుకే మీ తోటలో మొక్కలకోసం విసిరాను’ అన్నాడు […]

కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

రచన: రమేశ్ కలవల   భార్యా భర్తలన్నాక సవాలక్షా ఉంటాయి. వారి విషయంలో మనం జోక్యం  చేసుకోకూడదు. కానీ ఇది జోక్యం జేసుకోవడం కాదేమో, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాము అంతే కాబట్టి ఓ సారి ఏం జరిగిందంటే… ఆఫీసు నుండి వచ్చి బట్టలు విడిచి భార్యకు వాటిని ఉతకడానికి  అందజేసాడు చందోళం. ఆ ప్యాంటు చూస్తూ “ఉతుకడానికేనా?” అంది ఇందోళం. “ఏంటి, నన్నా” అని అడిగాడు హాలులోకి వెడుతూ అప్రమత్తం అవుతూ. “మీ ప్యాంటు తో మాట్లాడుతున్నానండి. […]

కౌండిన్య హాస్యకథలు – అట్ల దొంగ

రచన: రమేశ్ కలవల   ధీవర .. ప్రసర సౌర్య భార .. అని బ్యాగ్ గ్రౌండ్ లో సాంగ్ వినపడుతోంది. ఎత్తుగా ఉన్న గోడ మీదకు దూకి ఆ ఇంట్లోకి ఇట్లా చొరపడి అట్లా పట్టుకెళ్ళాడు. వచ్చింది ఒక్కడే కానీ వెళ్ళేటప్పుడు నలభై మంది వెళ్ళిన శబ్థం వచ్చింది. అతనే ఆలీబాబా అట్లదొంగ! ప్రతీ సంవత్సరం అట్లతద్ధినాడు మాత్రమే దొంగతనం చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అసలు చిక్కితేగా అడగటానికి? మొదటి సంవత్సరం భార్యలు […]

కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ

రచన: రమేశ్ కలవల తనకు ఊహ తెలిసిన రోజులు. అద్దంలో చూసుకుంటూ అక్కడ మచ్చ ఎలా పడిందా అని చిన్న బుర్రతో చాలా సేపు ఆలోచించాడు. అర్ధం కాక మళ్ళీ తువాలు కట్టుకొని అమ్మ దగ్గరకు బయలు దేరాడు. “అమ్మా, ఇక్కడ ఏమైయ్యింది నాకు?” అని వెనక్కి తిరిగి చూపిస్తూ అడిగాడు. “అదీ… నువ్వు పుట్టగానే ఎంతకీ మాట్లాడక పోయేసరికే ఆ హస్పటల్ లో ఓ నర్సు అక్కడ నిన్ను గట్టిగా గిచ్చగానే ఆ మచ్చ పడిందమ్మా” […]